ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఈనెల 20 21 22వ తేదీల్లో జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో హోమ్ ఓటింగ్ను నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.
హనుమకొండ కలెక్టరేట్లో నీ సమావేశపు హాలులో సెక్టోరియల్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లకు హోమ్ ఓటింగ్ పై అవగాహన సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులు, 80 ఏళ్ల పైబడిన వృద్ధులకు హోమ్ ఓటింగ్ విధానం ద్వారా ఓటును వేసే విధంగా ఈనెల 20,21,22 తేదీల్లో ఓటును వేసేవిధంగా ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. దివ్యాంగులు, 80 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులకు తమ ఇంటి వద్దనే ఓటు వేసుకునేవిధంగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది తో పాటు బి ఎల్ వో లు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తరఫున ఉండే ఏజెంట్లు ఉంటారని, ఈ ప్రక్రియ అంతా వీడియో చేయబడుతుందన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 11 బృందాలు, పరకాల నియోజకవర్గ పరిధిలో ఆరు బృందాలు రెండు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు హోమ్ ఓటింగ్ లో పాల్గొంటాయన్నారు. హోమ్ ఓటింగ్ లో విధులు నిర్వర్తించే అధికారులు,
దివ్యాంగులు, 80 ఏళ్ల వయసు పైబడిన వారి ఇళ్లకు వెళ్లి ఓటు తీసుకునేటప్పుడు అప్రమత్తంగా, పూర్తి పారదర్శకంగా ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సూచించిన అన్ని నియమాలను పాటించాలన్నారు. పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. హోమ్ ఓటింగ్ నిర్వహణలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని తెలియజేసేందుకు హెల్ప్ లైన్ ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. హోమ్ ఓటింగ్ ను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. పట్టణంలో 25 నుంచి 30 ఓట్లు, రూరల్ లో 20 నుంచి 25 వరకు హోమ్ ఓటింగ్ పోలింగ్ ను నిర్వహించాలన్నారు. మూడు రోజులపాటు జరిగే హోమ్ ఓటింగ్ గురించి పోటీల్లో ఉన్న అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు తెలియజేయాలన్నారు. హోమ్ ఓటింగ్ గురించి మీడియా ద్వారా తెలియజెప్పాలని పేర్కొన్నారు. హోమ్ ఓటింగ్ లో పాల్గొనే అధికారులు, సిబ్బంది పోలీసుల సహకారం తీసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో జరిగే రహస్య ఓటింగ్ విధంగానే ఈ హోమ్ ఓటింగ్ లో ఓటు వేసే ఓటర్లు తాము ఓటు వేయాలనుకునే అభ్యర్థులకు ఓటు వేసే విధంగా ఏర్పాట్లు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, అదనపు కలెక్టర్ మహేందర్ జి, వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఎల్. రమేష్, శ్రీనివాస్, ఓం ఓటింగ్ లో పాల్గొన్నారు.
Post A Comment: