మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 




సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ద్రోహం తలపెట్టిన జాతీయ కార్మిక సంఘాల ను నిలదీయండి!11, వేతన ఒప్పంద చర్చల్లో కాంట్రాక్టు కార్మికుల సమస్యల ఊసే లేకపోవడం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పట్ల జాతీయ సంఘాల నీతిమాలిన తనానికి నిదర్శనం.

సింగరేణి కాంట్రాక్టు కార్మికులు, గత దశాబ్ద కాలంగా ఫస్ట్ కేటగిరి వేతనం, పర్మనెంట్, తదితర చట్టబద్ధహక్కుల కోసం పోరాడుతున్నారు.

          సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల చట్టబద్ధహక్కులు సమస్యలు పరిష్కరించాలని ఈ సంవత్సరం 19 రోజులు సమ్మె కూడా నిర్వహించారు, ఈ సమ్మె జాతీయ అనుబంధ కాంట్రాక్టు కార్మిక సంఘాలతో పాటు, విప్లవ కార్మిక సంఘాల కాంట్రాక్టు కార్మిక సంఘాలు కూడా జేఏసీగా, ఏర్పడి చట్టబద్ధ సమ్మెకు పూనుకున్నాయి నిరాటంకంగా మిలటెంట్ గా జరుగుతున్న సమ్మె పోరాటాన్ని కాంట్రాక్ట్ కార్మిక వర్గం కష్టనష్టాలకోర్చి కొనసాగించింది. సింగరేణి యాజమాన్యం సమ్మె విచ్చిన్నాన్ని అధిగమించి కార్మికులు సమ్మె పోరాటాన్ని మిలిటెంట్ గా కొనసాగించారు. కాంట్రాక్టర్ కార్మికులు పనిచేసే విభాగాల్లో పని స్తంభించి సింగరేణి యాజమాన్యం దిగివచ్చే పరిస్థితుల్లో, జాతీయ కార్మిక సంఘాలు, వాటి తోకలైన కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు లోపాయికారిగా యాజమాన్యంతో మీలాకాతాయి ఏదైతే వేతన పెరుగుదల కోసం సమ్మె జరిగిందో. దాంతోపాటు మిగతా డిమాండ్లు పరిష్కరించకుండానే ఏకపక్షంగా సమ్మె విరమణ కు పూనుకున్నారు. 19 రోజుల మిలిటెంట్ సమ్మె పోరాటాన్ని వెన్నుపోటు పొడిచి సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ద్రోహాన్ని ఒడిగట్టారు.22, జీవో, అమలుకు సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తో ప్రభుత్వానికి లేఖ రాయించి అమలు చేయిస్తామని. ఉత్తర ప్రగల్బాలు పలికారు, తెలంగాణ ప్రభుత్వం, దాని అనుబంధ కార్మిక సంఘం టిబిజిఎస్, ఏఐటీయూసీ సిఐటియు ఐ ఎన్ టి యు సి లు కుమ్మక్కై ఏ ఒక్క డిమాండ్ సాధించకుండానే సమ్మె విచ్చిన్ననికి పాల్పడ్డారు.22, తమ తాబేదారులైన కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం 22 జీవోను గెజిట్ చేయకుండా కాలయాపన చేస్తున్నది. అసంఘటిత కార్మిక వర్గానికి నష్టం కలగజేస్తున్నది. ఇది ఇలా ఉండగా దీన్ని అడ్డం పెట్టుకొని జాతీయ కార్మిక సంఘాలు వాటి అనుబంధ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు, టీబీజీకేఎస్, కార్మికుల సమ్మెకు వెన్నుపోటు పొడిచాయి.

         ఓట్ల కోసం సీట్ల కోసం అధికార పార్టీ తో అంగలార్చుతూ, హుజూర్నగర్ లో మొదలై ఖమ్మంలో అలై బలై, దాకా దిగజారిన వీరి నీతిమాలిన విధానాలు, లొంగుబాటు, పర్మనెంట్ గని కార్మికుల్ని, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల్ని, వారి హక్కుల్ని యాజమాన్యాలకు, ప్రభుత్వాలకు తాకట్టు పెట్టడమే వీరి విధానంగా కొనసాగుతున్నది. సింగరేణి ఉత్పత్తి ఉత్పాదకతలో సింగరేణి కాంట్రాక్టర్ కార్మికులు భాగస్వాములు,30, వేల మంది కాంట్రాక్టు కార్మికుల సమస్యలు 11వ వేతన ఒప్పంద చర్చలలో లేవనెత్తకపోవడం వీరి సిగ్గుమాలిన తనాన్ని తెలియజేస్తున్నది, మిగతా చోట్ల హైపవర్కమిటీ వేతనాలు అమలు జరుగుతుండగా. సింగరేణిలో ఎందుకు అమలు చేయడం లేదు ప్రశ్నించే సత్తా లేని చేయవలేని జాతీయ కార్మిక సంఘాలు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు సమాధానం చెప్పాలి. తామే నికార్సేన పోరాట వారసత్వం కలిగిన వారమని ఏఐటియుసి సిఐటియు, ఎర్రజెండా ముసుగులో వెలిసిపోయిన లొంగుబాటు లోపాయి కారి సంస్కరణ వాద పోరాట పోతుల కొడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కూడా యాజమాన్యాలకు ప్రభుత్వాలకు తాకట్టుపెట్టి వీరి విధానాలను సింగరేణి కాంట్రాక్టు కార్మికులు అర్థం చేసుకోవాలి 19 రోజుల సమ్మెను రూపాయి కారి ఒప్పందంతో విచ్ఛిన్నం చేసిన వీరి కార్మిక వ్యతిరేక విధానాన్ని తిరస్కరించాలి, విశాల కార్మిక వర్గ క్షేత్రంలో వీరి కార్మిక వ్యతిరేక విధానాలను బట్టబయలు చేసినిలదీయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఎస్ సి సి డబ్ల్యూ యు) పిలుపునిస్తున్నది.

           అధికార పార్టీతో  అంటగాగుతున్న ఏఐటీయూసీ సిఐటియు, లు, జీవో 22, సింగరేణిలో అమలు చేయించాలని డిమాండ్ చేస్తున్నాం, జెబి సి సిఐ,11, వేతన ఒప్పంద చర్చల్లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు చర్చించనందుకు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను క్షమాపణలు కోరాలని డిమాండ్ చేస్తున్నాం.

                ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఎస్ ఎస్ సి డబ్ల్యూయు-ఐఎఫ్ టి యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. వెంకన్న, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు, ఈ. నరేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బందు అశోక్ రాష్ట్ర నాయకులు ఈదునూరు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: