ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ 26 వ డివిజన్ లో కార్పోరేటర్ బాలిన సురేష్ ఆద్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్శితులై లక్ష్మిపురానికి చెందిన యువకులు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ మేరకు వారికి ఎమ్మెల్యే నరేందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం,అభివృద్దే ఎజెండాగా పనిచేస్తున్నానని, ముఖ్యమంత్రి కేసీఆర్ ,కేటీఆర్ నాయకత్వంలో మీరిచ్చిన ఆశీర్వాదమే నాకు బలమన్నారు. ప్రజలకు సేవ చేయటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎన్నికలప్పుడే ప్రజల్లోకి వచ్చేవాళ్ళతో జాగ్రత్తగా ఉండాలన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే వాళ్ళను ఆశీర్వదించండన్నారు. టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తిరిగిలేని రాజకీయ శక్తిగా తయారైందని, టీఆర్ఎస్ కు కార్యకర్తలే బలమన్నారు.
టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో కొంగర నితీష్, కే.దిలీప్, ఈ అజయ్, కే.లడ్డు,జి.పవన్,ఎం.ప్రశాంత్ తేజ, ఆర్.రాము, బి రాహుల్, ఎండి.జావిద్ ఖాన్, టీ.చంటి, పి.కోటి, కే.కిరణ్,పి.కుమార్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమం కార్పోరేటర్ బాలిన సురేష్, బోగి సురేష్, మాజీ కార్పోరేటర్ కుందారపు రాజేందర్,మాజీ కో ఆప్షన్ మెంబర్ చాంద్ పాషా,డివిజన్ అధ్యక్షులు సోమవతి విజయభారతి , ప్రధాన కార్యదర్శి ఒద్యారపు రాజేంద్ర చారి,దుర్గేశ్వల స్వామి ఆలయ చైర్మన్ ఎలకంటి సతీష్, ధర్మకర్త కూచన రమేష్,డివిజన్ ముఖ్య నాయకులు గన్నారపు కుమార్ ,రేపూడి భాస్కర్,కొమ్ము రాజు,పోలెపాక సీతయ్య,కాపురపు సుదాకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: