మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ముత్తారం మండలం కేసనపల్లి గ్రామంలోని ఐకేపీ వరి కొనుగోలు కేంద్రంలో బుక్ కీపర్ గా పనిచేస్తున్న పేరుక కృష్ణ వారం క్రితం వడదెబ్బతో చనిపోవడం జరిగింది.ఈ రోజు ప్రజా సంఘాల నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు పెద్దపెల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యారావు మాట్లాడుతూ... వడ దెబ్బ వల్ల ఐకెపి సెంటర్లో పనిచేస్తున్న పేరుక కృష్ణ మరణం చెందడం పట్ల సంతాపం తెలియజేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి ఉన్న పెద్దదిక్కు కోల్పోవడంతో భార్య పిల్లలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు వారి కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వారి కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇప్పించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, పిల్లలకు మెరుగైన విద్య అందించాలని మరియు దళిత బంధు ఇప్పించి వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి. కొమురయ్య,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్, కెవిపిఎస్ మాజి జిల్లా నాయకులు, మంథని లింగయ్య తదితరులు ఉన్నారు.
Post A Comment: