మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
డిసెంబర్ 10, 11 వ తేదీలో ఎన్టిపిసిలో జరిగే పెద్దపల్లి జిల్లా సిఐటియు 3 వ మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ ముత్యంరావు పిలుపునిచ్చారు.
రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ఎన్టిపిసి ప్లాంట్ గేట్ నెంబర్ 2 నుండి అన్నపూర్ణ కాలనీ, ఎఫ్సీఐ ఎక్స్ రోడ్ వరకు జరిగిన బైక్ ర్యాలీని ప్రారంభించి మాట్లాడుతూ పెద్దపెల్లి జిల్లా మూడవ మహాసభలు కార్మిక క్షేత్రమైన ఎన్ టి పి సి లో జరగనున్నాయని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుందని, కార్మిక చట్టాలను మార్చి, నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేస్తూ కార్మికుల హక్కుల్ని కాలరాస్తుందని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26000/ - రూపాయలు అమలయ్యే విధంగా జీవోలు సవరించాలని డిమాండ్ చేశారు.
కార్మిక వర్గానికి సిఐటియు సమస్యల పరిష్కారంలో ముందు భాగాన నిలుస్తుందన్నారు.
మహాసభలకు పెద్ద ఎత్తున కార్మికులు, మేధావులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
బైక్ ర్యాలీలో సిఐటీయూ నాయకులు ఏం రామాచారి, ఎన్ బిక్షపతి,నాంసాని శంకర్, గిట్ల లక్ష్మారెడ్డి, భూమయ్య,దండ రాఘవరెడ్డి, ఎండి యాకూబ్, కాదశి మల్లేష్, కే రాజ్ కుమార్, బి అర్జున్, టి రవీందర్, ఎండి షమీం, ఏ అజయ్, కనకయ్య, జగన్, ఎం శంకర్, శివపాల్ సింగ్, బి నారాయణ, రామ్ సత్యనారాయణ, రాజమల్లు, భాస్కర్, మరియు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు
Post A Comment: