మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఆంతర్గాం మండల కేంద్రంలోని ఆఫీస్ ఆవరణలో సిపిఐ ఎంఎల్) న్యూడెమోక్రసీ అనుబంధ "అఖిల భారత రైతు-కూలీ సంఘం(ఏఐకేఎంఎస్ జిల్లా జనరల్ కౌన్సిల్ కరపత్రాలు విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ...అకాల వర్షాలతో రైతాంగం అతలాకుతలం అయిందని, ఆరుగాలం కష్టపడి చేతికందిన పంటను కొనుగోలు చేయవలసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్దిఉత్సవాలపేరుతో సంబరాల్లో మునిగి తేలుతుందని, జిల్లా లో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటుందని వీటంన్నింటి పరిష్కారానికి కలిసి కట్టుగా ఉద్యమించాలని, రైతంగా పోరాటాల కై భవిష్యత్తు కార్యాచరణ కోసం జూన్ 10న పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఏఐకేఎంఎస్ జనరల్ కౌన్సిల్ కు జిల్లా లోని రైతులు, ప్రజాస్వామిక వాదులు, ప్రజలు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు, గత కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించికొంటున్న ఏఐకేఎంఎస్ జనరల్ కౌన్సిల్ విజయవంతం కోసం జిల్లా వ్యాపార, వాణిజ్య వర్గాలు ఆర్ధిక హార్దిక సహాయం అందించాలని కోరారు.
ఇంకా ఈకార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మేరుగు చంద్రయ్య, నాయకులు వేల్పుల సాంబయ్య, టి రాజకొమురయ్య, ఆలకుంట దేవయ్య, లింగంపెల్లి శంకర్, మునుకుంట్ల శ్రీనివాస్, ఎండి నసీరొద్దీన్, ఆర్ శోబన్ బాబు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: