ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మంగళవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి శ్రీ హరీష్ రావు అధ్యక్షతన జరిగిన కంటి వెలుగు శిక్షణా కార్యక్రమంలో మంత్రి దయాకర రావు పాల్గొని, మాట్లాడారు.
గత కంటి వెలుగు కార్యక్రమంలో చూపు పొందిన వారు సీఎం కేసీఆర్ ని దేవుడిగా పొగుడుతున్నారని చెప్పారు. ఇది చాలా గొప్ప కార్యక్రమం అని, దీనిని విజయవంతం చేయడానికి
మా శాఖ పూర్తి సహకారం ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు పెరగటం గొప్ప విషయమని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో 80 శాతం పైగా సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన గొప్ప కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామన్నారు.
Post A Comment: