మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని మహాదేవపూర్ మండల అధ్యక్షురాలు రాణి బాయ్ రామారావు ఆధ్వర్యంలో, ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయము ఆవరణలో,డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మహాదేవపూర్ మండల ప్రత్యేక అధికారి, జెడ్పిసిఇఓ రఘువరన్ మాట్లాడుచు ఆగస్ట్ 29-8-1947 రోజున డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారిని చైర్మన్‌గా ఆరు దశాబ్దాల కిందట నవంబర్ 26-11-1949 నాడు డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన సర్ధార్ వల్లభాయి పటేల్ ప్రతిపాదించి ప్రవేశపెట్టారు.ప్రపంచంలోనే అతి పెద్దదైన రాజ్యాంగాన్ని రూపకల్పన చేసింది. కులాలు,విభిన్న మతాలు, రకరకాల ఆచార వ్యవహారాల సంఘటిత భారతావనికి స్వపరిపాలనా రూపకల్పన రాజ్యాంగ బద్దం చేశారు.భారత సర్వసత్తాక…సార్వభౌమ…ప్రజాస్వామ్య దేశంగా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుని దేశ ప్రజలకు హక్కులు కల్పించింది. భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం భారత ప్రజల సంక్షేమం,అభివృద్ధి కోసం రాజ్యాంగానికి లోబడి సవరణ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.మన రాజ్యాంగం గురించి మరింతగా తెలుసుకునేలా ఈరోజు మనకు స్పూర్తినివ్వాలి.రాజ్యాంగం ప్రజల నుంచి వచ్చింది.ప్రతి ఒక్కరు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. రాజ్యాంగం ద్వారానే అధికారం స్వీకరిస్తారు. రాజ్యాంగం పేరిట విధులు నిర్వహిస్తారు.కాబట్టి భారత రాజ్యాంగానికి ఉన్న ఔన్నత్యం చాలాగొప్పది అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు రాణి బాయి రామారావు, జడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్,ఎంపీటీసీలు ఆకుతోట సుధాకర్,మంచినీళ్ళ దుర్గయ్య,మండల ప్రత్యేక అధికారి జెడ్పిసిఓ రఘువరన్,ఎంపీడీవో శంకర్,ఎంపిఓ ప్రసాద్, కార్యాలయ పర్యవేక్షకులు శ్రీధర్ బాబు,ఏపీఎం రవీందర్,కార్యాలయ సిబ్బంది,ఉపాధి హామీ సిబ్బంది,ఐకెపి సిబ్బంది, రామారావు,టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: