చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని
గాంధీ పార్క్ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని 12వ వార్డ్ కౌన్సిలర్
తాడూరు శిరీష పరమేష్ మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి
వినతిపత్రం అందజేయడం జరిగింది. చౌటుప్పల్ ఊర చెరువు అలుగునీరు వెళు
ఎటకు ప్రత్యేక డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా గాంధీ
పార్కులో ఎలాంటి అభివృద్ధి జరగక పందుల స్వైర విహారంతో చుట్టుపక్కల ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. చౌటుప్పల్ చెరువు నిండినప్పుడు అలుగునీరు మరియు ఊటనీరు గాంధీ పార్క్ లో చేరి పరిసర ప్రాంత ప్రజల ఇండ్లలో కూడా నీరు చేరి సుమారు ఐదు రోజుల వరకు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. గాంధీ పార్క్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి ప్రత్యేక డ్రైనేజీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేని కోరడం జరిగిందని తెలిపారు.
Post A Comment: