ముఖ్య సంచాలక్ అనపర్తి సాయితేజ
ఈరోజు ముత్తారం మండల బిజెపి పార్టీ ఆఫీసులో బిజెపి మండల ఇంచార్జ్ లు పోతరవేని క్రాంతికుమార్, బిరుదు గట్టయ్య గార్ల ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం.... మన ప్రియతమా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పాలన 9 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా మహాజన సంపర్క అభియాన్ పేరుతో నెల రోజుల కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది మరియు గ్రామాల వారీగా, శక్తి కేంద్రాల వారిగా పోలింగ్ బూతుల వారిగా ఇన్చార్జిల నియామకం జరిగింది. ఈ నెల రోజులు కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 9 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా ప్రతి గడపగడపకు తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన చాలా మంచి పనులను వివరించాలని అలాగే ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ అతికించి మోడీ గారు చేసిన పనులను కరపత్ర రూపంలో పంచి పెట్టాలని చెప్పడం జరిగింది...
ఈ కార్యక్రమం లో బీజేపీ సీనియర్ నాయకులు మూగ మల్లేష్,మూగ మధునయ్య,బొడ్డు సారయ్య,మారం శ్రీనివాస్ రెడ్డి, బండ రాజిరెడ్డి,కంచం రమేష్,మూగ రాజయ్య,లక్కం రాజ గట్టు,రత్న సమ్మయ్య,ఇస్సంపెల్లి శ్రీను,ఉప్పు వరుణ్,పెయ్యల నరేష్ గార్లు మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...
Post A Comment: