మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 నుండి 22 వరకు నిర్వహించ తలపెట్టిన దశాబ్ది ఉత్సవ ఆర్భాటాలు ఎవరి కోసమని *సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ విమర్శించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ ప్రజల సొమ్మును విచచ్చలవిడిగా ఖర్చు చేయడానికి, వివిధ కార్యక్రమాలు తలపెట్టి, అందుకు తగిన బడ్జెట్ కూడా కేటాయించిందన్నారు. కానీ గత 2 నెలలుగా రైతులు ఐకేపీ సెంటర్లలో ధాన్యం పోసి ఉంచితే, గోనె సంచులు లేవని, లారీలు రావట్లేదు అని దాన్యం కొనుగోళ్లు నిలిపి వేసినారు.కొత్త ఆసరా పెన్షన్ ల ఊసే లేదు. ఉద్యోగులకు జీతాలు లేవు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయినవి. ఇవన్నీ ప్రభుత్వం కళ్ళకు కనబడుటలేదు. అట్టహసాలు, ఆర్బాటాలతో రాజకీయ పబ్బం గడుపు కోవాలని చూస్తుందన్నారు. ఐకేపీ సెంటర్ లలో రైతులు పడే బాధలు మీ కళ్ల కు ఎందుకు కనబడుట లేదో అర్ధం కావట్లేదనీ దుయ్యబట్టారు.తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలనీ డిమాండ్ చేశారు. ఏ ప్రజాస్వామిక ఆకాంక్షలతో నిలువెత్తు ఉద్యమం నిర్మించి, వందలాది మంది బలిదానాలు చేశారో, ఆ ఆశలు, ఆకాంక్షలు ఈ పదేండ్లలో నెరవేరలేదు అని అన్నారు. కోటి ఆశలతో విద్యార్థులు,నిరుద్యోగులు, సకల జనులు ఉద్యమించిన, వాళ్ళను మోసం చేసి తెలంగాణా ద్రోహులను అందలమెక్కించారని అన్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయిన సందర్బంగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని,నిలువ నీడ లేని పేదలకు డబుల్ బెడ్ రూం లు లేదా ఇళ్ళ స్థలాల ఇచ్చి ఇంటి నిర్మాణానికి 10లక్షల రూపాయలు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని,కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి ప్రతి ఒక్కరికి 10కేజీల సన్న బియ్యం తో పాటు పన్నెండు రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇవ్వాలనీ, రైతులకు తక్షణమే రుణ మాఫీ చేయాలని,దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని, దళితులందరికీ దళిత బందు ఇవ్వాలనీ, బీసీ బంధు అమలు జరపాలని, నిరుద్యోగులందరికీ 10వేల నిరుద్యోగ భృతి చెల్లించాలని తదితర డిమాండ్ల సాధనకు *సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా రాష్ట్ర 7వ మహాసభ జూన్ 2నుండి12వరకు "తెలంగాణ ప్రజల ఆకాంక్షల దీక్షా దివాస్" జరపాలని పిలుపునిచ్చింది అన్నారు. ఈ సందర్బంగా అన్ని మండలాల్లో,గ్రామాలలో దీక్షలు,ప్రదర్శనలు నిర్వహించాలని,దీనిలో ప్రజలందరూ భాగస్వామ్యం అయి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు *ఈ విలేకరుల సమావేశంలో సి పి ఐ యం ఎల్ ప్రజాపంధా కరీంనగర్ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, జిల్లా నాయకులు గుమ్మడి వెంకన్న, ఆడెపు శంకర్, గొల్లపల్లి చంద్రయ్య, కోడిపుంజుల లక్ష్మి, ఇనుగాల రాజేశ్వర్, కలవల రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: