పెద్దపల్లి,నవంబర్,17,(వమేడిగడ్డటీవీన్యూస్)వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చే పేషెంట్ లతో,వారిసహాయకులతో ఆసుపత్రిలోని వైద్యులు,సిబ్బంది సానుకూలంగా స్పందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు.శుక్రవారం కలెక్టర్ పెద్దపల్లిలోని మాతా,శిశు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి.ఆసుపత్రిలో ఉన్న వివిధ బ్లాక్ లను పరిశీలించిన కలెక్టర్,పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా మెరుగైన వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రులు అందిస్తున్నాయని కలెక్టర్ అన్నారు.ఆసుపత్రికి వచ్చే పేషెంట్ లు,వారి సహాయకులతో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సానుకూలంగా స్పందించాలని,వారితో ఓపికగా వ్యవహరించాలని,మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేయాలని అన్నారు.ఆసుపత్రికి వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని,ఉదయం 9 గంటలవరకు ఆసుపత్రిలో ఓపి సేవలు ప్రారంభం కావాలని,ఆసుపత్రి సిబ్బందికి బయోమెట్రిక్ విధానంద్వారా హాజరు నమోదు చేయాలని,ఆసుపత్రిలో మొదటి కాన్పుజరిగే మహిళలకు సాధారణ ప్రసవం జరిగే విధంగా ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని,అత్యవసర పరిస్థితులలో మాత్రమే మొదటి కాన్పులో సిజేరియన్ చేయాలని కలెక్టర్ తెలిపారు.ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్ పెండింగ్ లో ఉన్న ఆప్తమాలజీ ఆపరేషన్ థియేటర్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని టిఎస్ఈ.ఎండిసిఈఈ ను చరవాణిలో కలెక్టర్ ఆదేశించారు.ఆసుపత్రిలో ఫార్మసీ స్టోర్ ఏర్పాటు చేయడానికి అవసరమైన అంచనాలు తయారు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ తనిఖీలో కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్,డాక్టర్ శౌరయ్య,సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: