మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు భూషిపాక సంతోష్ మహారాజ్ ఆధ్వర్యంలో *బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను ఎన్టిపిసి జెడ్పిహెచ్ఎస్ బాధిత కార్మికుల కలిసి వారి సమస్యలను వివరిస్తూ ఎన్టిపిసి టిటిఎస్ లోని జిల్లా పరిషత్ హైస్కూల్ గత 20 సంవత్సరాల నుండి ఆరుగురు (6) కార్మికుల పారిశుద్య పనులతో పాటు సిఫర్గా అటెండర్గా అనేక పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాము. ఇట్టి కార్మికులకు NTPC యాజమాన్యం CSR-CD క్రింద జెడ్పిహెచ్ఎస్ స్కూల్ అవసరాల క్రింద కొంత Conservency Welfare సి ఎస్ ఆర్ పారితోషకము Fund ను 1986 నుండి ఇస్తున్నారు. Conservency Fund నుండి ఈ కార్మికులకు జెడ్పిహెచ్ఎస్ యాజమాన్యం నెల నెల జీతాలు ఇస్తూ పని చేయించుకుంటున్నారు. కానీ ఏప్రిల్ నెల నుండి ఎన్టిపిసి యాజమాన్యం అకారణంగా నిలిపి వేసినారు. ఇట్టి విషయంలో జడ్.పి.హెచ్.ఎస్ యాజమాన్యం యొక్క కార్మికులకు జీతాలు ఇవ్వకుండా పని ఆపివేసింది. దీని వలన ఆరుగురు కుటుంబాల రోడ్డున పడి దుర్భర జీవితాలు కొనసాగిస్తున్నారు.అలాగే NTPC పరిసర ప్రాంతాల పిల్లలు 500 పై చిలుకు విద్యార్థులు చదువుతున్నారు. వీల్లు అతి పేద, గరీబ్ పిల్లలతో పాటు ఈ కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలు కూడా చదువుతున్నారు. జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ శుభ్రత లోపించి పిల్లల అనారోగ్యానికి గురి అవుతున్నారు.కావున ఈ కార్మికుల యందు, దయతలచి, మానవత దృక్పథంతో ఆలోచన చేసి, ఎన్టివిసి యాజమాన్యంతో మాట్లాడి ఈ కార్మికులకు తగు న్యాయం చేయగలరని విజ్ఞప్తి చేసిన వెంటనే బండి సంజయ్ ఎన్ టి పి సి యజమాన్యంతో మాట్లాడి విధుల్లోకి తీసుకోవాలని కోరడం జరిగింది యజమాన్యం కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఈ కార్యక్రమంలో *ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దపెల్లి జిల్లా ఇంచార్జ్ మంతిని కిరణ్ *, ఎన్టిపిసి జడ్.పి.హెచ్.ఎస్ బాధిత కార్మికులు పల్లికొండ మల్లేష్, జి.రజిత, పి.స్వప్న, కే.శంకరయ్య, మంగ, భాష, మరియు ఎస్సిఆర్పిఎస్ యూత్ జిల్లా కార్యదర్శి మాలెం మధు,Ch.అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: