జుక్కల్ నియోజకవర్గం:

గత కొన్ని రోజులుగా మారిపోయిన రాజకీయ సమీకరణాలు ఎందుకంటే ప్రజలు బిజెపి వైపు మోగ్గు చూపెడుతున్నారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు జుక్కల్ నియోజకవర్గం లో కూడా మార్పు వైపు ప్రజలు ఆసక్తి చూపెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడి ప్రజలు అభివృద్ధికి నోచుకోలేదు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే 15 సంవత్సరాలుగా ఉన్న ప్రజలను ఇక్కడున్న సమస్యలను పరిష్కరించ లేదు అని నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకు ఇప్పటికీ సరైన రోడ్డు మార్గం లేదు ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. దానికి నిదర్శనమే ప్రతి గ్రామంలో ప్రచారానికి వెళ్లినప్పుడు అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఈ విధంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే పై ఇసుక కుంభకోణం, దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ లాంటి పథకాలలో తీవ్ర వ్యతిరేకతతో షెడ్యూల్ కులాల సామాజిక వర్గం ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే పక్కనే ఉన్న నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ అభివృద్ధి చాలా తక్కువగా ఉండడం కూడా దీనికి కారణం ఈ విధంగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పై నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనితో పాటు ప్రతి  గ్రామంలో అడ్డగోలుగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి కుటుంబాల మధ్య గ్రామీణ జీవన పద్ధతిని మహిళల జీవితాలను నాశనం చేస్తున్నారు అయినా ఇక్కడి నాయకులు కానీ పోలీసు సిబ్బంది గాని పట్టించుకోకపోవడంతో 'ఒక మహిళ నాయకురాలు వస్తే తమ సమస్యకి పరిష్కారం లభిస్తుందని ఇక్కడి మహిళలు సైతం ఆలోచన చేస్తున్నారు. దానికి నిదర్శనమే ప్రతి గ్రామంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన అరుణతార గారు ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రతి గ్రామంలో మహిళలు చూపెట్టిన అభిమానం మన కళ్ళ ముందు కనిపిస్తున్నది'.   అలాగే గతంలో కూడా వారు చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికీ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కళ్లకు కట్టినట్టు కల్పిస్తున్నాయి. ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకు రోడ్డు నిర్మాణాలు ఇప్పటికీ చెక్కుచెదకుండా కనిపిస్తున్నాయి. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని నిజాయితీగల అభ్యర్థి ఎన్నుకోవడంలో ఈసారి జుక్కల్ నియోజకవర్గం ప్రజలు వెనకడుగు వేయడం లేదు. అలాగే ఎస్సీ వర్గీకరణ విశ్వరూప మాదిగల సభ తర్వాత ఆ సామాజిక వర్గంలో కూడా సానుకూల వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే జుక్కల్ నియోజకవర్గం లో ఎస్సీ అది మాదిగల జనాభా కూడా అధికంగా ఉండడం బిజెపికి ఒక మంచి అవకాశం మరియు అరుణతార గారు కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ప్రజలు ఆమె వైపు మోగ్గు చూపిస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ వ్యతిరేక ఓటును బిజెపి తీసుకోవడంలో ముందంజలో ఉంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నాలుగు సార్లు గెలిచినప్పటికీ ఏలాంటి అభివృద్ధి లేదు. అయినా ఇక్కడి నియోజకవర్గం ప్రజలను కాదని ఎవరో కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇవ్వడంతో ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కాంగ్రెస్ వెంట లేరు. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపక పోవడానికి కారణం ఈ నియోజకవర్గ సరిహద్దు ప్రాంతంలో కర్ణాటక ఉంది అక్కడ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఇక్కడికి ప్రజలు అలాంటి ప్రభుత్వాన్ని కలలో కూడా ఊహించలేరు. అందుకే ప్రజలు బిజెపి వైపు అడుగులు వేస్తున్నారు. బిజెపి ఈ నియోజకవర్గంలో గెలవడానికి ముఖ్యమైన కారణం ఎక్కువ ఓటర్లు మహిళలు ఉండడం, మహిళా అభ్యర్థి మరియు విద్యావంతురాలు అహంకారం లేని నాయకురాలు అలాగే యువకులు అధిక సంఖ్యలో మోడీ నాయకత్వంలో బిజెపి వైపు ఆసక్తి చూపెడుతున్నారు. ఈ నియోజకవర్గం మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉంది కాబట్టి ఇక్కడి సాంప్రదాయాలు, ధర్మం పట్ల శ్రద్ధ, స్వామీజీలతో అధిక సన్నిహితం ఉండడం, వివిధ పార్టీలు ముస్లిం డిక్లరేషన్ పై కూడా ఇక్కడి హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెక్యులర్ అనే ముసుగులో వివిధ పార్టీలు చేస్తున్న  వాగ్దానాలు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ గ్రామీణ స్థాయి వరకు అందరూ గమనిస్తున్నారు.  కావున ఈ ఎన్నికల్లో అది బిజెపికి ఓటు బ్యాంకింగ్ మారే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే డిసెంబర్ 3వ తేదీన ఉదయించేది అరుణ తరానే జుక్కల్ గడ్డపై ఎగిరేది కాషాయ జెండానే అని ఇక్కడి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.





కె నాగరాజ్,

M.A జర్నలిజం,

న్యాయవాద విద్యార్థి.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: