ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఎన్నికల విధులలో పోలీసుల బాధ్యతలు కీలకమని జనరల్ అబ్జర్వర్ డాక్టర్ హెచ్.ఎన్ గోపాలకృష్ణ అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఈనెల 30వ తేదీన జరగనున్న ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు జనరల్ ఎన్నికల పరిశీలకులు గోపాలకృష్ణ, ఎన్నికల వ్యయ పరిశీలకులు రాహుల్ పంజాబ్ రావు గావాండే, పోలీస్ అబ్జర్వర్ తోగో కర్గా, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా లతో కలిసి జిల్లా పోలీస్ అధికారులతో శుక్రవారం సాయంత్రం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్నికల జనరల్ అబ్జర్వర్ డాక్టర్ హెచ్. ఎన్. గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ పక్కాగా అమలు చేయాలన్నారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత పటిష్టంగా ఉండాలన్నారు. ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా చూసుకోవాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఉంటుందన్నారు. ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చేటప్పుడు, పోలింగ్ అనంతరం స్ట్రాంగ్ రూములకు తరలించేటప్పుడు కట్టుదిట్టమైన భద్రత ఉండాలన్నారు. ఈనెల 29 30వ తేదీల్లో పోలీసు అధికారులు, సిబ్బంది పాత్ర కీలకమన్నారు. ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులకు సంబంధించి పలు అంశాలపై పోలీస్ అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఎం. ఏ.బారి, ఈస్ట్ జోన్ డిసిపి రవీందర్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: