పెద్దపల్లి:కమాన్ పూర్:నవంబర్:28:మేడిగడ్డటీవీన్యూస్:మంథని నియోజకవర్గ ప్రజా సంక్షేమ ప్రజా అభివృద్ధి ప్రదాత అని...నిన్నటి వరకు పుట్ట మధుకర్ మంచోడంటూ...ప్రజల కోసం పరితపించే నాయకుడని పొగిడిన పగటి వేషగాడు!.బాస్కర్‌రావుకు పార్టీ మారగానే చెడ్డోడిగా కన్పిస్తున్నాడా అని కమాన్‌పూర్ మండల బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడరు.బాస్కర్‌రావు కాంగ్రెస్ పార్టీలో చేరి పుట్ట మదు అభివృద్ది చేయలేదంటూ మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు.జెడ్పీ చైర్మన్‌గా కమాన్‌పూర్ అభివృధ్దికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, కాంగ్రెస్ నాయకులు కూర్చుండి మాట్లాడిన బస్టాండ్ సమీపంలోని డబుల్ రోడ్డు మధన్న వేయించింది కాదా అని వారు అన్నారు.కమాన్‌పూర్ మండలంలో అనేక అభివృధ్ది పనులు చేసిన.కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదని,కళ్లున్న కబోదులు కాంగ్రెస్ నాయకులు అన్నారు. పార్టీ మారితే ఎదుటివారిని దూషించడం బాస్కర్‌రావుకు అలవాటేనని ఆనాడు కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీధర్‌బాబుపై దుమ్మెత్తిపోసిన విషయాన్ని వాళ్లు గుర్తుచేశారు.మళ్లీ ఈనాడు ఆపార్టీ,ఆ నాయకుడి పంచనే చేరి అక్కున చేర్చుకుని పదవి ఇచ్చి గౌరవించిన పుట్ట మధన్న ఏం అభివృధ్ది చేయలేదని మాట్లాడటం సిగ్గు చేటన్నారు.పార్టీ ప్రచారాలు చేసుకుంటే తాము అధికారంలోకి వస్తే అభివృధ్ది చేశామని,ఇప్పటి వరకు చేసిన అభివృధ్దిని చెప్పుకుంటారే కానీ అభివృధ్ది చేసిన నాయకుడిపై బురదజల్లే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు.అలాగే కమాన్‌పూర్ మండలంలోని ప్రసిద్దిగాంచిన ఆదివరహస్వామి ఆలయం గత పాలకుల హయాంలో ఎలా ఉండే ఇప్పుడు ఎంత అభివృధ్ది చెందిందో,అన్ని సౌకర్యాలు ఎవరు కల్పించారో అందరికి తెలుసునన్నారు.రూ.2.50కోట్లతో సీసీ రోడ్లు,ప్రభుత్వ ఆస్పత్రిలో వెయిటింగ్ హాల్ నిర్మాణాలు చేసింది పుట్ట మధన్న కాదా అన్నారు.మంథని ఎమ్మెల్యేగా పుట్ట మదును నిర్ణయించారని,కాంగ్రెస్సోళ్లు ఎన్నిప్రలోభాలకు గురి చేసినా మధన్ననే గెలిపించుకుంటామని ప్రజలు తీర్మాణాలు చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక మధన్నపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.ఆదివరహస్వామి ఆలయ అభివృధ్దికి ఫారిన్ నుంచి ఫండ్ వస్తుందని,అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణల్లో వాస్తవం లేదని,ఆలయ ఆదాయ వ్యయాలకు సంబంధించిన రికార్డులు ఉంటాయని వివరించారు.అన్ని విధాలుగా ఆలయం అభివృధ్ది చెందుతుంటే కాంగ్రెస్ నాయకులకు కన్పించడం లేదా అని వారు విమర్శించారు.చట్టనికి విరుద్దంగా బాస్కర్ రావు సింగిల్ విండో కార్యాలయం పేరుమీద 251సర్వేనంబర్‌లోని భూమిని రిజస్ట్రేషన్ చేయించారని,గుంటకు రూ.4.50లక్షలతో కొనుగోలు చేశారని తెలిపారు.అయితే పక్కనే ఉన్న మరో సర్వేనంబర్‌ని ఎకరం భూమిని రూ.28లక్షలకు సదరు యజమాని అమ్మారని,ఈ లెక్కన బాస్కర్‌రావు నాలుగు రెట్లు ఎక్కువ ధర చెల్లించి డబ్బులు డ్రా చేసినట్లు వారు వివరించారు.అలాంటి వ్యక్తి ఈనాడు పుట్ట మధన్నపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటువేసి పుట్ట మధుకర్ ను బారీ మెజార్టీతో గెలిపించుకోవాలని వారు కోరారు.ఈసమావేశంలో కమాన్ పూర్ బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి,బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇనగంటి రామారావు,నీలం శ్రీనివాస్,గప కృష్ణమూర్తి,సర్పంచులు బొల్లపల్లి శంకర్ గౌడ్,తాటికొండ శంకర్,మండల కోఆప్షన్ మెంబర్ ఎండీ.ఇంతియాజ్,బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు బొమ్మగాని అనిల్ గౌడ్,నాయకులు మేకల సంపత్ యాదవ్,కొట్టే భూమయ్య,జాబు సతీశ్,మేడగొని విజయ్ గౌడ్,ఇనగంటి శ్రవణ్,ఆకుల రమేష్,వరాల ఎల్లయ్య,దండే రమేష్ ఠాగూర్,కుక్క చంద్రమౌళి,వెంగలి రాజయ్య,గొడిశెల స్వామి,గడ్డం ప్రకాష్,గసిగంటి అజయ్,కమ్మగోని అనిల్,భూంపల్లి కుమార స్వామి,సింగం శ్రీనివాస్,జంగపల్లి రవి,చొప్పరి శ్రీనివాస్,చెన్నూరి అబ్బిలాశ్,దండే ప్రదీప్, తోట రాజ్ కుమార్,జమాల్ పూరి శ్యామ్ లాల్,ఎంఏ సత్తార్,శేఖర్,సాయిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: