ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లాలో పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు, సామాజికవేత్తలకు తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం
పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
తన ఛాంబర్ లో రాష్ట్ర ప్రణాళిక శాఖ, హైదరాబాద్ ఆధ్వర్యంలో ముద్రించి జిల్లాకు పంపిన తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2023 పుస్తకమును ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,
ఈ పుస్తకం నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు , మేధావులకు, విద్యావేత్తలకు ఎంతో ఉపయోగపడుతుందని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, వివిధ పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
ఈ పుస్తకం ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతా పథకాల కార్యక్రమాల పూర్తి సమాచారాన్ని విశ్లేషిస్తుందని, రాష్ట్రం సాధించిన ప్రధాన విజయాలను ప్రముఖంగా పేర్కొనడం జరిగిందని, ప్రభుత్వ పాలనకు పారదర్శకత కల్పించడంతో పాటు బంగారు తెలంగాణ సాధనకు భవిష్యత్ మార్గాలకై సమగ్రమైన అధ్యయనం చేసే అవకాశం కల్పిస్తుందని తెలిపారు.311 పేజీలు ఉన్న ఈ పుస్తకంను అవసరమున్న వారు ముఖ్య ప్రణాళిక అధికారి (CPO) కార్యాలయంలో 150 రూపాయలు చెల్లించి పొందాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి అంకిత్ శంకువార్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సత్య నారాయణ రెడ్డి, జిల్లా పౌర సంబంధాల శాఖ ఏడి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
Post A Comment: