ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

 మెప్మా సిబ్బందికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని  ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.

శుక్రవారం బల్దియా పరిధి 31 వ డివిజన్ శాయంపేట పద్మశాలి కమ్యూనిటీ హాల్ లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  స్లం సమాఖ్య ల సర్వసభ్య సమావేశానికి ప్రభుత్వ చీఫ్ విప్ తో పాటు నగర మేయర్ గుండు సుధారాణి, లోక్ సభ సభ్యులు పసునూరి దయాకర్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

  అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో  చీఫ్ విప్ మాట్లాడుతూ  పావలా వడ్డీ అంశమై పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్  దృష్టికి తీసుకు వెళ్లడం జరుగుతుందని, రాబోయే నూతన సంవత్సరంలో శాయంపేటలో మహిళల కోసం కుట్టు మిషన్ శిక్షణ ను కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, కేవలం శిక్షణ ఇవ్వడమే కాకుండా మీ వ్యాపారం లాభసాటిగా జరిగేలా వివిధ పాఠశాలలు, కళాశాల లు,హాస్టలలో ఉండే పిల్లల బట్టలు కుట్టేలా ఆర్డర్స్ కుడా  ఇప్పించడం జరుగుతుందని, 6 నెలల క్రితం పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్ నగరానికి వచ్చి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గార్మెట్స్ ఇండస్ట్రీ కంపెనీ లు,కేరళ కు చెందిన కేటెక్స్ ను మనకు అందించడం జరిగిందని, ఇట్టి కంపెనీలలో మహిళలకు అనేక రకాలైన ఉపాధి అవకాశాలు లభిస్తాయనీ, మేయర్ లోక్ సభ సభ్యుల సహకారంతో కంపెనీ వారిని ఇక్కడికి తీసుకొచ్చి అనేక రకాలైన నైపుణ్యాలను నిరుద్యోగ, ఔత్సహిక మహిళలకు నేర్పించడానికి కృషి చేస్తానని  తెలిపారు.

   నగర మేయర్  గుండు సుధారాణి  మాట్లాడుతూ  నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే క్రమం లో ప్రత్యామ్నాయంగా  కాగితపు సంచుల, జూట్ సంచుల తయారీ పై  ఆర్.పి.లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, సానిటరీ నాప్కిల్స్ తయారీ , పూలను ఉపయోగించి దూప్ స్టిక్స్ తయారీ లలో శిక్షణ ఇప్పించడం జరిగిందని, సృజనాత్మకత తో తయారుచేసే ఉత్పత్తులకు మార్కెట్ లో డిమాండ్ ఉంటుందని,ఆ దిశగా ముందుకు వస్తే  కార్పొరేషన్ పరంగా మార్కెటింగ్ కల్పించేలా చూస్తామని ఈ సందర్భంగా మేయర్ తెలిపారు.

   లోక్ సభ  సభ్యులు పసునూరి దయాకర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించడానికి  తన వంతు సహకారం ఉంటుందని, వివిధ వ్యాపారాలు నిర్వహించడానికి ఆసక్తి కనబరిస్తే సహకరిస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భం గా చీఫ్ విప్,మేయర్, ఎం.పి.లను ఆర్.పి.లు శాలువాలతో సత్కరించి పూల మొక్కలను అందజేశారు.

   ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు, డీఎంసీ రజితా రాణి, శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ శిల్పా, టిఎంసి రమేష్, సి ఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: