పెద్దపల్లి,కమాన్ పూర్,నవంబర్ నవంబర్,28:మేడిగడ్డటీవీన్యూస్:మంథనినియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ గెలుపే ధ్యేయంగా ప్రతిఒక్కరు పనిచేయాలి,కుల సంఘాల నాయకుల విజ్ఞప్తి,బారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహేబ్ అంబేద్కర్,జ్యోతిరావ్‌పూలేలాంటి మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న బహుజన బిడ్డ పుట్ట మధుకర్ ను మంథని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనఅందరిపై ఉందని కులసంఘాల నాయకులు పేర్కొన్నారు.మంగళవారం కమాన్‌పూర్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు,బహుజన బిడ్డ పుట్ట మధన్నను ఎమ్మెల్యేగా గెలిపించుకుని అసెంబ్లీకి పంపిస్తే బీసీ,ఎస్సీ ఎస్టీ మైనార్టీల గొంతుకై మన సమస్యలు విన్నవిస్తారని అన్నారు.బీసీ బిడ్డగా ఈస్థాయికి ఎదిగి మన ఆత్మగౌరవం కాపాడేందుకు పోరాటం చేస్తుంటే కుట్రలు చేస్తున్నారని,ఆకుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పుట్ట మధుకు మద్దతు తెలుపుతున్నట్లు వారు వివరించారు.ఈనాడు మంథని నియోజకవర్గంలో మహనీయుల విగ్రహాలు పెట్టిన చరిత్ర పుట్ట మధూకర్‌కే దక్కుతుందన్నారు.ఎన్నికల ప్రచార రథానికి అంబేద్కర్ ఫోటో పెట్టుకున్న గొప్ప నాయకుడని అన్నారు.బహుజనుల ఓట్లు చీల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని,బీసీలంతా అప్రమత్తంగా ఉండి మన ఓటుహక్కును సద్వనియోగం చేసుకోవాలని,పుట్ట మధు ఎమ్మెల్యేగా గెలిస్తే బలహీనవర్గాలకు మేలు జరుగుతుందని వారు అన్నారు.ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటువేసి పుట్ట మధుకర్ బారీ మెజార్టీతో గెలిపించుకోవాలని వారు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి శంకర్,తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుక్క చంద్రమౌళి,బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు పొన్నం నవీన్ కుమార్,ఉపాధ్యక్షుడు తోట రాజ్ కుమార్,నాయకులు కమ్మగొని చలమయ్య గౌడ్,ఆకుల రమేష్,గసిగంటి అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: