మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం రైల్వే స్టేషన్ సందర్శన మరియు పలు నూతన బిల్డింగ్ ప్రారంభ కార్యక్రమాలకు విచ్చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జెన్ ను కలిసి రామగుండం ప్రాంతంలోని పెద్దంపేట గ్రామంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని అదేవిధంగా కుందన పెళ్లి గేటు సమీపంలో కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని దాంతో పాటు పెద్దంపేట గ్రామంలో గతంలో ఉన్న రైళ్ల సౌకర్యాన్ని పునరుద్ధరించాలని వినతిపత్రం సమర్పించిన అనంతరం పెండ్యాల మహేష్ ఉరిమెట్ల రాజలింగంలు మాట్లాడుతూ పెద్దంపేట్ రైల్వే గేట్ వలన సుమారు 20 గ్రామాల ప్రజలు మరియు ఇతర జిల్లాలకు కూడా లింక్ రోడ్డు కావడం వలన ప్రజలు ఏదైనా అత్యవసర సమయంలో వెళ్లాలంటే రైల్వే గేట్ అడ్డంకిగా ఉండి ఆంబులెన్స్ లో ఎవరైనా పేషన్స్ ఉన్న సమయంలో కూడా గేట్ పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న సందర్భాన్ని చూస్తున్నాం కావున వెంటనే యుద్ధ ప్రాతిపదికన పెద్దంపేట్ మరి కుందనపల్లి రైల్వే గేట్ల సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని అదేవిధంగా అనేకమంది ప్రజలకు సౌకర్యార్థంగా ఉన్న పెద్దంపేట రైల్వేస్టేషన్లో గతంలో ఆగిన ప్యాసింజర్ రైలు మళ్లీ తిరిగి పునరుద్ధరించాలని రైల్వే జియం ను కోరినట్టుగా తెలియజేశారు*ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం లతో పాటు కాంగ్రెస్ పార్టీ కుందనపల్లి అధ్యక్షులు జక్కుల నారాయణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాపోలు మాధవరావు సందనవేణి శేఖర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: