మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: మండలంలోని మూడు పంచాయితీరాజ్ రోడ్లను పునరుద్ధరించేందుకు 10.80 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎంపీపీ రాణీ బాయి రామారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు..మండలంలో గత కొంత కాలంగా పంచాయితీ రాజ్ రోడ్ల పునరుద్ధరణ చేపట్టక పోవడంతో అటవీ గ్రామాల ప్రజలు,ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా దృష్టికి తీసుకు వెళ్లగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపమని ఆదేశాలు ఇచ్చారని ఎంపీపీ రాణీ బాయి రామారావు తెలిపారు. మండలం లోని మద్దులపల్లి క్రాస్ రోడ్ నుంచి పలుగుల వరకు 8.75 కోట్లు, అర్ అండ్ బీ రోడ్డు నుంచి బెగుళూరు గ్రామం వరకు 45 లక్షలు, అంబట్ పల్లి నుంచి కిష్టరావుపేట వరకు 1.60 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ప్రభుత్వాినికి ప్రతిపాదనలు పంపినట్లు ఎంపీపీ రాణీ బాయి రామారావు తెలిపారు. మారుమూల అటవీ మండ లమైన మహాదేవపూర్ రోడ్ల పునరుద్ధరణ కు నిధులు మంజూరు చేస్తామని రాష్ట్ర పంచాయితీ రాజ్ మంత్రి ఎరవెల్లి దాయకర్ రావు హామీ ఇచ్చారని ఎంపీపీ పేర్కొన్నారు....
Post A Comment: