మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


రామగుండం పట్టణంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 73 సంవత్సరాల సందర్భంగా *ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రామగుండం అధ్యక్షులు కుక్క గంగాప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం మరియు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా విచ్చేసినటువంటి *22వ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లత మరియు 20 డివిజన్ కార్పొరేటర్ కన్నురి సతీష్ కుమార్ లు మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశ ప్రజలందరికీ బడుగు బలహీన వర్గాలందరినీ ఒకే విధమైన హక్కులు ఉండాలని చెప్పి రాజ్యాంగంలో పొందుపరచాలని విద్యా హక్కు చట్టం ఓటు హక్కు పౌరసత్వ హక్కు ప్రతి ఒక్కరికి సమాన హక్కు కుల మత లింగ వర్ణ భేదాలు లేకుండా ఉండాలని చెప్పి రాజ్యాంగాన్ని పొందుపరిచారని వారు గుర్తు చేశారు. ఈరోజు భారతదేశం ఒకతాటిపై ఉందంటే దానికి ముఖ్య కారణం భారత రాజ్యాంగం అని అలాంటి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరము గౌరవించుకుంటూ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ను స్మరించుకోవాలని అన్నారు. కార్యక్రమా అనంతరం అంబేద్కర్ చౌక్ లో స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు బుషిపాక సంతోష్ మహారాజ్, దారంగుల కుమార్, మీర్జా సలీం బెగ్, ఉరుమేట్ల రాజలింగం, ఈదునూరి హరిప్రసాద్, జరూపుల శ్రీను, బుశిపాక రాంచందర్, మల్లేష్ , బూషిపాక ప్రేమ్ కుమార్, వంశీ , శ్రీకాంత్, ఏముర్ల రాజయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: