ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఈనెల 30వ తేదీన జరగనున్న ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాహుల్ పంజాబ్రావ్ గావాండే అధికారులకు సూచించారు. వరంగల్ ఎన్ ఐ టీ లో ఎన్నికల అధికారులతో గురువారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాహుల్ పంజాబ్రావ్ గవాండే మాట్లాడుతూ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఖర్చు చేస్తున్న వ్యయాన్ని నిశితంగా పరిశీలించాలన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల వ్యయం రూ. 40 లక్షలకు మించకుండా చూసుకోవాలని, అంతకుమించి ఖర్చు చేసినట్లయితే అనర్హతకు గురవుతారని ఇదే విషయాన్ని అభ్యర్థులకు తెలియజేయాలన్నారు. అభ్యర్థులు భారత ఎన్నికల సంఘం సూచించిన ప్రకారం వ్యయపరిమితి ఉండాలని తెలియజేశారు. ఎవరైనా ఇప్పటివరకు ఏ బ్యాంకు నుంచైనా 10 లక్షల ను విత్ డ్రా చేశారా అని అధికారులను అడిగారు. ఇప్పటివరకు అలా జరగలేదని అధికారులు వివరణ ఇచ్చారు. ఎన్నికలలో మద్యం పంపిణీ నియంత్రణ కు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా డబ్బులు గానీ, గిఫ్టులు గాని పంపిణీ చేసినట్లయితే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డి సి ఓ నాగేశ్వర్ రావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆదాయపన్ను శాఖ అధికారి చక్రధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: