పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న

     



                                                 పెద్దపల్లి:నవంబర్:26:పెద్దపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ నిర్వహించారు,సమావేశం ప్రారంభ ముందు 73వ రాజ్యాంగ దినోత్సవమును పురస్కరించుకొని రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు.శనివారం జడ్పీ కార్యాలయంలో 1వ,2వ,4వ,7వ స్థాయి సంఘాల సమావేశాలను నిర్వహించారు.ఫైనాన్స్ ప్లానింగ్,విద్య,వైద్యం,గ్రామీణ అభివృద్ధి,గనులఅభివృద్ధి,పనులు సంబంధిత అంశాలపై జడ్పీ చైర్మన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించి జరుగుతున్న పనుల పురోగతి వివరాలను తెలుసుకున్నారు.జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్ సూచించారు.కెసిఆర్ కిట్ల పంపిణీ,ఉప ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణ పనులు,తదితర అంశాలపై జడ్పీ చైర్మన్ సమీక్షించారు.గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై చైర్మన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.గ్రామ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.గ్రామాల్లో పకడ్బందీ పారిశుధ్య చర్యలు చేపట్టి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలని జడ్పీ చైర్మన్ సూచించారు.హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని,నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం కనీసం 75 శాతం మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సమావేశంలో జడ్పీ సీఈవో శ్రీనివాస్,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్,ఈఈ పంచాయతీ రాజ్ ముని రాజు,జడ్పీటీసీలు బండారి రాంమూర్తి,ఆముల నారాయణ,బొద్దుల లక్ష్మీనర్సయ్య,వంగల తిరుపతిరెడ్డి,కో ఆప్షన్ సభ్యులు దివాకర్,జిల్లా అధికారులు,ప్రజా ప్రతినిధులు,తదితరులు  పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: