మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్: మండలంలోని ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరం అభివృద్ధికి కంకణం కట్టుకొని మారుమూల దట్టమైన అటవీ ప్రాంతం నుంచి రవాణా మార్గంతో ఆర్టీసీ బస్సుల సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఆలయ జీర్నోద్ధరణ, విద్యుత్ వెలుగులను ప్రసరింపజేసిన గొప్ప మహానుభావుడు, అభివృద్ధి ప్రదాత ముఖ్యలు స్వర్గీయ జువ్వాడి చొక్కారావు వర్ధంతి కార్యక్రమ వేడుకలను నేటి ఆదివారం రోజున దేవస్థానం ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని స్వర్గీయ చొక్కారావు కాంస్య విగ్రహానికి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ జక్కు శ్రీ హర్షిని, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ లింగంపల్లి శ్రీనివాస రావు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ మహేష్, కాళేశ్వరం ఎంపీటీసీ రేవెల్లి మమత, సర్పంచ్ వెన్నపురెడ్డి వసంత, ఆలయ ధర్మకర్తలు కామిడి రాంరెడ్డి, అడుప సమ్మయ్య, కలికోట దేవేందర్, శ్యామ్ సుందర్ దేవ్డా, కుంభం పద్మ, బండి రాజయ్య, పూల మాలలు వేసి ఘనమైన నివాళులర్పించి, భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుల బృందం, సిబ్బంది, గ్రామస్తులు, నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: