మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
గడ్చిరోలి : మే 29
వయసు పదిహేను ఏళ్లే. కానీ మోస్ట్ వాంటెడ్ నక్సలైట్. కొండకోనలే ఆవాసాలు. మారణాయుధాలతో సహవాసం. అయితే ఆమెలో ప్రస్తుతం మార్పు వచ్చింది. గన్‍లను వదిలి పుస్తకాలు, పెన్‌లను చేతబూనింది.. చదువుల్లో రాణించింది. ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి చరిత్ర సృష్టించింది. ఇంతకు ఆమెలో ఇంత మంచి మార్పు ఎలా వచ్చింది. ఇందుకు కారణాలేంటో ఆమెను పలకరించిన కోకిల డిజిటల్ మీడియా..
మహారాష్ట్రలోని గోండియాకు చెందిన ఇరావుల హిదామి తండ్రి.. చిన్నతనంలోనే మరణించాడు. తల్లి మరో వ్యక్తిని వివాహమాడి వెళ్లిపోయింది. ఒంటరైన ఈమెను ఎవరూ దగ్గరికి తీయలేదు. దీంతో తాను నక్సలిజంలో చేరిపోయింది. ఒడిశాలోని గడ్చిరోలి, మహారాషష్ట్రలోని గోండియా ప్రాంతాల్లో మోస్ట్ వాంటెడ్ హిట్ లిస్టులో చేరింది. పేరుమోపిన నక్సలైట్‍గా మారింది. పదిహేనేళ్లలోనే హిదామి పై ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
అయితే గోండియా ప్రాంతానికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారి ఎస్పీ సందీప్ అతోల్ ఈ విశయంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆవిడను సరైన దిశగా మార‍్చడంలో విజయం సాధించారు. 2018లోనే ఎస‍్పీ సలహాతో అటవి మార్గం విడిచి, జనావాసాలను చేరింది. పోలీసు అధికారి సందీప్ అతోల్ మద్దతుతో చదువును కొనసాగించింది. ఈ వారం వెలువడిన 12వ తరగతి బోర్డు పరీక్షలలో 45.83 శాతంతో ఉత్తీర‍్ణత సాధించింది. ఒకప్పుడు తుపాకి చేతబట్టి అడవులలో తిరిగిన హిదామి, ఆ బాటను మార్చుకొని చదువుపై దృష్టి సారించింది నా విజయాలకు ఎస్పీ సందీప్ అతోల్, కుటుంబమే కారణమని ఆ కుటుంబమే తన కుటుంబమని అంటోంది. భవిష్యత్‌లో పోలీసు దళంలో ఉద్యోగం సాధిస్తానని చెబుతోంది. సమస్యల పరిష్కారానికి అటవి దారి ఒక్కటే మార్గం కాదని నక్సలైట్లకు ఆమె హితువు పలికారు..
Post A Comment: