ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఈనెల 30వ తేదీన జరగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాలులో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తో కలిసి కలెక్టర్ మంగళవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలు ఉన్నాయని, ఈ రెండు నియోజకవర్గాల్లో 508124 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 56752 ఎపిక్ కార్డులు అందజేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 30వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అన్నారు. ఓటేసేందుకు ఓటర్లు తమ ఎన్నికల గుర్తింపు ( ఎపిక్) కార్డుతో పాటు ఆధార్ కార్డ్, ఉపాధి హామీ జాబ్ కార్డ్, బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, పెన్షన్ కార్డ్, ( ఎపిక్ కార్డుతో పాటు ప్రభుత్వం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డులు ) పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి ఓటు వేయవచ్చన్నారు. ఇప్పటివరకు ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీని రెండు నియోజకవర్గాల్లో 92. 35 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. ఇందులో పరకాల నియోజకవర్గంలో 96.52శాతం, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 89.12 శాతం ఓటరు సమాచార స్లిప్పులను పంపిణీ చేసినట్లు చెప్పారు. హనుమకొండ జిల్లాలో మొత్తం 484 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో 68 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సహకారంతో నిరంతర విద్యుత్తు, మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్, తదితర మౌలిక వసతులను కల్పించినట్లు చెప్పారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో అన్ని పోలింగ్ కేంద్రాలలో నూరు శాతం వెబ్ కాస్టింగ్ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అర్బన్ ప్రాంతం కావడంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరకాల నియోజకవర్గంలో 68 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరకాలలో 28 మంది అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేస్తుండగా అక్కడ రెండు ఈవీఎంలు , వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా ఒక ఈవీఎం ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ పశ్చిమ పరకాల నియోజకవర్గాల్లో ఈనెల 21, 22, 23 తేదీల్లో హోం ఓటింగ్ను నిర్వహించినట్లు తెలిపారు . ఈ రెండు నియోజకవర్గాల్లో 96.64 శాతం హోం ఓటింగ్ నమోదయింది అన్నారు. ఎన్నికలలో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగుల కోసం పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేందుకు పరకాల, వరంగల్ పశ్చిమ నియోజక వర్గాలకు రెండు ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనెల 29వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ను వేయవచ్చని అన్నారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోపరకాల వరంగల్ పశ్చిమ నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద ఫెసిలిటీషియన్ సెంటర్లు కూడా 29వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చన్నారు. అదేవిధంగా కౌంటింగ్ కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్, వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు . మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచార సమయం ముగిసినట్లు కలెక్టర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులందరూ అంకితభావంతో పనిచేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికల నిర్వహణపై న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన జరగనున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉంచాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులందరూ అంకితభావంతో పని చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రలోభాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. మద్యం, నగదు పంపిణీని కట్టడి చేయడంలో చివరి రెండు రోజులు కీలకమని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిని పెట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలో కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డుల పంపిణీ ప్రక్రియను పూర్తి చేసినట్టు తెలిపారు. ఓటర్ వివరాలతో కూడిన స్లిప్పులను జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో పంపిణీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ఏర్పాటుచేసిన సి-విజిల్ యాప్ పై ప్రజలకు అవగాహన కల్పించామని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఫిర్యాదులను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. సువిధ పోర్టల్ ద్వారా ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, తదితర వాటి కోసం వచ్చే దరఖాస్తులను వెంటనే పరిశీలిస్తూ గడువులోపు అనుమతులను జారీ చేస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పాల్గొన్నారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు (school holidays) రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ జరగనుంది. నగరంలోని పలు విద్యాసంస్థల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలించన్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు.
జుక్కల్ నియోజకవర్గం:
గత కొన్ని రోజులుగా మారిపోయిన రాజకీయ సమీకరణాలు ఎందుకంటే ప్రజలు బిజెపి వైపు మోగ్గు చూపెడుతున్నారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు జుక్కల్ నియోజకవర్గం లో కూడా మార్పు వైపు ప్రజలు ఆసక్తి చూపెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడి ప్రజలు అభివృద్ధికి నోచుకోలేదు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే 15 సంవత్సరాలుగా ఉన్న ప్రజలను ఇక్కడున్న సమస్యలను పరిష్కరించ లేదు అని నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకు ఇప్పటికీ సరైన రోడ్డు మార్గం లేదు ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. దానికి నిదర్శనమే ప్రతి గ్రామంలో ప్రచారానికి వెళ్లినప్పుడు అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఈ విధంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే పై ఇసుక కుంభకోణం, దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ లాంటి పథకాలలో తీవ్ర వ్యతిరేకతతో షెడ్యూల్ కులాల సామాజిక వర్గం ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే పక్కనే ఉన్న నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ అభివృద్ధి చాలా తక్కువగా ఉండడం కూడా దీనికి కారణం ఈ విధంగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పై నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనితో పాటు ప్రతి గ్రామంలో అడ్డగోలుగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి కుటుంబాల మధ్య గ్రామీణ జీవన పద్ధతిని మహిళల జీవితాలను నాశనం చేస్తున్నారు అయినా ఇక్కడి నాయకులు కానీ పోలీసు సిబ్బంది గాని పట్టించుకోకపోవడంతో 'ఒక మహిళ నాయకురాలు వస్తే తమ సమస్యకి పరిష్కారం లభిస్తుందని ఇక్కడి మహిళలు సైతం ఆలోచన చేస్తున్నారు. దానికి నిదర్శనమే ప్రతి గ్రామంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన అరుణతార గారు ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రతి గ్రామంలో మహిళలు చూపెట్టిన అభిమానం మన కళ్ళ ముందు కనిపిస్తున్నది'. అలాగే గతంలో కూడా వారు చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికీ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కళ్లకు కట్టినట్టు కల్పిస్తున్నాయి. ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకు రోడ్డు నిర్మాణాలు ఇప్పటికీ చెక్కుచెదకుండా కనిపిస్తున్నాయి. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని నిజాయితీగల అభ్యర్థి ఎన్నుకోవడంలో ఈసారి జుక్కల్ నియోజకవర్గం ప్రజలు వెనకడుగు వేయడం లేదు. అలాగే ఎస్సీ వర్గీకరణ విశ్వరూప మాదిగల సభ తర్వాత ఆ సామాజిక వర్గంలో కూడా సానుకూల వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే జుక్కల్ నియోజకవర్గం లో ఎస్సీ అది మాదిగల జనాభా కూడా అధికంగా ఉండడం బిజెపికి ఒక మంచి అవకాశం మరియు అరుణతార గారు కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ప్రజలు ఆమె వైపు మోగ్గు చూపిస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ వ్యతిరేక ఓటును బిజెపి తీసుకోవడంలో ముందంజలో ఉంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నాలుగు సార్లు గెలిచినప్పటికీ ఏలాంటి అభివృద్ధి లేదు. అయినా ఇక్కడి నియోజకవర్గం ప్రజలను కాదని ఎవరో కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇవ్వడంతో ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కాంగ్రెస్ వెంట లేరు. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపక పోవడానికి కారణం ఈ నియోజకవర్గ సరిహద్దు ప్రాంతంలో కర్ణాటక ఉంది అక్కడ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఇక్కడికి ప్రజలు అలాంటి ప్రభుత్వాన్ని కలలో కూడా ఊహించలేరు. అందుకే ప్రజలు బిజెపి వైపు అడుగులు వేస్తున్నారు. బిజెపి ఈ నియోజకవర్గంలో గెలవడానికి ముఖ్యమైన కారణం ఎక్కువ ఓటర్లు మహిళలు ఉండడం, మహిళా అభ్యర్థి మరియు విద్యావంతురాలు అహంకారం లేని నాయకురాలు అలాగే యువకులు అధిక సంఖ్యలో మోడీ నాయకత్వంలో బిజెపి వైపు ఆసక్తి చూపెడుతున్నారు. ఈ నియోజకవర్గం మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉంది కాబట్టి ఇక్కడి సాంప్రదాయాలు, ధర్మం పట్ల శ్రద్ధ, స్వామీజీలతో అధిక సన్నిహితం ఉండడం, వివిధ పార్టీలు ముస్లిం డిక్లరేషన్ పై కూడా ఇక్కడి హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెక్యులర్ అనే ముసుగులో వివిధ పార్టీలు చేస్తున్న వాగ్దానాలు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ గ్రామీణ స్థాయి వరకు అందరూ గమనిస్తున్నారు. కావున ఈ ఎన్నికల్లో అది బిజెపికి ఓటు బ్యాంకింగ్ మారే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే డిసెంబర్ 3వ తేదీన ఉదయించేది అరుణ తరానే జుక్కల్ గడ్డపై ఎగిరేది కాషాయ జెండానే అని ఇక్కడి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కె నాగరాజ్,
M.A జర్నలిజం,
న్యాయవాద విద్యార్థి.
పెద్దపల్లి:గోదావరిఖ:నవంబర్:24(మేడిగడ్డటీవీన్యూస్)రామగుండం.నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన సీఎం.ఎన్నికలు వచ్చినపుడు ఆగమాగం కావద్దు అభ్యర్థిగుణగణాలు,పార్టీ చూసి ఓటువేయాలి బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసంయాభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేసింది,రామగుండంలో నిరుద్యోగుల ఉపాధి కోసం పరిశ్రమలు ఎర్పాటు చెస్తానని కోరుకంటి చందర్ ను గెలిపిస్తే రామగుండం నియోజకవర్గం సమస్యలు పరిష్కారిస్తామని ఎన్నికలు వచ్చినపుడు ఆగమాగం కావద్దు అభ్యర్థి గుణగణాలు, పార్టీ చూసి ఓటువేయాలనీ కారు గుర్తుకు ఓటువేసీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ ను ఆశీర్వాదించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు.రామగుండం నియోజక వర్గం గోదావరిఖని సింగరేణి స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో సిఎం కేసీఆర్ ప్రసగించారు.ఎన్నికలు వచ్చినపుడు ఆగమాగం కావద్దు అభ్యర్థి గుణగణాలు,పార్టీ చూసి ఓటు వేయాలన్నారు.బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమన్నారు.యాభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేసిందన్నారు.సింగరేణి నీ నాశనం చేసిందే కాంగ్రెస్ అని చేతకాక సింగరేణినీ కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా పుట్టించిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు.సింగరేణి తెలంగాణ కొంగు బంగారమని తెలంగాణ ప్రభుత్వం వచ్చాకా కార్మికులను కంటికి రెప్పలగా కపాడుతున్నమని
సింగరేణి కార్మికులకు లాభాల వాటా పెంచామని
లాభాల వాటా,దీపావళి బోనస్ కలిపి వెయ్యి కోట్లు ఇచ్చన్నారు.కార్మికులకు వేతనాలు ట్యాక్స్ మినహాయింపు చేస్తామన్నారు.సింగరేణీలో 15 వేల మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించామన్నారు.రైతుబందు పుట్టించిందే బీఆర్ఎస్ అన్నారు,3 గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి అంటుండు3 గంటల కరెంట్ సరిపోతుందా? వారు ప్రశ్నించారు.ధరణి వచ్చాకే రైతుల చేతికి భూమి హక్కులు వర్తంచాయన్నారు.ధరణి బంగాళాఖాతం లో వేయాలని అంటున్నారని వాళ్ళనే బంగాళాఖాతంలో వేద్దామన్నారు.సింగరేణి నీ మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పారు.చందర్ ఉద్యమ సమయంలో 74 రోజులు జైల్లో ఉన్నాడని,రామగుండంలో మరిన్ని పరిశ్రమలు తీసుకువస్తామని
కోరుకంటి చందర్ ను బారీ మెజారిటీతో గెలిపించలి, నేటి కలియుగంలో జన్మించిన తెలంగాణ రాముడు సిఎం కేసీఆర్ కారుగుర్తుకు ఓటువేసి సిఎం కేసీఆర్ బుణం తీర్చుకోవాలి ప్రజా ఆశీర్వాద సభకు తరలివచ్చిన వేలాది మంది ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే,నేటి కలియుగంలో జన్మించిన కలియుగ కారణజన్ముడు సిఎం కేసీఆర్ ని..ఆనాడు రాముణ్ణి మనం చూడలేదనీ..ఈ నాటి సిఎం కేసీఆర్ రూపంలో రామున్ని చూస్తున్నని తెలంగాణ రాష్ట్రం కోసం జన్మించిన కారణ జన్ములు సిఎం కేసీఆర్ కారుగుర్తుకు ఓటువేసి బుణం తీర్చుకోవాలని.రామగుండం శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు.శుక్రవారం గోదావరిఖనిజవహర్‌లాల్ స్టేడియంలో ప్రజాఆశీర్వాద సభలో ఎమ్మెల్యే మాట్లాడరు...చరిత్ర నేర్పిన గాయాల నుండి తెలంగాణ గేయమై ఉద్భవించిన నాయకుడు సిఎం కేసీఆర్ అన్నారు.చరిత్ర నేర్పిన గాయాల నుండి తెలంగాణ గేయమై ఉద్భవించిన నాయకుడు సిఎం కేసీఆర్ అన్నారు.సింగరేణి కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ గత పాలకులు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలు ఇచ్చిన మహనేత సిఎం కేసీఆర్ అన్నారు.కాలుష్యానికి నిలయంగా ఉన్న ఈ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందాలని మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన సిఎం కేసీఆర్కు రుణపడి ఉంటామన్నారు.సివిల్ జడ్జ్ కోర్టు,సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుతో పాటు రాయదండిలో 1800 ఎకరాల కుర్జూ ఖమ్మీ భూములకు పట్టాలు అందించింది సిఎం కేసీఆర్ అన్నారు.రామగుండంలో గోదావరికి కరకట్ట నిర్మించాలని,కుటీర పరిశ్రమలు కావాలి,కాంట్రాక్టు కార్మికులు పర్మినెంట్ కావాలని ఎమ్మెల్యే,ముఖ్యమంత్రి ని కోరగా సానుకూలంగా స్పందించారు.ప్రజా ఆశీర్వాద సభకు తరలివచ్చిన వేలాది మంది ప్రజలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి ఆశీర్వాదించాలన్నారు,ఈ ఆశీర్వాదసభ ఎంపీ వెంకటేష్ నేత,ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణరావు,మధుసూదనాచారి,మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్,డిప్యూటీ మేయర్ అభిషేక రావు,మూల విజయ రెడ్డి,టీబీజీకేస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి మల్లయ్య జెడ్పిటిసి నారాయణ కౌశిక హరి కార్పొరేటర్స్ ఎంపీపీలు సర్పంచులు.నాయకులు,నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
పెద్దపెళ్లి:రామగిరి:మంథని,నవంబర్:24(మేడిగడ్డటీవీన్యూస్)సింగరేణి కార్మికుల పాదయాత్ర అభినందనీయం,ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన తొలి మలి దశ ఉద్యమాల్లో సింగరేణి కార్మికులు కీలకపాత్ర పోషించారని,వారి ఉద్యమస్పూర్తి మరువలేనిదని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ అన్నారు.సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు పొందిన యువకులు హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టమధూకర్ గెలుపు కోసం సెంటనరీ కాలనీలోని కోదండరామాలయం నుంచి మంథనిలోని గౌతమేశ్వరస్వామి ఆలయం వరకు శుక్రవారం సింగరేణి కార్మికులు చేపట్టిన పాదయాత్రను పుట్ట శైలజ ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడరు.రాష్ట్రంలోనే మంథనినియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉందని,ఇక్కడ సిరులు పండించే సింగరేణి సంస్థ ఉందని.సింగరేణి బిడ్డలు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం,సీఎం కేసీఆర్ నాయకత్వంలో కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు.అనేక ఏండ్లుగా ఎదురుచూస్తున్న కారుణ్య నియామకాలు బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే సాధ్యమయ్యాయని, వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసిన బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలిచి ఇక్కడి అభ్యర్థి పుట్ట మధూకర్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలనే మంచి ఆలోచనతో యువకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు.బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టమధూకర్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో సింగరేణి కార్మికుల గురించి మాట్లాడే అవకాశం ఉంటుందని,ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్ గెలుపు కోసం పని చేస్తామంటూ పాదయాత్ర చేపట్టి ఈ ప్రాంత ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అభినందనీయమని ఆమె అన్నారు.ప్రచారంలో భాగంగా అభ్యర్థి పుట్ట మధుకర్ పాదయాత్ర చేస్తున్న కార్మికులకు ఓసిపి టు కాడ కలుసుకొని అభినందనలు తెలిపారు.ఈ పాదయాత్ర కార్యక్రమంలో పార్టీ నాయకులు సింగరేణి కార్మికులు టీబీజీకేఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి:మంథని:నవంబర్:24(మేడిగడ్డటీవీన్యూస్)మంథని నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి కాంగ్రెస్,బిజెపి పార్టీల నాయకులు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరినారు.మహాదేవ పూర్ మండలం అంబట్ పల్లి గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ నుండి భిఆర్‌ఎస్ పార్టీలో చేరినరు వారికి మంథని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్,ఎన్నికల ఇంఛార్జి,మాజీ ఐడిసి చైర్మెన్ ఈద శంకర్ రెడ్డి కండువాలు కప్పి భీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వనించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు,పుట్ట మధుకర్ గెలుపు కోసమే పని చేస్తామని తెలిపారు.ఈ చేరికల కార్యక్రమంలో పార్టీ.నాయకులు,నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఎన్నికల విధులలో పాల్గొంటున్న ఉద్యోగులకు ఈ నెల 29వ తేదీ వరకూ హనుమకొండ, పరకాలలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆ రెండు చోట్ల ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం తెలిపారు.హనుమకొండలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హనుమకొండ జిల్లాకు సంబంధించిన వారికి ఒక ఫెసిలిటేషన్ సెంటర్, ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులకు మరొక ఫెసిలిటేషన్ సెంటర్, పోలీసు ఉద్యోగులు ఓటు వేసేందుకు మరొక ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరకాల నియోజకవర్గానికి సంబంధించి పరకాల లోని తహశీల్దార్ కార్యాలయంలో ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా అత్యవసర సర్వీసుల ఉద్యోగులకు పోస్టల్ ఓటింగ్ సెంటర్ ను ఈనెల 24,25, 26 తేదీల్లో హనుమకొండలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో, పరకాలలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. ఆదివారం కూడా ఫెసిలిటేషన్ సెంటర్లు పనిచేస్తాయని, ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఎన్నికల విధులలో పోలీసుల బాధ్యతలు కీలకమని జనరల్ అబ్జర్వర్ డాక్టర్ హెచ్.ఎన్ గోపాలకృష్ణ అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఈనెల 30వ తేదీన జరగనున్న ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు జనరల్ ఎన్నికల పరిశీలకులు గోపాలకృష్ణ, ఎన్నికల వ్యయ పరిశీలకులు రాహుల్ పంజాబ్ రావు గావాండే, పోలీస్ అబ్జర్వర్ తోగో కర్గా, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా లతో కలిసి జిల్లా పోలీస్ అధికారులతో శుక్రవారం సాయంత్రం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్నికల జనరల్ అబ్జర్వర్ డాక్టర్ హెచ్. ఎన్. గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ పక్కాగా అమలు చేయాలన్నారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత పటిష్టంగా ఉండాలన్నారు. ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా చూసుకోవాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఉంటుందన్నారు. ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చేటప్పుడు, పోలింగ్ అనంతరం స్ట్రాంగ్ రూములకు తరలించేటప్పుడు కట్టుదిట్టమైన భద్రత ఉండాలన్నారు. ఈనెల 29 30వ తేదీల్లో పోలీసు అధికారులు, సిబ్బంది పాత్ర కీలకమన్నారు. ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులకు సంబంధించి పలు అంశాలపై పోలీస్ అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఎం. ఏ.బారి, ఈస్ట్ జోన్ డిసిపి రవీందర్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
పెద్దపల్లి,మంథని,నవంబర్,23:(మేడిగడ్డటీవీన్యూస్):అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా గురువారం మంథని మండలం విలోచవరం,పోతారం,ఉప్పట్ల గ్రామాల్లో ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడరు గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో పాలకులు ప్రజల కష్టాలు,కన్నీళ్లు పట్టించుకోలేదన్నారు. అయితే తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజల అవసరాలను గుర్తించి అభివృధ్ది పనులు చేశామని తెలిపారు.అయితే గ్రామాలు ప్రగతిబాటలో పయనించాలని ఆలోచన చేస్తూ ఇక్కడి స్థానిక నాయకులను ప్రోత్సహిస్తే కోట్లాది రూపాయలు సంపాదించుకుని పార్టీలు మారుతున్నారని అన్నారు. స్తానికంగా ప్రజల నుంచి తిరస్కరించబడి,రాజకీయ భవిష్యత్ లేకుంటే అన్నా నీవే దిక్కు అంటూ వస్తే నమ్మి అన్నం పెడితే సున్నం పెట్టాడని ఆయన వివరించారు.బీసీలు,ఎస్సీలు ఎదుగాలని,సమాజంలో మంచి గౌరవించబడాలని ఆలోచన చేసి పదవులు ఇస్తే పైసల కోసం మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పార్టీలు మారడానికి ఒక సమయం, ఒక లెక్క ఉంటుందని,కానీ ఇక్కడ మాత్రం నాయకులు అమ్ముడు పోయి ఊర్లకు చెడ్డపేరు తీసుకువస్తున్నారని అన్నారు.విలోచవరం గ్రామానికి చెందిన ఓ నాయకుడిని ఆదరించి అన్నం పెడితే ఈ ఊరిలో అభివృధ్దిని అడ్డుకున్నాడని,కేవలం పైసల కోసం ఇక్కడి సర్పంచ్‌ను సైతం ఇబ్బంది పెట్టాడని అన్నారు.గొప్ప పదవులు వస్తే ఊరికి ఉపకారం చేయాలని,అక్కడి సర్పంచ్‌కు సహకారం అందించేలే కానీ అభివృధ్దిని అడ్డుకోవద్దని హితవు పలికారు.పది మంది ఎంపీటీసీలు ఛీ కొట్టితే ఒక్క ఎంపీటీసీకి డబ్బులిస్తే నా పదవి ఉంటదని చెప్పితే లక్ష రూపాయలు తానే ఇచ్చానని,ఆ పైసలు ఇస్తే తీసుకుని ఈనాడు పార్టీ మారి నీతులు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.వీళ్లంతా ప్రజల కోసం పార్టీలు మారడం లేదని,కేవలం స్వప్రయోజనాల కోసమే పార్టీ మారుతున్నారని,రేపు మళ్లీ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్లీ ఇక్కడికే వస్తారన్నారు.ఇలాంటి నాయకుల గురించి ప్రజలు ఆలోచన చేయాలని ఊరికి కలంకం తెచ్చే నాయకులను ఊరి బయటనుంచే వెళ్లగొట్టాలన్నారు.లీడర్ అంటే ఆదర్శంగా ఉండాలని,దాసరి లక్ష్మి లాంటి దళిత బిడ్డకు లక్షలు ఇస్తామని తిరిగితే లక్షలు వద్దని తన వెంటే తిరుగుతుందని,ఇది లీడర్ లక్షణమని,కులం కాదు గుణం గొప్పదని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు.తనతో పాటు తిరిగే నాయకులకు సైతం పదవులు ఉండాలని గౌరవంగా ఉండాలని ఆలోచన చేస్తానని,సురేష్‌లాంటి ఎస్సీ బిడ్డను పక్కకు పెట్టుకోవడం తప్పాఅని ప్రశ్నించారు.ఎస్సీ బీసీలు ఎదిగితే ఓర్చుకోలేని వాళ్లు ప్రజలకు ఏం మంచిచేస్తారని ప్రశ్నించారు.అన్నం పెట్టిన కంచంలో మన్ను పోసిన చరిత్ర కల్గిన నాయకుల గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలని,ఇక్కడ ద్రోహం చేసినోళ్లు రేపు అక్కడ ద్రోహం చేయరని గ్యారేంటీ ఏంటన్నారు.ఒక సామాన్యకుటుంబంలో పుట్టి ఏ రాజకీయ చరిత్ర లేకున్నా మీ ఆశీర్వాదంతో ఈ స్థాయికి ఎదిగానన్నారు.నాలుగేండ్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే గొల్లపల్లి నుంచి ముకునూరు వరకు అభివృధ్దిపనులు చేయని గ్రామం లేదని,నా సాయం అందని కుటుంబం లేదన్నారు.పోతారం,విలోచవరం,ఉప్పట్లలాంటి గ్రామాల ప్రజలు అనేక ఏండ్లు గంగ రోడ్డు కోసం ఎదురుచూశారని,ఆనాడు ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రిగా ఉన్న సమయంలో గంగ రోడ్డు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించాలన్నారు.కానీ తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ఊర్లకు గంగ రోడ్డు వేయించానని,గ్రామాల్లో బురదరోడ్డు లేకుండా సీసీ రోడ్లు వేయించానని గుర్తు చేశారు.అంతేకాకుండా ఆనాడు ముకునూరు,నీలంపల్లి గ్రామాలకు చెందిన ఆడబిడ్డలు ప్రసవం కోసం పెద్దంపేట వాగు దాటలేక అక్కడే ప్రసవిస్తే బిడ్డ బొడ్డు పేగును బండరాళ్లతో కొట్టి తెంపిన సందర్బాలు ఉన్నారని,ఆడబిడ్డల కాన్పు కష్టాలు పట్టించుకోని చరిత్ర కాంగ్రెస్ పాలకులదేనన్నారు.కానీ తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పెద్దంపేట వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేసి ఆడబిడ్డల కాన్పు కష్టాలు తీర్చానని,అలాగే అనేక వాగులపై వంతెన నిర్మాణాలు చేసి రాకపోకలు మెరుగుపర్చామన్నారు.ఈనాడు ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్ నాయకులు కేవలం ఆరు పథకాలు చెప్తున్నారే కానీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏంచేస్తాడో చెప్పడం లేదని,ఐదేండ్లు అధికారంలో ఉండిఏ ఒక్క అడబిడ్డ పెండ్లికి,పేదబిడ్డ చదువుకు సాయంచేయలేదని,ఈనాడు ఎన్నికలు రాంగానే ఓట్ల కోసం గడియారాలు,చీరలు పంచుతు.ఓటు బ్యాంకుగానే చూస్తున్నారే తప్ప మనగురించి ఆనాడే ఆలోచన చేయలేదని విమర్శించారు.బీఆర్ఎస్ ప్రభుత్వం,సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రజా సంక్షేమంకోసం అనేక అభివృధ్ది,పనులతోపాటు గొప్పపథకాలు అమలు చేస్తున్నారని,తొమ్మిదేండ్లలో అమలు చేస్తున్న పథకాలతో పాటు కొత్తగా అమలు చేసే పథకాలు,తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చేసే సేవలను బాజాప్తా చెప్తున్నానని అన్నారు.ఎమ్మెల్యేగా ఎంతోమంది బీద ఆడబిడ్డల పెండ్లిళ్లు,పేద విద్యార్ధులకు చదువులు,ఆస్పత్రుల్లో వైద్యం చేయించానని గుర్తు చేశారు.రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం,సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే పించన్‌లు,రైతుబంధు పెంపు,సౌభాగ్యలక్ష్మిపేరిట ప్రతి మహిళకు మూడు వేలు,రైతుబీమా తరహాలో కేసీఆర్ ఐదు లక్షల బీమా,నాలుగు వందలకే గ్యాస్‌సిలిండర్ వస్తుందని,ఈ పథకాలతోపాటు ప్రతిఏటా పేదింటి ఆడబిడ్డలకు ట్రస్టు ద్వారా పెండ్లిళ్లు,పేద విద్యార్ధులకు హైదరాబాద్‌లో రెండు హస్టల్‌లు ఏర్పాటు చేసి రూపాయి ఖర్చు లేకుండా ఉన్నత చదువులు చదివించే బాధ్యత తనదేన్నారు.అంతేకాకుండా గృహలక్ష్మిపథకం ద్వారా పేదకుటుంబాలకు ఇండ్లు మంజూరీ చేయించి ఆ ఇంటి నిర్మాణంతో తనవంతు సాయం చేసి దగ్గరుండి ఇంటి నిర్మాణం చేయిస్తానని హమీ ఇచ్చారు.ఆదరించి ఆశీర్వదిస్తే ఐదేండ్లు మీసేవకుడిగా పనిచేస్తానని స్పష్టం చేశారు.
పెద్దపల్లి,గోదావరిఖనినవంబర్23,మేడిగడ్డటీవీన్యూస్,రామగుండం.నియోజకవర్గంలోని మార్కండేయ కాలనీ బిజెపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి, గురువారం బిజెపి రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి మాట్లాడరు,కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి దళిత జాతిని తన్నిన విధానంను,బిఆర్ఎస్ నేత కేసిఆర్ దళిత మంత్రిని దూరంగ నెట్టివేసిన విధానంను చూస్తే కాంగ్రెస్,టీఆర్ఎస్ లు ఒక్కటేనని,దళితుల పట్ల వారి హేయమైన విధానం అర్థమవుతుందని,అందుకే దళితులందరు తమ ఆత్మగౌరవం కాపాడుకుంటూ నిజమైన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.దాదాపు మూడు దశాబ్దాల పోరాటాల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణను సమర్ధిస్తూ,పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెడతాననడం చారిత్రాత్మక ఘట్టమని,అందుకే దళిత మాదిగ జాతిని అక్కున చేర్చుకొన్న నరేంద్రమోడీ నాయకత్వానన్ని,బిజెపి పార్టీనిఆదరించాలని,దళిత మాదిగ జాతి అంతాఏకమై తనను నియోజకవర్గంలో తనను గెలిపించాలని రామగుండం ఎంఆర్పిఎస్ నాయకులను,కార్యకర్తలను,ప్రజలను కోరిన కందుల సంధ్యారాణి.ఈ సందర్భంగా రామగుండం ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మంద రవికుమార్ మాట్లాడరు,ప్రస్తుతం జరిగే అసెంబ్లీ ఎలక్షన్ లలో బిజెపి పార్టీకి ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని అన్నారు.హైదరాబాద్ లో జరిగిన ఎమ్మార్పీఎస్ విశ్వరూప సభలో దళిత మాదిగ జాతి బిడ్డనిని అక్కున చేర్చుకొన్న మోడీనీ,బిజెపిని ఆదరిస్తామన్నారు.ఎమ్మార్పీఎస్ ప్రధాన డిమాండ్ అయిన ఎస్సీ వర్గీకరణకు బిజెపి ప్రభుత్వం కట్టుబడి ఉందని,పార్లమెంటులో బిల్లు పెడతామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని,అందుకే తెలంగాణలో తమ పూర్తి మద్దతు బిజెపికి ఉంటుందని తెలియజేశారు.ఈ సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు...
పెద్దపల్లి:గోదావరిఖని,నవంబర్,23, మేడిగడ్డటీవీన్యూస్: న్యూ ఇండియా పార్టీ ఆర్థిక స్వేచ్ఛ అందరి హక్కు ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి నెలకు 5000 రూపాయలు ఇవ్వడం న్యూ ఇండియా పార్టీ ప్రథమ కర్తవ్యమని,ఆర్థిక స్వేచ్ఛకోసం యుద్ధం చేస్తున్న వేముల అశోక్ ని గెలిపించాలని న్యూ ఇండియా పార్టీ అధ్యక్షులు డా.జేవి రాజు అన్నారు.న్యూ ఇండియా పార్టీ రామగుండం ఎమ్మెల్యే అభ్యర్ధి వేముల అశోక్,పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డా.జేవి రాజు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పెద్దసంఖ్యలో గోదావరిఖని ప్రధాన చౌరస్తా నుండి తిలక్ నగర్ మీదుగా రమేష్ నగర్,లక్ష్మీనగర్ వరకు పాదయాత్ర నిర్వహించారు,ఈ సందర్భంగా డా.జేవి రాజు మాట్లాడరు,అందరికీ ఆర్థికస్వేచ్ఛ అనే నినాదం ప్రత్యేకతను సంచరించుకుందని,అందరు అభ్యర్థుల్లో అన్ని రకాలుగా అనుభవం ఉన్న అభ్యర్థి,డైనమిక్ లీడర్ వేముల అశోక్ అని,పార్టీ మేనిఫెస్టో హామీలతో రామగుండం ప్రజల మనసులను చురగొంటున్నాడని,రామగుండం ఎమ్మెల్యేగా వేముల అశోక్ కి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.ఎమ్మెల్యే అభ్యర్థి వేముల అశోక్ మాట్లాడరు,ఇప్పుడున్న నాయకులు పనికిరాని మేనిఫెస్టోలు చూపెట్టి తర్వాత మర్చిపోయి,అందినంత దోచుకుందాం దాచుకుందాం అనే రకంగా రాజకీయాన్ని అవినీతిమయం చేస్తున్నారన్నారు.తమ నాలుగు మేనిఫెస్టో లయినా పౌరసత్వ బంధుపథకం,ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ప్రతినెల 5000 చెల్లించుట,గ్రామబంధుపథకం:ప్రతి గ్రామానికి ప్రతి మున్సిపల్ వార్డుకు ఏటా అయిదు కోట్లతో ఉత్పత్తి కేంద్రాలు అందరికీ ఉద్యోగాలు కుటుంబ బంధు పథకం:ప్రతి కుటుంబానికి 12 లక్షలతో వ్యాపార అవకాశం కల్పించడం'ఆహార వ్యవసాయ బృంద పథకం:ప్రతి కుటుంబానికి భూమి ఉన్నా లేకపోయినా సంవత్సరానికి 75 వేల రూపాయలు చెల్లించుట,మొదలగు హామీల గురించి వివరించుతూ,తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించి,రామగుండం నిజమైన అభివృద్ధికి సహకరించాలని,తమ గుర్తు కుండ అని,అందరు కుండ గుర్తుకు ఓటువేసి గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీనాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఈనెల 30వ తేదీన జరగనున్న ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాహుల్ పంజాబ్రావ్ గావాండే అధికారులకు సూచించారు. వరంగల్ ఎన్ ఐ టీ లో ఎన్నికల అధికారులతో గురువారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాహుల్ పంజాబ్రావ్ గవాండే మాట్లాడుతూ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఖర్చు చేస్తున్న వ్యయాన్ని నిశితంగా పరిశీలించాలన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల వ్యయం రూ. 40 లక్షలకు మించకుండా చూసుకోవాలని, అంతకుమించి ఖర్చు చేసినట్లయితే అనర్హతకు గురవుతారని ఇదే విషయాన్ని అభ్యర్థులకు తెలియజేయాలన్నారు. అభ్యర్థులు భారత ఎన్నికల సంఘం సూచించిన ప్రకారం వ్యయపరిమితి ఉండాలని తెలియజేశారు. ఎవరైనా ఇప్పటివరకు ఏ బ్యాంకు నుంచైనా 10 లక్షల ను విత్ డ్రా చేశారా అని అధికారులను అడిగారు. ఇప్పటివరకు అలా జరగలేదని అధికారులు వివరణ ఇచ్చారు. ఎన్నికలలో మద్యం పంపిణీ నియంత్రణ కు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా డబ్బులు గానీ, గిఫ్టులు గాని పంపిణీ చేసినట్లయితే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డి సి ఓ నాగేశ్వర్ రావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆదాయపన్ను శాఖ అధికారి చక్రధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కమిషనింగ్ ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ రిటర్నింగ్, సెక్టోరియల్ అధికారులను ఆదేశించారు.
గురువారం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్ లలో ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ఈవీఎంలపై సీరియల్ నంబర్లు, అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన చిహ్నాల ఏర్పాటు సీసీ కెమెరాల ఎదుట పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. కమిషనింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి, ఈవీఎంల పనితీరు పరిశీలించి, వారికి పూర్తిస్థాయిలో నమ్మకాన్ని కలిగించాలని సూచించారు. రెండోవిడత ర్యాండమైజేషన్లో కేటాయించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల నంబర్లను కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్ ప్యాట్లని ఆయా పోలింగ్ కేంద్రాలకు
కేటాయించే ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్ నిర్వహణ తదితర అంశాల గురించి పరకాల, హనుమకొండ ఆర్డీవోలు శ్రీనివాస్,రమేష్ లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలలో సింబల్ లోడింగ్ లో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సమస్యలు లేకుండా సరిచూసుకోవాలన్నారు. ఎన్నికల రోజున మాక్ పోలింగ్ ఎలా నిర్వహిస్తారు, ఏదైనా సమస్య వస్తే ఏ విధమైన చర్యలు చేపడతారని అధికారులను సాంకేతిక నిపుణులను అడిగి తెలుసుకున్నారు. సెక్టోరియల్ అధికారులు ఎన్నికల విధుల గురించి తెలుసుకున్న అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలను తరలించే క్లోజ్డ్ వెహికల్స్ గురించి జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు సంబంధించి సెక్టోరియాల్ అధికారులకు అధికారులు సాంకేతిక నిపుణులు తర్ఫీదును ఇచ్చారు. ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ, పనితీరును గురించి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో నిర్వహించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;హనుమకొండ జిల్లాలోని రెండు నియోజకవర్గాలైన వరంగల్ పశ్చిమ, పరకాలలో నిర్వహించిన హోం ఓటింగ్ మూడో రోజు గురువారం ప్రశాంతంగా ముగిసింది. పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో హోం ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓటర్ల ఇళ్ల వద్దకు ఎన్నికల అధికారులు, సిబ్బంది వెళ్లి ఓటును స్వీకరించారు. ఫారం 12 డి ద్వారా దివ్యాంగులు, 80 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు హోం ఓటింగ్ కు దరఖాస్తు చేసుకోగా వారి ఇళ్ల వద్దకు ఎన్నికల అధికారులు, సిబ్బంది వెళ్లి ఓటర్ల నుండి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తీసుకున్నారు. ఇందులో భాగంగా మూడో రోజు గురువారం పరకాల,వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ ముమ్మరంగా సాగింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో హోం ఓటింగ్ కు దరఖాస్తు చేసుకున్నవారిలో 353 మంది ఓటర్లుఉన్నారు. పరకాల నియోజకవర్గంలో 302 మంది ఓటర్లు ఫారం 12డి ద్వారా దరఖాస్తు చేసుకున్నారని అధికారులు పేర్కొన్నారు. హోం ఓటింగులో పరకాల నియోజకవర్గం నుండి 302మంది ఓటర్లకు గాను 297(మొత్తం 98.34శాతం )మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకున్నారని, అదేవిధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 353మంది ఓటర్లు ఉండగా 336మంది ఓటర్లు (మొత్తం 95.18 శాతం )తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లాలో 655మంది ఓటర్లకు గాను 633మంది (మొత్తం 96.64 శాతం )హోం ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. కాగా హోం ఓటింగ్ ప్రక్రియ గురువారంతో ముగిసినట్లు అధికారులు తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హనుమకొండ నయీమ్ నగర్ లోని చైతన్య డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఓటింగ్ సరళిని గురించి సంబంధిత అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి రెండు ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయగా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కునువినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా సాగే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను కలెక్టర్ పలకరించారు. వారితో మాట్లాడి ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న ఏర్పాట్లను గురించి జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ అబ్దుల్ హై, నోడల్ అధికారి సురేష్ , తహశీల్దార్ బావు సింగ్ లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సి డి సి లోని రెండు ఫెసిలిటేషన్ సెంటర్లలో మూడు రోజులపాటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం నుండి 28వ తేదీ వరకూ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వేయవచ్చునని అధికారులు తెలిపారు.
పోలింగ్ రోజున ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
హనుమకొండ : ఈ నెల 30వ తేదీన జరగనున్న ఎన్నికల లో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హనుమకొండలోని నయీమ్ నగర్ లో ఉన్న చైతన్య డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఎన్నికల విధులలో పాల్గొననున్న O. P.O లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని గురువారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలలో పాల్గొననున్న ఓపిఓలు భారత ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. ఎన్నికల రోజున మార్క్ పోలింగ్ మొదలుకొని ఓటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల రోజున ప్రతి పోలింగ్ కేంద్రంలో పనిచేసే ఎన్నికల అధికారులు సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ కి చివరి రోజు కావడంతో ఎంతమంది పోస్టల్ బ్యాలెట్ ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ వారిని అడిగి తెలుసుకున్నారు. అందులో కొంతమంది దరఖాస్తు చేసుకోలేదని తెలియజేయడంతో తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా డీఈవో డాక్టర్ అబ్దుల్ హై, నోడల్ అధికారి సురేష్ , తహశీల్డర్ బావుసింగ్, అధికారులు పాల్గొన్నారు.
పెద్దపల్లి:మంథని:నవంబర్21,మేడిగడ్డటీవీన్యూస్ మంథని.నియోజకవర్గంలో రోజురోజుకు పెరుగుతున్న గులాబీ సైన్యం రత్నాపూర్ గ్రామపంచాయితీ రాం నగర్ కు చెందిన వార్డ్ మెంబర్ కుంట సదాలక్ష్మి,బీజేపీ యువ నాయకులు కుంట చక్రీ ఆధ్వర్యంలో 100 మంది భీఆర్ఎస్ పార్టీలో చేరారు,కల్వచర్ల గ్రామపంచాయితీ గోకుల్ నగర్ కు చెందిన100మంది భీఆర్ఎస్ పార్టీలోకిరాగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పుట్ట మధు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్న నేతలుమంథని గడ్డపై గులాబీజెండాఎగురడం ఖాయమే అంటున్నారు2014 అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఈసారి జరిగే అసెంబ్లీఎన్నికల్లో మంథని.నియోజకవర్గంలో కారు రోజుకు..కాంగ్రెస్ కుదేలు!.మంథని నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి నిత్యం బారీగా చేరికలు జరుగుతూనే ఉన్నాయి.కాంగ్రెస్ పార్టీకి చెందిన తాజా,మాజీ ప్రజాప్రతినిదులు గులాబీగూటికి చేరుతున్నారు.రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖామయని సర్వేలన్నీ చెప్తున్న క్రమంలో చేరికల పర్వం జోరుగా సాగుతోంది.బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అభ్యర్థత్వాన్ని బలపరుస్తూ ఆయన గెలుపే లక్ష్యంగా వందల సంఖ్యలో ఆయా పార్టీల నాయకులు,కార్యకర్తలు గులాబీ దళంలో చేరుతున్నారు.మంథని,ముత్తారం,రామగిరి,కమాన్‌పూర్ మండలాలతో పాటు తూర్పు మండలాల్లో కారు దూసుకెళ్తుంటే హస్తం బేజారవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.గత నెల రోజుల క్రితం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ ప్రజాఆశీర్వాద పాదయాత్ర విశేషస్పందన రాగా,ఈ నెల 07న మంథనిలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగసభ రాజకీయ సమీకరణాలను తారుమారు చేసింది.ముఖ్యమంత్రి చేసిన ఆసక్తికర మాటలు బహుజనుల్లో ఆలోచింప జేసింది.ఈ క్రమంలో బహుజనవర్గాలకు చెందిన ప్రజాప్రతినిదులు,నాయకులు,కార్యకర్తలు ఆయా పార్టీలను వీడి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు.మంగళవారం రామగిరి మండలం రాంనగర్ లో వార్డ్ మెంబర్ కుంట సదాలక్ష్మి,చక్రీ ఆధ్వర్యంలో 100 మంది,గోకుల్ నగర్ కు చెందిన100మంది యువకులు,మహిళలు,పెద్దఎత్తన బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారికి బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.తొమ్మిదేండ్లుగా రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం,సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృధ్ది సంక్షేమ పథకాలతో పాటు మంథనిలో ఎమ్మెల్యేగా జెడ్పీ చైర్మన్‌గా పుట్ట మధూకర్ చేసిన అభివృధ్ది,సేవలను గుర్తించి బీఆర్‌ఎస్‌పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు.ఈ చేరికల కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి:రామగిరి:నవంబర్21:మేడిగడ్డటీవీన్యూస్)మంథని నియోజకవర్గం ముస్త్యాల గ్రామంలో కెసిఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గడపగడపకు అందజేసి కారుగుర్తుకు ఓటేసి పుట్ట మధుకర్ ను గెలిపించాలన్నర్,పొరపాటున కాంగ్రెస్ కు ఓటేస్తే మనకు కర్ణాటక గతే పడుతుందీ.గ్రహణం పట్టిన కాంగ్రెస్ కారుచీకటి పార్టీని మార్చేయాలని స్వాతంత్రం వచ్చిన వెంటనే ఆనాడే గాంధీజీ చెప్పినట్లు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పుట్ట రాజన్న అన్నారు.మంగళవారం రామగిరి మండలం ముస్తాల గ్రామంలో మంథని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వాంచారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.తెలంగాణ రాకుంట అడ్డుకున్న ఆంధ్ర కాంగ్రెస్ నాయకత్వానికి తెలంగాణ నాయకులు వెంకటస్వామి,శ్రీపాదరావ్ లాంటి వారి రాజకీయ కుటుంబాలు తెలంగాణ పేరు చెప్పుకొని దేశంలో,తెలంగాణలో ఎంత స్థాయిలో ఉన్నారో మేధావులు,ప్రజలు ఆలోచన చేయాలి,తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసిపడుతున్న తరుణంలో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో జతకట్టిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆయన అనుచరులు ఎంత అరాచకం సృష్టించాడో మంథని ప్రజలు మేధావులు మరిచిపోతీ రా,మతితప్పితిరా?.నాటి విద్యార్థి జేఏసీ నాయకుడు నేడు కోర్టు చుట్టు తిరుగుతున్న శ్రీరాముని అడిగి తెలుసుకోండి,కాంగ్రెస్కు ఓటు వేస్తే కారుచీకటే అని గుర్తుతెరగాలి,తొమ్మిదేళ్ల తెలంగాణ పచ్చని ప్రశాంత వాతావరణం పాలనలో కొనసాగుతుంటే విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ కుట్ర రాజకీయాలకు పూనుకున్నదని,ప్రజా సమస్యలు ఏనాడు పట్టించుకోకుండా హైదరాబాదుకు పరిమితమై అల్లుడు అత్తగారింటికి వచ్చినట్టు ఉన్నది మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎమ్మెల్యేగిరి ఇలాంటి వారికి ఓటుతో సరి అయిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు,మంథని నియోజక వర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పుట్ట మధుకర్ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలతో పాటు పుట్ట లింగమ్మ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కళ్ళముందు కనిపిస్తున్న ప్రజల నాయకుడు పుట్ట మధుకర్ కారు గుర్తుకు ఓటువేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసినారు,మంగళవారం రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 12 పథకాల మేనిఫెస్టోను గ్రామంలో గడపగడపకు చేరవేస్తూ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసినారు,తెలంగాణ ఉద్యమ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పుట్ట రాజన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బాసినేని సత్యనారాయణరావు,సుంకర మహేష్,కోసిక నరసయ్య,సుందిళ్ల రాజు,బాసినేనిమహేందర్ రావు,అవునురి సమ్మయ్య,బి,వినోద,ఎస్ మాధవి,రైతు రమేష్,ప్రశాంతు,రాజేశం,పిట్టల రవి,సుందిళ్ల రఘు,బేర పూర్ణచందర్,బి రవి,వెంకటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు,నాయకురాలు తదితరులు పాల్గొన్నారు,
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;హనుమకొండ జిల్లా పరిధిలోని రెండు నియోజకవర్గాలైన వరంగల్ పశ్చిమ , పరకాలలో హోమ్ ఓటింగ్ మంగళవారం ప్రారంభమైంది. 12డి ఫారం ద్వారా దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు, ఎనభై ఏళ్ళ వయసు పైబడిన వృద్ధులు హోమ్ ఓటింగ్ విధానంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఈనెల 30వ తేదీన పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోలేని ఫారం 12డి ద్వారా దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు, ఎనభై ఏళ్ల వృద్ధులు ఫారం 12డి ద్వారా దరఖాస్తు చేసుకుని పోస్టల్ బ్యాలెట్ విధానంలో తమ ఇంటి వద్దనే ఓటు వేసేందుకు ఎలక్షన్ కమిషన్ హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని కల్పించింది. ఇందులో భాగంగానే జిల్లాలోని రెండు నియోజకవర్గాలైన వరంగల్ పశ్చిమ, పరకాలలో హోమ్ ఓటింగ్ ను అధికారులు చేపట్టారు.
జిల్లాలో 21, 22,23 తేదీల్లో హోమ్ ఓటింగ్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మొదటి రోజున వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో హోమ్ ఓటింగ్ను నిర్వహించారు. మంగళవారం ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకూ హోమ్ ఓటింగ్ ను నిర్వహించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 363మంది దివ్యాంగులు, ఎనభై ఏళ్ల వయసు పైబడిన వృద్ధులైన ఓటర్లు ఉన్నారని, పరకాల నియోజకవర్గంలో 302మంది ఓటర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 11బృందాలు, పరకాల నియోజకవర్గంలో 6 బృందాలు హోమ్ ఓటింగులో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో హోమ్ ఓటింగు కు దరఖాస్తు చేసుకున్న ఓటర్లలో 236మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. అదేవిధంగా పరకాల నియోజకవర్గంలో 143మంది ఓటర్లు తమ ఓటును వేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మొదలైన హోమ్ ఓటింగ్ విధానాన్ని ఎన్నికల జనరల్ అబ్జర్వర్ డాక్టర్ హె చ్. ఎన్. గోపాలకృష్ణ, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఇతర అధికారులు పరిశీలించారు. హోమ్ ఓటింగ్ కు చేపట్టిన చర్యలను ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రిసైడింగ్, అదనపు పోలింగ్ అధికారులు, సెక్టార్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లను అడిగి తెలుసుకుని హోమ్ ఓటింగును పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. హోమ్ ఓటింగును చేపడుతున్నప్పుడు వీడియోగ్రఫీ తప్పకుండా చేయాలని ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులకు తెలియజేసారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సక్రమంగా జరిగే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.
మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, జాయింట్ ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ,పోలింగ్ రోజు అత్యవసర సేవలు కింద విధులు నిర్వహించే ఓటర్లు తమ ఓటు హక్కు ముందస్తుగా వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందని, దరఖాస్తు చేసుకున్న ఓటర్ల కోసం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోటీ చేసే అభ్యర్థులకు తప్పనిసరిగా ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్ల జాబితా వివరాలను అందజేయాలని అన్నారు. ఇంటి వద్ద నుంచి ఓటు సేకరణ వివరాలను ప్రతి రోజూ మీడియా ద్వారా తెలియజేయాలని అన్నారు.
పట్టణ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం, గ్రామీణ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలలో 60 శాతం వెబ్ క్యాస్టింగ్ చేయాలని, మిగిలిన పోలింగ్ కేంద్రాల బయట సిసి కెమేరాలు ఏర్పాటు చేయాలని అన్నారు.
నూతన ఓటర్లకు ఓటర్ గుర్తింపు కార్డులు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ నివేదిక వివరాలను సమర్పించా లని అన్నారు. జిల్లాలో ప్రతి ఓటరుకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని, ప్రతి రోజూ ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ పై నివేదిక అందించాలని, ప్రతి రోజూ నోడల్ అధికారి ద్వారా ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ పై రివ్యూ నిర్వహించాలని అన్నారు.
పోలింగ్ రోజు విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవిఎం యంత్రాల ర్యాండమైజేషన్ పూర్తి చేసి, ఈవిఎం కమిషనింగ్ ప్రక్రియ ప్రారంభించాలని అన్నారు.
పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి, వారికి అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈవిఎం యంత్రాల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఎన్నికల ప్రచారం సంబంధించి సమావేశాలు, సభలు నిర్వహించుకునేందు కు రాజకీయ పార్టీల ప్రతినిధుల, అభ్యర్థుల నుంచి వచ్చే దరఖాస్తులకు ఎప్పటికప్పుడు సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ సిక్త పట్నాయక్, అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ద శుక్ల, జడ్పీ సీఈఓ వెంకటేశ్వర్లు, అధికారులు సురేష్, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
ప్రధాని నరేంద్ర మోడీఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో నీతివంతమైన పరిపాలన బిజెపితోనే సాధ్యమని స్థానిక కౌన్సిలర్ పోలోజు శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం
చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో 9,10,11 వార్డుల పరిధిలో భారతీయ జనతా పార్టీ మునుగోడు అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటి ప్రచార నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ బిజెపి ఫోర్ లీడర్ పోలో శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కారు రావాల్సిన అవసరం ఉందని, బిజెపి పార్టీ ద్వారానే తెలంగాణ ప్రజల యొక్క ఆశలు, ఆకాంక్షలు నెరవేరుతాయని అన్నారు. 30 తారీఖున జరిగే ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా తిరిగి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్
అధ్యక్షులు వెంకటేశం గౌడ్, చలమల వినయ్ రెడ్డి, గోశిక పురుషోత్తం,
తడక సురేఖ, గోశిక భావన రుషి, ధనుంజయ, నీరజ, భాస్కర్ అక్కనపల్లి
శివ, నరహరి సంపత్,హరీష్, ప్రవీణ్,
తదితరులు పాల్గొన్నారు...
తెలంగాణ న్యూస్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి పవన్
అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆదేశానుసారం మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్ మండల పరిధిలోని కాద్లుర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టేక్మాల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప, కాద్లుర్ గ్రామ సర్పంచ్ జ్యోతి భన్సిలాల్. ,BRS గ్రామ పార్టీ అధ్యక్షుడు యం ఎన్ మల్లేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కాద్లుర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు.అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ గారిని గెలిపించాలని గ్రామంలో ప్రతి గడప గడపకు వెళ్లి మన ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల మేనిఫెస్టోను గ్రామంలో ప్రతి గడపగడపకు వెళ్లి ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తు మహిళలు గ్రామస్తులు యువకులు రామ్మక ఆట ఆడుతూ పాటలు పాడుతూ నృత్యం చేశారు. సారు కారు సర్కారు అనే నినాదంతో నాయకులు కార్యకర్తలు ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈసంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చి నప్పుడే కాంగ్రెస్ బిజెపి పార్టీ నాయకులకు గుర్తుకువస్తారు గతంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి చేసిందేమీ లేదని అన్నారు బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పల్లెలు సిఎం కేసిఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ ను బారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈకార్యక్రమంలో కాద్లుర్ గ్రామ సర్పంచ్ జ్యోతి బన్సిలాల్. బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు , యం ఎన్.మల్లేశం , మాజి అధ్యక్షుడు యాదయ్య. మండల ప్రధాన కార్యదర్శి అవినాష్. సిద్ధప్ప. భాస్కర్ . గోవింద చారి అంజా గౌడ్ బక్క యాదయ్య . చాకలి పూజ చిన్న మల్లేశం.గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.పెద్దపల్లి:నవంబర్:18:మేడిగడ్డటీవీన్యూస్: రామగుండం నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి సోమవారపు గెలుపు కోసం 500 మంది ఎస్ఎస్ యూత్ టీం యువ సమ్మేళనం బూతు స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం గౌతమ్ నగర్ సోమారపు సత్యనారాయణ గృహంలో శనివారం రామగుండం నియోజకవర్గ
సోమారపు సత్యనారాయణ ఎస్ఎస్ యూత్ టీం యువ సమ్మేళనం బూతు స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు,ఈ సందర్భంగా సోమారపు సత్యనారాయణ మాట్లాడరు. రామగుండంని అభివృుద్ది చేసాను అదేవిధంగా ఇక్కడ మెడికల్ కాలేజి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నాహయాంలోనే,శాంక్షన్ చేపించనని కొందరు మేమె చెపించమని గొప్పలు చెప్పుకుంటున్నారు అది అబ్బడమని తెలిపారు,అదేవిధంగా గోదావరి నదిని కలుషితం చేసారని మురుగునీరు,వస్తుందని మళ్ళీ నేను గెలిచాక గంగమ్మ తల్లిని శుద్ధి చేపించి స్వచ్ఛమైన మంచి నీరు 24 గంటలు అందిస్తానని తెలిపారు,అదేవిదంగా ఆర్ఎఫ్సీఎల్ కూడా రావడానికి నేను కూడా ప్రధానమంత్రులతో మాట్లాడి ఒప్పించానని తెలిపారు,ఆలోచించండి మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయ్,ఇపుడు ఉన్న బిఆర్ఎస్ అభ్యర్థి గురించి మీకు తెలుసు ఏపనిచెసిన కమిషన్లను తీసుకొని డబ్బులు సంపాదించడం తప్ప ఈప్రాంత ప్రజల గురించి అతనికి అవసరం లేదు,ఇపుడు వజ్రం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడ అభివృద్ధితో పాటు శాంతీయుత వాతావరణం ఏర్పడుతుంది అని,ఆలోచించి నన్ను గేలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్-లావణ్య,పత్తి సంజీవ్,పిడుగు కృష్ణ,సురేష్ పటేల్,సునీల్ కుమార్,సురేందర్,ధరణి సంజీవ్,కిషోర్,శ్యామ్ రాజ్,కృప సాగర్,వరుణ్,మేడి రాజు,శివ ప్రసాద్,నిఖిల్,కమల్ గౌడ్,అరవింద్ యాదవ్,పొన్నాల లక్ష్మణ్,రాకేష్,అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు .
పెద్దపల్లి,కాటారం,మంథని,నవంబర్,18(మేడిగడ్డటీవీన్యూస్) పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ మంథని నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ గెలుపుకోసం భారత రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంథని నియోజకవర్గంలో ఆదివారం నాడు పర్యటించనున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం ఆమె సాయంత్రం నాలుగు గంటలకు రామగిరి మండలం సెంటినరీకాలనీలోని వాణి సెకండరీ పాఠశాల క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.మంథని నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మంథని టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ కోరారు.కాగా శనివారం గోదావరిఖని సబ్ డివిజనల్ ఏసిపి తుల శ్రీనివాసరావు మంథని సీఐ సతీష్ తో కలిసి సెంటినరీ కాలనీలోని బహిరంగ సభ పరిసరాలు,బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.
పెద్దపల్లి,నవంబర్,17,(వమేడిగడ్డటీవీన్యూస్)వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చే పేషెంట్ లతో,వారిసహాయకులతో ఆసుపత్రిలోని వైద్యులు,సిబ్బంది సానుకూలంగా స్పందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు.శుక్రవారం కలెక్టర్ పెద్దపల్లిలోని మాతా,శిశు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి.ఆసుపత్రిలో ఉన్న వివిధ బ్లాక్ లను పరిశీలించిన కలెక్టర్,పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా మెరుగైన వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రులు అందిస్తున్నాయని కలెక్టర్ అన్నారు.ఆసుపత్రికి వచ్చే పేషెంట్ లు,వారి సహాయకులతో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సానుకూలంగా స్పందించాలని,వారితో ఓపికగా వ్యవహరించాలని,మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేయాలని అన్నారు.ఆసుపత్రికి వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని,ఉదయం 9 గంటలవరకు ఆసుపత్రిలో ఓపి సేవలు ప్రారంభం కావాలని,ఆసుపత్రి సిబ్బందికి బయోమెట్రిక్ విధానంద్వారా హాజరు నమోదు చేయాలని,ఆసుపత్రిలో మొదటి కాన్పుజరిగే మహిళలకు సాధారణ ప్రసవం జరిగే విధంగా ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని,అత్యవసర పరిస్థితులలో మాత్రమే మొదటి కాన్పులో సిజేరియన్ చేయాలని కలెక్టర్ తెలిపారు.ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్ పెండింగ్ లో ఉన్న ఆప్తమాలజీ ఆపరేషన్ థియేటర్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని టిఎస్ఈ.ఎండిసిఈఈ ను చరవాణిలో కలెక్టర్ ఆదేశించారు.ఆసుపత్రిలో ఫార్మసీ స్టోర్ ఏర్పాటు చేయడానికి అవసరమైన అంచనాలు తయారు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ తనిఖీలో కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్,డాక్టర్ శౌరయ్య,సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
అభ్యర్థి నామినేషన్ వేసిన రోజు నుండి కౌంటింగ్ వరకు ప్రతి ఖర్చు ఎన్నికల వ్యయం కింద జమ అవుతుందని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాహుల్ పంజాబ్ రావు గవాండే అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశహాలులో వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల నుండి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు, వారి ప్రతినిధులకు ఎన్నికల వ్యయంపై సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాహుల్ పంజాబ్ రావ్ గవాండే మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తాము ఖర్చు చేస్తున్న వ్యయాన్ని తప్పకుండా చూపించాలన్నారు. ఒక అభ్యర్థి గరిష్టంగా ఎన్నికల వ్యయం రూ.40 లక్షలకు మించరాదన్నారు. 40 లక్షల రూపాయలకు మించి ఖర్చు చేసినట్లయితే ఎన్నికల కమిషన్ అనర్హులుగా ప్రకటిస్తుందన్నారు. అభ్యర్థులు కరపత్రాలు పోస్టర్లు అనుమతి తీసుకున్న తర్వాతనే ప్రచారానికి వినియోగించాలన్నారు. ప్రతి కరపత్రం పోస్టర్ పైన ముద్రించిన వారి పేరు ఫోన్ నెంబరు ఎన్ని ప్రతులు అనేది తప్పనిసరిగా సూచించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో వాడిన ప్రతి ప్రచార సాధనాల యొక్క రేటు జిల్లా ఎన్నికల అధికారి నిర్ణయించిన ధరల పట్టిక ప్రకారం ఖర్చు చూపించాల్సి ఉంటుందన్నారు. స్టార్ కంపెనీ తో సభలు సమావేశాలు నిర్వహించినప్పుడు ఆ ఖర్చులు సంబంధిత అభ్యర్థి మాత్రమే భరించాల్సి ఉంటుందన్నారు. స్టార్ క్యాంపెనర్ సభలో సమావేశాల్లో ఒకరికి మించి అభ్యర్థులు పాల్గొన్నట్లయితే ఆ సభకు అయిన ఖర్చును హాజరైన అభ్యర్థులకు సమానంగా లెక్కిస్తామన్నారు. అభ్యర్థులు ఎన్నికల్లో డబ్బులు గిఫ్టులు పంచితే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తప్పకుండా పత్రికల్లో ఏవైనా కేసులు ఉన్నాయా లేవా అనే వివరాలను మూడుసార్లు పోలింగ్ ముందు వరకు ప్రకటన ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమ ఎన్నికల వ్యయాన్ని ఎంత ఖర్చు చేశారు దేనికి ఖర్చు చేశారా అనే వివరాలను తప్పకుండా చూపించాలన్నారు . పోటీల్లో ఉన్న అభ్యర్థులు ఎన్నికల వ్యయాన్ని చూపించనట్లయితే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. అభ్యర్థులు ఒకరోజు రూ.10 వేల కంటే ఎక్కువ నగదును ఖర్చు చెయకూడదన్నారు. అభ్యర్థులు నిర్వహించే సభలు, సమావేశాలు, ర్యాలీలు, వాహనాల, వినియోగించే పూలదండలు కార్పెట్, వాటర్, టీ, ఇలా అన్నీ కూడా ఎన్నికల వ్యయం కింద జమ అవుతాయని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ బ్యాంకు అకౌంటును అప్డేట్ చేసుకోవాలన్నారు. ఏవైనా పత్రికల్లో, చానళ్ల లో అభ్యర్థులకు సంబంధించిన ప్రకటనలు వస్తే ఎం సి ఎం సి కమిటీ వాటిని గుర్తించి సంబంధిత అభ్యర్థులకు నోటీసులు అందజేస్తుందని, ఆ నోటీసులకు సదరు అభ్యర్థులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈనెల 18, 22,26 తేదీల్లో అభ్యర్థుల వ్యయ పరిశీలన ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యయ నోడల్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ విజయ్ భాస్కర్ రెడ్డి, ఏ ఈ ఓ లు, వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు అభ్యర్థుల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని హనుమకొండ రెవిన్యూ కాలనీ, వడ్డేపల్లి పరిధిలో బీఎల్వోలు ఓటర్లకు ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తుండగా ఆయా కాలనీలో కలెక్టర్ పరిశీలించారు. ఓటర్లను వారి ఇళ్ల వద్దకు వెళ్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం కలిశారు. రెవెన్యూ కాలనీలో ఓటరు అయినా సంధ్యారాణి, ఎక్సైజ్ కాలనీ కూరగాయల మార్కెట్ సమీపంలోని సయ్యద్ మజహర్ హుస్సేన్, వడ్డేపల్లి గవర్నమెంట్ స్కూల్ సమీపంలో ఉన్న రమాదేవిలను వారివారి ఇళ్ల వద్దకు వెళ్లి కలెక్టర్ మాట్లాడి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తారు, ప్రతి ఎన్నికల సమయంలో ఓటు వేస్తున్నారా, ఓటరు లిస్ట్ లో ఉన్న వివరాలు, ఓటరు స్లిప్ ఎప్పుడు అందించారనే వివరాలను సంధ్యారాణి, సయ్యద్ మజహర్ హుస్సేన్, రమాదేవిలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆయా ఏరియాలో ఉన్న ఓటర్ల వివరాలను స్థానిక బిఎల్ఓలు సైదా, మౌనిక, జ్యోతిలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఓటర్లకు ఓటు స్లిప్పులను అందిస్తూ వారి సంతకాలను తీసుకుంటున్నట్లు బిఎల్వోలు కలెక్టర్ కు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులు ఉంటే సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఓటర్లకు కలెక్టర్ సూచించారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న ఎన్నికలలో తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు . తాను సీనియర్ సిటిజెన్ అని పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకునే వీలుందా అని అధికారులను సయ్యద్ మజాహార్ హుస్సేన్ అడిగి తెలుసుకున్నారు. తన ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందొ బిఎల్ వో ద్వారా తెలుసుకున్నారు. ఓటరు స్లిప్పులను త్వరగా పంపిణీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, హనుమకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎల్. రమేష్, సివిల్ సప్లై అధికారి ఉమారాణి హనుమకొండ తహశీల్దార్ విజయకుమార్, కృష్ణ, షాజీద్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం నాడు జనరల్ అబ్సర్వర్ డాక్టర్ హెచ్ ఎన్ గోపాలకృష్ణ పరకాల చెక్ పోస్ట్ తనిఖీ చేసి వాహన తనిఖీలు చేసి వాహనాలను నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహారించందంతో పాటు, వాహనాలను క్షుణ్ణముగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలని సూచించారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100 కి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన, ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
అంతకుముందు
గుండెప్పాడ్ ఆత్మకూరు నీరుకుల్లా
క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు సందర్శించి సిబ్బంది కి పలు సూచనలు చేసారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఈనెల 20 21 22వ తేదీల్లో జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో హోమ్ ఓటింగ్ను నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.
హనుమకొండ కలెక్టరేట్లో నీ సమావేశపు హాలులో సెక్టోరియల్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లకు హోమ్ ఓటింగ్ పై అవగాహన సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులు, 80 ఏళ్ల పైబడిన వృద్ధులకు హోమ్ ఓటింగ్ విధానం ద్వారా ఓటును వేసే విధంగా ఈనెల 20,21,22 తేదీల్లో ఓటును వేసేవిధంగా ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. దివ్యాంగులు, 80 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులకు తమ ఇంటి వద్దనే ఓటు వేసుకునేవిధంగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది తో పాటు బి ఎల్ వో లు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తరఫున ఉండే ఏజెంట్లు ఉంటారని, ఈ ప్రక్రియ అంతా వీడియో చేయబడుతుందన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 11 బృందాలు, పరకాల నియోజకవర్గ పరిధిలో ఆరు బృందాలు రెండు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు హోమ్ ఓటింగ్ లో పాల్గొంటాయన్నారు. హోమ్ ఓటింగ్ లో విధులు నిర్వర్తించే అధికారులు,
దివ్యాంగులు, 80 ఏళ్ల వయసు పైబడిన వారి ఇళ్లకు వెళ్లి ఓటు తీసుకునేటప్పుడు అప్రమత్తంగా, పూర్తి పారదర్శకంగా ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సూచించిన అన్ని నియమాలను పాటించాలన్నారు. పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. హోమ్ ఓటింగ్ నిర్వహణలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని తెలియజేసేందుకు హెల్ప్ లైన్ ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. హోమ్ ఓటింగ్ ను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. పట్టణంలో 25 నుంచి 30 ఓట్లు, రూరల్ లో 20 నుంచి 25 వరకు హోమ్ ఓటింగ్ పోలింగ్ ను నిర్వహించాలన్నారు. మూడు రోజులపాటు జరిగే హోమ్ ఓటింగ్ గురించి పోటీల్లో ఉన్న అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు తెలియజేయాలన్నారు. హోమ్ ఓటింగ్ గురించి మీడియా ద్వారా తెలియజెప్పాలని పేర్కొన్నారు. హోమ్ ఓటింగ్ లో పాల్గొనే అధికారులు, సిబ్బంది పోలీసుల సహకారం తీసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో జరిగే రహస్య ఓటింగ్ విధంగానే ఈ హోమ్ ఓటింగ్ లో ఓటు వేసే ఓటర్లు తాము ఓటు వేయాలనుకునే అభ్యర్థులకు ఓటు వేసే విధంగా ఏర్పాట్లు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, అదనపు కలెక్టర్ మహేందర్ జి, వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఎల్. రమేష్, శ్రీనివాస్, ఓం ఓటింగ్ లో పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఉత్సాహవంతమైన యువ ఓటర్స్ కు 19న ఆదివారం క్రికెట్ మ్యాచ్ కార్యక్రమం జెఎన్ఎస్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ట్రైనీ కలెక్టర్ శ్రద్ద శుక్ల తెలిపారు.
శుక్రవారం నాడు ఆమె జెఎన్ఎస్ గ్రౌండ్ లో మ్యాచ్ ఏర్పాట్లు పై అధికారులతో కలసి పరిశీలంచారు. ఓటు హక్కు ప్రాధాన్యత గురించి యువతకు అవగాహన కల్పించే స్వీప్ కార్యక్రమంలో భాగంగా వరంగల్, హనుమకొండ జిల్లాల మద్యనా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ నిర్వహణ ఉదయం 7 నుండి 11 గంటల మధ్య జరుపబడుతుందని తెలిపారు. ఉత్సాహవంతులైన యువ ఓటర్లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు భాగస్వామ్యాన్ని పెంచేందుకు వరంగల్, హనుమకొండ యువ ఓటర్లు, అధికారులుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజలను భాగస్వాములను చేస్తూ ఓటు ప్రాధాన్యతను వివరించడం వరకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు.
.ఈ కార్యక్రమం లో జిఎం ఇండస్ట్రీస్ హరి ప్రసాద్, డిపిఓ జగదీశ్ స్పోర్ట్స్ అధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి:మంథని,నవంబర్16:(మేడిగడ్డటీవీ న్యూస్)పేద్దపల్లి జిల్లా మంథని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు సమీపంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంథని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుదిల్ల శ్రీధర్ బాబుకు సంబంధించి ఓటర్లకు ఇవ్వడానికి సిద్ధం చేసిన శ్రీధర్ బాబు ఫోటోతో గల గోడ గడియారాల డీసీఎం వ్యాన్ ఎఫ్ఎస్టి టీం పట్టుకోగా అందులో శ్రీధర్ బాబు ఫోటోతో ఉన్న 5368 గోడ గడియారాలు వాటి విలువ సుమారు 196000/కలిగి ఉన్న వ్యాన్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్టు రిటర్నింగ్ అధికారి వి హనుమాన్ నాయక్ తెలిపారు,
పెద్దపల్లి:రామగుండం:నవంబర్:16:(మేడిగడ్డటీవీన్యూస్):రామగుండం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి సోమారపు సత్యనారాయణ 45,46 వ డివిజన్ కాకతీయ నగర్,ఎన్టీఆర్ నగర్,ద్వారకానగర్ ఇంటింటి ప్రచారం కొనసాగించారు,మండల అధ్యక్షుడు తుమ్మల చంద్రశేఖర్ గౌడ్,కమల్ గౌడ్,బలికొండ రాకేష్,రేగుల కుమార్,లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము నిర్వహించారు,ఈ బస్తి బాట కార్యక్రమంలో సోమారపు సత్యనారాయణ మాట్లాడరు.ఒకప్పుడు ఈఎన్టీఆర్ నగర్ కాకతీయనగర్ ఏవిధంగా ఉండేదో మీ అందరికి తెలుసు నేను అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రతి గల్లి గల్లికి సిసి రోడ్లు,వీధి దీపాలు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వేసి ఈ కాలనీని సుందరంగా తీర్చిదిద్దానని,24 గంటలు మంచి నీటి సౌకర్యం కల్పించాలని,నేను స్వతంత్ర అభ్యర్తిగా పోటీ చేస్తున్నానని నాకు వజ్రం గుర్తు వచ్చిందని గతంలో నన్ను ఎలా గెలిపించారో మీరు,తిరిగి అసెంబ్లీకి పంపించాలని,ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే.ఇక్కడ ఉన్న యువతి,యువకుల భవిష్యతు బాగుండాలి అంటే, రామగుండం ప్రజలు వజ్రాన్ని గెలిపంచి మరొకసారి అసెంబ్లీకి పంపించాలని తెలిపారు,ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్-లావణ్య,మాజీ మేయర్ రాజమణి,కుసుమ,మాజీ కార్పొరేటర్లు పిడుగు కృష్ణ,కోదాటి ప్రవీణ్,వడ్లూరి రవి,రవి నాయక్,కిషన్ రావు,వీరన్న,పత్తి సంజీవ్,సుభాష్,నారాయణ రెడ్డి,బిక్షపతి దీటి వెంకటస్వామి,చంద్రశేఖర్ గౌడ్,సంపంగి శ్రీనివాసు,కమల్ గౌడ,రాజుడేవిడ్,రాయ మల్లు,రమణారెడ్డి,సురేష్ అడ్వకేట్ సురేష్,రాయాలింగు,పాశంరాజు,వీరేశం,సునిల్,సురెందరు,అరవిందు,కిషోర్,సురేష్,రాకేష్ వాసు,కృప,శ్యామ్ రాజ్,రవి,నిఖిల్,యశ్వంత్,ప్రకాష్,కార్తీక్,వరుణ్,సంపత్,రాజు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
పెద్దపల్లి:గోదావరిఖని,నవంబర్,16,మేడిగడ్డటీవీన్యూస్,రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలదృష్ట్యా,ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ప్రశాంతమైన వాతావరణంలో ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికలు జరిగేందుకు ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా,హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా,ఎన్నికలను ప్రభావితం చేసే,ప్రజలను ప్రలోభాలకు గురిచేసే మద్యం,డబ్బు,వస్తువుల అక్రమ రవాణాకు అవకాశం లేకుండా శాంతియుతంగా జరిగే విధంగా కట్టుదిట్టమైన ముందస్తు భద్రత చర్యలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోనీ పెద్దపల్లి,మంచిర్యాల జోన్ పరిధిలోనీ బస్ స్టాండ్స్,రైల్వే స్టేషన్స్,లాడ్జ్ లను,వాహనాలను ఆకస్మికంగా తనిఖీలు విస్తృతస్థాయిలో వాహన తనిఖీలు నిర్వహించిన,రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి(డిఐజి) ఆదేశాల మేరకు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.ఎన్నికలు ముగిసే వరకు ఈ ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయన్నారు,ఎన్నికల నియమావళి ఉల్లంఘించి అక్రమ రవాణాకు పాల్పడిన,మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నియమాలు అతిక్రమించిన ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.నిష్పక్షపాతంగా,పారదర్శకంగా,ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడడమే పోలీస్ శాఖ పని అన్నారు.ఈ తనిఖీల్లో