ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ నగర పాలక సంస్థ పరిధి లోని 31,49,50 డివిజన్ల ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నిర్వహించారు. ముఖాముఖి లో భాగంగా ప్రజల నుండి దాదాపు 118 ఫిర్యాదులను స్వీకరించి సమస్యలన్నింని అతి త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
అనంతరం 26 మందికి కళ్యాణలక్ష్మి, షాధిముబారక్ చెక్కులను అందజేశారు. అనారోగ్యానికి గురై ఆర్ధికంగా చేతికలబడిన 8 మందికి 6 లక్షల రూపాయల 30 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంజూరు చేయించి నేడు లబ్ధిదారులకు అందించారు. అనారోగ్యానికి గురై హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇద్దరికి 2 లక్షల 25 వేల విలువైన ఎల్వోసిలను అందించడం జరిగింది.
ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని, వారికున్న పలు మౌలిక సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో ముఖాముఖి కార్యక్రమం ద్వారా మరింత విస్తృతంగా ప్రజల సమస్యలను పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నామని చీఫ్ విప్ అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్లు మామిండ్లరాజు, ఏనుగుల మనస-రాంప్రసాద్, నెక్కొండ కవిత-కిషన్ మరియు తెరాస డివిజన్ అధ్యక్షులు, మున్సిపల్ అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: