ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఎన్నికల విధులలో పాల్గొంటున్న ఉద్యోగులకు ఈ నెల 29వ తేదీ వరకూ హనుమకొండ, పరకాలలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆ రెండు చోట్ల ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం తెలిపారు.హనుమకొండలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హనుమకొండ జిల్లాకు సంబంధించిన వారికి ఒక ఫెసిలిటేషన్ సెంటర్, ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులకు మరొక ఫెసిలిటేషన్ సెంటర్, పోలీసు ఉద్యోగులు ఓటు వేసేందుకు మరొక ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరకాల నియోజకవర్గానికి సంబంధించి పరకాల లోని తహశీల్దార్ కార్యాలయంలో ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా అత్యవసర సర్వీసుల ఉద్యోగులకు పోస్టల్ ఓటింగ్ సెంటర్ ను ఈనెల 24,25, 26 తేదీల్లో హనుమకొండలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో, పరకాలలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. ఆదివారం కూడా ఫెసిలిటేషన్ సెంటర్లు పనిచేస్తాయని, ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు.
Post A Comment: