మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సిఐటియు 53వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఎన్టిపిసి మేడిపల్లి సెంటర్లో ఎన్టిపిసి రామగుండం ఏరియా కన్వీనర్ గిట్ల లక్ష్మారెడ్డి, ఎన్టిపిసి ప్లాంట్ గేట్ 2 కమాన్ వద్ద రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు కాదాశి మల్లేష్ సిఐటియు జెండాలను ఆవిష్కరించిన అనంతరం కార్మికులకు ఎన్ టి పి సి గేట్ నెంబర్ 2 దగ్గర కరపత్రాలను పంపిణీ చేశారు.
అనంతరం ఆర్ ఐ డబ్ల్యూ యూ ప్రధాన కార్యదర్శి నాంసాని శంకర్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్పొరేట్ మతోన్మాద విధానాలను వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాలని కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరిగింది కార్మిక వర్గానికి హక్కులు, సౌకర్యాల కోసం సిఐటియు ఎనలేని కృషి చేస్తున్నదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ఐక్య పోరాటాల ద్వారా ఎన్నో కార్మిక ఉద్యమాలు నిర్మించిన ఘనత సీఐటీయూ యూనియన్ కు ఉందని, దేశంలో సిఐటియు కార్మిక సంఘాన్ని స్థాపించి కార్మికుల ఉద్యమంలో ముందుభాగాన పోరాడుతూ ఈరోజు 53వ ఆవిర్భావ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జిల్లా కోశాధికారి ఎం రామాచారి, నాయకులు కాదాసీ మల్లేష్, టి రవిందర్, ఎండి షమీం , వి శ్రీనివాస్ రెడ్డి, అక్క పాక శంకర్ టి నారాయణరెడ్డి, కనకయ్య, రవి, ధరణి రాజయ్య, భూమేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: