మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్*



హైదరాబాద్, మే 24:

రాష్ట్రంలో కల్తీ ఫుడ్ పెరిగిపోతున్నది. పాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట నూనె, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్.. ఇట్ల ప్రతీది కల్తీ అవుతున్నది. ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టడంలో సర్కార్ విఫలమవుతున్నది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఫుడ్ సేఫ్టీ విషయంలో మన రాష్ట్రం చివర్లో ఉన్నది. ఫుడ్ సేఫ్టీలో 17 పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే 15వ స్థానానికి దిగజారింది. అంటే కల్తీ ఫుడ్ ఎక్కువున్న రాష్ట్రాల జాబితాలో టాప్ 3లో ఉన్నదన్నట్టు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇటీవల విడుదల చేసిన రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీపై సర్వే చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ.. పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా రిపోర్టులు ఇచ్చింది. పెద్ద రాష్ట్రాల జాబితాలో ఒడిశా, ఉత్తరప్రదేశ్, అస్సాం, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల కంటే తెలంగాణలో ఫుడ్ కల్తీ ఎక్కువగా ఉన్నట్టు రిపోర్టులో తేలింది. మరోవైపు ఫుడ్ క్వాలిటీ చెకింగ్ లోనూ రాష్ట్రం వెనుకబడిందని వెల్లడైంది. కల్తీ ఫుడ్ ను అరికట్టేందుకు కఠిన చట్టం తీసుకొస్తామని గొప్పగా చెప్పిన సర్కార్.. ఆరేండ్లయితున్నా అందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఫుడ్ కల్తీపైనా ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కూడా కల్పించడం లేదు. మార్కెట్ లోకి విచ్చలవిడిగా వస్తున్న కల్తీ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసి జనం అనారోగ్యానికి గురవుతున్నారు. క్యాన్సర్, గుండె, కిడ్నీ, లివర్ తదితర రోగాల బారినపడుతున్నారు. 


*ఫుడ్ క్వాలిటీ టెస్టుల్లేవు..* 


ఫుడ్ క్వాలిటీ చెకింగ్ లోనూ మన రాష్ట్రం వెనుకబడింది. ఇందులో 20 పాయింట్లకు గాను తెలంగాణకు 3.5 పాయింట్లే వచ్చాయి. తమిళనాడుకు 10 పాయింట్లు, మిగిలిన రాష్ట్రాలు కూడా మంచి పాయింట్లతో ముందున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఫుడ్ క్వాలిటీ టెస్టులు చేయడం లేదు. హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ నూనెలు వాడుతున్నారు. వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వినియోగిస్తున్నారు. దీంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పెద్ద పెద్ద ప్రైవేట్ హోటళ్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. మాంసం విక్రయ కేంద్రాల్లోనూ క్వాలిటీ చెకింగ్ ఉండటం లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించే ఫుడ్ విషయంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో పేషెంట్లకు అందిస్తున్న ఆహారం, పాలు, పండ్లు, గుడ్లు, ఇతర పదార్థాల నాణ్యతను పట్టించుకోవడం లేదు. గురుకుల హాస్టళ్లలోనూ తనిఖీలు చేపట్టడం లేదు. కల్తీ ఫుడ్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు తరచూ జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలోని స్లాటర్​హౌస్ కు ప్రభుత్వ గుర్తింపు ఉంది. ఇక్కడ రోజుకు 3 వేల గొర్రెలను కోస్తారు. ప్రతిరోజూ ఇక్కడ ర్యాండమ్ గా మాంసానికి క్వాలిటీ టెస్టులు చేయాలి. కానీ నామమాత్రంగానే టెస్టులు జరుగుతున్నట్లు చెబుతున్నారు...

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: