ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
పార్టీలకు,రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 19 వ డివిజన్ లో ఇటివల కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసిన మంచన చంద్రకళ గారి కుటుంబానికి బుధవారం తెలంగాణ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి ఫథకం ద్వారా మంజూరైన చెక్కును ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వారికి అందజేసారు. పార్టీలకతీతంగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని, ప్రతీ గడపకు తెలంగాణ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ ఓని స్వర్ణలత భాస్కర్, డివిజన్ అధ్యక్షులు ఈటల ఉమామహేందర్, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
Post A Comment: