ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
జిల్లా పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వర్టికల్ (వర్టికల్ అనగా విభాగం... ఉదాహరణ.... రిసెప్షన్ వర్టికల్, బ్లూ కోర్ట్ వర్టికల్, క్రైమ్ వర్టికల్ ) విభాగంలో ప్రతిభ 32 మంది పోలీస్ అధికారులు సిబ్బందికి ఎస్పీ ప్రశంస పత్రాలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని, అలాంటి శాఖలో ప్రతి అంశంలో జాగ్రత్తగా పని చేయాలని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రోత్సహించే విధంగా పోలీసు అధికారులను, సిబ్బందిని గుర్తించి, అవార్డులు, రివార్డు లను ఇస్తున్నట్లు ఎస్పి తెలిపారు. ప్రతి ఒక్కరు వర్టికల్ వారిగా పోటీపడి విధులు నిర్వర్తించాలని అన్నారు. పోలీసులు ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రయత్నించాలని ఎస్పి అన్నారు. ప్రశంసా పత్రం పొందిన వారిలో భూపాలపల్లి సీఐ రాజిరెడ్డి, కాలేశ్వరం ఎస్సై లక్ష్మణ్ రావు, గణపురం ఎస్సై అభినవ్, టేకుమట్ల ఎస్సై రాజు, ఏఎస్సై లు ప్రతాపరెడ్డి, వెంకన్న, హెడ్ కానిస్టేబుల్లు యాకయ్య, రామ్మోహన్రావు, శ్రీనివాస్, రవికుమార్, కానిస్టేబుల్లు, అరుణ, సాంబశివరావు, స్వాతి, అనూష, సంతోష్, సారంగపాణి, మోహన్ రావు, నేతాజీ, చంద్రమోహన్, కుమారస్వామి హరీష్, వేణు శ్రీధర్, శ్రీనివాస్ లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు, డిఎస్పీలు ఏ. రాములు, జి. రామ్మోహన్ రెడ్డి, కిషోర్ కుమార్, ఇన్స్పెక్టర్ పెద్దన్న కుమార్ పాల్గొన్నారు.

Post A Comment: