May 2023
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడిగడ్డ టీవీ  మెదక్ జిల్లా ఇంచార్జ్ కోడ పాక పవన్


మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని పాత లింగయ్య పల్లి గ్రామంలో సోమవారం నుండి బీరప్ప కళ్యాణోత్సవం జరిపించడానికి భారీ ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు గొర్రెల కాపరుల సహకార సంఘం గ్రామ సర్పంచ్ కిష్టయ్య మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో వారం రోజులపాటు కళ్యాణ్ ఉత్సవం నిర్వహిస్తున్నారు కళ్యాణ మహోత్సవ ముందు రోజున కురుమ సంఘం ఆధ్వర్యంలో గంగమ్మకు బోనాలు సమర్పించారు కుల పెద్దలైన లింగం ఝాన్సీ దంపతుల ఇంటి నుండి గంగమ్మకు బోనాలు భారీ డప్పు చప్పులతో పోతరాజు విన్యాసాలతో ఊరేగింపుగా తీసుకెళ్లడం జరిగింది ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి బాగున్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతి కుల సంఘాలతో పాటు కురుమ గొల్ల సంఘాల అభివృద్ధికి పెద్దపీట వేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాణి కిష్టయ్య .ఉప సర్పంచ్ అంజయ్య. కురుమ కుల పెద్దలు మల్లయ్య.  కురుమ సంఘం అధ్యక్షులు తంగేడుపల్లి దానయ్య. కార్యదర్శి నేల కంటి సాయిలు .వ్యవస్థాపక అధ్యక్షులు తంగేడి పల్లి లింగం. మండల వైస్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి .ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి. జెడ్ పి టి సి షర్మిల శ్రీనివాస్ రెడ్డి. పి ఎస్ సి ఎస్ చైర్మన్ దత్తురాజు. స్థానిక ఎంపిటిసి సరస్వతి వెంకటేశం. కురుమ గొల్ల సంఘస్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

సిఐటియు 53వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఎన్టిపిసి మేడిపల్లి సెంటర్లో ఎన్టిపిసి రామగుండం ఏరియా కన్వీనర్ గిట్ల లక్ష్మారెడ్డి, ఎన్టిపిసి ప్లాంట్ గేట్ 2 కమాన్ వద్ద రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు కాదాశి మల్లేష్ సిఐటియు జెండాలను ఆవిష్కరించిన అనంతరం కార్మికులకు ఎన్ టి పి సి గేట్ నెంబర్ 2 దగ్గర కరపత్రాలను పంపిణీ చేశారు.

అనంతరం ఆర్ ఐ డబ్ల్యూ యూ ప్రధాన కార్యదర్శి నాంసాని శంకర్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్పొరేట్ మతోన్మాద విధానాలను వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాలని కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరిగింది కార్మిక వర్గానికి హక్కులు, సౌకర్యాల కోసం సిఐటియు ఎనలేని కృషి చేస్తున్నదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ఐక్య పోరాటాల ద్వారా ఎన్నో కార్మిక ఉద్యమాలు నిర్మించిన ఘనత సీఐటీయూ యూనియన్ కు ఉందని, దేశంలో సిఐటియు కార్మిక సంఘాన్ని స్థాపించి కార్మికుల ఉద్యమంలో ముందుభాగాన పోరాడుతూ ఈరోజు 53వ ఆవిర్భావ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జిల్లా కోశాధికారి ఎం రామాచారి, నాయకులు కాదాసీ మల్లేష్, టి రవిందర్, ఎండి షమీం , వి శ్రీనివాస్ రెడ్డి, అక్క పాక శంకర్ టి నారాయణరెడ్డి, కనకయ్య, రవి, ధరణి రాజయ్య, భూమేష్ తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

 


 
తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 నుండి 22 వరకు నిర్వహించ తలపెట్టిన దశాబ్ది ఉత్సవ ఆర్భాటాలు ఎవరి కోసమని *సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ విమర్శించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ ప్రజల సొమ్మును విచచ్చలవిడిగా ఖర్చు చేయడానికి, వివిధ కార్యక్రమాలు తలపెట్టి, అందుకు తగిన బడ్జెట్ కూడా కేటాయించిందన్నారు. కానీ గత 2 నెలలుగా రైతులు ఐకేపీ సెంటర్లలో ధాన్యం పోసి ఉంచితే, గోనె సంచులు లేవని, లారీలు రావట్లేదు అని దాన్యం కొనుగోళ్లు నిలిపి వేసినారు.కొత్త ఆసరా పెన్షన్ ల ఊసే లేదు. ఉద్యోగులకు జీతాలు లేవు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయినవి. ఇవన్నీ ప్రభుత్వం కళ్ళకు కనబడుటలేదు. అట్టహసాలు, ఆర్బాటాలతో రాజకీయ పబ్బం గడుపు కోవాలని చూస్తుందన్నారు. ఐకేపీ సెంటర్ లలో రైతులు పడే బాధలు మీ కళ్ల కు ఎందుకు కనబడుట లేదో అర్ధం కావట్లేదనీ దుయ్యబట్టారు.తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలనీ డిమాండ్ చేశారు. ఏ ప్రజాస్వామిక ఆకాంక్షలతో నిలువెత్తు ఉద్యమం నిర్మించి, వందలాది మంది బలిదానాలు చేశారో, ఆ ఆశలు, ఆకాంక్షలు ఈ పదేండ్లలో నెరవేరలేదు అని అన్నారు. కోటి ఆశలతో విద్యార్థులు,నిరుద్యోగులు, సకల జనులు ఉద్యమించిన, వాళ్ళను మోసం చేసి తెలంగాణా ద్రోహులను అందలమెక్కించారని అన్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయిన సందర్బంగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని,నిలువ నీడ లేని పేదలకు డబుల్ బెడ్ రూం లు లేదా ఇళ్ళ స్థలాల ఇచ్చి ఇంటి నిర్మాణానికి 10లక్షల రూపాయలు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని,కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి ప్రతి ఒక్కరికి 10కేజీల సన్న బియ్యం తో పాటు పన్నెండు రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇవ్వాలనీ, రైతులకు తక్షణమే రుణ మాఫీ చేయాలని,దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని, దళితులందరికీ దళిత బందు ఇవ్వాలనీ, బీసీ బంధు అమలు జరపాలని, నిరుద్యోగులందరికీ 10వేల నిరుద్యోగ భృతి చెల్లించాలని తదితర డిమాండ్ల సాధనకు *సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా రాష్ట్ర 7వ మహాసభ జూన్ 2నుండి12వరకు "తెలంగాణ ప్రజల ఆకాంక్షల దీక్షా దివాస్" జరపాలని పిలుపునిచ్చింది అన్నారు. ఈ సందర్బంగా అన్ని మండలాల్లో,గ్రామాలలో దీక్షలు,ప్రదర్శనలు నిర్వహించాలని,దీనిలో ప్రజలందరూ భాగస్వామ్యం అయి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు *ఈ విలేకరుల సమావేశంలో సి పి ఐ యం ఎల్ ప్రజాపంధా కరీంనగర్ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, జిల్లా నాయకులు గుమ్మడి వెంకన్న, ఆడెపు శంకర్, గొల్లపల్లి చంద్రయ్య, కోడిపుంజుల లక్ష్మి, ఇనుగాల రాజేశ్వర్, కలవల రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

కుర్చీ వేసుకోని ఒసిపి కాకుండా చుస్తా అని చెప్పి గోదావరిఖని ప్రాంతాన్ని బొందల గడ్డగా చేసిన కెసిఆర్ ప్రభుత్వంఉద్యోగాలు, ఇసుక, బూడిద ఇలా అన్ని అమ్ముకునుడే తప్ప రామగుండం అభివృద్ది శూన్యం*రామగుండం నియోజకవర్గ ప్రజలందరికి అండగా ఉంటానని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు.

30వ డివిజన్ లో పెద్ద ఎత్తున మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు వారి సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొన్నారు.. 

ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. 

గత 30 సంవత్సరాలుగా రామగుండం నియోజకవర్గ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న నన్ను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఓసీపీలతో బొందల గడ్డలు అవుతాయని, బొందల గడ్డలు కాకుండా కుర్చీ వేసుకుని ఓసిపి కాకుండా అడ్డుకుంటానని చెప్పినా కేసిఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత ఓసిపి చేసి గోదావరిఖని ప్రాంతాన్ని బొందల గడ్డగా చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు, ఇసుక, బూడిద అన్ని అమ్ముకోవడమే తప్ప రామగుండం నియోజకవర్గం అభివృద్ధి చేయడంలో రామగుండం ఎమ్మెల్యే విఫలం అయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి పేద ప్రజలను ఆదుకుంటామని తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

 

పెద్దపల్లి  జిల్లా  మున్నూరుకాపు  యువత  ఉపాధ్యక్షుడిగా  బద్రి  దేవేందర్ పటేల్  నియామకం  పెద్దపల్లి  జిల్లా  కేంద్రం లో  మున్నూరుకాపు  జిల్లా. అధ్యక్షులు  మల్కా రామ స్వామి   నియామక పత్రం  అందచేసారు ఈ నియామకానికి  సహకరించిన  జిల్లా  అధ్యక్షుడికి  మున్నూరు  కాపు  పెద్దపల్లి  జిల్లా  కార్యవర్గానికి  బద్రి  దేవేందర్  పటేల్  హృదయ  పూర్వక కృతజ్ఞతలు  తెలియ జేశారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

ముత్తారం మండలం కేసనపల్లి గ్రామంలోని ఐకేపీ వరి కొనుగోలు కేంద్రంలో బుక్ కీపర్ గా పనిచేస్తున్న  పేరుక కృష్ణ వారం క్రితం వడదెబ్బతో చనిపోవడం జరిగింది.ఈ రోజు ప్రజా సంఘాల నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు పెద్దపెల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి  ఎర్రవెల్లి ముత్యారావు మాట్లాడుతూ... వడ దెబ్బ వల్ల ఐకెపి సెంటర్లో పనిచేస్తున్న పేరుక కృష్ణ మరణం చెందడం పట్ల సంతాపం తెలియజేసి వారి కుటుంబానికి  ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి ఉన్న పెద్దదిక్కు కోల్పోవడంతో భార్య పిల్లలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు వారి కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వారి కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇప్పించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, పిల్లలకు మెరుగైన విద్య అందించాలని మరియు దళిత బంధు ఇప్పించి వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.  ఆయన వెంట సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి. కొమురయ్య,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్,  కెవిపిఎస్ మాజి జిల్లా నాయకులు, మంథని లింగయ్య తదితరులు ఉన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్ 


కాళేశ్వరం: క్షేత్రంలో ఈరోజు మాజీ మంత్రి, మంథని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు 54వ జన్మ రోజును పురస్కరించుకొని, స్థానిక కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పాలాభిషేకం పూజలు నిర్వహించారు,అనంతరం  బస్టాండ్ సమీపంలోని శ్రీపాద చౌక్ లో కేక్ కట్ చేసి, స్థానికులకు, భక్తులకు స్వీట్లు, పండ్లు, పులిహోర ప్రసాదం ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ శుభ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బందెల సత్తమ్మ, మండల ప్రధాన కార్యదర్శి మాడుగుల పవన్, గ్రామ శాఖ అధ్యక్షులు మంగాయి లక్ష్మణ్, ప్రచార కమిటీ అధ్యక్షులు షకీల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కామిడి శ్రీనివాస్ రెడ్డి, షేక్ జానీ, గందేసిరి సత్యనారాయణ, మాచర్ల సారయ్య, వార్డ్ సభ్యురాలు లేతకారి కవిత, గ్రామ కమిటీ మహిళా అధ్యక్షురాలు మహేశ్వరి, యూత్ నాయకులు మాచర్ల అరుణ్, హైదర్, పెండ్యాల సంతోష్, దూది వెంకటస్వామి, ఫరీద్, నిట్టూరి రాకేష్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జూన్ 2 నుంచి 22 వరకు మూడు వారాల పాటు జరగనున్నాయని, ప్రజల, వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేస్తూ వేడుకలను ఘనంగా విజయవంతంగా నిర్వహించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టవలసిన కార్యక్రమాలపై సమీక్ష సమావేశాన్ని ఎస్పి నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు మూడు వారాల పాటు సాగే ‘‘ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను’’ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తూ విజయవంతం చేయాలని, ఎలాంటి సంఘటనలు జరగకుండా, భద్రత పరమైన ఏర్పాట్లను చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పోలీస్ శాఖ నిర్వహించే సురక్ష దినోత్సవం మరియు తెలంగాణ రన్ కార్యక్రమాలను విజయవంతం అయ్యేలా కార్యచరణ రూపొందించాలని ఎస్పి పేర్కొన్నారు.

జూన్ 4వ తేదీ – ఆదివారం - సురక్షా దినోత్సవం 

 శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాన్ని, సమర్ధవంతమైన సేవలను వివరించే విధంగా కార్యక్రమాలు ఉండాలని ఆదేవిదంగా పోలీసుశాఖలో జరిగిన సంస్కరణలను, వాటి విశిష్టతను ప్రజలకు వివరించాలని ఎస్పి పేర్కొన్నారు. పోలీసుశాఖ సాధించిన ఘనతలను, విజయాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలను చేపట్టాలనీ, పోలీసులు వాడుతున్న అధునాతన సాంకేతిక అంశాలు, షి టీమ్, డయల్ -100, సైబర్ నేరాల గురించి ప్రజలకు తెలపాలన్నరు. పోలీసు జాగిలాలు వివిధ నైపుణ్యాల గురించి ప్రదర్శన, పెట్రోలింగ్ కార్స్, బ్లూ కాట్స్ , వెహికిల్స్ తో ర్యాలీ నిర్వహించాలని ఎస్పి సురేందర్ రెడ్డి ఆదేశించారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా లోని రెండు నియోజకవర్గ కేంద్రాల్లో పోలీసు శాఖ నేతృత్వంలో ప్రజలు, యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్ కార్యక్రమం నిర్వహించి విజయవంతం చేయాలనీ అన్నారు.

 ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి అడ్మిన్ వి. శ్రీనివాసులు, అదనపు ఎస్పి ఏఆర్ వి. శ్రీనివాస్, కాటారం డిఎస్పీ జీ. రామ్ మోహన్ రెడ్డి, జిల్లా పరిధిలోని ఇన్స్పెక్టర్ లు, ఎస్సై లు పాల్గొన్నారు.అంతకు ముందు ప్రజాదివాస్ కార్యక్రమం లో భాగంగా జిల్లా లోని వివిధ మండలాల నుంచి వచ్చిన 13 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పి సురేందర్ రెడ్డి , పిటిషన్ల పై విచారణ జరిపి చట్ట పరంగా న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

నివాస ప్రాంతాలలో చెట్ల పొదలు తొలగించండి*సీపీఎం. రామగుండం కార్పోరేషన్ 3వ డివిజన్ అంబేడ్కర్ భవన్ లైన్ ఓల్డ్ విస్డం స్కూల్ ఎదురు ఇండ్ల ప్రక్కన ఖాళీ స్థలంలో చెట్లు పిచ్చి మొక్కలు పెరిగి పాములు,విషపురుగులకు స్థావరాలు అయ్యాయి, వర్షాకాలం లో పరిస్థితి భయం, భయంగా ఉంటుంది,అంతేకాదు సరయిన డ్రైనేజీ లేని కరణo తో ఇండ్లలో నుండి వెలువడే నీరు ఇండ్ల ప్రక్కనే ఉన్న ఖలిస్తలల్లో నిలిచి దుర్వాసన భారంచలేని పరిస్తితి ఉంది,నీటి గుంటలు పందులకు ఈతకొలనులు అయ్యాయి, విస్డం స్కూల్ ప్రక్కనుండి రెండు వీధులను కలుపుతూ రోడ్డు వేయడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ వేశారు కానీ రోడ్డు నిర్మించలేదు.కాలనీ వాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ అధికారులు కాలనీ సమస్యలు పరిష్కరించాలని సీపీఎం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, ఎం రామాచారి కార్యదర్శి ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ, G లక్ష్మారెడ్డి కార్యదర్శి రెండో డివిజన్

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఇద్దులాపూర్ గ్రామంకు చెందిన పి పి ఎల్(ప్రోగ్రేస్సివ్ పేరెంట్స్ లీగ్)ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి దార మొండయ్య(మధు)కు హైదరాబాద్ లోని పలక్ నామ ఆర్ కే పురం ఎస్సీ బాలికల గురుకులంలో ఇంటర్ స్పెషల్ స్టడీ క్యాంప్ సందర్శనంలో భాగంగా మొదటి సారి వచ్చారని పేరెంట్స్ కమిటి అధ్యక్షులు సి హెచ్ లక్ష్మణ్,ప్రిన్సిపాల్ శాలువాతో ఘనంగా సన్మానం చేసినారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జె మహేష్,కార్యవర్గ సభ్యులు బి దశరత,సి స్వామి,పి శంకర్ రావు లు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

అంతర్గాం మండల్ అధ్యక్షుడు ఒల్లెపు సాయికుమార్  ఆధ్వర్యంలో యూత్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ నాజీముద్దీన్  పర్యవేక్షణలో నూతన కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది .ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు  మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్  మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన యువజన నాయకులు ప్రతి గ్రామంలో పూర్తిస్థాయిగా యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని రానున్న రోజుల్లో రామగుండం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని కోరారు,అలాగే నూతనంగా ఎన్నికైన అంతర్గాం మండలం యూత్ సభ్యులు ప్రధాన కార్యదర్శిగా ఆలకుంట రాజేశం ,మండల యూత్ ఉపాధ్యక్షుడిగా దోబ్బల తరుణ్ కుమార్ ,మండల యూత్ కార్యదర్శిగా వేముల సతీష్, అంతర్గాం మండల టౌన్ అధ్యక్షుడిగా ఆలకుంట సంజీవ్, పెద్దంపేట్ గ్రామ యూత్ అధ్యక్షుడిగా మహేష్, ముర్ముర్ గ్రామ యూత్ అధ్యక్షుడిగా పెసరి సురేష్, ఎల్లంపల్లి గ్రామ యూత్ అధ్యక్షునిగా గుమ్ముల ప్రశాంత్, మర్రిపల్లి యూత్ అధ్యక్షునిగా అజయ్,బ్రాహ్మణపల్లి గ్రామ యూత్ ఉపాధ్యక్షుడిగా జాడి ప్రశాంత్, బ్రాహ్మణపల్లి గ్రామ యూత్ కార్యదర్శిగా వంశీ,ఎగ్లాస్పూర్ గ్రామ యూత్ అధ్యక్షునిగా అజయ్ , పోత్యాల గ్రామ యూత్ అధ్యక్షుడిగా మస్కం భాస్కర్,ఆకనపల్లి యూత్ గ్రామ అధ్యక్షుడిగా నరేష్,గోలివాడ గ్రామ యూత్ అధ్యక్షుడిగా గాదం కుమార్, సోషల్ మీడియా మెంబర్ చిలుక మనోజ్ మరియు ఆలకుంట అనిల్ కు నియమిక పత్రాన్ని అందజేశారు..ఈ  కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ నాజీముద్దీన్, అంతర్గాం మండల్ యూత్ అధ్యక్షుడు ఒల్లెపు సాయికుమార్, రామగుండం మున్సిపల్ కార్పొరేటర్ ముస్తఫా , నియోజవర్గ యూత్ కాంగ్రెస్స్ వైస్ ప్రెసిడెంట్  జ్యోతి, కార్పొరేషన్ అధ్యక్షుడు సతీష్, మెహ్రజ,అజయ్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు విజయ్ తదితర  రులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని 

30/05/2023 రోజున ఉదయం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కు శ్రీకారం చుట్టారు బీజేపీ పార్టీ సీనియర్ నేతలు గుజ్జుల రామకృష్ణ రెడ్డి, మరియు కాసిపేట లింగయ్య, కౌశిక హరి . కావున రైతులు, రైతు  శ్రేయోభిలాషులు,బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అధిక  సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్

గడ్చిరోలి : మే 29

వయసు పదిహేను ఏళ్లే. కానీ మోస్ట్ వాంటెడ్ నక్సలైట్. కొండకోనలే ఆవాసాలు. మారణాయుధాలతో సహవాసం. అయితే ఆమెలో ప్రస్తుతం మార్పు వచ్చింది. గన్‍లను వదిలి పుస్తకాలు, పెన్‌లను చేతబూనింది.. చదువుల్లో రాణించింది. ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి చరిత్ర సృష్టించింది. ఇంతకు ఆమెలో ఇంత మంచి మార్పు ఎలా వచ్చింది. ఇందుకు కారణాలేంటో ఆమెను పలకరించిన కోకిల డిజిటల్ మీడియా.. 

మహారాష్ట్రలోని గోండియాకు చెందిన ఇరావుల హిదామి  తండ్రి.. చిన్నతనంలోనే మరణించాడు. తల్లి మరో వ్యక్తిని వివాహమాడి వెళ్లిపోయింది. ఒంటరైన ఈమెను ఎవరూ దగ్గరికి తీయలేదు. దీంతో తాను నక్సలిజంలో చేరిపోయింది. ఒడిశాలోని గడ్చిరోలి, మహారాషష్ట్రలోని గోండియా ప్రాంతాల్లో మోస్ట్ వాంటెడ్ హిట్ లిస్టులో చేరింది. పేరుమోపిన నక్సలైట్‍గా మారింది. పదిహేనేళ్లలోనే హిదామి పై ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.


అయితే గోండియా ప్రాంతానికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారి ఎస్పీ సందీప్ అతోల్ ఈ విశయంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆవిడను సరైన దిశగా మార‍్చడంలో విజయం సాధించారు. 2018లోనే ఎస‍్పీ సలహాతో అటవి మార్గం విడిచి, జనావాసాలను చేరింది. పోలీసు అధికారి సందీప్ అతోల్ మద్దతుతో చదువును కొనసాగించింది. ఈ వారం వెలువడిన 12వ తరగతి బోర్డు పరీక్షలలో  45.83 శాతంతో ఉత్తీర‍్ణత సాధించింది. ఒకప్పుడు తుపాకి చేతబట్టి అడవులలో తిరిగిన హిదామి, ఆ బాటను మార్చుకొని చదువుపై దృష్టి సారించింది నా విజయాలకు ఎస్పీ సందీప్ అతోల్, కుటుంబమే కారణమని ఆ కుటుంబమే తన కుటుంబమని అంటోంది. భవిష్యత్‌లో పోలీసు దళంలో  ఉద్యోగం సాధిస్తానని చెబుతోంది. సమస్యల పరిష్కారానికి అటవి దారి ఒక్కటే మార్గం కాదని నక్సలైట్లకు ఆమె హితువు పలికారు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

ఆంతర్గాం మండల కేంద్రంలోని ఆఫీస్ ఆవరణలో సిపిఐ ఎంఎల్) న్యూడెమోక్రసీ అనుబంధ "అఖిల భారత రైతు-కూలీ సంఘం(ఏఐకేఎంఎస్ జిల్లా జనరల్ కౌన్సిల్ కరపత్రాలు విడుదల చేయడం జరిగింది.

    ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ...అకాల వర్షాలతో రైతాంగం అతలాకుతలం అయిందని, ఆరుగాలం కష్టపడి చేతికందిన పంటను కొనుగోలు చేయవలసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్దిఉత్సవాలపేరుతో సంబరాల్లో మునిగి తేలుతుందని, జిల్లా లో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటుందని వీటంన్నింటి పరిష్కారానికి కలిసి కట్టుగా ఉద్యమించాలని, రైతంగా పోరాటాల కై భవిష్యత్తు కార్యాచరణ కోసం జూన్ 10న పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఏఐకేఎంఎస్ జనరల్ కౌన్సిల్ కు జిల్లా లోని రైతులు, ప్రజాస్వామిక వాదులు, ప్రజలు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు, గత కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించికొంటున్న ఏఐకేఎంఎస్ జనరల్ కౌన్సిల్ విజయవంతం కోసం జిల్లా వ్యాపార, వాణిజ్య వర్గాలు ఆర్ధిక హార్దిక సహాయం అందించాలని కోరారు.

     ఇంకా ఈకార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మేరుగు చంద్రయ్య, నాయకులు వేల్పుల సాంబయ్య, టి రాజకొమురయ్య, ఆలకుంట దేవయ్య, లింగంపెల్లి శంకర్, మునుకుంట్ల శ్రీనివాస్, ఎండి నసీరొద్దీన్, ఆర్ శోబన్ బాబు తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ముఖ్య సంచాలక్ అనపర్తి సాయితేజ


ఈరోజు ముత్తారం మండల  బిజెపి పార్టీ ఆఫీసులో బిజెపి మండల ఇంచార్జ్ లు పోతరవేని క్రాంతికుమార్, బిరుదు గట్టయ్య గార్ల ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం.... మన ప్రియతమా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పాలన 9 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా మహాజన సంపర్క అభియాన్ పేరుతో నెల రోజుల కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది మరియు గ్రామాల వారీగా, శక్తి కేంద్రాల వారిగా పోలింగ్ బూతుల వారిగా ఇన్చార్జిల నియామకం జరిగింది. ఈ నెల రోజులు కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 9 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా ప్రతి గడపగడపకు తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన చాలా మంచి పనులను వివరించాలని అలాగే ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ అతికించి మోడీ గారు చేసిన పనులను కరపత్ర రూపంలో పంచి పెట్టాలని చెప్పడం జరిగింది...

ఈ కార్యక్రమం లో బీజేపీ సీనియర్ నాయకులు మూగ మల్లేష్,మూగ మధునయ్య,బొడ్డు సారయ్య,మారం శ్రీనివాస్ రెడ్డి, బండ రాజిరెడ్డి,కంచం రమేష్,మూగ రాజయ్య,లక్కం రాజ గట్టు,రత్న సమ్మయ్య,ఇస్సంపెల్లి శ్రీను,ఉప్పు వరుణ్,పెయ్యల నరేష్ గార్లు మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్


మహాదేవపూర్: మండలంలోని ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరం  అభివృద్ధికి కంకణం కట్టుకొని మారుమూల దట్టమైన అటవీ ప్రాంతం నుంచి రవాణా మార్గంతో ఆర్టీసీ బస్సుల సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఆలయ జీర్నోద్ధరణ, విద్యుత్ వెలుగులను ప్రసరింపజేసిన గొప్ప మహానుభావుడు, అభివృద్ధి ప్రదాత ముఖ్యలు స్వర్గీయ జువ్వాడి చొక్కారావు వర్ధంతి కార్యక్రమ వేడుకలను నేటి ఆదివారం రోజున దేవస్థానం  ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని స్వర్గీయ చొక్కారావు కాంస్య విగ్రహానికి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ జక్కు శ్రీ హర్షిని, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ లింగంపల్లి శ్రీనివాస రావు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ మహేష్, కాళేశ్వరం ఎంపీటీసీ  రేవెల్లి మమత, సర్పంచ్ వెన్నపురెడ్డి వసంత, ఆలయ ధర్మకర్తలు కామిడి రాంరెడ్డి, అడుప సమ్మయ్య, కలికోట దేవేందర్, శ్యామ్ సుందర్ దేవ్డా, కుంభం పద్మ, బండి రాజయ్య, పూల మాలలు వేసి ఘనమైన నివాళులర్పించి, భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుల బృందం, సిబ్బంది, గ్రామస్తులు, నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

   పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న


             


                                       పెద్దపల్లి:మే:27:(విజన్ ఆంధ్ర):రాష్ట్ర స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలలో పెద్దపల్లి జిల్లా నుండి పాల్గొనేందుకు క్రీడాకారులు బయలుదేరి వెళ్లారు.శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణం నుంచి 159 క్రీడాకారులు,23 మంది కోచ్ లు,లైజన్ అధికారులు మొత్తం 187 మందిచే హైదరాబాద్ కు బయలు దేరిన బస్సులను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,ఈ నెల(మే)28 నుండి మే 31 వరకు హైదరాబాద్ లోని ఎల్.బి.స్టేడియం,గచ్చి బౌలి,సరూర్ నగర్,జింఖానా గ్రౌండ్,కె.వి.బి.ఆర్.యసుఫ్ గూడా స్టేడియంలలో రాష్ట్ర స్థాయిలో సి.ఎం.కప్ క్రీడా పోటీలు జరుగనున్నాయి అని,జిల్లా స్థాయిలో విజేతలైన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపినట్లు తెలిపారు.క్రీడాకారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు,జిల్లా స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీలలో ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తిని కొనసాగిస్తూ,రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా ప్రతిభ కనబరిచి రాణించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్,జిల్లా యువజన,క్రీడల శాఖ అధికారి వై.తిరుపతి రావు,జిల్లా విద్యా శాఖ అధికారి డి.మాధవి,జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రవీణ్ రెడ్డి,కోచ్ లు,క్రీడాకారులు,తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 




నీడ ఏడు వసంతాలు పూర్తిచేసుకుని ఎనిమిదవ వసంతo లోకి అడిగిడినా సందర్భంగా కృతజ్ఞత సమావేశం.

 నీడ గత ఏడు సంవత్సరాలుగా నిరుపేదలకు 4ఇండ్లు కట్టించడం జరిగినది, డయాలసిస్ పేషెంట్ ల కీ పెన్సషన్ ఇస్తున్నాము, ఎంతో మంది నిరుపేద పేషెంట్ ల కీ 7స0వత్సరాలగా ఆసరా గా నిలిస్తున్నాము అంటే కేవలం దాతల సహకారంతోనే సాధ్యమైనది అని తెలిపారు. నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్, నీడ పేషెంట్ల కీ అందించే ప్రతి పైసా సామాజిక మధ్యమాల ద్వారా అందరికి తెలపడంతో పాటు ప్రతి సoవత్సరo ఆడిటింగ్ చేస్తున్నామని అవి విలేకరల సమావేశం లో చూపించారు. ఇక ముందు కూడా నీడ అంతే నిజాయితీ గా పని చేస్తుందని తెలిపారు.భవిష్యత్తులో పేద విద్యార్థుల చదువు కోసం పని చేస్తామని తెలిపారు.

ఈ సందర్బంగా నీడ సహాయం అందిస్తున్న దాతలకు, నీడ్ శ్రేయోభిలాషులకు, నీడ కీ అండగా ఉంటున్నా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చెందర్ కు,ఇతర నాయకులకు, పోలీస్ శాఖ వారికి, ప్రజలకు ధన్యవాదములు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నీడ సలహాదారులు బాల రాజకుమార్, నీడ శాశ్వత సభ్యులు అంచర్ల మహేష్, గోపాగోని నవీన్ గౌడ్, బొల్ల చెంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఇట్లు

పల్లెర్ల రమేష్ గౌడ్

నీడ సంస్థ

9949441960

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



 ఆర్ జి-1 ఏరియా లోని జీడికే11 ఇంక్లైన్ యందు పలు సమస్యల ఆర్ జీ-1 ఉపాధ్యక్షులు సదానందం అధ్యక్షతన గని పిట్ కార్యదర్శి సంపత్ ఆధ్వర్యంలో మీద ఒక్క రోజు నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు .

*ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన  ఐ ఎన్ టి యు సి జనరల్ సెక్రెటరీ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ ..

*1. 11 ఇంక్లైన్ వచ్చే నూతన రోడ్ వల్ల కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వెంటనే సమస్య పరిష్కరించాలి.*2. 2 ఇంక్లైన్ మరియు 5 ఇంక్లైన్ ఉండే బ్రిడ్జి మీదుగా వచ్చే కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు వెంటనే సమస్య ను పరిష్కరించాలి.

*3. 190/240 మాస్టర్స్ నిండిన బదిలీ వర్కర్స్ కి వెంటనే జనరల్ మజ్దూర్  ప్రమోషన్ ఇవ్వాలని.*4. RG-1 లోని సర్ఫేస్ ఖాళీలను గుర్తించి వెంటనే అట్టి పోస్టులను సీనియారిటీ బేసిస్ లో భర్తీ చేయాలని.*5. కార్మికుల కొరకు నూతన మరుగుదొడ్లు లాకర్ రూమ్స్  ఏర్పాటు చేయాలని.*6. గని యందు వెంటిలేషన్ సమస్య ను వెంటనే పరిష్కరించాలి.*7. CM సెక్షన్ లో పని చేస్తున్న బొల్టర్ అపరేటర్లు కి వెంటనే ప్రమోషన్ ఇవ్వాలని .8. 11 ఇంక్లైన్ క్యాంటీన్ పరిస్థితి మరీ దారుణంగా ఉందని కార్మికులకు నాణ్యమైన అల్పాహారం అందించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ దీక్షకు మద్దతు తెలిపారు.*ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి , సెంట్రల్ క్యాంపెనింగ్ ఇంఛార్జి వికాస్ కుమార్ యాదవ్ , సెంట్రల్ సెక్రెటరీ కృష్ణ , బ్రాంచ్ సెక్రెటరీలు సాగర్ , నాగరాజు , శ్రీనివాస్, జగన్మోహన్ , మహేష్ బాబు , G శ్రీనివాస్ , తాల్ల సంపత్ , రాజేశం , అన్వేష్ , శ్రీనివాస్ రెడ్డి , నహీం , భాస్కర్ రెడ్డి, పొన్నం సంపత్, మహిళా కో ఆర్డినేటర్ స్వప్న , ఆంజనేయులు , పృధ్వీరాజ్ , ఓదెలు , శ్రీకాంత్ , సురేష్ , కొమ్ము శ్రీనివాస్ , జంగ రవీందర్ , ఉప్పు శంకర్ , కొండ శ్రీనివాస్ , v శ్రీనివాస్ , దయ్యాల విజయ్, కిరణ్ , శ్రీకాంత్, రమేష్ , ముకేష్ , వెంకటేష్ , సత్యనారాయణ , చంద్రయ్య , అక్బర్ ఖాన్ , అజార్ , సతీష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని  తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  కుటుంబ సభ్యులతో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు 

దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీర్వచణం చేయగా ఆలయ ఈవో వరసిద్ధి వినాయక స్వామి శేష వస్త్రంతో మంత్రి ని సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

అలాగే తిరుపతిలో కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెల్లవారుజామున తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కలకాలం సుభిక్షంగా ఉండేలా దీవెనలు అందించాలని స్వామిని వేడుకున్నారు తదుపరి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న కొప్పుల కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ

కాణిపాక గణనాథుని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



హైదరాబాద్ లోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సోషల్ వెల్ఫేర్,ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల కార్యదర్శి రోనాల్డ్ రోస్ ను కలిసి విద్యార్థిని,విద్యార్థుల విషయంలో 24 అంశాలు తెలుపుతూ వినతి పత్రం అందజేసి అనంతరం బాలుర మంథని,పెద్దపల్లి,కోరుట్ల,మేడిపల్లి ల విషయాలు తెలుపడం జరిగినది సానుకూలంగా స్పందించినరు.కార్యక్రమంలో పి పి ఎల్(ప్రోగ్రేస్సివ్ పేరెంట్స్ లీగ్) ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మచ్చ నర్సన్నమార్క్స్ అంబేద్కర్,రాష్ట్ర ప్రధానకార్యదర్శి మేడిగడ్డ పులెందర్,రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి దార మదు,రాష్ట్ర నాయకులు ధరం శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్



హైదరాబాద్ : ఆడపిల్లలను కన్నవారు అల్లుడికి వరకట్నం ఇవ్వడం ఎప్పటి నుంచో ఉన్న ఆచారంగా కొనసాగుతుంది. పెళ్లిలో కచ్చితంగా ఎంతో కొంత నగదును వధువు కుటుంబ సభ్యులు వరుడికి ఇస్తారు.

అయితే ఇటీవల హైకోర్టు విడాకుల విషయం సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే, కేరళ ప్రభుత్వం వరకట్నం తీసుకునేవారికి డిగ్రీ పట్టా రద్దు చేసే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. తాజాగా, తెలంగాణలో కూడా ఈ విధానాన్ని తీసుకురాబోతున్నట్లు సమాచారం.. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీనియర్ లెక్చరర్ శ్రీనివాస్ మాధవ్ కేరళ వరకట్న వ్యతిరేక విధానాన్ని అధ్యయనం చేశారు.. 


రెండేళ్ల కిందటే కేరళలో వరకట్న వ్యతిరేక విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థులు, తల్లిదండ్రుల వైఖరిలో మార్పు వచ్చింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఇదే విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్‌కు ప్రతిపాదన సమర్పించారు. ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదనను అవసరమైన ప్రోటోకాల్‌లను పరిశీలిస్తోంది. ఈ విషయమై ఉన్నత విద్యామండలితో పాటు, మహిళా శిశు సంక్షేమ శాఖతో సమావేశం నిర్వహించి, అధికారికంగా ప్రకటించాలని కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా కట్నం తీసుకుంటే డిగ్రీ పట్టా రద్దు చేసే విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

ఉత్తర తెలంగాణలో రెండో రాజధానిగా వెలుగొందుతున్న వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ), ఎంజీఎం, సీకేఎం ఆస్పత్రులకు  కొత్తగా 52 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్త పోస్టుల్లో భాగంగా వరంగల్ కు  జరిపిన కేటాయింపుల పట్ల ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. కొత్తగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కాకతీయ మెడికల్ కాలేజీకి 23, ఎంజీఎంకు 27, సీకేఎంకు 2 కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో కేఎంసీలో పాథాలజీ 1, పిడియాట్రిక్స్ 2, రేడియో డయాగ్నసిస్ 1, జనరల్ సర్జరీ 2, ఈఎన్టీ 1, అనస్తీషియా 9, న్యూరాలజీ 1, న్యూరో సర్జరీ 1, ప్లాస్టిక్ సర్జరీ 2, పిడియాట్రిక్ సర్జరీ 1, యూరాలజీ 1 పోస్టులు మంజూరయ్యాయి. అలాగే ఎంజీఎంలో జనరల్ మెడిసిన్ 5, పిడియాట్రిక్స్ 2, డీవీఎల్ 1, రేడియో డయాగ్నసిస్ 1, జనరల్ సర్జరీ 2, ఆర్థోపెడిక్స్ 1, అనస్థీషియా 6, రేడియేషన్ ఆంకాలజీ 2, కార్డియాలజీ 2, సీటీవీఎస్ 2, ఎండోక్రినాలజీ 1, మెడ్ గ్యాస్ట్రో 1, నెఫ్రాలజీ 1 పోస్టు మంజూరయ్యాయి. సీకేఎంలో పిడియాట్రిక్స్ 1, ఓబీజీ 1 పోస్టులు మంజూరయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో వరంగల్ ను హెల్త్ సిటీ ఏర్పాటుకు తగు భూమికను సిద్ధం చేసినట్లు తెలిపారు. సువిశాలమైన ఒకే ప్రాంతంలో కాకతీయ మెడికల్ కాలేజీ, ఎంజీఎం, కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం, నేత్ర వైద్యశాల తదితర వైద్యాలయాలు చోటు చేసుకున్నాయన్నారు. 

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 24 అంతస్తుల ఆస్పత్రి భవన విస్తరణను కూడా తాజగా పెంచినట్లు ఎమ్మెల్యే నరేందర్ తెలిపారు. దీంతో అంచనా విలువ రూ. 1250 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆస్పత్రి నిర్మాణంలో ఎట్టి పరిస్థితుల్లో ఖర్చుకు వెనక్కి తగ్గే ప్రసక్తి లేకుండా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముందుకు పోవడం పట్ల వరంగల్ జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే నరేందర్ తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

జిల్లాలో పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు, సామాజికవేత్తలకు తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 

పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్  అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

తన ఛాంబర్ లో రాష్ట్ర ప్రణాళిక శాఖ, హైదరాబాద్ ఆధ్వర్యంలో ముద్రించి జిల్లాకు పంపిన తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2023 పుస్తకమును  ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, 

ఈ పుస్తకం నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు , మేధావులకు, విద్యావేత్తలకు ఎంతో ఉపయోగపడుతుందని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, వివిధ పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

ఈ పుస్తకం ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతా పథకాల కార్యక్రమాల పూర్తి సమాచారాన్ని విశ్లేషిస్తుందని, రాష్ట్రం సాధించిన ప్రధాన విజయాలను ప్రముఖంగా పేర్కొనడం జరిగిందని, ప్రభుత్వ పాలనకు పారదర్శకత కల్పించడంతో పాటు బంగారు తెలంగాణ సాధనకు భవిష్యత్ మార్గాలకై సమగ్రమైన అధ్యయనం చేసే అవకాశం కల్పిస్తుందని తెలిపారు.311 పేజీలు ఉన్న ఈ పుస్తకంను అవసరమున్న వారు  ముఖ్య ప్రణాళిక అధికారి (CPO) కార్యాలయంలో 150 రూపాయలు చెల్లించి పొందాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ట్రైనీ  ఐపీఎస్  అధికారి అంకిత్ శంకువార్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సత్య నారాయణ రెడ్డి, జిల్లా పౌర సంబంధాల శాఖ ఏడి  లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 




హన్మకొండ ;

బిఆర్ ఎస్ తోనే దేశానికి ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ఏర్ప‌డుతుంది. రాష్ట్రంలాగే దేశం బాగుప‌డాలంటే, బిఆర్ ఎస్ దేశంలో అధికారంలోకి రావాలి. అందుకు మ‌న‌మంతా స‌హ‌క‌రించాలి. సిఎం కెసిఆర్ ను ఆశీర్వ‌దించాలి. దేశం మొత్తం సీఎం కెసిఆర్ కోసం ఎదురు చూస్తున్న‌ది. అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు.  ప్ర‌భుత్వ‌ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అభివృద్ధి, సంక్షేమాలపై విస్తృత ప్రచారం కల్పించాలి అని మంత్రి కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. బి అర్ ఎస్ పార్టీ పిలుపు మేరకు వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయ‌ప‌ర్తి మండలం కొండాపురం, గ‌ట్టిక‌ల్‌, తానీశ్ తండ‌, ఊక‌ల్లు, బాలాజీ తండా, జ‌గ‌న్నాథ‌ప‌ల్లె, దుబ్బ‌తండాల‌కు క‌లిపి ఊక‌ల్లు గ్రామ శివారులో నిర్వ‌హించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప‌ట్ల కేంద్ర వైఖ‌రిని దుయ్య‌బ‌ట్టారు. కేంద్రంలోని బిజెపి ప్ర‌భుత్వం తెలంగాణ ప‌ట్ల వివ‌క్ష‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ది. తెలంగాణ అభివృద్ధికి స‌హ‌క‌రించ‌క‌పోగా, అడ్డుపుల్ల వేస్తున్న‌ది. నిధుల‌కు కోత పెట్టి, నిందిస్తున్న‌ది. న్యాయంగా తెలంగాణ‌కు రావాల్సిన నిధుల‌ను కూడా నిలిపివేస్తున్న‌ది. ఈ వైఖ‌రి కార‌ణంగా తెలంగాణ అభివృద్ధి కుంటు ప‌డుతున్న‌ది. అయినా, సీఎం కెసిఆర్ తెలంగాణ‌ను అన్ని రంగాల్లో అగ్ర‌గామిగా నిలిపారు. దేశానికే ఆద‌ర్శంగా తీర్చిదిద్దారు. అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వివ‌రించారు. ఇక‌, తాను పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో పాత కొత్త తేడా లేకుండా కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని సమైక్య పాలనలో నిరాదరణకు గురైన పల్లెలు నేడు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా స‌మృద్ధిగా సాగునీరు, 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబార‌క్‌ పథకాలు దేశానికే ఆద‌ర్శంగా మారాయని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాల‌లో రాష్ట్రం దేశంలోనే నెం.1 గా నిలిచిందని ప్రశంసించారు.

మరోవైపు నియోజకవర్గం లో చేసిన అభివృద్ధి ని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. దేవాలయాల, చారిత్రక ప్రదేశాల, గ్రామాల అభివృద్ధి కి సంబందించిన వివరాలను మంత్రి తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గం లో చెరువుల బాగు, మిషన్ భగీరథ మంచి నీరు, రిజర్వాయర్లు, చెరువులను నింపడం, ధాన్యం కొనుగోలు, ఉపాధి హామీ వంటి పలు పథకాలు, రోడ్లు, మండల కేంద్రాల అభివృద్ధి, వివిధ సంక్షేమ పథకాలను మంత్రి సోదాహరణంగా వివరించారు.రాష్ట్రానికి నయా పైసా ఇవ్వని బీజేపోళ్లు కూడా తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను సీఎం కేసీఆర్ తిప్పికొట్టారన్నారు. మాయ మాటలతో తెలంగాణను ఆగం పట్టియ్యాలని చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ను ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు అండ‌గా నిలావాల‌ని పార్టీ శ్రేణుల‌కు మంత్రి పిలుపునిచ్చారు.

మ‌హిళ‌ల‌కు వ‌డ్డిస్తూ, వారితో క‌లిసి ఆత్మీయ భోజ‌నాలు



బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ స‌మ్మేళ‌నాల్లో బాగంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు స్వ‌యంగా వ‌డ్డించారు. మ‌హిళ‌ల‌తో క‌లిసి భోజ‌నాలు చేశారు.అంత‌కుముందు ఆత్మీయ సమ్మేళ‌నంలో ఆత్మీయ అతిథిగా పాల్గొని, సిఎం సందేశం చ‌దివి వినిపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, ముఖ్యులు, కార్యకర్తలు యువత విభాగం రైతుబంధు సమితి బాధ్యులు, బి అర్ ఎస్ పార్టీ వివిధ విభాగాల బాధ్యులు, ఆయా గ్రామాల పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 




= సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ 

రామగుండంలో మెడికల్ కళాశాల సబ్ రిజిస్టర్ కార్యాలయం సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్ నిర్మాణం 

 రామగుండం నియోజకవర్గ ప్రజలకు మరింత సేవచేసే భాగ్యం శ్రీవారు కల్పించాలి 

రామగుండం శాసనసభ్యులు 

పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ 

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్  నాయకత్వంలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్ర నిలుస్తుందని 

తెలంగాణ రాష్ట్రంలో రాబోవు ఎన్నికల్లో  మరోమారు టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించి హ్యట్రిక్  సీఎంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్   తెలంగాణకు పరిపాలన అందించేలా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆశీర్వదించాలని రామగుండం శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్  అన్నారు 

బుధవారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని

దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్  మంత్రి కెటి రామారావు  కొప్పుల ఈశ్వర్ ఆశీస్సులతో రామగుండం నియోజకవర్గంలో మెడికల్ కళాశాల సబ్రిజిస్ట్రార్ కార్యాలయం 

సీనియర్ సివిల్ జడ్జి కోర్టు 

నూతనంగా రోడ్లు ప్రధాన కూడళ్ల సుందరీకరణ పూర్తి చేశామని చెప్పారు. రామగుండం నియోజకవర్గంలో ఐటీ ఇండస్ట్రీయల్ పార్కును మంత్రివర్యులు కేటిఆర్  ఏర్పాటు చేయనున్నరని అన్నారు. రాబోయే ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గ ప్రజలకు 

పరిపాలన అందించే భాగ్యం అదృష్టాన్ని ప్రసాదించాలని, 

రామగుండం నియోజకవర్గంలో 

చేపడుతున్నా వేంకటేశ్వర ఆలయం పూర్తి కావాలని స్వామివారిని ఎమ్మెల్యే  వేడుకున్నారు. రామగుండం నియోజకవర్గం ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని స్వామీ వారు ప్రసాదించాలన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 




హన్మకొండ  ;

ప్రతిభావంతులైన క్రీడాకారులని ప్రోత్సహించేందుకు ప్రతి మాసంలో  క్రీడలను నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. 

ఘనంగా ముగిసిన జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు

స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం జరిగిన హనుమకొండ జిల్లా స్థాయి సీఎం కప్ పోటీల ముగింపు కార్యక్రమానికి వినయ్ భాస్కర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.  క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో

సీఎం కప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్ర క్రీడా చరిత్రలో హనుమకొండ జిల్లాకు ప్రత్యేకత ఉందని ఈ ఒరవడిని కొనసాగించేందుకు త్వరలో మెగా టోర్నమెంట్  నిర్వహించనున్నట్లు చెప్పారు. అన్ని క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రత్యేక స్పోర్ట్స్ క్యాలెండర్ ను రూపొందిస్తున్నట్లు తెలిపారు.

జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్,జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు మహ్మద్ అజీజ్ ఖాన్ మాట్లాడుతూ క్రీడాకారుల ప్రతిభ వెలుగులోకి వచ్చేందుకు సీఎం కప్ పోటీలు దొహదపడినట్లు చెప్పారు. గతమెంతో ఘనకీర్తిని కలిగిన హనుమకొండ క్రీడా ప్రతిభను రాష్ట్ర రాజధానిలో రెపరెపలాడించాలన్నారు. జిల్లాలో సీఎం కప్ పోటీల విజయవంతానికి కృషి చేసినవారందరికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ అధికారులందరి సహకారంతో మండల, జిల్లా స్థాయిలో సీఎం కప్ పోటీలను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. ఇదే స్ఫూర్తితో హనుమకొండ జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. 



చిaన్నారులు విద్యార్థి దశలోనే ఆసక్తి ఉన్న క్రీడల్లో శిక్షణ పొందాలన్నారు. ప్రణాళిక బద్ధంగా శ్రమిస్తేనే క్రీడల్లో విజయాలు సాధించగలరన్నారు. రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలో హనుమకొండ జిల్లాను ముందంజలో నిలపాలని ఆమె ఆకాంక్షించారు. జిల్లాలో సీఎం క పోటీలను విజయవంతంగా నిర్వహించిన క్రీడా శాఖను ఆమె అభినందించారు. అనంతరం వివిధ క్రీడల్లో విజయాలు సాధించిన జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన క్రీడాకారులకు జ్ఞాపికలు, మెడల్స్,  సర్టిఫికెట్స్ లను అతిథులు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా, ట్రెయినీ ఐపీఎస్ అంకిత్,డీఆర్వో  వాసు చంద్ర, డివైఎస్వో జి.అశోక్ కుమార్, డిఇఓ అబ్దుల్ హై, డీసీపీ ఎం ఎం బారీ, ఏసీపీలు కిరణ్ కుమార్, శ్రీనివాస్, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు, పీఈటీలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల్ లింగాపూర్ గ్రామంలో ప్రారంభమైన పోచమ్మ జాతర ఈరోజు నుండి మొదలుకొని 28 5 23 ఆదివారం రోజున ముగింపు కార్యక్రమం జరుగుతుంది పోచమ్మ జాతర ప్రారంభోత్సవ సందర్భంగా పూజారి మురళీధర శర్మ మాట్లాడుతూ లింగాపూర్ గ్రామ ప్రజలు ఈ మూడు రోజులు జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అలాగే ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు పొంది ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అర్కుటి రాయమల్లు యాదవ్ కాసర్ల రాజనర్సు మాజీ ఎంపీటీసీ ఇరికిల్ల పద్మ శంకరయ్య పులి శ్రీను గౌడ్ కందుల నారాయణ కందుల సంతోష్ అర్షణ పెళ్లి శ్రీనివాస్ (లీడర్) అర్శన పెళ్లి రాజు పల్లికొండ భూమేష్ కొక్కుల శంకర్ పూరేల రవీందర్ పులి లక్ష్మయ్య గౌడ్  తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్



పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండల్ లింగాపూర్ గ్రామంలో 18 మంది కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 24/05/23 బొడ్రాయి మరియు పోచమ్మకు పాలపోరుకతో ప్రారంభమైన లింగాపూర్ పోచమ్మ జాతర ఈ సందర్భంగా దూరప్రాంతాలలో ఉన్న యువకులు ఆడబిడ్డలు చుట్టాలు బంధువులతో లింగాపూర్ గ్రామం పల్లెటూరి కళ మళ్లీ ఈరోజు కనిపిస్తుందని లింగాపూర్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు దూర ప్రాంతాలలో జీవనం సాగిస్తూ ఉన్న స్నేహితులు బంధువులు బిడ్డలు అల్లుండ్లు అన్నదమ్ములు అక్క చెల్లెలు బావ మరదలు అందరూ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని లింగాపూర్ గ్రామ ప్రజలు తెలియజేశారు ఈ వేడుక 28 5 23 ఆదివారం ముగుస్తుందని లింగాపూర్ పోచమ్మ కమిటీ సభ్యులు కాసాల రాజనర్స్ అర్శన పెళ్లి శ్రీనివాస్ ( లీడర్) పులి శ్రీనివాస్ గౌడ్ కందుల సంతోష్ పూరేల్ల రవి గౌడ్ పులి లక్ష్మయ్య గౌడ్ అర్శన పెళ్లి రాజు పల్లికొండ భూమేష్ కొక్కుల శంకర్ కందుల నారాయణ గాలి ఎల్లయ్య మాజీ సర్పంచ్ ఇరికిల్ల శంకరయ్య తెలిపారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్  అనారోగ్యానికి గురై హైదరాబాద్లో చికిత్స పొంది, ఇంటికి వచ్చిన సందర్భంగా ఈరోజు సాయంత్రం వారి గృహానికి విచ్చేసి, వారిని పరామర్శించిన  ఏఐసీసీ సెక్రెటరీ మంథని శాసనసభ్యులు  దుద్దిల్ల శ్రీధర్ బాబు  & పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ 

బొంతల రాజేష్  యోగక్షేమాలు అడిగి తెలుసుకొని, వైద్యుల సూచనల మేరకు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని, త్వరగా కోలుకొని, మునిపటిలా పార్టీ పటిష్టం కొరకు & ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పలు కార్యక్రమాలు చేస్తూ, రానున్న ఎన్నికల్లో రామగుండంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని దుద్దిల్ల శ్రీధర్ బాబు  సూచించారు. 

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన  శ్రీధర్ బాబు రాజేష్ గృహానికి వచ్చిన సందర్భంలో శాలువాతో సత్కరించిన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్   బోంతల రాజేష్ ను పరామర్శించిన వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మహాదేవపూర్ మండలం ప్రతినిధి/దూది శ్రీనివాస్*



కరీంనగర్‌, మే 24:

 రాజకీయాలు ఎప్పుడెలా మారతాయో చెప్పడం కష్టం. మార్పులు ఒకోసారి స్థానిక నేతలకు చుక్కలు చూపిస్తాయి. ఇప్పుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో షాక్‌కు గురవుతున్న ఆ నేత ఎవరు? షాక్లు సొంత పార్టీ నుంచి కాకుండా మిత్రపక్షంగా ఉన్న పార్టీ నుంచి అయితే పరిస్తితి ఎలా ఉంటుంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో వస్తున్న మార్పులేంటని తెలుసుకుందాం.


*కరీంనగర్ నగరానికి* అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తూ.. మంత్రిగా కొనసాగుతున్న గంగుల కమలాకర్‌కు ఆయన చుట్టూ ఉన్నవారి నుంచే సమస్యలు మొదలయ్యాయా? ఆయన కోటరీయే ఇప్పుడాయన కొంప ముంచుతోందా అంటే అవును అనేలా ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని సెగ్మెంట్లలో పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయగల స్థితిలో మైనారిటీలు ఉన్నారు. గత రెండుసార్లు మైనారిటీల మద్దతుతోనే గంగుల కమలాకర్ గులాబీ పార్టీ తరపున విజయం సాధించారు. అయితే ఈసారి పరిస్థితి అలా లేదంటున్నారు స్థానిక మజ్లిస్ పార్టీ నాయకులు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ తీరుపై వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గత కొంత కాలంగా సామాన్యులనే కాదు.. మిత్రపక్షంగా ఉన్న తమను పట్టించుకోవడంలేదని మజ్లిస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


*సోషల్ మీడియాలో వార్*

ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ మైనార్టీ లీడర్స్, ఎంఐఎం నేతలకు మధ్య సోషల్ మీడియా వార్ పెద్ద ఎత్తున నడిచింది. ఇదంతా మంత్రి గంగుల కమలాకర్ కావాలనే  చేయిస్తున్నారనే అనుమానాలూ  ఎంఐఎం నేతలు వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సమావేశం నిర్వహించుకున్న ఎంఐఎం నేతలు.. వెయ్యి కోట్ల రూపాయల విరాళాలు సేకరించైనా కరీంనగర్ లో గాలిపటం జెండా ఎగరేస్తామని చాలెంజ్ చశారు. కొందరు నేతలు పైసలు చల్లితే ఏదైనా జరుగుతుందని అనుకుంటున్నారని.. అంతకుమించిన సినిమా తాము చూపిస్తామనీ సవాల్ విసిరారు. ఇప్పటికే నగరంలోని 35 డివిజన్లలో ముస్లిం మైనార్టీల ఓట్ బ్యాంక్ ప్రభావిత శక్తిగా మారినట్లు వారు చెప్పుకొచ్చారు. ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు, తెలంగాణా హజ్ కమిటీ సభ్యుడైన సయ్యద్ గులాం హుస్సేన్ నోటే ఈ సంచలన వ్యాఖ్యలు వెలువడటంతో.. కరీంనగర్ లో పొలిటికల్ డైమెన్షన్స్ మారిపోతున్నాయన్న టాక్ నడుస్తోంది. 


*సవాల్‌ విసిరారు*

అయితే కరీంనగర్ కేంద్రంగా జరిగిన ఈద్ మిలాప్ పార్టీలో మాట్లాడిన నేతలు.. గులాబీ బాస్ పైనా, మాజీ ఎంపీ వినోద్కుమార్ పైనా తమకున్న సాఫ్ట్ కార్నర్ ను బయటపెట్టారే తప్ప.. ఇప్పుడున్న ఎమ్మెల్యేకు సానుకూలంగా ఒక్క మాటా మాట్లాడకపోగా.. సవాల్ విసరడం చర్చనీయాంశంగా మారింది. వినోద్ చొరవ వల్లే స్మార్ట్ సిటీ పనులు శరవేగంగా జరుగుతున్నాయంటూనే.. ఎమ్మెల్యే నిధులతో తమ డివిజన్లను అభివృద్ధి చేయాల్సిందేనన్న డిమాండ్ వారి మాటల్లో వినిపించింది. అంతేకాదు, ఎంఐఎం అండదండలతో గెల్చి ఎమ్మెల్యేలు, మంత్రులై ఇవాళ చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్న వారికి రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా బుద్ధి చెప్పుతామని వార్నింగ్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో దమ్ముంటే ఎంఐఎం అండ లేకుండా గెలిచి చూపించాలనీ గంగులకు ఎంఐఎం నేతలు సవాల్ కూడా విసిరారు. కరీంనగర్ నగరంలోని ముస్లిం మైనార్టీలెక్కువగా ఉండే ప్రాంతాల్లో అభివృద్ధి కొరవడిందని.. దర్గాలు, షాదీఖానాలు, కమ్యూనిటీ హాల్స్ వంటివాటిని కనీసం పట్టించుకోవడంలేదంటూ స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి గంగుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.


*బీఆర్ఎస్ అభ్యర్థిని బట్టే ఎంఐఎం నిర్ణయం*

కరీంనగర్లో ప్రస్తుత రాజకీయ వాతావరణం గమనిస్తుంటే....వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం కరీంనగర్ నుంచి పోటీకి సిద్ధమవుతోందనే ప్రచారం సాగుతోంది. ఇలా ఉంటే..గంగులను ఎంపీ స్థానానికి పంపించి.. మాజీ ఎంపీ వినోద్ ను కరీంనగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయించే అవకాశాలూ ఉన్నట్టు టాక్ నడుస్తోంది. అయితే వినోద్ మాత్రం ఎంపీ స్థానానికే మొగ్గు చూపుతుండగా.. హుస్నాబాద్ నుంచి వినోద్ ను గెలిపించాలన్న కేటీఆర్ ప్రకటనతో ఇక కరీంనగర్ అసెంబ్లీ టిక్కెట్ రేసులో వినోద్ ఉంటాడా అన్నది డౌటే..? వినోద్ పోటీలో ఉంటే ఎంఐఎం నేతల ఆలోచనలో ఏదైనా మార్పు రావచ్చునేమో గాని..గంగుల కనుక మళ్ళీ పోటీ చేస్తే మాత్రం మజ్లిస్ బరిలో దిగడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక అంతిమంగా బీఆర్ఎస్ అభ్యర్థిని బట్టే ఎంఐఎం నిర్ణయం ఆధారపడి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మహాదేవపూర్ మండల ప్రతినిధి/ దూది శ్రీనివాస్*



సంగారెడ్డి, మే 24:

ఉల్లి ధర రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది. బహిరంగా మార్కెట్ లో రోజురోజుకూ ఉల్లి ధర పడిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితి కొట్టుమిట్టాడుతున్నారు. లాభాలు లేకున్నా ఫర్వాలేదు, కానీస పెట్టుబడులు వస్తే చాలు ఆనే ఆలోచనలో ఉల్లి రైతులు ఉన్నారు. బహిరంగ మార్కెట్‌లో క్వింటాలు ఉల్లి ధర రూ.800 నుంచి రూ.900 వరకు మాత్రమే పలుకుతుండడంతో రైతులు కన్నీరు మున్నీరుమున్నీరవుతున్నారు. పంట సాగుకు ఒక ఎకరానికి సుమారుగా రూ.30 వేలు ఖర్చవుతోంది.


కానీ, పంట చేతికి వచ్చేసరికి కనీసం కూలీల డబ్బులు కూడా రాకపోవడంతో అన్నదాతలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం, బర్దిపూర్, కృష్ణాపూర్, మాచునూర్, పొట్టి పల్లి, ఎల్గోయి, చిలేపల్లి, వనంపల్లి, తదితర గ్రామాలలో వేసిన పంట చేతికి రావడంతో కనీస ధర లేకపోవడంతో ఉల్లి పంటను తీయకుండానే పొలాల్లోనే రైతులు వదిలేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కూలీలు సైతం ఉల్లిని నిరాకరిస్తున్నారు. డబ్బులే కావాలని అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు.


దీంతో దిక్కుతోచని స్థితిలో రైతన్న పరిస్థితి ఏర్పడింది. గతేడాది రూ.3 వేలకు పైగా ఉండడంతో ఈ ఏడాది కూడా అదే ధర వస్తుందని భావించి రైతులు జిల్లాలో పెద్దఎత్తున ఉల్లి సాగు చేశారు. ప్రస్తుతం పంట చేతికి రావడంతో మార్కెట్‌కు తీసుకొస్తే కిరాయిలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్ ను బట్టి క్వింటాకు రూ.800నుంచి రూ.1,000వరకు కొనుగోలు చేస్తూ.. వినియోగదారులకు కేజీ రూ.11 నుంచి రూ.15 వరకు విక్రయిస్తున్నారు. అష్టకష్టాలు పడి పండించిన పంటకు ఒక్కసారిగా గిట్టుబాటు ధర పడిపోవడంతో రైతులకు ఏమి చేయని దీనస్థితిలో ఉన్నారు రైతులు.


సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలంలోని కుప్పానగర్ గ్రామానికి చెందిన ఓ యువ రైతు తన రెండు ఎకరాల పొలంలో ఉల్లి పంటను పండించారు. పెట్టుబడి కాదు కదా కేవలం ఆయనకు గత రాత్రి మార్కెట్ కు తరలిస్తే రూ.7,718 మాత్రమే వచ్చాయి. ఉల్లి రైతును ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. కొందరు రైతులు ఏమో ఉల్లికి ధర లేకపోవడంతో కిరాయి ఇల్లు, తీసుకొని కిరాయి రూములు తీసుకొని ఉల్లిని నిల్వ చేస్తున్నారు. మరికొందరు రైతులు చేసేది ఏమీ లేక మార్కెట్ తరలిస్తున్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్*



హైదరాబాద్, మే 24:

రాష్ట్రంలో కల్తీ ఫుడ్ పెరిగిపోతున్నది. పాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట నూనె, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్.. ఇట్ల ప్రతీది కల్తీ అవుతున్నది. ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టడంలో సర్కార్ విఫలమవుతున్నది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఫుడ్ సేఫ్టీ విషయంలో మన రాష్ట్రం చివర్లో ఉన్నది. ఫుడ్ సేఫ్టీలో 17 పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే 15వ స్థానానికి దిగజారింది. అంటే కల్తీ ఫుడ్ ఎక్కువున్న రాష్ట్రాల జాబితాలో టాప్ 3లో ఉన్నదన్నట్టు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇటీవల విడుదల చేసిన రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీపై సర్వే చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ.. పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా రిపోర్టులు ఇచ్చింది. పెద్ద రాష్ట్రాల జాబితాలో ఒడిశా, ఉత్తరప్రదేశ్, అస్సాం, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల కంటే తెలంగాణలో ఫుడ్ కల్తీ ఎక్కువగా ఉన్నట్టు రిపోర్టులో తేలింది. మరోవైపు ఫుడ్ క్వాలిటీ చెకింగ్ లోనూ రాష్ట్రం వెనుకబడిందని వెల్లడైంది. కల్తీ ఫుడ్ ను అరికట్టేందుకు కఠిన చట్టం తీసుకొస్తామని గొప్పగా చెప్పిన సర్కార్.. ఆరేండ్లయితున్నా అందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఫుడ్ కల్తీపైనా ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కూడా కల్పించడం లేదు. మార్కెట్ లోకి విచ్చలవిడిగా వస్తున్న కల్తీ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసి జనం అనారోగ్యానికి గురవుతున్నారు. క్యాన్సర్, గుండె, కిడ్నీ, లివర్ తదితర రోగాల బారినపడుతున్నారు. 


*ఫుడ్ క్వాలిటీ టెస్టుల్లేవు..* 


ఫుడ్ క్వాలిటీ చెకింగ్ లోనూ మన రాష్ట్రం వెనుకబడింది. ఇందులో 20 పాయింట్లకు గాను తెలంగాణకు 3.5 పాయింట్లే వచ్చాయి. తమిళనాడుకు 10 పాయింట్లు, మిగిలిన రాష్ట్రాలు కూడా మంచి పాయింట్లతో ముందున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఫుడ్ క్వాలిటీ టెస్టులు చేయడం లేదు. హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ నూనెలు వాడుతున్నారు. వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వినియోగిస్తున్నారు. దీంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పెద్ద పెద్ద ప్రైవేట్ హోటళ్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. మాంసం విక్రయ కేంద్రాల్లోనూ క్వాలిటీ చెకింగ్ ఉండటం లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించే ఫుడ్ విషయంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో పేషెంట్లకు అందిస్తున్న ఆహారం, పాలు, పండ్లు, గుడ్లు, ఇతర పదార్థాల నాణ్యతను పట్టించుకోవడం లేదు. గురుకుల హాస్టళ్లలోనూ తనిఖీలు చేపట్టడం లేదు. కల్తీ ఫుడ్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు తరచూ జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలోని స్లాటర్​హౌస్ కు ప్రభుత్వ గుర్తింపు ఉంది. ఇక్కడ రోజుకు 3 వేల గొర్రెలను కోస్తారు. ప్రతిరోజూ ఇక్కడ ర్యాండమ్ గా మాంసానికి క్వాలిటీ టెస్టులు చేయాలి. కానీ నామమాత్రంగానే టెస్టులు జరుగుతున్నట్లు చెబుతున్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


*మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్*



హనుమకొండ, మే 24: మోడల్‌ స్కూళ్లలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలోని మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మోడల్‌ స్కూళ్ళలో గత పదేళ్లుగా బదిలీలు లేక ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లుగా అర్హులైన పీజీటీలు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి పొందలేక పోయారు. ఏళ్ళుగా ఒకే చోట పని చేయడంతో అనాసక్తితో పాటు అజమాయిషీ కొరవడింది.


మోడల్‌ స్కూళ్లు 2013లో ప్రారంభమైనా ఇప్పటి వరకు సబ్జెక్టు ఉపాధ్యాయులకు రోస్టర్‌ పద్ధతిలో కాకుండా ఖాళీల ప్రకారం కేటాయించారు. దీంతో దూర ప్రాంతాల ఉపాధ్యాయులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల బదిలీకి సంబంధించిన షెడ్యూల్‌ ఒకటి, రెండు రోజుల్లో జారీ కావచ్చునని తెలుస్తోంది.


*500 మంది టీచర్లు*


ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 30 మోడల్‌ స్కూళ్ళు ఉన్నాయి. సుమారు 500 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (టీజీటీలు) 200 మంది, పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్లు 270 మంది, ప్రిన్సిపాళ్లు 30 మంది వీరిలో ఉన్నారు. అన్ని కేటగిరీల ఉపాధ్యాయులను బదిలీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 194 పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 3880 సాంక్షన్డ్‌ పోస్టులు ఉండగా 1236 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 2838 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. 2013లో కేంద్ర ప్రభుత్వం మోడల్‌ స్కూల్‌ వ్యవస్థను ప్రారంభించింది.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 700 స్కూళ్లను మంజూరు చేసింది. వీటిలో మొదటి దశ కింద తెలంగాణలో 194 స్కూళ్ళు ప్రారంభమయ్యా యి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ దశ కింద మిగతా స్కూ ళ్లు ప్రారంభం కాలేదు. 2013లో ఉపాధ్యాయుల నియామకం జరిగింది. అప్పటి నుంచి వారు పోస్టింగ్‌ వచ్చిన స్కూళ్లలోనే పని చేస్తున్నారు. బదిలీలు జరగలేదు. కేంద్ర ప్రభుత్వం మొదట ఈ స్కూళ్లను ప్రారంభించినా ఆ తర్వాత నిర్వహణ భాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేతికి వచ్చింది. ప్రతీ పాఠశాల భవనాన్ని అయిదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. రూ. 3 కోట్లతో ఫర్నీచర్‌ను సమకూర్చారు.


*బదిలీల్లో జాప్యం*


ఆయా పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేస్తున్నారు. పాఠశాలలను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు పదేళ్లుగా బదిలీలు చేపట్టలేదు. ఏడుకాడు బదిలీలు జరుగుతాయని ప్రకటనలు వెలువడుతున్నప్పటికీ ఆచరణలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. చాలా మంది ఉపాధ్యాయులకు ఇతర జిల్లాలోని పాఠశాలల్లో ఉద్యోగం రావడంతో కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహించాల్సి వస్తోంది. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బదిలీలకు పచ్చ జెండా ఊపడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బదిలీ ప్రక్రియను వెంటనే చేపట్టి వేసవి సెలవులు పూర్తయ్యేలోగా పూర్తి చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 




పెద్దపల్లి జిల్లా, అంతర్గాం మండలం, పెద్దంపేట గ్రామ నివాసి ఆముల దిలీప్ కుమార్ (35) ఆకస్మిక మరణం చెందగా,తల్లి తండ్రి అయిన లక్ష్మి -రామయ్య (సింగరేణి మాజీ ఉద్యోగి)  అనుమతితో ,చిన్నాన అయిన . ఆముల నారాయణ అంతర్గాం (జెడ్.పి.టి. సి )  సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఎల్ విపి నరేందర్ వరంగల్ చే నేత్రాలు సేకరించి హైదరాబాద్ పంపించడం జరిగింది. ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన అమ్మ నాన్న లక్ష్మి -రామయ్య, తమ్ముడు ప్రసన్నకుమార్, చెల్లెలు  అనూష-రంజిత్ ,చిన్నాన జెడ్పిటిసి ఆముల నారాయణ కు  సమీప బంధువు మంత్రి . కొప్పుల ఈశ్వర్,కార్పోరేటర్ రాజు ,సదాశయ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి ,ముఖ్యులు రమేష్, డాక్టర్ భీష్మాచారి, రాజమౌళి, చంద్రమౌళి, కె.యస్.వాసు ,అన్నపూర్ణ  లయన్స్ క్లబ్ రాజేందర్, త్రివేది వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడిగడ్డ టీవీ న్యూస్ సీఈఓ అనపర్తి శ్రీనివాస్ గౌడ్ 





పెద్దపల్లి నియోజకవర్గంలో , పెద్దపల్లి మండలం రాగినెడు గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎల్లమ్మ తల్లి మారు కోల్పు బోనాల మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని అమ్మవార్లకు ప్రత్యేక పూజ నిర్వహించి, అమ్మ వారి ఆశీస్సులు తీసుకున్న *బీజేపీ నాయకులు ఏగోలపు సదయ్య గౌడ్*  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మ వార్ల దీవెనలతో నియోజకవర్గంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో,సుఖ సంతోషాలతో,పాడి పంటలతో సువిశాలంగా ఉండాలని కోరారు.ఇట్టి కార్యక్రమంలో బీజేపీ నాయకులు పొన్నం మధురయ్య గౌడ్,ఇల్లందుల అంజి బాబు గౌడ్,ఆకుల అజేయ్ గౌడ్,తోడేటి సదయ్య గౌడ్,బుర్ర కార్తీక్ గౌడ్,రంగు సంపత్ గౌడ్,ముత్యం సంపత్ గౌడ్ ,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



: ఎన్నికల నిర్వహణలో ప్రతిసారీ కొత్త సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయని, అందుకే ఈ ప్రక్రియలో పాల్గొనడం ప్రతి అధికారికి నిత్య నూతనంగానే ఉంటుందని డీజీపీ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. మరో అయిదారు నెలల్లో రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికల నిర్వహణపై ఎస్పీలు, కమిషనర్లకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం పునశ్చరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలకు చేయాల్సిన ముందస్తు ఏర్పాట్లు, ప్రవర్తనా నియమావళి, పాత కేసులు... తదితర అంశాలను డీజీపీ వివరించారు. జూన్‌, జులైల్లో చేయాల్సిన పనులు, కేంద్ర బలగాలతో సమన్వయం, సిబ్బంది మోహరింపు వంటి అంశాలపై అంతా అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న జిల్లాల ఎస్పీలు, కమిషనర్లలో చాలామందికి గతంలో ఎన్నికలు నిర్వహించిన అనుభవం లేదని, వారంతా సీనియర్‌ అధికారుల సహకారం తీసుకోవాలని అంజనీకుమార్‌ సూచించారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల నిర్వహణలో పాల్గొని వచ్చిన అదనపు డీజీ సౌమ్యా మిశ్ర, డీసీపీ అభిషేక్‌ మొహంతి తమ అనుభవాలను పంచుకున్నారు. నిఘా విభాగాధిపతి అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ... ఒకేచోట మూడేళ్లుగా పనిచేస్తున్న పోలీసు అధికారులను ఎన్నికల సమయంలో తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు. శాంతిభద్రతల అదనపు డీజీ సంజయ్‌ కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ... సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌ పోస్టుల ఏర్పాటుపై శ్రద్ధ చూపించాలన్నారు. సీఐడీ అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌ మాట్లాడుతూ... ఎన్నికల విధులకోసం వచ్చే బలగాలకు మార్గదర్శకత్వం చేసేలా ఠాణాల్లో గైడ్‌ను సిద్ధం చేయాలన్నారు. తెలంగాణ పోలీసు బెటాలియన్ల అదనపు డీజీ స్వాతిలక్రా, ఐజీ షానవాజ్‌ ఖాసిం, డీఐజీ కార్తికేయ పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



గత రెండు నెలలుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల సాధన కోసం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని పవర్ హౌస్ కాలనీ, జంగాలపల్లి, ఇందిరమ్మ కాలనీ, పీకే రామయ్య కాలనీ నాలుగు కేంద్రాలలోని ప్రభుత్వ భూములలో పేదలచే గుడిసెలు వేయించి పోరాటం చేస్తున్నది.  సిఐటియు అఖిలభారత కమిటీ కోశాధికారి మరియు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎం సాయిబాబా  ఇందిరమ్మ కాలనీ, పికె రామయ్య కాలనీలలోని రెండు ఇండ్ల స్థలాల పోరాట కేంద్రాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశాలలో సాయిబాబు మాట్లాడుతూ దీర్ఘకాలంగా నిరుపేదలు కిరాయి ఇళ్లలో ఉంటూ చాలీచాలని జీతాలతో బతుకులీడుస్తు, సంపాదనలో సగం కిరాయిలకే పోతున్న పరిస్థితులలో ఇళ్ల స్థలాలు కావాలని కోరుకోవడం సమంజసంగా ఉంది. న్యాయమైన మీ పోరాటానికి సిఐటియు అండగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిచనున్నది. కావున ఈ దశాబ్ది ఉత్సవాల ప్రారంభాని కంటే ముందే అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సాయిబాబా  గుడిసెలు వేసుకున్న వారి గుడిసెలను సందర్శించి అందరిని ఆప్యాయతతో పలకరించారు. ఉత్తేజ కరంగా సాగిన కామ్రేడ్ సాయిబాబు  ఉపన్యాసం మొక్కవోని దీక్షతో ఇళ్ల స్థలాలు ఇచ్చేంతవరకు పోరాటం కొనసాగిస్తామని సమావేశంలో పాల్గొన్న మహిళలు ఉత్సాహంతో నినాదాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాదయ్య కార్యదర్శి మహేశ్వరి, ఇందిరమ్మ కాలనీ ఇళ్ల స్థలాల సాధన కమిటీ కన్వీనర్ కామ్రేడ్ ఎమ్ రామాచారి, నాయకులు సిహెచ్ ఉపేందర్, రమణక్క, భాగ్య, స్వప్న, మహాలక్ష్మి, ఏం సంపత్ తదితరులు పాల్గొన్నారు. పీకే రామయ్య కాలనీ ఇండ్ల స్థలాల సాధన మూడో కేంద్రం లో జరిగిన సమావేశంలో కన్వీనర్ కామ్రేడ్ ఎన్ బిక్షపతి, నాయకులు పి నాగలక్ష్మి, గిట్ల లక్ష్మారెడ్డి, బీర్క సుజాత, గొట్టిపాటి కరుణ, స్వర్ణ, ముంతాజ్, షౌకత్, మంగ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లాలో చదువుతున్న యాదవ విద్యార్థిని  విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందియాలని సంకల్పంతో రామగుండం యాదవ  చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అర్హులైన,విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్స్ మెడల్స్ తో సన్మానం చేయాలని,నిర్ణయించుకున్నాము. కావున అర్హులైన విద్యార్థులు  దరఖాస్తు చేసుకోవాలని ఆవుల రాజేష్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.   పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు  దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు చేసుకొనుటకు అర్హులైన వారు పదవ తరగతి లో 9.0 జి పి ఏ నుంచి 10.0 జీపీఏ వరకు అర్హులు, ఇంటర్ ప్రథమ సంవత్సరం కు 350 పైగా మార్కులు వచ్చినవారు అర్హులు. ద్వితీయ సంవత్సరం 850 మార్కులు పైగా వచ్చినవారుఅర్హులు గా నిర్ణయించడం జరుగుతుంది. కుల సర్టిఫికెట్ జిరాక్స్, మార్క్స్ మెమో జిరాక్స్, ఆధార్ కార్డ్ జతపరచి అప్లై  చేసుకోగలరు. *దరఖాస్తుకు చివరి తేదీ30-05-2023 మరిన్ని వివరాలకు సెల్ నెంబరు 9010661282


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


                 

తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం, తెలంగాణ ప్రజాసంఘాల జె.ఎ.సి రాష్ట్ర వ్యవస్థాపక ఛైర్మన్  గజ్జెల కాంతం  ఆదేశానుసారం *మంచిర్యాల జిల్లా తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షులుగా ఆరకొండ శేఖర్ (అడ్వకేట్) ను జిల్లా ఉపాధ్యక్షులుగా మంద రజినీకాంత్ ను, బెల్లంపల్లి నియోజక వర్గ అధ్యక్షులుగా చంద్ర శేఖర్ కొరాల్ల (టీచర్) ను నియోజక వర్గ ఉపాధ్యక్షులు గా యం.డి జాఫర్ ను నియామకం చేయడమైనది. వీరు ఈ రోజు నుండి కుల మతాలకు, రాజకీయాలకు, రాగ ద్వేషాలకు అతీతంగా మంచిర్యాల జిల్లా లోని ప్రజలందరినీ కలుపుకొని డాక్టర్ బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేడ్కర్  మనకందించిన రాజ్యంగ ఫలాలను రక్షించు కొనుట రాష్ట్ర ఛైర్మన్ గజ్జెల కాంతం అధ్వర్యంలో పోరాటాలను నడిపించుట నూతన కమిటీలను గ్రామ స్థాయినుంచి నిర్మాణము చేయవలసిన బాధ్యత వీరిపై ఉంటుందని తెలియజేస్తూ ఈ నియామకం చేయడమైనది.

జై భీమ్ లతో

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 




సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ద్రోహం తలపెట్టిన జాతీయ కార్మిక సంఘాల ను నిలదీయండి!11, వేతన ఒప్పంద చర్చల్లో కాంట్రాక్టు కార్మికుల సమస్యల ఊసే లేకపోవడం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పట్ల జాతీయ సంఘాల నీతిమాలిన తనానికి నిదర్శనం.

సింగరేణి కాంట్రాక్టు కార్మికులు, గత దశాబ్ద కాలంగా ఫస్ట్ కేటగిరి వేతనం, పర్మనెంట్, తదితర చట్టబద్ధహక్కుల కోసం పోరాడుతున్నారు.

          సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల చట్టబద్ధహక్కులు సమస్యలు పరిష్కరించాలని ఈ సంవత్సరం 19 రోజులు సమ్మె కూడా నిర్వహించారు, ఈ సమ్మె జాతీయ అనుబంధ కాంట్రాక్టు కార్మిక సంఘాలతో పాటు, విప్లవ కార్మిక సంఘాల కాంట్రాక్టు కార్మిక సంఘాలు కూడా జేఏసీగా, ఏర్పడి చట్టబద్ధ సమ్మెకు పూనుకున్నాయి నిరాటంకంగా మిలటెంట్ గా జరుగుతున్న సమ్మె పోరాటాన్ని కాంట్రాక్ట్ కార్మిక వర్గం కష్టనష్టాలకోర్చి కొనసాగించింది. సింగరేణి యాజమాన్యం సమ్మె విచ్చిన్నాన్ని అధిగమించి కార్మికులు సమ్మె పోరాటాన్ని మిలిటెంట్ గా కొనసాగించారు. కాంట్రాక్టర్ కార్మికులు పనిచేసే విభాగాల్లో పని స్తంభించి సింగరేణి యాజమాన్యం దిగివచ్చే పరిస్థితుల్లో, జాతీయ కార్మిక సంఘాలు, వాటి తోకలైన కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు లోపాయికారిగా యాజమాన్యంతో మీలాకాతాయి ఏదైతే వేతన పెరుగుదల కోసం సమ్మె జరిగిందో. దాంతోపాటు మిగతా డిమాండ్లు పరిష్కరించకుండానే ఏకపక్షంగా సమ్మె విరమణ కు పూనుకున్నారు. 19 రోజుల మిలిటెంట్ సమ్మె పోరాటాన్ని వెన్నుపోటు పొడిచి సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ద్రోహాన్ని ఒడిగట్టారు.22, జీవో, అమలుకు సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తో ప్రభుత్వానికి లేఖ రాయించి అమలు చేయిస్తామని. ఉత్తర ప్రగల్బాలు పలికారు, తెలంగాణ ప్రభుత్వం, దాని అనుబంధ కార్మిక సంఘం టిబిజిఎస్, ఏఐటీయూసీ సిఐటియు ఐ ఎన్ టి యు సి లు కుమ్మక్కై ఏ ఒక్క డిమాండ్ సాధించకుండానే సమ్మె విచ్చిన్ననికి పాల్పడ్డారు.22, తమ తాబేదారులైన కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం 22 జీవోను గెజిట్ చేయకుండా కాలయాపన చేస్తున్నది. అసంఘటిత కార్మిక వర్గానికి నష్టం కలగజేస్తున్నది. ఇది ఇలా ఉండగా దీన్ని అడ్డం పెట్టుకొని జాతీయ కార్మిక సంఘాలు వాటి అనుబంధ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు, టీబీజీకేఎస్, కార్మికుల సమ్మెకు వెన్నుపోటు పొడిచాయి.

         ఓట్ల కోసం సీట్ల కోసం అధికార పార్టీ తో అంగలార్చుతూ, హుజూర్నగర్ లో మొదలై ఖమ్మంలో అలై బలై, దాకా దిగజారిన వీరి నీతిమాలిన విధానాలు, లొంగుబాటు, పర్మనెంట్ గని కార్మికుల్ని, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల్ని, వారి హక్కుల్ని యాజమాన్యాలకు, ప్రభుత్వాలకు తాకట్టు పెట్టడమే వీరి విధానంగా కొనసాగుతున్నది. సింగరేణి ఉత్పత్తి ఉత్పాదకతలో సింగరేణి కాంట్రాక్టర్ కార్మికులు భాగస్వాములు,30, వేల మంది కాంట్రాక్టు కార్మికుల సమస్యలు 11వ వేతన ఒప్పంద చర్చలలో లేవనెత్తకపోవడం వీరి సిగ్గుమాలిన తనాన్ని తెలియజేస్తున్నది, మిగతా చోట్ల హైపవర్కమిటీ వేతనాలు అమలు జరుగుతుండగా. సింగరేణిలో ఎందుకు అమలు చేయడం లేదు ప్రశ్నించే సత్తా లేని చేయవలేని జాతీయ కార్మిక సంఘాలు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు సమాధానం చెప్పాలి. తామే నికార్సేన పోరాట వారసత్వం కలిగిన వారమని ఏఐటియుసి సిఐటియు, ఎర్రజెండా ముసుగులో వెలిసిపోయిన లొంగుబాటు లోపాయి కారి సంస్కరణ వాద పోరాట పోతుల కొడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కూడా యాజమాన్యాలకు ప్రభుత్వాలకు తాకట్టుపెట్టి వీరి విధానాలను సింగరేణి కాంట్రాక్టు కార్మికులు అర్థం చేసుకోవాలి 19 రోజుల సమ్మెను రూపాయి కారి ఒప్పందంతో విచ్ఛిన్నం చేసిన వీరి కార్మిక వ్యతిరేక విధానాన్ని తిరస్కరించాలి, విశాల కార్మిక వర్గ క్షేత్రంలో వీరి కార్మిక వ్యతిరేక విధానాలను బట్టబయలు చేసినిలదీయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఎస్ సి సి డబ్ల్యూ యు) పిలుపునిస్తున్నది.

           అధికార పార్టీతో  అంటగాగుతున్న ఏఐటీయూసీ సిఐటియు, లు, జీవో 22, సింగరేణిలో అమలు చేయించాలని డిమాండ్ చేస్తున్నాం, జెబి సి సిఐ,11, వేతన ఒప్పంద చర్చల్లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు చర్చించనందుకు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను క్షమాపణలు కోరాలని డిమాండ్ చేస్తున్నాం.

                ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఎస్ ఎస్ సి డబ్ల్యూయు-ఐఎఫ్ టి యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. వెంకన్న, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు, ఈ. నరేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బందు అశోక్ రాష్ట్ర నాయకులు ఈదునూరు తదితరులు పాల్గొన్నారు.