మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
లింగాపూర్ గ్రామ ఎస్సి కాలినీలో దళిత కుంబాలతో కలిసి సమావేశం నిర్వహించిన కౌశిక్ హరి. ఈ సందర్భంగా బీజేపీ నేత కౌశిక హరి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళు గా అవస్థలు పడుతున్న ఎస్సి కాలినిని సింగరేణి నిర్లక్ష్యం చేస్తూ వస్తుందని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా కుట్ర చేస్తుందని ఈ మధ్య కాలంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో కలెక్టర్ ను కలవడం జరిగిందని కలెక్టర్ సానుకూలంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. అయితే సింగరేణి మాత్రం ఈ పక్రియ కు మోకాలు అడ్డుతోందని ఈ ఆలోచన విరమించుకోవాలని లేదంటే ఆందోళన తప్పదని అన్నారు. అలాగే గ్రామ పంచాయతీ అధికారులు కూడా ఎస్సి కాలిని పై చిన్న చూపు విడనాడాలని కాలిని లో సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేదంటే పై అధికారులకు పిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అలాగే భవిష్యత్ కార్యాచరణ పై దిశ నిర్దేశం చేశారు, అలాగే వీరికి అండగా అన్ని పార్టీలు కలిసి రావాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఇరికిల్ల పద్మ శంకరయ్య, నిమ్మరాజుల రవి, దారంగుల కుమార్, కన్నం మోహన్,పులి శ్రీనివాస్, ఇరికిల్ల శివయ్య,గుర్రం రాజలింగు,ఇరికిల్ల రాజనర్స్,గుర్రం చందు,అధిక సంఖ్యలో మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: