చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
జనసేన చౌటుప్పల్ మండల అధ్యక్షుడు పర్నే శివారెడ్డి తన జన్మదినం సందర్భంగా పురపాలిక పరిధిలోని లింగోజిగూడెంలో అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు ఆట వస్తువులు, అక్షరాలు నేర్చుకోవడానికి పలకలు, బల పాలు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బాల్యం ఎంతో విలువై నదని, చిన్నతనంలోనే పిల్లల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందనిఅన్నారు. జనసేన ఆధ్వర్యంలో విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఫర్నే రజిత, యాసిస్ రెడ్డి, అంగన్వాడి టీచర్ అరుణ, ఆయా లక్ష్మమ్మ పాల్గొన్నారు. అనంతరం జనసేన కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి
జన్మదిన వేడుకలుఘనంగాజరుపుకున్నారు.
Post A Comment: