మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గత రెండు నెలలుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల సాధన కోసం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని పవర్ హౌస్ కాలనీ, జంగాలపల్లి, ఇందిరమ్మ కాలనీ, పీకే రామయ్య కాలనీ నాలుగు కేంద్రాలలోని ప్రభుత్వ భూములలో పేదలచే గుడిసెలు వేయించి పోరాటం చేస్తున్నది. సిఐటియు అఖిలభారత కమిటీ కోశాధికారి మరియు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎం సాయిబాబా ఇందిరమ్మ కాలనీ, పికె రామయ్య కాలనీలలోని రెండు ఇండ్ల స్థలాల పోరాట కేంద్రాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశాలలో సాయిబాబు మాట్లాడుతూ దీర్ఘకాలంగా నిరుపేదలు కిరాయి ఇళ్లలో ఉంటూ చాలీచాలని జీతాలతో బతుకులీడుస్తు, సంపాదనలో సగం కిరాయిలకే పోతున్న పరిస్థితులలో ఇళ్ల స్థలాలు కావాలని కోరుకోవడం సమంజసంగా ఉంది. న్యాయమైన మీ పోరాటానికి సిఐటియు అండగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిచనున్నది. కావున ఈ దశాబ్ది ఉత్సవాల ప్రారంభాని కంటే ముందే అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సాయిబాబా గుడిసెలు వేసుకున్న వారి గుడిసెలను సందర్శించి అందరిని ఆప్యాయతతో పలకరించారు. ఉత్తేజ కరంగా సాగిన కామ్రేడ్ సాయిబాబు ఉపన్యాసం మొక్కవోని దీక్షతో ఇళ్ల స్థలాలు ఇచ్చేంతవరకు పోరాటం కొనసాగిస్తామని సమావేశంలో పాల్గొన్న మహిళలు ఉత్సాహంతో నినాదాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాదయ్య కార్యదర్శి మహేశ్వరి, ఇందిరమ్మ కాలనీ ఇళ్ల స్థలాల సాధన కమిటీ కన్వీనర్ కామ్రేడ్ ఎమ్ రామాచారి, నాయకులు సిహెచ్ ఉపేందర్, రమణక్క, భాగ్య, స్వప్న, మహాలక్ష్మి, ఏం సంపత్ తదితరులు పాల్గొన్నారు. పీకే రామయ్య కాలనీ ఇండ్ల స్థలాల సాధన మూడో కేంద్రం లో జరిగిన సమావేశంలో కన్వీనర్ కామ్రేడ్ ఎన్ బిక్షపతి, నాయకులు పి నాగలక్ష్మి, గిట్ల లక్ష్మారెడ్డి, బీర్క సుజాత, గొట్టిపాటి కరుణ, స్వర్ణ, ముంతాజ్, షౌకత్, మంగ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: