మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
కుర్చీ వేసుకోని ఒసిపి కాకుండా చుస్తా అని చెప్పి గోదావరిఖని ప్రాంతాన్ని బొందల గడ్డగా చేసిన కెసిఆర్ ప్రభుత్వంఉద్యోగాలు, ఇసుక, బూడిద ఇలా అన్ని అమ్ముకునుడే తప్ప రామగుండం అభివృద్ది శూన్యం*రామగుండం నియోజకవర్గ ప్రజలందరికి అండగా ఉంటానని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు.
30వ డివిజన్ లో పెద్ద ఎత్తున మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు వారి సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొన్నారు..
ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ..
గత 30 సంవత్సరాలుగా రామగుండం నియోజకవర్గ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న నన్ను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఓసీపీలతో బొందల గడ్డలు అవుతాయని, బొందల గడ్డలు కాకుండా కుర్చీ వేసుకుని ఓసిపి కాకుండా అడ్డుకుంటానని చెప్పినా కేసిఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత ఓసిపి చేసి గోదావరిఖని ప్రాంతాన్ని బొందల గడ్డగా చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు, ఇసుక, బూడిద అన్ని అమ్ముకోవడమే తప్ప రామగుండం నియోజకవర్గం అభివృద్ధి చేయడంలో రామగుండం ఎమ్మెల్యే విఫలం అయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి పేద ప్రజలను ఆదుకుంటామని తెలిపారు.
Post A Comment: