మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
కాళేశ్వరం: క్షేత్రంలో ఈరోజు మాజీ మంత్రి, మంథని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు 54వ జన్మ రోజును పురస్కరించుకొని, స్థానిక కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పాలాభిషేకం పూజలు నిర్వహించారు,అనంతరం బస్టాండ్ సమీపంలోని శ్రీపాద చౌక్ లో కేక్ కట్ చేసి, స్థానికులకు, భక్తులకు స్వీట్లు, పండ్లు, పులిహోర ప్రసాదం ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ శుభ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బందెల సత్తమ్మ, మండల ప్రధాన కార్యదర్శి మాడుగుల పవన్, గ్రామ శాఖ అధ్యక్షులు మంగాయి లక్ష్మణ్, ప్రచార కమిటీ అధ్యక్షులు షకీల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కామిడి శ్రీనివాస్ రెడ్డి, షేక్ జానీ, గందేసిరి సత్యనారాయణ, మాచర్ల సారయ్య, వార్డ్ సభ్యురాలు లేతకారి కవిత, గ్రామ కమిటీ మహిళా అధ్యక్షురాలు మహేశ్వరి, యూత్ నాయకులు మాచర్ల అరుణ్, హైదర్, పెండ్యాల సంతోష్, దూది వెంకటస్వామి, ఫరీద్, నిట్టూరి రాకేష్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: