ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రజల/ బాధితుల ఫిర్యాదులపై విచారణ జరిపి, పోలీసులు తీసుకుంటున్న చర్యలు, కేసు విచారణలో వాస్తవాలను, ఫిర్యాదుదారులకు వివరించడం తో పాటు వారికి సత్వర న్యాయం అందించేందుకు జిల్లా పోలీస్ అధికారులు కృషి చేయాలనీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజా దివాస్ కార్యక్రమం సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాది దారులకు /బాధితులకు, పారదర్శకoగా సేవలు అందించాలని, వాస్తవ పరిస్థితులను పరిశీలించి...
త్వరితగతిన సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 15 ఫిర్యాదిదారులతో ఎస్పి మాట్లాడి, వారి సమస్యలకు గల కారణాలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై క్షేత్రస్ధాయిలో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఇవాళ్టి ప్రజాదివాస్ కార్యక్రమంలో అధికంగా భూ వివాదాలు, కుటుంబ , వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి.
Post A Comment: