చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
నారాయణపూర్ మండలం జనగాం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యానాల లక్ష్మి నరసమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ యానాల రాంరెడ్డి విద్యార్థులకు నోటుబుక్స్, పెన్ను, పెన్సిల్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే విద్యార్థి దశ నుంచే మార్పు అవసరమని అన్నారు. ఆటపాటలతోపాటు విద్యపై శ్రద్ధ పెట్టి ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో మంచి గుర్తింపు పొందాలని విద్యార్థులనుదేశించి అన్నారు. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సమకూర్చారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఎం సి చైర్మన్ గడ్డం యాదగిరి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందం పాల్గొనడం జరిగింది.
Post A Comment: