మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లాలో చదువుతున్న యాదవ విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందియాలని సంకల్పంతో రామగుండం యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అర్హులైన,విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్స్ మెడల్స్ తో సన్మానం చేయాలని,నిర్ణయించుకున్నాము. కావున అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆవుల రాజేష్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు చేసుకొనుటకు అర్హులైన వారు పదవ తరగతి లో 9.0 జి పి ఏ నుంచి 10.0 జీపీఏ వరకు అర్హులు, ఇంటర్ ప్రథమ సంవత్సరం కు 350 పైగా మార్కులు వచ్చినవారు అర్హులు. ద్వితీయ సంవత్సరం 850 మార్కులు పైగా వచ్చినవారుఅర్హులు గా నిర్ణయించడం జరుగుతుంది. కుల సర్టిఫికెట్ జిరాక్స్, మార్క్స్ మెమో జిరాక్స్, ఆధార్ కార్డ్ జతపరచి అప్లై చేసుకోగలరు. *దరఖాస్తుకు చివరి తేదీ30-05-2023 మరిన్ని వివరాలకు సెల్ నెంబరు 9010661282
Post A Comment: