November 2022
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

పార్టీలకు,రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 19 వ డివిజన్ లో ఇటివల కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసిన మంచన చంద్రకళ గారి కుటుంబానికి బుధవారం  తెలంగాణ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి ఫథకం ద్వారా మంజూరైన చెక్కును ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్  వారికి అందజేసారు. పార్టీలకతీతంగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్  సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని, ప్రతీ గడపకు తెలంగాణ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ ఓని స్వర్ణలత భాస్కర్, డివిజన్ అధ్యక్షులు ఈటల ఉమామహేందర్, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

వరంగల్ 26 వ డివిజన్ లో కార్పోరేటర్ బాలిన సురేష్ ఆద్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్  చేపడుతున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్శితులై లక్ష్మిపురానికి చెందిన యువకులు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ మేరకు వారికి ఎమ్మెల్యే నరేందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం,అభివృద్దే ఎజెండాగా పనిచేస్తున్నానని, ముఖ్యమంత్రి కేసీఆర్ ,కేటీఆర్  నాయకత్వంలో మీరిచ్చిన ఆశీర్వాదమే నాకు బలమన్నారు. ప్రజలకు సేవ చేయటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎన్నికలప్పుడే ప్రజల్లోకి వచ్చేవాళ్ళతో జాగ్రత్తగా ఉండాలన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే వాళ్ళను ఆశీర్వదించండన్నారు. టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్  నాయకత్వంలో తిరిగిలేని రాజకీయ శక్తిగా తయారైందని, టీఆర్ఎస్ కు కార్యకర్తలే బలమన్నారు.

టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో కొంగర నితీష్, కే.దిలీప్, ఈ అజయ్, కే.లడ్డు,జి.పవన్,ఎం.ప్రశాంత్ తేజ, ఆర్.రాము, బి రాహుల్, ఎండి.జావిద్ ఖాన్, టీ.చంటి, పి.కోటి, కే.కిరణ్,పి.కుమార్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమం కార్పోరేటర్ బాలిన సురేష్, బోగి సురేష్, మాజీ కార్పోరేటర్ కుందారపు రాజేందర్,మాజీ కో ఆప్షన్ మెంబర్ చాంద్ పాషా,డివిజన్ అధ్యక్షులు సోమవతి విజయభారతి , ప్రధాన కార్యదర్శి ఒద్యారపు రాజేంద్ర చారి,దుర్గేశ్వల స్వామి ఆలయ చైర్మన్ ఎలకంటి సతీష్, ధర్మకర్త కూచన రమేష్,డివిజన్ ముఖ్య నాయకులు గన్నారపు కుమార్ ,రేపూడి భాస్కర్,కొమ్ము రాజు,పోలెపాక సీతయ్య,కాపురపు సుదాకర్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన  కమిషనర్  గా   ఏ.వి.రంగనాధ్ ( డిఐజి) నియమిస్తు  రాష్ట్ర  ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ ని డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న

   


                                                         
పెద్దపల్లి:మంథని:కాటారం:నవంబర్30:ప్రతాపగిరి తెరాస పార్టీ గ్రామ మహిళ కమిటీని,నియమించిన కాటారం మండలం మహిళా అధ్యక్షురాలు ఏలువాక సుజాత,మంథని నియోజకవర్గం తెరాస పార్టీ ఇంచార్జి పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్,జయశంకర్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని ల ఆదేశాల మేరకు,ప్రతాపగిరి తెరాస పార్టీ మహిళా అధ్యక్షురాలు పిట్టల కమల,ఉపాధ్యక్షురాల్లు రాగం ఎర్రక్క,మాషిపెద్ది బుజ్జమ్మ,ప్రధాన కార్యదర్శి గుంటి అరుణ,సంయుక్త కార్యదర్శి గడ్డం లక్ష్మిరాణి,ప్రచార కార్యదర్శి దండ వేణి ఓదక్క,కోశాధికారి దేవునూరి రాజక్కలను,కమిటీ సభ్యులను నియమించారు,ఈ కమిటీ నియమకానికి సీనియర్ నాయకులు వూర వెంకటేశ్వర్ రావు,ఉప సర్పంచ్,గ్రామ శాఖ అధ్యక్షులు,ఉపాధ్యక్షులు యూత్ అధ్యక్షులు,ఉపాధ్యక్షులు తెరాస పార్టీనాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

విధి నిర్వహణలో గాయపడ్డ పంచాయతీ కార్యదర్శికి మెరుగైన వైద్యంఅందించాలని కలెక్టర్, వైద్యులతో  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. 

గత మూడున్నరేళ్లుగా పనిచేస్తున్న తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల(టిపిఎస్ఎఫ్) ఫెడరేషన్ అధ్యక్షులు గౌరినేని రాజేశ్వర్ రావు నేతృత్వంలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు ని హైదరాబాద్ లో కలిసి వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అవిరామంగా పనిచేస్తున్నారని, వారి సేవలను గుర్తించి, వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ రెగ్యులరైజ్ చేయాలని మంత్రిని కోరారు. 

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల విజ్ణప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఈ అంశాన్ని  ముఖ్యమంత్రి  కేసిఆర్  దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

 ఆదిలాబాద్ జిల్లా నేరెడుగొండు మండలం, పీచర గ్రామ పంచాయతీ జూనియర్ కార్యదర్శి రాజ్ కుమార్ ఆర్.ఓ.ఎఫ్.ఆర్ సర్వేలో భాగంగా విధులు నిర్వహించి ఇంటికి వస్తుండగా ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  వెంటనే రాజ్ కుమార్ కు మెరుగైన వైద్య అందించాలని జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. అనంతరం రాజ్ కుమార్ చేరిన హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులతో మాట్లాడారు. రాజ్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మెరుగైన సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. 

మంత్రిని కలిసిన వారిలో సంఘం కోశాధికారి శశిధర్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ ఆకారపు సురేశ్, జాయింట్ సెక్రటరీ ప్రవీణ్, జనగామ జిల్లా అధ్యక్షులు గర్వందుల శ్రీకాంత్ గౌడ్, సంఘం ప్రతినిధులు లక్ష్మీనారాయణ, పృథ్వి, శివ, భాస్కర్, పాషా, వినయ్ తదితరులు ఉన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

ములుగు జిల్లా రామప్ప దేవాలయాన్ని  ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ టి. కె. శ్రీదేవి

సందర్శించారు. 

బుధవారం వెంకటాపుర్  మండలంలోని పాలంపేట గ్రామంలో గల ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయాన్ని  ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ టి కె శ్రీదేవి సందర్శించారు. 

రామప్పలో జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ టి కె శ్రీదేవి తో కలిసి సందర్శించారు.

వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, ఆలయ గైడ్‌ ద్వారా రామప్ప శిల్ప కళా సౌందర్యాన్ని తెలుసుకున్నారు. 

 గుడిలోని రాతి కట్టడాలను, శిల్ప కళా నైపుణ్యాన్ని గైడ్ వివరించారు. పర్యాటక రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు.అనంతరం రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్  రామప్ప చెరువు ప్రత్యేకత తో పాటు ఉపాలయాల పరిరక్షణకు, నిర్మాణాలకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.

ఆర్ధిక కార్యదర్శిటి కే శ్రీదేవి , కలెక్టర్ రామప్ప చెరువులో బోటింగ్ చేస్తూ

పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి కే శ్రీదేవి మాట్లాడుతూ రామప్ప చెరువు కట్టపైనున్న ఆలయాలతో పాటు రామప్ప ఆలయానికి పశ్చిమ భాగంలో ఉన్న కాలభైరవుడి ఆలయాన్ని  సందర్శించి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యల గురించి దాని కంప్లీట్ డిపిఆర్ పంపించాల్సిందిగా రాష్ట్ర పురవాస్తు శాఖ అధికారులకు ఆదేశించారు. రామప్ప కట్టడం అద్భుతమని పేర్కొన్నారు

 ఆలయ మండపంలో వారిని అర్చకులు శాలువాలతో సన్మానించి వేదమంత్రాలతో ఆశీర్వచనం అందజేశారు. 

రామప్ప ఆలయ సందర్శనకు వచ్చిన విద్యార్థులతో ఆమె కాసేపు ముచ్చటించారు. రామప్ప విశిష్టత అందరూ తెలుసుకొని ప్రతి విద్యార్థి ఒక ఆర్టికల్ రాసి తనకు పంపించాల్సిందిగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురావస్తు శాఖ ఏడీలు నర్సింగ్, మల్లు నాయక్, ఉమ్మడి జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, అస్సిటెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్య కిరణ్, తహసిల్దార్ మంజుల, టూరిజం కార్పొరేషన్ మేనేజర్ అశోక్, ఏఎస్సై కృష్ణయ్య, టూరిజం రెవెన్యూ పోలీస్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రాష్ట్రా కాంగ్రెస్ పులుపు మేరకు రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో స్థానిక గోదావరిఖని చొరస్తాలో నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా  రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు  గోపిశెట్టి నిరంజన్ గారు పాల్గొని ప్రసంగిస్తూ గడిచిన 8 సంవత్సరాల నుండి  రైతు రుణ మాఫీ కోసం ఎదుచూసి బ్యాంకులలో రినివల్ చేయక  బాంక్ ఖాతాలను బ్లాక్ లిస్ట్ లో పెట్టీ వారి ఆస్తులు జప్తు చేసే పరిస్థితులు వఛ్చి చివరకు కొంత మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ధరణి పోర్టల్ వల్ల అనేక మంది రైతులు తమ సొంత పొలాల్లో యాజమాన్యా హక్కుల కొరకు రెవెన్యూ కార్యాలయాలచుట్టు చెప్పులరిగెల  తిరిగి అధికారుల మీద దాడులు చేసేవరకు పరిస్థితులు వెళ్లడం అంటే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో రాజకీయాలు చేస్తూ గిట్టుబాటు ధర చెల్లించక వారి కొనే పరిస్తితులులేకుండా చేశారు అలాగే పోడు భూముల సమస్యలు పరిష్కటించక పోవడంతో ఇటీవల ఫారెస్ట్ అధికారిని దాడి చేసి హత్యచేసి వరకు ప్రజలకు ప్రభుత్వ సంస్థలకు ఎంతటి యాగాండం ఏర్పడిందో చుస్తే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో తెలుస్తోంది ఇకనైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతు సమస్యలు పరిష్కరించకపోతే తీవ్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ రైతు పక్షాన నిరంతరం పొరాటం చేస్తుందని రాబోయేరోజుల్లో కాంగ్రేస్ అధికారంలో వస్తుందని అన్ని సమస్యలు పరిష్కరిస్టుమాని అంతవరకు రైతులు దైర్యంగా ఉండాలని వారు సూచించారు...

రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్  ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో  బ్లాక్ 1 అధ్యక్షులు కాల్వ లింగ స్వామి మాజీ అధ్యక్షులు M రవికుమార్, కార్పొరేటర్లు మహంకాళి స్వామి ఎండ్ ముస్తఫా ,కొలిపాక సుజాత తేజస్విని ప్రకాష్ ,నగునూరి సుమలత రాజు, సన ఫేక్రోద్దీన్,రామగుండం మండల మాజీ mpp ఉరిమెట్ల రాజలింగం బీసీ సెల్ నాయకులు పెండ్యాల మహేష్ గట్ల రమేష్ రవి యాదవ్ చంద్రమౌళి కుమారస్వామి మురళి మాటేటి సతీష్ విజయ్ గౌడ్  కృష్ణ sc సెల్ నాయకులు తాళ్లపెళ్లి యుగేoదర్ దులికట్ట సతీష్ మిట్టపెళ్లి మహేందర్  యూత్ కాంగ్రేస్ నాయకులు నాజిమోద్దీన్ అడపా సాయి కిరణ్  జ్యోతి మెహరాజ్ అజయ్ nsui దాసరి విజయ్ ,ఉదయ్ md రహీం ఫజల్ ముస్తఫా, బుర్ల రవి, నంది వెంకటేష్, కుంట సది దశరడం ఉర్సు అనిల్ ఖదీర్  పొయ్యిలా సతీష్ తిరుపతి రెడ్డి, కార్తీక్ మహేష్ మహిళా కాంగ్రెస్ నాయకులు శరణ్య లావన్య సల్మా అనిత చౌదరి  స్రవంతి శంకరమ్మ సరితా  రామగుండం నాయకులు అధ్యక్షులు హరి ప్రసాద్ అప్పసి శ్రీనివాస్ అల్లి శంకర్ మరియు 500 మంది కార్యకర్తలు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 జనగామ చరిత్రలో నిలిచిపోయే విధంగా‌‌.. యువ సమ్మేళనం లో మూడు వేల మంది యువతీ, యువకులు , విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాను.. వివిధ క్షేత్రాల సమిష్టి సమన్వయంతోనే ఇంతటి విజయం సాధించగలిగాం అనడంలో సందేహం లేదు..


ఈ కార్యక్రమానికి సహకరించిన ఉత్సవ సమితి సభ్యులకు, సమన్వయ కర్తలకు, పదాధికారులకు, వివిధ క్షేత్రాల ప్రతినిధులకు, ముఖ్యంగా విద్యార్థి నాయకులకు అభినందనలు తెలుపుతూ.. అద్భుతంగా ప్రచురించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపెళ్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న                   



పెద్దపల్లి:మంథని:కాటారం:నవంబర్:29:చిదనేపల్లి తెరాస పార్టీ మహిళా గ్రామ కమిటీనీ నియమించిన కాటారం మండలం మహిళా అధ్యక్షురాలు ఏలుబాక సుజాత,తెరాస పార్టీ మంథని నియోజకవర్గం ఇంచార్జి మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్,జయశంకర్ జిల్లా జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిణి ల ఆదేశాల మేరకు మంగళవారం మహిళా గ్రామ కమిటీని నియమించారు,కాటారం మండలం తెరాస మండలం మహిళా అధ్యక్షురాలు ఎలుబాక సుజాత,చిదనేపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ఆధ్వర్యంలో మహిళా కమిటీ ఎన్నుకున్నారు,ఈ కమిటీకి సీనియర్ నాయకులు వూర వెంకటేశ్వర్లు,గ్రామ శాఖ అధ్యక్షులు ఉపాధ్యక్షులు,యూత్ అధ్యక్షులు,సర్పంచ్,ఉపసర్పంచ్,సీనియర్ నాయకులు తెరాస పార్టీ అభిమానులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు,వీరందరికీ కృతజ్ఞతలు తెలిపారు,అధ్యక్షులు దేవునూరి సౌజన్య,ఉపాధ్యక్షులు చీర్ల సమత,ప్రధాన కార్యదర్శి కమ్మగోని స్వప్న,సంయుక్త కార్యదర్శి బవుతూ స్వప్న,ప్రచార కార్యదర్శి బండం సుగుణ,కోశాధికారి జైన్ పోసక్కల కు నియామక పత్రాలను అందజేసి పార్టీ కోసం పనిచేయాలని తెలిపినారు,కమిటీ సభ్యులను కూడా ఎన్నుకున్నారు,

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో  ముఖ్యమంత్రి కేసీఆర్  కంటి వెలుగు కార్యక్రమం చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 

మంగళవారం  మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి శ్రీ హరీష్ రావు  అధ్యక్షతన జరిగిన కంటి వెలుగు శిక్షణా కార్యక్రమంలో మంత్రి దయాకర రావు  పాల్గొని, మాట్లాడారు.

గత కంటి వెలుగు కార్యక్రమంలో చూపు పొందిన వారు సీఎం కేసీఆర్ ని దేవుడిగా పొగుడుతున్నారని చెప్పారు. ఇది చాలా గొప్ప కార్యక్రమం అని, దీనిని విజయవంతం చేయడానికి

మా శాఖ పూర్తి సహకారం ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు పెరగటం గొప్ప విషయమని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో 80 శాతం పైగా సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్  ప్రారంభించిన గొప్ప కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



ఎన్టిపిసి మేడిపల్లి సెంటర్లోని చిలకలయ్య గుడి నందు అయ్యప్పస్వామి టెంపుల్ లో గల సుబ్రహ్మణ్యస్వామి షష్టి నీ పురస్కరించుకొని విశిష్టమైన రోజు గా సుబ్రమణ్య స్వామి షష్టి మంగళవారం రోజు రావడం చాలా అరుదు కావున ప్రత్యేకించి స్వామివారికి పంచామృతాలతో ఆలయ ప్రధాన అర్చకులు నరహరి శర్మ  సమక్షంలో సుబ్రమణ్య  సత్యం గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల సమక్షంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ఎంతో ఘనంగా అభిషేకం నిర్వహించారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్



శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో    

18 వరోజు అన్నదాన కార్యక్రమనిర్వహించిన  అన్నదానం ప్రభువు trs పార్టీ యూత్ ప్రచార కార్యదర్శి బబ్బూరి రాజు గౌడ్ మనీషా దంపతులు పెళ్లిరోజు సందర్భంగాఅన్నదానం నిర్వహించారు వారికి అష్ట అయిశ్వర్యాలు అయీరు ఆరోగ్యాలు ప్రసాదించాలని అయ్యప్పస్వామి ని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో గురుస్వాములు చెరకు అశోక్ గౌడ్  తొర్పునూరి నర్సింహ్మ గౌడ్ చెవగొని మహేష్ గౌడ్ కళ్లెం నాగరాజు గౌడ్   బత్తుల మల్లేష్ గౌడ్ సవ్వొజు మల్లేష్ చారి అల్లి కృష్ణ ఐతగొని శ్రీను దేశగోని రాజు జోర్కా నగేష్ మరగొని గణేష్ పబ్బు శ్రీకాంత్   వంగురి శ్రీను మేకల అనిల్ చెవగొని గణేష్ గౌడ్ సిలివేరు రాజు ఉప్పునూతల నర్సింహ్మ చింతల జగన్ చెరకు రాకేష్ గౌడ్ బెల్లి కృష్ణ మీసాల శ్రీకాంత్  బొల్లు ప్రవీణ్ మోహన్ కృష్ణ అన్నప్రసాదం స్వీకరిస్తున్న అయ్యప్పస్వామి మలదారులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్ 

మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ రామకృష్ణ దేవాలయంలో 17వ రోజు నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా కట్ట యాదగిరి కన్య స్వామి అయ్యప్ప మాలదారులకు అన్నదానం చేశారు. ఈకార్యక్రమంలో గురు స్వాములు చెరుకు అశోక్ గౌడ్, చెవగోని మహేష్ గౌడ్, తొర్పునూరి నరసింహగౌడ్, స్వాములు కళ్లెం నాగరాజు గౌడ్, బత్తుల మల్లేష్ గౌడ్, మల్లేష్ చారి, ఐతగోని శ్రీను, మారగొని గణేష్, పబ్బు శ్రీకాంత్, మలిగే రవి, పాశం భరత్, చిలువేరు రాజు, మార్గం శేఖర్, మీసాల శ్రీకాంత్, నాగరాజు, ప్రవీణ్ పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్ 


జనసేన చౌటుప్పల్ మండల అధ్యక్షుడు పర్నే శివారెడ్డి తన జన్మదినం సందర్భంగా పురపాలిక పరిధిలోని లింగోజిగూడెంలో అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు ఆట వస్తువులు, అక్షరాలు నేర్చుకోవడానికి పలకలు, బల పాలు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బాల్యం ఎంతో విలువై నదని, చిన్నతనంలోనే పిల్లల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందనిఅన్నారు. జనసేన ఆధ్వర్యంలో విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఫర్నే రజిత, యాసిస్ రెడ్డి, అంగన్వాడి టీచర్ అరుణ, ఆయా లక్ష్మమ్మ పాల్గొన్నారు. అనంతరం జనసేన కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి

జన్మదిన వేడుకలుఘనంగాజరుపుకున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

 ప్రజల/ బాధితుల ఫిర్యాదులపై విచారణ జరిపి,  పోలీసులు తీసుకుంటున్న చర్యలు, కేసు విచారణలో వాస్తవాలను, ఫిర్యాదుదారులకు వివరించడం తో పాటు వారికి సత్వర న్యాయం అందించేందుకు  జిల్లా పోలీస్ అధికారులు కృషి చేయాలనీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  జె. సురేందర్ రెడ్డి  అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజా        దివాస్ కార్యక్రమం సోమవారం జిల్లా పోలీస్  కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాది దారులకు /బాధితులకు,  పారదర్శకoగా సేవలు అందించాలని, వాస్తవ పరిస్థితులను పరిశీలించి...

త్వరితగతిన సమస్య పరిష్కారానికి కృషి చేయాలని   పోలీస్ అధికారులకు ఆదేశించారు. జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 15   ఫిర్యాదిదారులతో ఎస్పి  మాట్లాడి, వారి  సమస్యలకు గల కారణాలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై క్షేత్రస్ధాయిలో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఇవాళ్టి ప్రజాదివాస్ కార్యక్రమంలో  అధికంగా భూ వివాదాలు, కుటుంబ , వ్యక్తిగత సమస్యలతో పాటు  ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్


రామగుండం కార్పొరేషన్ పరిధి 14 వ డివిజన్ లక్ష్మీపూర్ నివాసి నిరుపేద కుటుంబానికి చెందిన కొమ్ము నరసయ్య లక్ష్మీపూర్ గ్రామంలో వృత్తిరీత్యా బర్లు కాస్తూ భార్య ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్న నరసయ్య వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా సోమవారం రోజున జరిగే దినకర్మ కార్యక్రమం కొరకు సేవ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేశం ను సహాయం కోరగా సేవ స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు హోటల్ శంకరన్న మరియు వేల్పుల అనిల్ యాదవ్ ద్వారా బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం అందజేశారు నిరాశ్రయ స్థితిలో ఉన్న మా కుటుంబానికి అడగగానే సహాయం అందించిన సేవాస్పూర్తి అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ కు మరియు ఫౌండేషన్ సభ్యులకు బాధిత కుటుంబ సభ్యులు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు.. 

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


లింగాపూర్ గ్రామ ఎస్సి కాలినీలో దళిత కుంబాలతో కలిసి సమావేశం నిర్వహించిన కౌశిక్ హరి. ఈ సందర్భంగా బీజేపీ నేత  కౌశిక హరి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళు గా అవస్థలు పడుతున్న ఎస్సి కాలినిని సింగరేణి నిర్లక్ష్యం చేస్తూ వస్తుందని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా కుట్ర చేస్తుందని ఈ మధ్య కాలంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో కలెక్టర్ ను  కలవడం జరిగిందని కలెక్టర్  సానుకూలంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. అయితే సింగరేణి మాత్రం ఈ పక్రియ కు మోకాలు అడ్డుతోందని ఈ ఆలోచన విరమించుకోవాలని లేదంటే ఆందోళన తప్పదని అన్నారు. అలాగే గ్రామ పంచాయతీ అధికారులు కూడా ఎస్సి కాలిని పై చిన్న చూపు విడనాడాలని కాలిని లో సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేదంటే పై అధికారులకు పిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అలాగే భవిష్యత్ కార్యాచరణ పై దిశ నిర్దేశం చేశారు, అలాగే వీరికి అండగా అన్ని పార్టీలు కలిసి రావాలని ఈ సందర్భంగా కోరారు.  ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఇరికిల్ల పద్మ శంకరయ్య, నిమ్మరాజుల రవి, దారంగుల కుమార్, కన్నం మోహన్,పులి శ్రీనివాస్, ఇరికిల్ల శివయ్య,గుర్రం రాజలింగు,ఇరికిల్ల రాజనర్స్,గుర్రం చందు,అధిక సంఖ్యలో మహిళలు, ప్రజలు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్ 


 చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని

గాంధీ పార్క్ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని 12వ వార్డ్ కౌన్సిలర్

తాడూరు శిరీష పరమేష్ మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి

వినతిపత్రం అందజేయడం జరిగింది. చౌటుప్పల్ ఊర చెరువు అలుగునీరు వెళు

ఎటకు ప్రత్యేక డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా గాంధీ

పార్కులో ఎలాంటి అభివృద్ధి జరగక పందుల స్వైర విహారంతో చుట్టుపక్కల ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. చౌటుప్పల్ చెరువు నిండినప్పుడు అలుగునీరు మరియు ఊటనీరు గాంధీ పార్క్ లో చేరి పరిసర ప్రాంత ప్రజల ఇండ్లలో కూడా నీరు చేరి సుమారు ఐదు రోజుల వరకు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. గాంధీ పార్క్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి ప్రత్యేక డ్రైనేజీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేని కోరడం జరిగిందని తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు భూషిపాక  సంతోష్ మహారాజ్ ఆధ్వర్యంలో *బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను ఎన్టిపిసి జెడ్పిహెచ్ఎస్ బాధిత కార్మికుల కలిసి వారి సమస్యలను వివరిస్తూ ఎన్టిపిసి టిటిఎస్ లోని జిల్లా పరిషత్ హైస్కూల్ గత 20 సంవత్సరాల నుండి ఆరుగురు  (6) కార్మికుల పారిశుద్య పనులతో పాటు సిఫర్గా అటెండర్గా అనేక పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాము. ఇట్టి కార్మికులకు NTPC యాజమాన్యం CSR-CD క్రింద జెడ్పిహెచ్ఎస్ స్కూల్ అవసరాల క్రింద కొంత Conservency Welfare సి ఎస్ ఆర్ పారితోషకము Fund ను 1986 నుండి ఇస్తున్నారు. Conservency Fund నుండి ఈ కార్మికులకు జెడ్పిహెచ్ఎస్ యాజమాన్యం నెల నెల జీతాలు ఇస్తూ పని చేయించుకుంటున్నారు. కానీ ఏప్రిల్ నెల నుండి  ఎన్టిపిసి యాజమాన్యం అకారణంగా నిలిపి వేసినారు. ఇట్టి విషయంలో జడ్.పి.హెచ్.ఎస్ యాజమాన్యం యొక్క కార్మికులకు జీతాలు ఇవ్వకుండా పని ఆపివేసింది. దీని వలన ఆరుగురు కుటుంబాల రోడ్డున పడి దుర్భర జీవితాలు కొనసాగిస్తున్నారు.అలాగే NTPC పరిసర ప్రాంతాల పిల్లలు 500  పై చిలుకు విద్యార్థులు చదువుతున్నారు. వీల్లు అతి పేద, గరీబ్ పిల్లలతో పాటు ఈ కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలు కూడా చదువుతున్నారు. జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ శుభ్రత లోపించి పిల్లల అనారోగ్యానికి గురి అవుతున్నారు.కావున ఈ కార్మికుల యందు, దయతలచి, మానవత దృక్పథంతో ఆలోచన చేసి, ఎన్టివిసి యాజమాన్యంతో మాట్లాడి ఈ కార్మికులకు తగు న్యాయం చేయగలరని విజ్ఞప్తి  చేసిన వెంటనే బండి సంజయ్  ఎన్ టి పి సి యజమాన్యంతో మాట్లాడి విధుల్లోకి తీసుకోవాలని  కోరడం జరిగింది యజమాన్యం కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఈ కార్యక్రమంలో *ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దపెల్లి జిల్లా ఇంచార్జ్ మంతిని కిరణ్ *, ఎన్టిపిసి జడ్.పి.హెచ్.ఎస్ బాధిత కార్మికులు పల్లికొండ మల్లేష్, జి.రజిత, పి.స్వప్న, కే.శంకరయ్య, మంగ, భాష, మరియు ఎస్సిఆర్పిఎస్ యూత్ జిల్లా కార్యదర్శి మాలెం మధు,Ch.అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


లింగాపూర్ గ్రామ ఎస్సి కాలినీలో దళిత కుంబాలతో కలిసి సమావేశం నిర్వహించిన కౌశిక్ హరి. ఈ సందర్భంగా బీజేపీ నేత  కౌశిక హరి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళు గా అవస్థలు పడుతున్న ఎస్సి కాలినిని సింగరేణి నిర్లక్ష్యం చేస్తూ వస్తుందని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా కుట్ర చేస్తుందని ఈ మధ్య కాలంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో కలెక్టర్ ను  కలవడం జరిగిందని కలెక్టర్  సానుకూలంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. అయితే సింగరేణి మాత్రం ఈ పక్రియ కు మోకాలు అడ్డుతోందని ఈ ఆలోచన విరమించుకోవాలని లేదంటే ఆందోళన తప్పదని అన్నారు. అలాగే గ్రామ పంచాయతీ అధికారులు కూడా ఎస్సి కాలిని పై చిన్న చూపు విడనాడాలని కాలిని లో సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేదంటే పై అధికారులకు పిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అలాగే భవిష్యత్ కార్యాచరణ పై దిశ నిర్దేశం చేశారు, అలాగే వీరికి అండగా అన్ని పార్టీలు కలిసి రావాలని ఈ సందర్భంగా కోరారు.  ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఇరికిల్ల పద్మ శంకరయ్య, నిమ్మరాజుల రవి, దారంగుల కుమార్, కన్నం మోహన్,పులి శ్రీనివాస్, ఇరికిల్ల శివయ్య,గుర్రం రాజలింగు,ఇరికిల్ల రాజనర్స్,గుర్రం చందు,అధిక సంఖ్యలో మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్

నారాయణపూర్ మండలం జనగాం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యానాల లక్ష్మి నరసమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ యానాల రాంరెడ్డి విద్యార్థులకు నోటుబుక్స్, పెన్ను, పెన్సిల్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే విద్యార్థి దశ నుంచే మార్పు అవసరమని అన్నారు. ఆటపాటలతోపాటు విద్యపై శ్రద్ధ పెట్టి ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో మంచి గుర్తింపు పొందాలని విద్యార్థులనుదేశించి అన్నారు. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సమకూర్చారు.

 ఈ కార్యక్రమంలో ఎస్ ఎం సి చైర్మన్ గడ్డం యాదగిరి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందం పాల్గొనడం జరిగింది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


రామగుండం పట్టణంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 73 సంవత్సరాల సందర్భంగా *ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రామగుండం అధ్యక్షులు కుక్క గంగాప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం మరియు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా విచ్చేసినటువంటి *22వ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లత మరియు 20 డివిజన్ కార్పొరేటర్ కన్నురి సతీష్ కుమార్ లు మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశ ప్రజలందరికీ బడుగు బలహీన వర్గాలందరినీ ఒకే విధమైన హక్కులు ఉండాలని చెప్పి రాజ్యాంగంలో పొందుపరచాలని విద్యా హక్కు చట్టం ఓటు హక్కు పౌరసత్వ హక్కు ప్రతి ఒక్కరికి సమాన హక్కు కుల మత లింగ వర్ణ భేదాలు లేకుండా ఉండాలని చెప్పి రాజ్యాంగాన్ని పొందుపరిచారని వారు గుర్తు చేశారు. ఈరోజు భారతదేశం ఒకతాటిపై ఉందంటే దానికి ముఖ్య కారణం భారత రాజ్యాంగం అని అలాంటి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరము గౌరవించుకుంటూ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ను స్మరించుకోవాలని అన్నారు. కార్యక్రమా అనంతరం అంబేద్కర్ చౌక్ లో స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు బుషిపాక సంతోష్ మహారాజ్, దారంగుల కుమార్, మీర్జా సలీం బెగ్, ఉరుమేట్ల రాజలింగం, ఈదునూరి హరిప్రసాద్, జరూపుల శ్రీను, బుశిపాక రాంచందర్, మల్లేష్ , బూషిపాక ప్రేమ్ కుమార్, వంశీ , శ్రీకాంత్, ఏముర్ల రాజయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్



గాయత్రికళాశాల చౌటుప్పల్ డిగ్రీ లో డిగ్రీ రెండవ,మూడవ సంవత్సరవిద్యార్థిని విద్యార్థులుఅందరూ కలిసిమొదటి సంవత్సర విద్యార్ధులకు జయశ్రీ

గార్డెన్ లో ఫ్రెషేర్స్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భముగా కళాశాల చైర్మెన్ బండారు

మయూర్ రెడ్డి, కరస్పాండెంట్ భీమిడి సుభాష్ రెడ్డి, ప్రిన్సిపాల్ చెన్నగోని ఆంజనేయులు, అధ్యపకబృందం, మరియు విద్యార్థిని విద్యార్థులుbపాల్గొన్నారు.. ఈప్రిపేర్స్ పార్టీని ఉద్దేశించి. కళాశాల కరస్పాండెంట్ విద్యార్థులని బాగా చదువుకోవాలని, ఆటల్లో బాగా రాణించాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని మంచి భవిష్యత్తు ఏర్పరుచుకోవాలని విద్యార్థులు అంత క్రమశిక్షణ తో ముందుకు వెళ్లాలని తెలియజేసారు. అలాగే ప్రెషర్స్

పార్టీ కార్యక్రమంలో విద్యార్థులు వారి డాన్సులతో, పాటలతో, ఉపన్సాసాలతో అందరిని అలరించారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్



మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ

రామకృష్ణ దేవాల యంలో 15వ రోజు నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా తాటిపాముల శివకృష్ణ పవిత్ర దంపతులు అయ్యప్ప మాలదారులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు చెరుకు అశోక్ గౌడ్,చెవగోని మహేష్ గౌడ్, తొర్పునూరి నరసింహ గౌడ్, స్వాములు

కళ్లెం నాగరాజు గౌడ్, బత్తులమల్లేష్ గౌడ్, మల్లేష్ చారి, ఐతగోని శ్రీను, మారగొని గణేష్, పబ్బు శ్రీకాంత్,మలిగే రవి, పాశం భరత్, చిలువేరు రాజు, మార్గం శేఖర్, శ్రీకాంత్, నాగరాజు,బొట్ల ప్రవీణ్ పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్


జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని మహాదేవపూర్ మండల అధ్యక్షురాలు రాణి బాయ్ రామారావు ఆధ్వర్యంలో, ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయము ఆవరణలో,డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మహాదేవపూర్ మండల ప్రత్యేక అధికారి, జెడ్పిసిఇఓ రఘువరన్ మాట్లాడుచు ఆగస్ట్ 29-8-1947 రోజున డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్‌ గారిని చైర్మన్‌గా ఆరు దశాబ్దాల కిందట నవంబర్ 26-11-1949 నాడు డాక్టర్‌ బాబు రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షతన సర్ధార్‌ వల్లభాయి పటేల్‌ ప్రతిపాదించి ప్రవేశపెట్టారు.ప్రపంచంలోనే అతి పెద్దదైన రాజ్యాంగాన్ని రూపకల్పన చేసింది. కులాలు,విభిన్న మతాలు, రకరకాల ఆచార వ్యవహారాల సంఘటిత భారతావనికి స్వపరిపాలనా రూపకల్పన రాజ్యాంగ బద్దం చేశారు.భారత సర్వసత్తాక…సార్వభౌమ…ప్రజాస్వామ్య దేశంగా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుని దేశ ప్రజలకు హక్కులు కల్పించింది. భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం భారత ప్రజల సంక్షేమం,అభివృద్ధి కోసం రాజ్యాంగానికి లోబడి సవరణ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.మన రాజ్యాంగం గురించి మరింతగా తెలుసుకునేలా ఈరోజు మనకు స్పూర్తినివ్వాలి.రాజ్యాంగం ప్రజల నుంచి వచ్చింది.ప్రతి ఒక్కరు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. రాజ్యాంగం ద్వారానే అధికారం స్వీకరిస్తారు. రాజ్యాంగం పేరిట విధులు నిర్వహిస్తారు.కాబట్టి భారత రాజ్యాంగానికి ఉన్న ఔన్నత్యం చాలాగొప్పది అని  కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు రాణి బాయి రామారావు,  జడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్,ఎంపీటీసీలు ఆకుతోట సుధాకర్,మంచినీళ్ళ దుర్గయ్య,మండల ప్రత్యేక అధికారి జెడ్పిసిఓ రఘువరన్,ఎంపీడీవో శంకర్,ఎంపిఓ ప్రసాద్,  కార్యాలయ పర్యవేక్షకులు శ్రీధర్ బాబు,ఏపీఎం రవీందర్,కార్యాలయ సిబ్బంది,ఉపాధి హామీ సిబ్బంది,ఐకెపి సిబ్బంది, రామారావు,టిఆర్ఎస్ సీనియర్ నాయకులు,  తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న

     



                                                 పెద్దపల్లి:నవంబర్:26:పెద్దపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ నిర్వహించారు,సమావేశం ప్రారంభ ముందు 73వ రాజ్యాంగ దినోత్సవమును పురస్కరించుకొని రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు.శనివారం జడ్పీ కార్యాలయంలో 1వ,2వ,4వ,7వ స్థాయి సంఘాల సమావేశాలను నిర్వహించారు.ఫైనాన్స్ ప్లానింగ్,విద్య,వైద్యం,గ్రామీణ అభివృద్ధి,గనులఅభివృద్ధి,పనులు సంబంధిత అంశాలపై జడ్పీ చైర్మన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించి జరుగుతున్న పనుల పురోగతి వివరాలను తెలుసుకున్నారు.జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్ సూచించారు.కెసిఆర్ కిట్ల పంపిణీ,ఉప ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణ పనులు,తదితర అంశాలపై జడ్పీ చైర్మన్ సమీక్షించారు.గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై చైర్మన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.గ్రామ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.గ్రామాల్లో పకడ్బందీ పారిశుధ్య చర్యలు చేపట్టి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలని జడ్పీ చైర్మన్ సూచించారు.హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని,నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం కనీసం 75 శాతం మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సమావేశంలో జడ్పీ సీఈవో శ్రీనివాస్,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్,ఈఈ పంచాయతీ రాజ్ ముని రాజు,జడ్పీటీసీలు బండారి రాంమూర్తి,ఆముల నారాయణ,బొద్దుల లక్ష్మీనర్సయ్య,వంగల తిరుపతిరెడ్డి,కో ఆప్షన్ సభ్యులు దివాకర్,జిల్లా అధికారులు,ప్రజా ప్రతినిధులు,తదితరులు  పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;
జిల్లా పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది  ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  జె. సురేందర్ రెడ్డి  అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వర్టికల్  (వర్టికల్ అనగా విభాగం... ఉదాహరణ.... రిసెప్షన్ వర్టికల్, బ్లూ కోర్ట్  వర్టికల్, క్రైమ్ వర్టికల్ )  విభాగంలో ప్రతిభ  32 మంది పోలీస్ అధికారులు సిబ్బందికి  ఎస్పీ  ప్రశంస పత్రాలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ సురేందర్ రెడ్డి  మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని,  అలాంటి శాఖలో  ప్రతి అంశంలో జాగ్రత్తగా పని చేయాలని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రోత్సహించే విధంగా పోలీసు  అధికారులను, సిబ్బందిని  గుర్తించి, అవార్డులు, రివార్డు లను ఇస్తున్నట్లు ఎస్పి తెలిపారు. ప్రతి ఒక్కరు వర్టికల్ వారిగా పోటీపడి విధులు నిర్వర్తించాలని అన్నారు. పోలీసులు ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన నాణ్యమైన సేవలు అందించేందుకు  ప్రయత్నించాలని ఎస్పి  అన్నారు.  ప్రశంసా పత్రం పొందిన వారిలో భూపాలపల్లి సీఐ రాజిరెడ్డి, కాలేశ్వరం ఎస్సై లక్ష్మణ్ రావు, గణపురం ఎస్సై అభినవ్, టేకుమట్ల ఎస్సై రాజు, ఏఎస్సై  లు ప్రతాపరెడ్డి,  వెంకన్న, హెడ్ కానిస్టేబుల్లు  యాకయ్య, రామ్మోహన్రావు, శ్రీనివాస్, రవికుమార్,  కానిస్టేబుల్లు, అరుణ,  సాంబశివరావు, స్వాతి, అనూష, సంతోష్, సారంగపాణి, మోహన్ రావు, నేతాజీ, చంద్రమోహన్, కుమారస్వామి హరీష్, వేణు శ్రీధర్, శ్రీనివాస్ లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు,  డిఎస్పీలు ఏ. రాములు, జి. రామ్మోహన్ రెడ్డి, కిషోర్ కుమార్, ఇన్స్పెక్టర్ పెద్దన్న కుమార్  పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


ప్పంచ మేధావి డా. భీమ్ రావు అంచడ్కర్  రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చి 73వ దినోత్సవం కార్యక్రమం. సందర్భంగా గోదావరిఖని కూరగాయల మార్కెట్ దగ్గర *SC రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా ఉపాద్యక్షులు అడ్డూరి రాజేష్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల మాలలతో గౌరవించుకోవడం జరింగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా *ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు భూష్పక సంతోష్ మహారాజ్ మాట్లాడుతూ ప్రపంచ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 సంవత్సరాలు కావస్తున్న, కెంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నిరెత్తనట్టు వ్యవరిస్తున్నాయి, డాక్టర్ బి.ఆర్ రాజ్యాంగ ఫలాలు దళిత బడుగు బలహీన వర్గాలకు అందిని పరిస్థితి ఉంది,రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో ఇప్పటివరకు కూడా పాలకులు అంబేద్కర్  విగ్రహాలకు శుద్ధి చేయకపోవడం చాలా దారుణమైన విషయం, అని అన్నారు మరియు ఈరోజు అంబేద్కర్  రాజ్యాంగ రచించడం వల్లేనె ఈ రోజు ప్రతి గ్రామంలో రేషన్ కార్డు మీద బియ్యం తింటున్నాం అంటే కారణం అంబేద్కర్, వృద్ధులకు వికలాంగులకు పింఛన్ వస్తుందంటే కారణం అంబేద్కర్, గవర్నమెంట్ ఆఫీసులలో ఉద్యోగం చేస్తున్నారంటే కారణం అంబేద్కర్, కోర్టు పోలీస్స్టేషన్ అడ్మిషన్ ఇవన్నీ ఉన్నాయి అంటే కారణం కూడా అంబేద్కర్, కావున అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మరియు ఆయన ఆశయాలను అంబేద్కర్ యొక్క విధివిధాలు ప్రజల్లోకి కలెక్టర్, ఎమ్మార్వో  అధికారులు ప్రజలకు తీసుకెళ్లి అవగాహన కల్పించవలసిందిగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాట్లాడరు  *బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కోశాధికారి కాశిపేట శివాజీ , మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ గారి కృషి, ఆయన సేవలను గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో , పరిరక్షణ సమితి కార్పొరేషన్ అద్యక్షులు కుక్కగంగా ప్రాసాద్ గారు, భైరం రవి వర్మ, సంగ రవి, రాజు, గోపడేను నవీన్, వేద నాయకులు అధిక సంఖ్యలో. పాల్గొనడం జరిగింది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్ 

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు శుక్రవారం చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో

నూతన గ్రామశాఖ కమిటీని ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ మండల కన్వీనర్ బోయ

లింగస్వామి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. గ్రామ శాఖ అధ్యక్షునిగా బోయ

శ్రవణ్, ఉపాధ్యక్షులుగా బోయ జోసెఫ్, ప్రధాన కార్యదర్శిగా బర్కం పవన్, సహాయ

కార్యదర్శిగా బర్రె సంతోష్, బోయప్రకాశ్, కార్యదర్శిగా బోయ శివ, ప్రచార కార్య

దర్శిగా బోయ అఖిల్, బోయ చందు, తుర్పింటి వికాస్, బర్కం అభిలాశ్ నూతనంగా ఎన్నుకోబడ్డారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


రామగుండం రైల్వే స్టేషన్ సందర్శన మరియు పలు నూతన బిల్డింగ్ ప్రారంభ కార్యక్రమాలకు విచ్చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం  అరుణ్ కుమార్ జెన్  ను కలిసి రామగుండం ప్రాంతంలోని పెద్దంపేట గ్రామంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని అదేవిధంగా కుందన పెళ్లి గేటు సమీపంలో కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని దాంతో పాటు పెద్దంపేట గ్రామంలో గతంలో ఉన్న రైళ్ల సౌకర్యాన్ని పునరుద్ధరించాలని వినతిపత్రం సమర్పించిన అనంతరం పెండ్యాల మహేష్ ఉరిమెట్ల రాజలింగంలు మాట్లాడుతూ పెద్దంపేట్ రైల్వే గేట్ వలన సుమారు 20 గ్రామాల ప్రజలు మరియు ఇతర జిల్లాలకు కూడా లింక్ రోడ్డు కావడం వలన ప్రజలు ఏదైనా అత్యవసర సమయంలో వెళ్లాలంటే రైల్వే గేట్ అడ్డంకిగా ఉండి ఆంబులెన్స్ లో ఎవరైనా పేషన్స్ ఉన్న సమయంలో కూడా గేట్ పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న సందర్భాన్ని చూస్తున్నాం కావున వెంటనే యుద్ధ ప్రాతిపదికన పెద్దంపేట్ మరి కుందనపల్లి రైల్వే గేట్ల సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని అదేవిధంగా అనేకమంది ప్రజలకు సౌకర్యార్థంగా ఉన్న పెద్దంపేట రైల్వేస్టేషన్లో గతంలో ఆగిన ప్యాసింజర్ రైలు మళ్లీ తిరిగి పునరుద్ధరించాలని రైల్వే జియం ను కోరినట్టుగా తెలియజేశారు*ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం లతో పాటు కాంగ్రెస్ పార్టీ కుందనపల్లి అధ్యక్షులు జక్కుల నారాయణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాపోలు మాధవరావు సందనవేణి శేఖర్ తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

జనగామ గ్రామం లోని వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ను వెంటనే ప్రారంభించి రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని స్థానిక  శాసన సభ్యులు కొరుకంటి చందర్ ను మరియు ప్యాక్స్ చైర్మన్ మామిడాల ప్రభాకర్ ను బిజెపి రామగుండం నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ మారం వెంకటేష్ కోరారు ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ

రైతులు పండించిన పంట కు భద్రత లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కావున  వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ను వెంటనే ప్రారంభించి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బిజెపి రామగుండం అసెంబ్లీ కన్వీనర్ మారంవెంకటేష్ కోరారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న                             


                      పెద్దపల్లి:గోదావరిఖని:నవంబర్:25:పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బోగిరి భాస్కర్-ధనలక్ష్మి ల కూతురు దేవర్షిని నూతన వస్త్రాలంకరణ కార్యక్రమానికి శుక్రవారం సుందిళ్ల గ్రామానికి విచ్చేసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు,టిఆర్ఎస్ పార్టీ సుందిళ్ల గ్రామ శాఖ అధ్యక్షుని కూతురుకు అక్షంతలు వేసి ఆశీర్వదించారు,టిఆర్ఎస్ పార్టీ నాయకుల రామగిరి మండలం అధ్యక్షలు శెంకష్ రవీందర్,భూపాలపల్లి తెరాస యూవనాయకుడు జక్కు రాకేష్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ నాయకులు పుట్ట రాజన్న,రామగిరి మండలం నాయకులు దాసరి రాయాలింగ్,పూదరి సత్యనారాయణ,కాపరబోయిన భాస్కర్,,సుంకరి,మహేష్,సుంకరి సమ్మయ్య,ముస్తాయాలా గ్రామశాఖ అధ్యక్షులు బాసీనేని సత్యనారాయణరావు,మొదటి వార్డు మెంబర్ బసీనేని వినోదరావు తదితరులు పాల్గొన్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

డిసెంబర్ 10, 11 వ తేదీలో ఎన్టిపిసిలో జరిగే పెద్దపల్లి జిల్లా సిఐటియు 3 వ మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ ముత్యంరావు పిలుపునిచ్చారు.

రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ఎన్టిపిసి ప్లాంట్ గేట్ నెంబర్ 2 నుండి అన్నపూర్ణ కాలనీ, ఎఫ్సీఐ ఎక్స్ రోడ్ వరకు జరిగిన  బైక్ ర్యాలీని ప్రారంభించి మాట్లాడుతూ పెద్దపెల్లి జిల్లా మూడవ మహాసభలు కార్మిక క్షేత్రమైన ఎన్ టి పి సి లో జరగనున్నాయని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుందని, కార్మిక చట్టాలను మార్చి, నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేస్తూ కార్మికుల హక్కుల్ని కాలరాస్తుందని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26000/ - రూపాయలు అమలయ్యే విధంగా జీవోలు సవరించాలని డిమాండ్ చేశారు. 

 కార్మిక వర్గానికి సిఐటియు సమస్యల పరిష్కారంలో ముందు భాగాన నిలుస్తుందన్నారు.

మహాసభలకు పెద్ద ఎత్తున కార్మికులు, మేధావులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

బైక్ ర్యాలీలో సిఐటీయూ నాయకులు ఏం రామాచారి, ఎన్ బిక్షపతి,నాంసాని శంకర్, గిట్ల లక్ష్మారెడ్డి, భూమయ్య,దండ రాఘవరెడ్డి, ఎండి యాకూబ్, కాదశి మల్లేష్, కే రాజ్ కుమార్,  బి అర్జున్, టి రవీందర్, ఎండి షమీం, ఏ అజయ్, కనకయ్య, జగన్, ఎం శంకర్, శివపాల్ సింగ్, బి నారాయణ, రామ్ సత్యనారాయణ, రాజమల్లు, భాస్కర్,  మరియు  అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

 మెప్మా సిబ్బందికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని  ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.

శుక్రవారం బల్దియా పరిధి 31 వ డివిజన్ శాయంపేట పద్మశాలి కమ్యూనిటీ హాల్ లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  స్లం సమాఖ్య ల సర్వసభ్య సమావేశానికి ప్రభుత్వ చీఫ్ విప్ తో పాటు నగర మేయర్ గుండు సుధారాణి, లోక్ సభ సభ్యులు పసునూరి దయాకర్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

  అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో  చీఫ్ విప్ మాట్లాడుతూ  పావలా వడ్డీ అంశమై పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్  దృష్టికి తీసుకు వెళ్లడం జరుగుతుందని, రాబోయే నూతన సంవత్సరంలో శాయంపేటలో మహిళల కోసం కుట్టు మిషన్ శిక్షణ ను కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, కేవలం శిక్షణ ఇవ్వడమే కాకుండా మీ వ్యాపారం లాభసాటిగా జరిగేలా వివిధ పాఠశాలలు, కళాశాల లు,హాస్టలలో ఉండే పిల్లల బట్టలు కుట్టేలా ఆర్డర్స్ కుడా  ఇప్పించడం జరుగుతుందని, 6 నెలల క్రితం పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్ నగరానికి వచ్చి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గార్మెట్స్ ఇండస్ట్రీ కంపెనీ లు,కేరళ కు చెందిన కేటెక్స్ ను మనకు అందించడం జరిగిందని, ఇట్టి కంపెనీలలో మహిళలకు అనేక రకాలైన ఉపాధి అవకాశాలు లభిస్తాయనీ, మేయర్ లోక్ సభ సభ్యుల సహకారంతో కంపెనీ వారిని ఇక్కడికి తీసుకొచ్చి అనేక రకాలైన నైపుణ్యాలను నిరుద్యోగ, ఔత్సహిక మహిళలకు నేర్పించడానికి కృషి చేస్తానని  తెలిపారు.

   నగర మేయర్  గుండు సుధారాణి  మాట్లాడుతూ  నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే క్రమం లో ప్రత్యామ్నాయంగా  కాగితపు సంచుల, జూట్ సంచుల తయారీ పై  ఆర్.పి.లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, సానిటరీ నాప్కిల్స్ తయారీ , పూలను ఉపయోగించి దూప్ స్టిక్స్ తయారీ లలో శిక్షణ ఇప్పించడం జరిగిందని, సృజనాత్మకత తో తయారుచేసే ఉత్పత్తులకు మార్కెట్ లో డిమాండ్ ఉంటుందని,ఆ దిశగా ముందుకు వస్తే  కార్పొరేషన్ పరంగా మార్కెటింగ్ కల్పించేలా చూస్తామని ఈ సందర్భంగా మేయర్ తెలిపారు.

   లోక్ సభ  సభ్యులు పసునూరి దయాకర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించడానికి  తన వంతు సహకారం ఉంటుందని, వివిధ వ్యాపారాలు నిర్వహించడానికి ఆసక్తి కనబరిస్తే సహకరిస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భం గా చీఫ్ విప్,మేయర్, ఎం.పి.లను ఆర్.పి.లు శాలువాలతో సత్కరించి పూల మొక్కలను అందజేశారు.

   ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు, డీఎంసీ రజితా రాణి, శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ శిల్పా, టిఎంసి రమేష్, సి ఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

మహిళా భద్రత విషయంలో  ముఖ్యమంత్రి  కేసీఆర్  అత్యంత సీరియస్ గా ఉన్నారని అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా షీ టీమ్స్ భరోసా కేంద్రాలు పెట్టి వారి భద్రతకు పెద్దపీట వేసారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు  అన్నారు.

శుక్రవారం  వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భరోసా కేంద్ర నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని, ప్రసంగించారు. 

రాష్ట్రంలో అరాచకాలు చేసేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహిళల విషయంలో ప్రజల్లో మార్పు తీసుకురావాలని అధికారులను కోరారు.

మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు  మాట్లాడుతూ  భరోసా కేంద్రం ఏర్పాటుతో పాటు ప్రజల్లో మార్పులు తీసుకురావాలి. 

అత్యాచారాలు చేసేవాళ్ళు ఉన్నారు. వారిపై కఠినంగా వ్యవహరించాలి. సీఎం కేసిఆర్  మహిళల భద్రత విషయంలో పట్టుదల గా ఉన్నారు.

రాష్ట్రంలో పోలీస్ వాళ్ళు చాకచక్యంగా, పటిష్టంగా పని చేస్తున్నారు. ప్రభుత్వం కూడా వారికి అదే స్థాయిలో విస్తృత అధికారాలు ఇచ్చి గౌరవం కూడా కల్పించింది. 

నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోలీసులకు ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత ఎవరూ ఇవ్వలేదు. గతంలో జీప్స్ అసోసియేషన్ ద్వారా జీప్స్ పెట్టుకుని పోలీసులు తిరిగే వారు. ఇప్పుడు ప్రతి పోలీస్ కు మంచి వాహనాలు ఇచ్చి, మెయింటెనెన్స్ ఖర్చులు ఇచ్చారు. హోమ్ గార్డ్స్ జీవితం గతంలో ఘోరంగా ఉండేది. కానీ నేడు హోం గార్డ్స్ వేతనం 20 వేలు ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం.మహిళల విషయంలో గతంలో ఆరాచకాలు జరిగేవి.  నా దగ్గరకు రోజూ చాలా మంది మహిళా భాదితులు వచ్చే వారు.కానీ ఇప్పుడు అలాంటి ఫిర్యాదులు దాదాపు రావడం లేదు.మహిళకు భరోసా కేంద్రాలకు రాకుండా చూడాలి. వచ్చినా వారికి అన్ని విధాల సాయం చేయాలి.జనగామ లో కూడా భవన ప్రారంభం చేయాలని జెమిని సంస్థ వారిని కోరుతున్నాను.

ఇక్కడి(వరంగల్) సీపీ డైనమిక్ గా ఉన్నారు. సీఎం  ఆలోచనలు అమలు చేస్తున్నారు. ప్రజల్లో మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ భరోసా కేంద్రం పని చేస్తుంది. పిల్లల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నాం. అంగన్ వాడి కేంద్రాల ద్వారా వారికి అన్ని రకాల తోడ్పాటు అందిస్తున్నాం. అరాచకాలు చేసిన వారిని ఉపేక్షించేది లేదు. దోషులకు వారం రోజుల్లో శిక్షలు వేసింది ఈ వరంగల్ లోనే.


భరోసా కేంద్ర భవనాన్ని త్వరగా నిర్మించాలి.

ఎంపీ పసునూరి దయాకర్..


తెలంగాణలో పోలీసులు ఫ్రెండ్లీ గా ఉంటున్నారు.

దేశంలో మనం నంబర్ వన్ గా ఉన్నాం. ప్రశాంతంగా ఉండేందుకు పోలీసులు చేస్తున్న కృషి అద్బుతం.

మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు, దాడులు జరిగినా 24 గంటల్లో దోషులను పట్టుకుని శిక్షిస్తున్నారు. ఈరోజు మహిళల భద్రత కోసం భరోసా కేంద్రం కోసం నూతన భవన నిర్మాణాన్ని శంఖు స్థాపన చేసుకోవడం సంతోషం.


మేయర్ గుండు సుధారాణి


తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మహిళా రక్షణ ధ్యేయంగా షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, సఖి కేంద్రాలు పెట్టీ దేశానికి రోల్ మోడల్ చేశారు. 

ఫ్రెండ్లీ పోలీస్ గా మన తెలంగాణ పోలీస్ పని చేస్తున్నారు. మహిళలు తమపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల గురించి చెప్పుకోవడానికి ఈ షి టీమ్స్, భరోసా కేంద్రాలు తోడ్పడుతున్నాయి. 

ఇలాంటి వాటి కోసం జెమిని ఎడిబుల్స్ ముందుకు రావడం సంతోషం.

మహిళల అన్ని రంగాల అభివృద్ది కి సీఎం కేసిఆర్ గారు మహిళా కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. 

డ్రగ్స్ నివారణ కోసం వరంగల్ పోలీస్ శాఖ ప్రత్యేక కృషి చేస్తూ యువతని తప్పు దోవ పట్టకుండా పని చేస్తోంది.

చీఫ్ విప్  దాస్యం వినయ్ భాస్కర్

సీఎం కేసిఆర్  ఒక వైపు సంక్షేమం, అభివృద్ది చేస్తూనే మహిళలకు భరోసా, భద్రత ఇస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా షి టీమ్స్ పెట్టి అత్యంత భద్రత కల్పించారు. మహిళలకు మేయర్ పదవులు ఇచ్చిన ఘనత సీఎం కేసిఆర్ ది.

వరంగల్ భరోసా కేంద్రం గతంలో నాటి మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభం చేసుకున్నాం.

మహిళలు తమ సమస్యలు చెప్పుకునే ఫ్రెండ్లీ కేంద్రాలు మహిళా పోలీస్ స్టేషన్లు, భరోసా కేంద్రాలు.

జెమిని వారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.

కొంతమంది పిల్లలను చెత్త కుప్పల్లో వేస్తున్నప్పుడు వారిని రక్షించేందుకు, అలాంటివి చేయకుండా ఉండేందుకు ఐసీడీఎస్ వాళ్లు అనేక వాహనాలు పెట్టి పరిరక్షిస్తున్నారు. 

ఎవరైనా కూడా మీ పిల్లలు మీకు వద్దు అనుకుంటే వారిని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా భరోసా కేంద్రాలు, ఊయలలు పెడుతున్నాం. అందులో వదిలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ సమావేశంలో  ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్  గుండు సుధారాణి, ఎంపి పసునూరి దయాకర్,  వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, మున్సిపల్ కమిషనర్ 

ప్రావీణ్య, ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డీసీపీ అశోక్, జెమిని సంస్థ ప్రతినిధులు చంద్ర శేఖర్ రెడ్డి, అనురాగ్ శర్మ, తదితరులు  పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

వరంగల్ నగర పాలక సంస్థ పరిధి లోని 31,49,50 డివిజన్ల ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని  రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్  దాస్యం వినయ్ భాస్కర్ నిర్వహించారు.  ముఖాముఖి లో  భాగంగా ప్రజల నుండి దాదాపు 118 ఫిర్యాదులను స్వీకరించి సమస్యలన్నింని అతి త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

అనంతరం 26 మందికి కళ్యాణలక్ష్మి, షాధిముబారక్ చెక్కులను అందజేశారు. అనారోగ్యానికి గురై ఆర్ధికంగా చేతికలబడిన 8 మందికి 6 లక్షల రూపాయల 30 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంజూరు చేయించి నేడు లబ్ధిదారులకు అందించారు. అనారోగ్యానికి గురై హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇద్దరికి 2 లక్షల 25 వేల విలువైన ఎల్వోసిలను అందించడం జరిగింది.

ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని, వారికున్న పలు మౌలిక సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో ముఖాముఖి కార్యక్రమం ద్వారా మరింత విస్తృతంగా ప్రజల సమస్యలను పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నామని చీఫ్ విప్ అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్లు మామిండ్లరాజు, ఏనుగుల మనస-రాంప్రసాద్, నెక్కొండ కవిత-కిషన్ మరియు తెరాస డివిజన్ అధ్యక్షులు, మున్సిపల్ అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

కాజిపేట్ స్టేషన్ పర్యటనకు విచ్చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ను కలిసి పలు సమస్యలపై  రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్  దాస్యం వినయ్ భాస్కర్ మరియు వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్  

సమీక్ష సమావేశం నిర్వహించారు. 

 కాజిపేట్ రైల్వే జంక్షన్ కు సంబంధించిన ఫ్లాట్ ఫాంల విస్తరణ, స్థానిక యువతకు ఉపాధిని కల్పించేందుకు పిరియాడికల్ ఓవరహాలిక్ సెంటర్ మంజూరు మరియు స్థానిక విశ్రాంత ఉద్యోగుల, పనిచేసే ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సబ్ డివిజనల్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరారు.  అలాగే రైల్వే స్టేడియాన్ని క్రీడాకారులను అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు ఆటో డ్రైవర్లను రుసుంల పేరుతో వేధించవద్దని ఇలా 9 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని చీఫ్ విప్ ఎంపీ తో కలిసి అందజేసారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్ 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: మండలంలోని మూడు పంచాయితీరాజ్ రోడ్లను పునరుద్ధరించేందుకు  10.80 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎంపీపీ రాణీ బాయి రామారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు..మండలంలో  గత కొంత కాలంగా పంచాయితీ రాజ్ రోడ్ల పునరుద్ధరణ చేపట్టక పోవడంతో అటవీ గ్రామాల ప్రజలు,ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా దృష్టికి తీసుకు వెళ్లగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపమని ఆదేశాలు ఇచ్చారని ఎంపీపీ రాణీ బాయి రామారావు తెలిపారు. మండలం లోని మద్దులపల్లి క్రాస్ రోడ్ నుంచి పలుగుల వరకు 8.75 కోట్లు, అర్ అండ్ బీ రోడ్డు నుంచి బెగుళూరు గ్రామం వరకు 45 లక్షలు, అంబట్ పల్లి నుంచి కిష్టరావుపేట వరకు 1.60 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ప్రభుత్వాినికి ప్రతిపాదనలు పంపినట్లు ఎంపీపీ రాణీ బాయి రామారావు తెలిపారు. మారుమూల అటవీ మండ లమైన మహాదేవపూర్ రోడ్ల పునరుద్ధరణ కు నిధులు మంజూరు చేస్తామని రాష్ట్ర పంచాయితీ రాజ్ మంత్రి ఎరవెల్లి దాయకర్ రావు హామీ ఇచ్చారని ఎంపీపీ పేర్కొన్నారు....