June 2023
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

సింగరేణి ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్లో 40 సంవత్సరాల సర్వీస్ నింపుకొని పదవీ విరమణ చేస్తున్న రాజ్ కుమార్ ను మరియు శ్రీనివాస్ ను ఘనంగా సన్మానం చేసిన డీజిఎం హనుమంతు ముఖేష్

సింగరేణి ఎక్స్ప్లోనేషన్లో 45 సంవత్సరాల క్రితం నుండి సింగరేణిలో పని చేస్తూ సింగరేణి సంస్థలు అభివృద్ధి పథంలో నడిపిన రాజ్ కుమార్ శ్రీనివాసులను సింగరేణి ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ డీజీఎం హనుమంతు ముఖేష్ సుభాష్ లు రాజ్ కుమార్ శ్రీనివాసులను శాల్వాలతో సత్కరించారు ఈ సందర్భంగా సింగరేణి అధికారులుమాట్లాడుతూ వారు సింగరేణికి చేసిన సేవలు మరిచిపోలేనివని వారు పదవీ విరమణ పొందుతున్నందుకు ఆనందంగానూ మరియు బాధగాను ఉందని మాతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను మేము ఎప్పుడూ మర్చిపోలేము అని ఈ సందర్భంగా తెలిపారు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని పిల్లలతో సంతోషంగా గడపాలని వారు కోరారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

అంతర్గాం మండలం మురుమూరు గ్రామంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెస్ రాజ్ ఠాగూర్ గారి ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అధ్యక్షులు హనుమాన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పాత్రికేయ సమావేశంలో హాజరైన మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం మాట్లాడుతూ ఎల్లంపల్లి భూనిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా అన్యాయం చేస్తూ దశాబ్ది ఉత్సవాల పేరుతో మాటలకే పరిమితం అవుతూ చేతల్లో ఏ ఒక్క అభివృద్ధి పని చేయకుండా మురుమూరు గ్రామానికి దశాబ్ది ఉత్సవాల పేరుతో వచ్చిన శాసనసభ్యుల్ని ప్రజలు నిలదీస్తే ప్రశ్నించే గొంతుకులను అణిచివేస్తూ అహంకార పూరిత మాటలు అనడం సబబు కాదని అధికారం శాశ్వతం కాదని రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు*ఈ పాత్రికేయ సమావేశంలో హాజరైన కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ఏ ఒక్క ఆకాంక్ష నెరవేర్చకుండా మళ్లీ అధికారమే లక్ష్యంగా కల్లబొల్లి మాటలతో దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ నిన్న మొరుమూరు గ్రామానికి వచ్చిన స్థానిక శాసనసభ్యులు చందర్ ని ప్రజలు నిలదీస్తే సమాధానం చెప్పకుండా అసహనానికి లోనై బెదిరింపు చర్యలు చేయడం సరికాదని ఆర్ ఎఫ్ సి ఎల్ ఉద్యోగ బాధితులకు న్యాయం చేస్తానని అఖిలపక్షం పేరుతో కాలయాపన చేసి మళ్లీ ఇప్పుడు చేతులెత్తేయడం నీ చిత్తశుద్ధికి నిదర్శనమని ఇప్పటికైనా బాధితులకు బాసటగా నిలవాల్సిన బాధ్యత నీపై ఉందని లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీ బిడ్డలను మోసం చేయడానికి గొర్రెలు బర్రెలు లోన్ లో పేరుతో మరోసారి కొత్త నాటకానికి తెర లేపుతున్న అధికార పార్టీకి ప్రజలే బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు*ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాజీ ఎంపీపీ రాజలింగం తో పాటు ఇన్చార్జ్ మండల అధ్యక్షులు హనుమాన్ రెడ్డి మాజీ సర్పంచ్ గుంట బాబు మడ్డి తిరుపతి గౌడ్ బరుపాటి శ్రీనివాస్ ఎనగందుల శ్రీకాంత్ గొర్రె చందు సంఘన వేణు శేఖర్ రమేష్ గౌడ్ ఎలుగంటి లింగన్న సురేష్ రాజనర్సు జూపాక నారాయణ మిడిగొండ లింగన్న పన్నాల తిరుపతి ఊరేటి మహేష్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

బీఎస్పీ పార్టీ లో చేరిన రామగుండం బీజేపీ సీనియర్ నాయకుడు విజయగిరి రాము

బీఎస్పీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ గోలివాడ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో రామగుండం కార్పోరేషన్ ఎన్టీపీసీ ఏరియా కు చెందిన *బీజేపీ సీనియర్ నాయకుడు విజయగిరి రాము*ను బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు , సీయం అభ్యర్థి డాక్టర్ ఆర్.ఎస్.‌ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ లోని తన స్వగృహంలో బీఎస్పీ పార్టీ కండువా కప్పి  పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ" బీసీ లకు బీఎస్పీ పార్టీ పెద్దపీట వేస్తుందని, పార్టీలో బీసీలకు సముచిత గౌరవం ఉంటుందని, రామగుండం నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీని బలోపేతం చేయాలని" అన్నారు.  ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర నాయకులు దేవునూరి సంపత్ కుమార్, రవికిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

బహుజన సమాజ్ పార్టీ నాయకులు వేమునూరులో గ్రామంలో గ్రామ పెద్దలు సీనియర్ నాయకులతో గ్రామ సభ నిర్వహించడం జరిగినది,

ఈ సభ ముఖ్య ఉద్దేశ్యం నేటి అధికార పార్టీలు రైతుల పట్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లేక సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు నేటి అధికార ప్రతినిధులు వారి వారి స్వంత ప్రలోభాలతో రాజకీయాల్లోకి వచ్చి ప్రజల ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని డబ్బు ఆశ కల్పించి ఓట్లను కొని గద్దె పైన కూర్చోని 5 సంవత్సరాల కాలంలో ఏనాడూ రైతులను, నిరుద్యోగులను పట్టించుకోకుండా ఇంతవరకు కాలయాపన చేస్తూ రామగుండం నియోజకవర్గంలో అన్ని రకాల సమస్యల వలయంగా సృష్టించి అధికార పార్టీలు లీడర్స్ ఎవరికి వారే లాభ పడినారు, ఇదేవిధంగా నేడు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది? కావున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో అనుక్షణం పేద ప్రజలకు రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగుల కోసం పాటు పడుతూ.. తన ఐ పి ఎస్ ఉద్యోగాన్ని త్రునప్రాయంగా వదులుకుని బహుజన రాజ్యాధికారం కోసం పాటు పడుతున్నా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేయాలి ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని గ్రామ పెద్దలకు తెలియ పరుస్తూ అవగాహన కల్పించారు   

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రెటరీ ఇరికిల్ల రాజనర్సయ్య ఈదునూరి ధర్మరాజు పెద్దపెల్లి జిల్లా ఈసీ మెంబర్ మరియు రామగుండం అసెంబ్లీ ఇంచార్జ్ జింక ఉదయ్ పాలకుర్తి మండల్ అధ్యక్షులు ఈదునూరి శ్యామ్ మాజీ ఉపసర్పంచ్ ముల్కల లక్ష్మణ్ ముల్కల నారాయణ చిలుక శ్రీను గుల్కాల సతీష్ తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్ 

మహాదేవపూర్: మండల కేంద్రంలో ఈరోజు ప్రియతమ నాయకులు ఏఐసీసీ కార్యదర్శి, మంథని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు, మాజీ ప్రధాని,మాజీ ఏఐసీసీ అధ్యక్షులు స్వర్గీయ పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని, మహాదేవపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షులు కోట రాజబాపు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్బర్ ఖాన్   మాట్లాడుతూ, మంథని నియోజకవర్గానికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, దేశ ప్రధాన మంత్రిగా పదవులు చేపట్టారు. ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించడం జరిగిందని, దేశ ప్రధానిగా వారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు ఈ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాయని, ప్రపంచ దేశాలు ఆర్థిక మాధ్యంలో కొట్టుమిట్టాడుతుంటే, భారతదేశం బలంగా నిలబడడానికి కారణం  ఆయన తీసుకున్నటువంటి సంస్కరణలని వారు కొనియాడారు, 13 భాషలు మాట్లాడగల బహుభాషా కోవిదులని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నాయకత్వంలో వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్పిటీసీ గుడాల అరుణ శ్రీనివాస్,  మైనారిటీ సెల్ అధ్యక్షులు అస్రార్ ఖురేషి, కాంగ్రేస్ సీనీయర్ నాయకులు  కోట సమ్మయ్య, రాంమోహన్,  ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు రంజిత్, మహిళ కాంగ్రేస్ నాయకురాలు జనని, యూత్ కాంగ్రేస్ నాయకులు క్రిష్ణ మోహన్, ముఖీధ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

పాలకుర్తి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాలు, పట్నాల కార్యక్రమానికి గౌడ సంఘం ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర బిజేపి పార్టి మహిళ మోర్ఛ కార్యవర్గ సభ్యురాలు, బిజేపి రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ విచ్చేయడం జరిగింది. ఈ సంధర్బంగా గౌడ సంఘం పెద్దలు వారిని శాలువాతో సన్మానించడం జరిగింది, ఈ కార్యక్రమంలో కుల పెద్దలు, బిజేపి పార్టి పాలకుర్తి మండల అధ్యక్షులు పత్తి సంజీవ్ , ప్రధాన కార్యదర్శి బాలసాని మల్లేష్ గారు కిసాన్ మోర్చ అధ్యక్షులు మాదసు రాజేశం , బిజేపి సీనియర్ నాయకులు డా. బ్రహ్మం గుర్రం సతీష్ అంకం శ్రీనివాస్, తోట మహేష్, బాలసాని శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

అంతర్గాం మండల పరిధిలోని పెద్దంపేట్ గ్రామంలో పేదలు, రైతులు సాగు చేసుకుంటున్న ఖుర్షికమ్ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అనేక సంవత్సరాలుగా సీపీఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పోరాటాలు చేసి ప్రభుత్వా అదికార్లను,ప్రజా ప్రతినిధులను కల్సి అనేక సందర్భాలలో వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది.

పెద్దంపేట్ గ్రామంలో గత 70 ఏళ్ళనుండి అక్కడి పేద రైతులు సాగు చేసుకుంటున్న ఖుర్షికమ్మి భూములకు తక్షణమే పట్టాలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చేసిన విజ్ఞప్తుల ఫలితంగా స్థానిక రామగుండం నియోజకవర్గ *ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మరియు సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి కే రాజన్న,పెద్దంపేట్ వార్డు మెంబర్ కుమార్ సిరికొండ కృష్ణ*లు *రాష్ట్ర ప్రభుత్వ రెవిన్యూ ప్రిన్సిపుల్ సెక్రటరీ శ్రీ నవీన్ మిట్టల్ ను ఈ రోజు కలవడం జరిగింది. త్వరలోనే ఖుర్షికమ్ భూములకు పట్టాలు ఇస్తానని *రాష్ట్ర ప్రభుత్వ రెవిన్యూ ప్రిన్సిపుల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ హామీ ఇచ్చారని తెలిపారు 

ఎన్నో సంవత్సరాల గా ఎన్నో ఆశలతో ఎదిరి చూస్తున్న పెద్దంపేట్ గ్రామ పేద ప్రజల ఆశలు నెరవేరుతాయని *సీపీఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా*కార్యదర్శి కే రాజన్న*తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

హైదరాబాద్ : ప్రశ్నించే గొంతులను కాపాడుకోవల్సిన బాధ్యత పౌర సమాజంపై ఉందని సుప్రసిద్ధ పాత్రికేయులు, మేధావులు, ప్రజా సంఘాల బాధ్యులు పిలుపునిచ్చారు. కిరాయిరాతలతో జర్నలిజాన్ని శాసించేందుకు ప్రయత్నిస్తున్న ట్రోల్ ముఠాలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ , హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ , హైదరాబాద్ ప్రెస్ క్లబ్, నెట్ వర్క్ ఆఫ్ ఒమెన్ ఇన్ మీడియా, తెలంగాణ స్టేట్ స్మాల్ అండ్ మీడియం పేపర్స్, మేగ్ జైన్స్ అసోసియేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిజం - ట్రోల్ ముఠాలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. టియుడబ్ల్యూజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్వతంత్ర జర్నలిస్ట్ తులసీ చందు, ఏపి ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, సుప్రసిద్ధ పాత్రికేయులు డాక్టర్ కె. రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ వేణుగోపాల్, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, సి. వనజ, ఓయూ జర్నలిజం విభాగం మాజీ అధిపతి ప్రోఫెసర్ పద్మజా షా, సీనియర్ సంపాదకులు కె. శ్రీనివాస్, వీక్షణం సంపాదకులు ఎన్. వేణుగోపాల్ , సామాజిక కార్యకర్త సజయ, మహిళ సంఘం నాయకురాలు వి. సంధ్య, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ మిత్రలతో పాటు దాదాపు 200మంది ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా స్వతంత్ర జర్నలిస్టు తులసీ చందుకు సమావేశం సంఘీభావం ప్రకటించింది. ప్రశ్నించే గొంతుకలపై జరుగుతున్న దాడులు, అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవస్సిందిగా తెలంగాణ డిజిపిని కలిసి వినతిపత్రం సమర్పిద్దామని సమావేశంలో తీర్మాణించారు. అలాగే 39 పౌర, ప్రజా సంఘాలతో కూడిన ఐక్య వేదికగా సోషల్ ప్లాట్ ఫాంగా ఏర్పడదామని తీర్మాణించారు. ఈ సందర్భంగా టియూడబ్ల్యూజె నేత విరాహత్ అలీ మాట్లాడుతూ.. కిరాయిరాతలతో మీడియాను భయపెట్టే ముఠాలకు ఎలా సమాధానం చెప్పాలో తెలుసునన్నారు. సోషల్ మీడియా వేదికగా కొన్ని ముఠాలు రెచ్చిపోతున్నాయని అన్నారు. ఉన్నది ఉన్నట్లు వార్తలను రాస్తే గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన తెలిపారు. స్వతంత్ర జర్నలిస్టు తులసీ చందు మీద సోషల్ మీడియాలో జరుగుతున్న దాడిని మీడియా మొత్తం మీద జరిగనట్లుగా భావించి ఆమెకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. 

యాంటీ హిందూ అనే నిందమోపారు - తులసీ చందు

జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో మతం వస్తుంది మేలుకో అనే వీడియో చేసినందుకు తనపై యాంటీ హిందూ అనే ముద్ర వేశారని స్వతంత్ర జర్నలిస్టు తులసీ చందు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను చెప్పడానికే తాము ఉన్నామన్నారు. ఈ మధ్య తాను పెట్టిన నాన్ కంటెంట్ సబ్జెక్టు మీద ఫేస్ బుక్ లో ఎటాక్ జరిగిందన్నారు. తాను ఏ వార్తను సృష్టించలేదని, అయినప్పటికీ తనను శత్రువుగా, అర్బన్ నక్సలైట్, కమ్యూనిక్రుస్టు అని వ్యంగంగా చిత్రీకరిస్తున్నారని చెప్పారు. ప్రశ్నించే గొంతులపై దాడులు చేసేవారి వెనుకఉన్న వారెవరో ఆరా తీయాల్సిన అవసరం ఉందన్నారు. తనపై దాడులకు పాల్పడి నాలుగైదు యూట్యూబ్ ఛానల్స్ పై కేసు పెట్టినట్లు ఆమె చెప్పారు. ట్రోలింగ్ ముఠాలను అడ్డుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. బీజేపీ నేతలను, ప్రధానమంత్రిని ప్రశ్నించే వారిపై నేరుగా దాడులు చేయాలని పెద్ద వ్యవస్థను పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు.

వ్యవస్థీకృత స్థాయిలో ట్రోలింగ్ ముఠాలు - కె.రామచంద్రమూర్తి

వ్యవస్థీకృత స్థాయిలో ట్రోలింగ్ ముఠాలు తయారయ్యాయని సుప్రసిద్ధ జర్నలిస్టు డాక్టర్ కె. రామచంద్రమూర్తి అన్నారు. నిజం చెప్పేవారిని భయపెడుతున్నారని ఆయన తెలిపారు. మోడీ, కేసీఆర్ అంటూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా పాపులారిటీ బాగా పెరిగిందన్నారు. కర్నాటక ఎన్నికల్లో సోషల్ మీడియా బాగా పనిచేసిందన్నారు. 

ఇండిపెండెంట్ జర్నలిజం ప్రాచుర్యం పొందింది - దేవులపల్లి అమర్

సోషల్ మీడియా వెలుగులోకి వచ్చాక ఇండిపెండెంట్ జర్నలిజం విస్త్రతంగా ప్రాచుర్యం పొందిందని చెప్పారు. గతంలో వార్తపత్రికలు మాత్రమే ఉన్నప్పుడు వ్యతిరేకంగా వార్తలు రాస్తే సంబంధిత బాధితుడు సంపాదకులకు ఫిర్యాదు చేసేవారని అన్నారు. ఇప్పుడు ఏ సంపాదకుడి కట్టడి లేకుండా ఇండిపెండెంట్ జర్నలిజం సాగుతుందన్నారు. 

సోషల్ మీడియా మీదే ఎందుకు దాడులు - జర్నలిస్టు వేణుగోపాల్ రెడ్డి

సోషల్ మీడియ మీదే ఎందుకు దాడులు జరుగుతున్నాయని తెలంగాణ జర్నలిస్టు అధ్యయన వేదిక అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. వాస్తవాలను ఎవరు జీర్ణించుకోలేరో వారే మీడియాపై దాడులకు తెగబడుతున్నారని అన్నారు. 

నైతిక విలువలు నాశనం అయిపోయాయి - ప్రోఫెసర్ హరగోపాల్

సమాజంలో మహిళపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న వేళ నైతిక విలువలు నాశనం అయిపోయాయని అన్నారు. సమాజ మార్పు కోసం పోరాటం చేస్తున్న మహిళలపై దాడులు జరగడం అన్యాయమని అన్నారు. మహిళలకు మెరుగైన జీవితం, విలువల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 

ఇండిపెండెంట్ వాయిస్ ను కాపాడాలి - పాశం యాదగిరి

ఇండిపెండెంట్ వాయిస్ ను కాపాడాలని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి పిలుపునిచ్చారు. ప్రజల వాయిస్ సోషల్ మీడియా వేదికగా ఇండిపెండెంట్ జర్నలిజం ద్వారా వినిపిస్తుందన్నారు. జర్నలిజంలో క్రిటిక్ థాట్ అనేది లేకుండా చంపివేయడానికి ట్రోలింగ్ ముఠాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు.

చెప్పినమాట వినకపోతే దాడులు - ప్రోఫెసర్ పద్మజా షా 

చెప్పినమాట వినని వారిపై అసహనంతో ప్రభుత్వాలు సిబిఐ వంటి సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఓయూ జర్నలిజం మాజీ అధిపతి ప్రొఫెసర్ పద్మజా షా ఆరోపించారు. ఈ నేపథంలో ప్రతిభవంతులైన జర్నలిస్టులు యూట్యూబ్ లు వేదికగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రజాధనంతో లేనివి ఉన్నట్లుగా ప్రభుత్వాలు ప్రోపగండ చేస్తున్నాయని అన్నారు. డబ్బులు తీసుకుని అవాస్త వార్తలను ప్రచురిస్తున్నారనే నిందలు వేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

మనిషి అభిప్రాయాలను ఎందుకు సహించరు ? జర్నలిస్టు సజయ

మనిషి అభిప్రాయాలను ఎందుకు సహించలేకపోతున్నారని సీనియర్ జర్నలిస్టు సజయ ప్రశ్నించారు. చాకలి ఐలమ్మ వారసులుగా జర్నలిస్టులుగా నిలబడతామని అన్నారు. జర్నలిస్టుగా ఎథిక్స్ పాటిస్తామని అన్నారు. 

పెద్ద శక్తులే పనిచేస్తున్నాయి - సీనియర్ సంపాదకులు కె. శ్రీనివాస్

ట్రోలింగ్ ముఠాలు వెనుక పెద్ద శక్తులే పనిచేస్తున్నాయని సీనియర్ సంపాదకులు కె. శ్రీనివాస్ అన్నారు. భౌతికంగా మనుషులపై దాడులకు, ట్రోలింగ్ ముఠాలకు పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదన్నారు. ఇండిపెండెంట్ జర్నలిజంను ప్రజా జర్నలిజంగా ఆహ్వానించాలని సూచించారు. ప్రభుత్వాలు నియంతృత్వంతో భావప్రకటన స్వేచ్ఛను అణచివేస్తున్నాయని అన్నారు.

ట్రోలింగ్ ముఠాలపై కేసు పెట్టాలి ః ఎన్ డబ్ల్యూ ఎంఐ బాధ్యులు వనజ

ట్రోలింగ్ ముఠాలపై కేసు పెట్టాలని ఎన్ డబ్ల్యూ ఎం ఐ బాధ్యుుల వనజ సూచించారు. కేసులు పెట్టిన తర్వాత ఏమీ జరగకపోతే అవతలవాళ్ళకు లోకువ అవుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై డిజిపిని కలిసి వినతిపత్రాలు సమర్పించాలని కోరారు. తెలంగాణలో ట్రోలింగ్ ముఠాలకు వ్యతిరేకంగా పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు. సంస్కార రహితంగా కనిపించిన ట్రోలింగ్ లను ఎదుర్కొనాలని పిలుపునిచ్చారు. 

ఇండిపెండెంట్ మీడియాను కాపాడాలి - సీనియర్ ఎడిటర్ వేణుగోపాల్ఇండిపెండెంట్ మీడియాను కాపాడాలని సీనియర్ సంపాదకులు వేణుగోపాల్ పిలుపునిచ్చారు. ఇండిపెండెంట్ జర్నలిజం వెలుగులోకి వచ్చాక ఒత్తిడి లేకుండా తోచిన విధంగా అభిప్రాయాన్ని తెలిపే అవకాశం వచ్చిందన్నారు. తులసీ చందు శక్తివంతమైన జర్నలిస్టు కాబట్టే ఆమెపై దాడి జరిగిందన్నారు. ఏది న్యాయమే ఏది ధర్మమో గుర్తించే స్థాయిలో తులసీ ఉన్నారని అన్నారు. మహిళా జర్నలిస్టులు, స్త్రీలపై విఫరీతమైన ట్రోలింగ్ లు రావడం దారుణమన్నారు. 

ఆర్గనైజ్డు ట్రోలింగ్ - మహిళా సంఘం నేత సంధ్యఅర్గనైజ్డు ట్రోలింగ్ ను అరికట్టాలని మహిళ సంఘం నేత వి. సంధ్య డిమాండ్ చేశారు. కాషాయి మూకల దాడులను తులసీ బాగా ఎండగడుతుందని ప్రసంశించారు. తులసీ ఒంటరికాదని ఆమె వెనుక తామున్నామని అన్నారు. ఈ మధ్యకాలంలో 72 కులదురాహంకార హత్యలు జరిగాయనిచెప్పారు. హిందువులు హిందువులను చంపితే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడరని ఆమె ప్రశ్నించారు. 

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు పద్మ వంగ, లక్ష్మణరావు, కృష్ణమూర్తి, బాలరెడ్డి, ప్రసాద మూర్తి, కార్టునిస్టు నరసింహం, డాక్టర్ మిత్ర, హిప్నో పద్మ కమమలాకర్, సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ బాధ్యుడు బాన్సువాడ నాని, పివోడబ్ల్యూ నేత సంధ్య, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం నేత కరుణాకర్, తెలంగాణ విద్యావంతుల వేదిక నేత అంబటి నాగయ్య, తెలంగాణ టీచర్స్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ నేత వై. అశోక్ కుమార్, దళితబహుజన ఫ్రంట్ నేత శంకర్, తెలంగాణ రచయితల వేదిక ఇనిశెట్టి శంకర్, మహిళా ట్రాన్స్ జెండర్ జేఏసీ బాధ్యులు దేవి, కులనిర్మూలన సంఘం నేత జి. జ్యోశ్న, గూగుల్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భరత్ తదితర ప్రజా సంఘాల నేతలు పాల్గొని స్వతంత్ర జర్నలిస్టు తులసీ చందుకు సంఘీభావం పలికారు. అంబటి అంజనేయులకు ఘన నివాళి

రెండు రోజుల క్రితం మృతి చెందిన ఐజెయు సీనియర్ నాయకులు , వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉద్యమ నేత అంబటి ఆంజనేయులుకు సమావేశం ఘనంగా నివాళులర్పించింది. రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అంబటి అమర్ హై అని నినాదాలు చేశారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ ఆధ్వర్యంలో మాధక ద్రవ్యల నిర్ములన దినోత్సవం సందర్బంగా స్థానిక గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లో అవగాహనా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య అతిధిగా ఎక్స్చేంజి సీఐ రమేష్  హాజరైనారు ఈసందర్బంగా మగువ ప్రెసిడెంట్ సోమారపు లావణ్య , మగువ సెక్రటరీ డాక్టర్. లక్ష్మి వాణి  మాట్లాడుతూ 

 మాదక ద్రవ్యాల వాడకం ఒక ప్రమాదమైన వ్యసనము (Addiction). ఈనాటి యువతరాన్ని దారి మళ్ళించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల కన్నా తీవ్రమైన ప్రభావకాలు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6 శాతం జనాభా అనగా 185 మిలియన్ల మంది ఇలా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనాలు తెలుపుతున్నాయి వీటికి అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులు వదిలి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులౌతున్నారు. ఒకసారి దీనికి బానిసలైన తర్వాత వీనిని సంపాదించడానికి ఎంతటి అకృత్యాలు, నేరాలు చేయడానికి వెనుకాడరు మాదక ద్రవ్యాల నిరోధానికి భారత ప్రభుత్వం నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సస్ చట్టాన్ని చేసింది. ఈ మత్తు మందులు పండించేవారు, వ్యాపారం చేసేవారు, కలిగివున్నవారు చట్టపరంగా కఠినంగా శిక్షార్హులు ఇలాంటి వ్యసనపరుల్ని మళ్ళీ మామూలు మనుషుల్ని చేయడం చాల కష్టమైన పని. వీరిని డ్రగ్ అడిక్షన్ కేంద్రాలు, మానసిక వైద్యుల ద్వారా చికిత్స చేసి కాపాడవచ్చును రామగుండం నియోజకవర్గం లో కూడా డ్రగ్ అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి అని పేర్కొన్నారు ఈకార్యక్రమంలో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, మగువ డైరెక్టర్ సునీత, గాంధీ , కాలేజీ స్థాఫ్,స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు.. 

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

ప్రతి కేసు విషయంలో సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  జె. సురేందర్ రెడ్డి  అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్లలో నమోదైన పెండింగులో ఉన్న కేసుల వివరాలను  అడిగి తెలుసుకున్నారు. కేసుల సత్వర పరిష్కారానికి అధికారులందరూ కృషి చేయాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. షీ టీమ్స్ ,సైబర్ క్రైమ్స్, అక్రమ మానవ రవాణా వంటి అంశాలపై అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదిలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తెలిపారు .సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. విధుల పట్ల నిబద్ధతతో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ నేరస్తులకు శిక్ష పడే విధంగా చేస్తూ, బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా పని చేయాలని పేర్కొన్నారు. విధులు పట్ల అలసత్వం వహిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పి సురేందర్ రెడ్డి  హెచ్చరించారు. ప్రతి కేసులో సమగ్ర విచారణ చేపట్టి భాదితులకు అండగా నిలవాలని తెలిపారు. అంతకుముందు ప్రజాదివాస్ కార్యక్రమంలో భాగంగా  వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, న్యాయం చేయవలసిందిగా పోలీస్ అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో    ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ  శ్రీ వి. శ్రీనివాస్,  భూపాలపల్లి, కాటారం, డిఎస్పీలు  ఏ. రాములు, జి రామ్మోహన్ రెడ్డి, వర్టికల్ డిఎస్పి కిషోర్ కుమార్, జిల్లా పరిధిలోని సిఐలు, రిజర్వు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

  హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్సు  హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి లో వస్తున్న దరఖాస్తులను ఆలస్యం చేయకుండా వెంటనే పరిశీలించి పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.

ఈ ప్రజావాణిలో జిల్లాలోని వివిధ శాఖలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్, డిఆర్డిఏ పీడి  శ్రీనివాస్, డిపిఓ  జగదీశ్వర్  లు ఇట్టి దరఖాస్తులను తీసుకొని, వీటి పై స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఈ ప్రజావాణి లో మొత్తం 180  దరఖాస్తులు  వచ్చాయని తెలియజేశారు. శాఖల వారిగా వాటి వివరాలు

టు బిహెచ్కె నోడల్ ఆఫీసర్ -14,

ఏడి మైన్స్ -03,

Gwmc కమిషనర్  -12,

కమిషనర్ ఆఫ్ పోలీస్ -09,

కమిషనర్ పరకాల మున్సిపాలిటీ -01,

  డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ హనుమకొండ -02,

 బీసి వెల్ఫేర్ ఆఫీసర్ -01, 

డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ -01,

డి.ఎం.హెచ్.ఓ -01,

డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ -01,

 డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ -01,

టూరిజం ఆఫీసర్ -01,

డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ -03,

ED ఎస్సీ కార్పొరేషన్ -25,

 అడిషనల్ కలెక్టర్ హన్మకొండ -04,

ఎంపీడీవో దామెర -02,

ఎంపీడీవో అయినవోలు -01,

ఎంపీడీవో పరకాల -01,

రీజినల్ మేనేజర్ టి ఎస్ ఆర్ టి సి -01,

రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ హనుమకొండ -06,

సూపరిండెంట్ ఎంజీఎం -06,

సూపర్డెంట్ ఆర్ ఇ హెచ్ వరంగల్ -03,

తహసిల్దార్ భీమ దేవరపల్లి -04,

 తహసిల్దార్ ధర్మసాగర్ -06,

తహసిల్దార్ ఎల్కతుర్తి -13,

 తహసిల్దార్ హనుమకొండ -22,

 తహసిల్దార్ హసన్ పర్తి -07,

తహసిల్దార్ అయినవోలు -05,

 తహసిల్దార్ కమలాపూర్ -08,

తహసిల్దార్ కాజీపేట -06,

తహాసిల్దార్ నడికుడా -01,

తహసిల్దార్ పరకాల -02,

తహసిల్దార్ శాయంపేట -02,

కలెక్టరేట్:

D -సెక్షన్ -04,

E - సెక్షన్ -01.

ఈ  ప్రజావాణి కార్యక్రమం లో   డిఎంఅండ్ హెచ్ ఓ  సాంబశివ రావు, ఎస్.సి కార్పొరేషన్ ఈ.డి మాధవి లత, డిఎం డబ్య్లు ఓ  శ్రీను, ఏడి సర్వే ల్యాండ్ రికార్డ్ ప్రభాకర్, డిడబ్ల్యుఓ  మధురిమ, తదితర శాఖల  అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

మహిళలతోనే మార్పు సాధ్యమని జిల్లా సంక్షేమ అధికారి కే మధురిమ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ

సమాజం ప్రగతి బాటన పరుగులు తీయాలంటే మహిళలు పూనుకోవాలని, కుటుంబ వ్యవస్థలో తల్లితండ్రుల పాత్ర ప్రధానమని వారి పిల్లలకు నైతిక విలువలను చిన్ననాటి నుండే అలవర్చాలని అన్నారు. యాంత్రిక జీవితంతో తలమునుకలై పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు స్నేహితుల ప్రభావం, సోషల్ మీడియా ప్రభావంతో యువత మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, కుటుంబ వ్యవస్థలో నైతికత దిగజారకుండా చూసుకున్నప్పుడు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని అన్నారు.

జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి సాంబశివరావు మాట్లాడుతూ యువత సత్తువనంత కబళించి వేస్తున్న ప్రధాన సమస్యల్లో గంజాయి, కొకైన్, హెరాయిన్ లాంటి పదార్థాలు తీసుకోవడం ద్వారా మల్టిపుల్ సైకాలజికల్ డిజార్డర్స్ గా మారుతున్నారని అన్నారు. యువత తలుచుకుంటే సాధించేది లేదని యువత సన్మార్గంలో నడిచి దేశానికి ఆయువుపట్టుల నిలవాలని ఆకాంక్షించారు.

చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కజాంపురం దామోదర్ మాట్లాడుతూ సినిమాల ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం నేడు గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించిందని తద్వారా యువత పెడదారి లో నడిచి భవిష్యత్ జీవితాన్ని నిర్వీర్యం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, ముఖ్యంగా మధ్యతరగతి ఎగువన ఉన్నవారు వారి వారి జీవన పోరాటంలో తలమునుకలై వారి పిల్లల విషయంలో దృష్టి సారించకపోవడంతో ఈ అమానవీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.

ఇన్స్పెక్టర్ సుజాత మాట్లాడుతూ గంజాయి మాదకద్రవ్యాల వినియోగం విషయంలో టార్గెట్ గ్రూపు, టార్గెట్ ఏరియాల పై దృష్టి సారించి సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని రకాల వ్యాధులకు ప్రధాన కారణం పొగాకు అని, పొగాకు, గంజాయి, మరియు రక రకాల మత్తు పదార్థాల వినియోగించుకొని తద్వారా భవిష్యత్ జీవితం నాశనం చేసుకుంటున్నారని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి అబ్దుల్ హై, 

డీసీపీవో పి సంతోష్ కుమార్, ఎఫ్ ఆర్ వో రవి కృష్ణ, సీనియర్ సహాయకులు వి వెంకట్ రామ్, హెల్పింగ్ హ్యాండ్ డైరెక్టర్ రాము తదితరులు పాల్గొన్నారు.

తొలుత ఉదయం అదాలత్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఎ బారి, స్థానిక కార్పొరేటర్ వసంత, హనుమకొండ కాజీపేట 

ఏసీపి లు కిరణ్ కుమార్, శ్రీనివాస్ లు మరియు అదనపు డిప్యూటీ 

డీఎంహెచ్వో లు డాక్టర్ మదన్ మోహన్ రావు, యాకూబ్ పాషా, డెమో వి అశోక్ రెడ్డి, సీడీపీవో భాగ్యలక్ష్మి , ఐసిడిఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు, అషా వర్కర్లు, మెప్మా ఆర్పీలు ర్యాలీ లో పాల్గొని మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై ప్ల కార్డులు చేతబూని నినాదాలు చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

ఏ ఒక్కరూ అధైర్య పడొద్దు గాయపడ్డ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించిన రాజ్ ఠాగూర్*క్షతగాత్రులకు నా సొంత డబ్బులతో నాణ్యమైన వైద్యం చేపిస్తానని హామీ, మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్

*క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని ప్రధాన వైద్యులతో మాట్లాడిన రాజ్ ఠాగూర్ ప్రైవేటు బస్సు బోల్తా పడి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడిన ఘటన పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద చోటుచేసుకుంది...

పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన ముస్లిం కుటుంబం బంధువులతో కలిసి హైదరాబాద్ లో పెళ్ళికి వెళ్లి రామగుండం తిరిగి వచ్చే క్రమంలో కాట్నపల్లి వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి బోల్తా పడింది....

ఈ ప్రమాదంలో 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది....

 ఈ విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన *డిసిసి అధ్యక్షులు మక్కన సింగ్ రాజ్ ఠాగూర్ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడినుంచి క్షతగాత్రులను గాయాలపాలైన వారిని కరీంనగర్ లోని గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్ కు మరియు సీరియస్ గా ఉన్న వారిని గుడ్ లైఫ్ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి వారికి నాణ్యమైన వైద్యం అందించాలని ఇటు ప్రభుత్వ ప్రధాన వైద్య అధికారులతో మాట్లాడి అలాగే సీరియస్ గా ఉన్న వారిని గుడ్ లైఫ్ ప్రైవేటు హాస్పటల్లో చేర్పించిన అనంతరం హాస్పిటల్ వైద్యులతో నాణ్యమైన వైద్యం అందించాలని అవసరమైతే వైద్యానికి అయ్యే ఖర్చు నేను భరిస్తానని ఇంకా ఎవరైనా సీరియస్ గా ఉంటే అవసరమైతే హైదరాబాద్ కు తరలించి ఉన్నత వైద్య సదుపాయం అందిస్తానని గాయపడ్డ వారి బంధువులు సన్నిహితులు ఎవరు బాధపడవద్దని పూర్తిస్థాయిలో వారికి నా వంతు బాధ్యతగా సహాయ సహకారాలు అందిస్తానని వారికి పూర్తి అండగా ఉంటానని ఎవరు అధైర్యపడవద్దని వారికి ధైర్యం చెప్పి భరోసా కల్పించడం జరిగినది.వారి వెంట కరీంనగర్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ 41డివిజన్ ప్రెసిడెంట్ ఫజల్ ,యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నజీమ్ , రామగుండం మైనారిటీ ప్రెసిడెంట్ గౌస్ బాబా శంకర్ తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

గోదావరిఖని ఐఎఫ్టియు కార్యాలయంలో ఐఎఫ్టియు ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు తోకల రమేష్ హాజరై మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం బొగ్గు గనుల మీద ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నది. ఆషాడ మాసంలో బొగ్గు గని కార్మికులంతా గత 130 సంవత్సరాలుగా కార్మికులంతా డిపార్ట్మెంట్ వారిగా సామూహిక భోజనాలు వండుకొని దావతులు చేసుకోవడం సాంప్రదాయంగా వస్తున్నది. కానీ సింగరేణి యాజమాన్యం ఈ సంవత్సరం బావుల మీద వంటలు వండవద్దని దావతులు చేసుకోవద్దని ప్రత్యేకంగా సర్కులర్ను జారీ చేయడం దానికి కోడ్ ఆఫ్ డిసిప్లేన్ అడ్డం పెట్టుకోవడం దుర్మార్గం. వెంటనే సింగరేణి యాజమాన్యం కార్మికులను అవమానపరిచే విధంగా విడుదల చేసిన సర్కులర్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కోడ్ ఆఫ్ డిసిప్లేన్ పేరుతో సింగరేణి యాజమాన్యం కార్మికులపై అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నది. మేము మొదటి నుంచి చెప్తున్నాం. వేరి లో కోడ్ ఆఫ్ డిసిప్లేన్ నిరంకుశంగా ఉన్నద దాన్ని రద్దు చేయాలని చెబుతున్నాం. దానిని మార్చకుండా సింగరేణి యాజమాన్యం దాని పేరుతో కార్మికులపై, కార్మిక సంఘాలపై పెత్తనం చెలాయించేందుకు కుట్రలు చేస్తున్నది. వెంటనే సింగరేణి యాజమాన్యం కార్మికుల నుంచి ప్రతిఘటనను ఎదుర్కోకముందే తక్షణమే యాజమాన్యం జారీ చేసిన నిరంకుశ సర్కిలర్ ను వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. *ఇంకా ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు నాయకులు పి రాజేందర్, ఏ సారయ్య, నగునూరు పోషం, ఎం వాసుదేవరెడ్డి, మాట్ల సమ్మయ్య, కొయ్యడ శంకర్ తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

 

       
తెలంగాణ హెచ్ ఆర్ సి ఐ నూతన కమిటీ ఎన్నిక. (హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) హెచ్ ఆర్ సి ఐ పోరాడుతుందని జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్ అన్నారు. హైదరాబాదులో తెలంగాణ శాఖ జనరల్ బాడీ సమావేశం లో ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు, సౌత్ జోనల్ బెల్లం హరిప్రసాద్, తెలంగాణ స్టేట్ అధ్యక్షులు బేతి తిరుమలరావు, కార్యదర్శి పుల్లం రాజు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ వెల్ఫేర్ సెక్రెటరీ గా గోదావరిఖనికి చెందిన గోలి మహేందర్ మరియు తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ గా పోరండ్ల ప్రవీణ్ కుమార్ ని నియమించారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


ప్రగతి శీల యువజన సంఘం(పి వై ఎల్) పెద్దపల్లి జిల్లా 6వ.మహాసభను పెద్దంపేట్ భగత్ సింగ్ భవన్(కత్తరమల్ల పోచన్న నగర్) లో జరిగింది ఈ యోక్క మహాసభ కు పి వై ఎల్ అధ్యక్షుడు కాశిపేట దర్మేందర్ జెండా ఆవిష్కరించి అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యవక్తగా పార్టీ జిల్లా కార్యదర్శి కె రాజన్న హాజరై మాట్లాడుతూ...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటికో ఉద్యోగం ఇస్తామని వాగ్దానాలు చేసి అదికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉపాదిఅవాకాశాలను లేకుండా చేసాయని, ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విదానాలపై పోరాడాలని యువతకు పిలుపునిచ్చారు.

   ఇంకా ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా అద్యక్షుడు ఇ నరేష్, పి ఓ డబ్ల్యూ జిల్లా అద్యక్షులు కె జ్యోతి, ఎ ఐ కె యమ్ ఎస్ జిల్లా అద్యక్షులు మేరుగు చంద్రయ్య,రాష్ట్ర నాయకుడు వెల్తురు సదానందం, ఉపాద్యక్షుడు కొల్లూరి మల్లేశం, పార్టీ డివిజన్ నాయకులు పైడిపల్లి రమేష్, పి వై ఎల్ జిల్లా నాయకులు సమ్మెట తిరుపతి, బి ఆనంద్, దూలం సతీష్, తిర్రి బాలక్రిష్ణ, ఒ సుదాకర్, కాదాసి లింగమూర్తి దదితర నాయకులు, మహిళలు, యువకులు 70 మంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెకప్ సక్ర మంగా జరగాలని కలెక్టర్  సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. ఆదివారం 

 ఏనుమాముల మార్కెట్  ఈవీఎం గోడౌ న్లో ఫస్ట్ లెవల్ చెకప్ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో గోడౌన్ తెరిచి, ఎఫ్ఎల్సీ చేపట్టినట్లు వెల్లడిం చారు. జిల్లాలో జరుగుతున్న మొదటి స్థాయి తనిఖీని పరిశీలించేందుకు ఇంజినీర్ల బృందం జిల్లాకు వచ్చి నట్లు తెలిపారు. వీరి సమక్షంలో ప్రతి ఈవీ ఎం మాక్ పోలింగ్ నిర్వహిస్తార న్నారు. మాక్ పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే సమాచారమి వ్వాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల పాటు తనిఖీప్రక్రియనిర్వహించనున్నాయని  తెలిపారు.

ఈ కార్యక్రమం లో అదనపు  కలెక్టర్ సంధ్య రాణి, రాజకీయ పార్టీ ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

 రాజకీయ పార్టీ ప్రతినిధులు

ఈవి శ్రీనివాసరావు ఐఎన్సి

డాక్టర్ ఇండ్ల నాగేశ్వర్ రావు బిఆరెస్ బిల్లా రమణ రెడ్డి

కుసుమ శ్యామ్ సుందర్ టీడీపీ N. రజనీకాంత్, వైఎస్సార్ సిపి సయ్యద్ షబ్బీర్ ఎంఐఎం బంకా సంపత్

మొహమ్మద్ నెహాల్ తదితరులు పాల్గొన్నారు .

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్  రాష్ట్రంలో అమలు చేస్తూ.. దేశ ప్రజల అభిమానాన్ని సంపాదించుకొని.. ఆయన పాలనను  స్వాగతిస్తున్నారని  రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్  అన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని  రామగుండ పట్టణంలో  ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే చందర్  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు పట్టణ ప్రజలు కోలాట బృందంతో ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక మజీద్ కార్నర్ లోని అంబేద్కర్ విగ్రహానికి  ఎమ్మెల్యే చందర్  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  ఎమ్మెల్యే చందర్  మాట్లాడారు. సమాఖ్య పాలనలో  కాంగ్రెస్ 70 ఏళ్లుగా పాలించిందని, తెలంగాణను  అభివృద్ధికి సంక్షేమానికి దూరం పెట్టిందన్నారు. గతంలో పెన్షన్ రూ.200లు కంటితుడుపు చర్యగా అందించారని అన్నారు. గత ప్రభుత్వంలో  నిరుపేద వర్గాల ప్రజలు ఎలాంటి సంక్షేమం లేకుండా అభివృద్ధి లేకుండా జీవనం సాగించారని ఆవేదన వ్యక్తం చేశారు. బిపిఎల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును కూలదోసి ప్రజలను రోడ్డు మీద పడేసిన ఘన చరిత్ర కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ శాప్ చైర్మన్గా కొనసాగిన మక్కాన్సింగ్ రామగుండం నియోజకవర్గం ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు.  అభివృద్ధి నోచుకోలేక తెలంగాణ ప్రజలు తల్లడిల్లుతున్న క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్  బిఆర్ఎస్ పార్టీ స్థాపించి.. అన్ని వర్గాల పోరాటాలతో ఉద్యమంతో  తెలంగాణను  సాధించుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ సారధ్యంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని అన్నారు. వృద్ధులకు వితంతువులకు రూ.2,016లు, వికలాంగులకు రూ.3016లు అందిస్తూ ఆర్థిక భరోసాగా నిలిచారని అన్నారు. నిరుపేద యువతుల పెళ్లిళ్లు ఆర్థిక  భారం కాకూడదనే ఉద్దేశంతో  కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేరిట  రూ 100116లు అందిస్తూ ఇంటి పెద్దన్నగా  కెసిఆర్ నిలిచారని అన్నారు. అంతేకాకుండా  రైతే రాజుగా భావిస్తున్న భారతదేశంలో  రైతుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైతుబంధు,  రైతుబీమా లాంటి పథకాలను అమలు చేస్తూ, కాలేశ్వరం ప్రాజెక్టుతో  తెలంగాణ బీడు భూములన్ని పంటపొలాలుగా సస్యశ్యామలంగా వర్ధిల్లుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఇల్లు కట్టుకోవడానికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించే వారని, సీఎం కేసీఆర్  మహిళల పేరిట గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల అందించడం జరుగుతుందని అన్నారు. సీఎం కేసీఆర్  పేద ప్రజల శ్రేయోభిలాషి  అన్నారు.  గత ఎన్నికల్లో  నాపై నమ్మకం ఉంది నన్ను గెలిపించిన  ప్రజానీక సంక్షేమం కోసం  తరతరాలుగా గుర్తిండిపోయే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు  ఎమ్మెల్యే  తెలిపారు. ఈ క్రమంలోనే నిరుపేద  ప్రజల ఆరోగ్యం కోసం మెడికల్ కళాశాలను  ముఖ్యమంత్రి కేసీఆర్ ను  మెప్పించి ఒప్పించి తీసుకువచ్చానని, ఈ కళాశాలలో  ఉచితంగా కార్పొరేట్ వైద్యంతోపాటు వైద్య పరీక్షలు, మందులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా  స్థానిక యువత ఉపాధి కోసం ఐటీ పార్క్ ఇండస్ట్రియల్ పార్కులని సైతం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వాహన దారుల కోసం సౌకర్యవంతమైన రోడ్లను ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా  రిజిస్ట్రేషన్ ల కోసం జిల్లాకు ప్రజలు తరలి వెళ్లకుండా.. రామగుండం లోనే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత పాలకులు చేయలేని అభివృద్ధిని  నాలుగున్నర ఏండ్ల కాలంలో  చేసి చూపించానని అన్నారు. అంతేకాకుండా  ప్రభుత్వ ఆక్రమిత భూముల్లో ఉన్నటువంటి నిరుపేదలకు పట్టాలిప్పించడానికి  చర్యలు తీసుకుంటున్నట్టు ఎమ్మెల్యేతెలిపారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం  ప్రజల్లోకి వచ్చి ప్రచారాలు చేయబడుతున్న నాయకులను  తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలు వస్తేనే తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోని, ప్రజల్లో తిరగని నాయకులు  రాజకీయాలకు పనికిరారని ఆయన అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం  తప్పని విధంగా కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకు సాగుతానని ఎమ్మెల్యే  అన్నారు. గొప్ప ఆలోచనలతో  గొప్ప పథకాలతో ఉన్నతమైన మార్గదర్శకం తో  తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో  భారతదేశంలోని అగ్రగామిగా నిలిచిన  ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓటేసి ఆయన రుణం తీర్చుకోవాలని, హ్యాట్రిక్ సీఎంగా గెలిపించుకోవాలని ఎమ్మెల్యే చందర్   పిలుపునిచ్చారు. రామగుండం పట్టణ ఇన్చార్జి  బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో  డిప్యూటీ మేయర్  నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు   కన్నూరి సతీష్ కుమార్, అమ్రిన్ ఫాతిమా - సలీం  బేగ్, దొంత శ్రీనివాస్, కొమ్ము వేణుగోపాల్, దాతు శ్రీనివాస్, బాల రాజ్ కుమార్, జనగామ కవితా సరోజిని, కల్వచర్ల కృష్ణవేణి, నాయకులుశివరాత్రి గంగాధర్, కలవల శీను, నిమ్మని సంతోష్, పల్లికొండ నరేష్, దాముఖ వంశీ, బద్రి రజిత రాజేందర్, ఆశాది వేణుగోపాల్, డాక్టర్ ముస్తఫా, డాక్టర్ దుర్గం రాజ్, పెరిక శంకర్, దండుగుల శ్రీను, మంథని శ్రీను, గోమ్మురాజుల శీను, ఎగ్గే నరేష్, మాచర్ల నరేష్, వడ్డేపల్లి రమేష్, కలువల భాను, ఆరుముల్లా కనకపాల్, కలవల మహేందర్, దాముఖ సదన్, దాముఖ అనిల్, వినయ్, మెండే వంశీ, వేల్పుల అంజి, చిలుముల అన్వేష్, అటహారుద్దీన్, తోడేటి శంకర్ గౌడ్, పర్లపల్లి రవి, మెతుకు దేవరాజ్, అడ్డాల రామస్వామి, కల్వల సంజీవ్, కాల్వ శ్రీనివాస్, వేగొలపు శ్రీనివాస్, బొడ్డు రవీందర్, రాకం వేణు, జేవి రాజు, తిరుపతి నాయక్, దీటి బాలరాజు, మాదాసు రామ్మూర్తి, అల్లి గణేష్, దాసరి ఆనంద్, గోవర్ధన్, మేకల అబ్బాస్, ఇరుగురాల శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

ఎన్ టి పి సి ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో సి పి ఐ యం ఎల్ ప్రజాపంధా రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ డివి క్రిష్ణ ప్రథమ వర్ధంతి సభ జరిగింది *ఈ సభక సి పి ఐ యం ఎల్ ప్రజాపంధా రాష్ట్ర నాయకులు నంది రామయ్య హాజరై మాట్లాడుతూ ప్రజాపంథా మార్గ నిర్దేశకుడు, విప్లవ కార్మికోద్యమ నేత కామ్రేడ్ డివి క్రిష్ణ తన చివరి ఊపిరి ఉన్నంతకాలం విప్లవం కోసం, పేద బడుగు వర్గాల ప్రజల కోసం పని చేశారు. భారత దేశ పరిస్థితులకు అనుగుణంగా విప్లవ పంథా రూపొందించాడు. భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం చివరి దాకా పోరాడాడు. ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ప్రధమ వర్ధంతి సభ జరుగబోతున్నది. అన్ని వర్గాల ప్రజలు హాజరై జయప్రదం చేయాలని పిలపునిచ్చారు. కామ్రేడ్ డివి క్రిష్ణ ఆశయాలు కొనసాగిద్దాం అని పిలుపునిచ్చారు. *ఇంకా ఈ కార్యక్రమంలో సి పి ఐ యం ఎల్ ప్రజాపంధా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్,పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్,జిల్లా నాయకులు అడేపు శంకర్, మార్త రాములు,పెండ్యాల రమేష్ గొల్లపల్లి చంద్రయ్య, కోడిపుంజుల లక్ష్మి, తూళ్ళ శంకర్, ఇనుగాల రాజేశ్వర్, పి.రాజేందర్ , ఏ.సారయ్య, కలువల రాయమల్లు మాడుగుల రమేష్,లచ్చన్న, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

తబిత ఆశ్రమంలో బీఎస్పీ ఉత్తర తెలంగాణ ఇంచార్జ్ జక్కని సంజయ్ జన్మదిన వేడుకలు.

రామగుండం నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇంచార్జ్ గోలివాడ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో బీఎస్సీ పార్టీ ఉత్తర తెలంగాణ ఇంచార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కని సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను రామగుండం పట్టణంలోని తబిత అనాథ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోలివాడ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ " బీఎస్పీ పార్టీ ఉత్తర తెలంగాణ ఇంచార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కని సంజయ్ కుమార్ బీఎస్పీ పార్టీ అభివృద్ది కొరకు చాలా పనిచేస్తున్నారని, జక్కని సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ బూత్ స్థాయి వరకు విస్తరిస్తామని, వచ్చే ఎన్నికలలో రామగుండంలో బీఎస్పీ జెండా ఎగుర వేస్తామని అన్నారు. రాబోవు కాలంలో జక్కని సంజయ్ కుమార్ ఉన్నత పదవులు నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం జక్కని సంజయ్ కుమార్ జన్మదినం‌ సందర్భంగా రామగుండం పట్టణంలోని తబిత ఆశ్రమంలో పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు జనగామ మల్లేష్, అంతడుపుల రాజేందర్, రాచర్ల రాజ్ కుమార్, జనగామ సాయి, చిలుక ప్రశంత్ లతో పాటు తబిత ఆశ్రమ నిర్వాహకులు, పిల్లలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఎన్టిపిసి యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని యునైటెడ్ ఫోరం నాయకులు డిమాండ్ చేశారు.

ఈరోజు ఎన్టిపిసి ప్రాజెక్టు గేట్ 2 వద్ద యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన అర్థనగ్న ప్రదర్శన, ర్యాలీ నిర్వహించి వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులు దేశానికి వెలుగులు ఇచ్చే ఎన్టిపిసి మహారత్న కంపెనీలో పనిచేస్తూ, వారి కుటుంబాలు అర్ధాకలితో దుర్భర జీవితాలను గడుపుతున్నారని, దానికి నిరసనగా ఎన్టిపిసి యాజమాన్యానికి తెలియజేయడం కోసం ఈరోజు కార్మికుల అర్థనగ్న ప్రదర్శన నిర్వహించడం జరిగిందని తెలిపారు.

నిరవధిక సమ్మెలోకి వెళ్లే ముందు ఇలాంటి పోరాటాలు నిర్వహిస్తూ, యజమాన్యం స్పందించకుంటే కార్మికులకు, కార్మిక సంఘాలకు గత్యంతర లేని పరిస్థితుల్లో సమ్మె లోకి వెళ్లక తప్పదని, ఈ విషయాన్ని యాజమాన్యం గ్రహించాలని, జూన్ 30 తర్వాత ఏ క్షణమైనా సమ్మెలోకి వెళ్లడం జరుగుతుందని, దానికి కార్మికులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

అర్థనగ్న ప్రదర్శనలో ఫోరం నాయకులు సిఐటియు నాంసాని శంకర్, గిట్ల లక్ష్మారెడ్డి,దండ రాఘవరెడ్డి, ఐఎఫ్టియు చిలుక శంకర్, బుచ్చన్న, గోదావరి యూనియన్  రాజ మల్లయ్య,సత్యనారాయణ, టిఆర్ఎస్ ఈ భూమయ్య, చింతల సత్యం, బిఎంఎస్ హెచ్ రాజిరెడ్డి, ఏఐటియుసి ఆర్ లక్ష్మణ్, ఎం శంకర్, టిఎన్టియుసి కంది చంద్రయ్య, ఏ శ్రీనివాస్, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

వేమునూర్ గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పల్లికొండ రామయ్య, బోరె లచ్చయ్య   *డీసీసీ అధ్యక్షులు, రామగుండం నియోజక వర్గం ఇంచార్జ్ మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్*ను మర్యాద పూర్వకంగా కలిసి వేమూనూర్ లో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు మరియు పలు అంశాల గురించి మాట్లాడటం జరిగింది, త్వరలో జరగబోయే ఎన్నికల్లో *భారీ మెజారిటీ తో మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ *రామగుండం ఎమ్మెల్యే*గా గెలవబోతున్నారని ఆశా భావం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఒక్క వేమూనూరే కాదు చుట్టూ ప్రక్కల పల్లెలన్నీ, గ్రామాలన్నీ మక్కన్ సింగ్ గెలుపు ఖాయం అయిందని ఎక్కడికెళ్లిన మక్కన్ సింగ్ కే ఓటేయ్యాలని అమ్మలక్కలంతా చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారని తెలియజేసారు, వీరి వెంట అంతగ్రామ్ మండల అధికార ప్రతినిధి మడ్డి తిరుపతి గౌడ్,నియోజక వర్గ ఫిషరీష్ చైర్మన్ పల్లికొండ రాజేష్,సీనియర్ నాయకులు బరుపాటి శ్రీనివాస్ కార్పొరేషన్, మండల కాంగ్రెస్ నాయకులు కునారపు ప్రేమ్, మేడి ఓదెలు, సోమన్ పెల్లి శ్రీకాంత్,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



 

గుడిసెలు వేసుకున్న పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి,బస్సు యాత్ర బృందం కన్వీనర్ స్.వీరయ్య . తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యవేదిక బస్సు యాత్ర బృందం నాయకులు ఎన్టీపీసీలోని పి కె రామయ్య కాలనీ 3వ కేంద్రం  లో వేసుకున్న గుడిసెలను సందర్శించారు, నాయకులకు పూలమాలలు వేసి స్వాగతం పలికారుఈ సందర్భంగా సీపీఎం జెండాను స్.వీరయ్య  ఎగుర వేశారు.అలాగే ఇందిరమ్మ కాలనీ 2వ కేంద్రంలో వేసుకున్న గుడిసెలను సందర్శించదానికి వచ్చిన యాత్ర బృందం కు పూలమాలలతో స్వాగతం పలికారు.ఈసందర్భంగా సీపీఎం జెండాను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు స్కైలాబ్ బాబు ఎగురవేశారు అనంతరం స్.వీరయ్య , మల్లు లక్ష్మి , స్కైలబ్ బాబు మాట్లాడుతూ,ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వం మాట నిలబెట్టు కాలేదు కాబట్టే ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని ఉంటున్న రని ప్రభుత్వం బెదిరించి గుడిసెలు తొలగిస్తే ఉరుకునే ప్రసక్తే లేదన్నారు.భూకబ్జా దారులు పై చూపని ప్రతాపం పేదలపై చూపడం సరికాదని , ఈ ప్రాంతంలో గత మూడు నెలలుగా ఇండ్ల స్థలాల కోసం పోరటం చేస్తున్న పేదలందరికీ 125 గజాల స్థలం కేటాయించి ఇండ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 5లక్షలు కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసేవరకు పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చించారు. ఈ  కార్యక్రమంలో బస్సు యాత్ర బృందం నాయకులు డి వై ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులుకోట రమేష్,రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్,ప్రజా నాట్య మండలి కార్యదర్శి వేముల ఆనంద్,సోషల్ మీడియా రాష్ట్ర బాధ్యులు జగదీష్ వ్య. కా స రాష్ట్ర నాయకురాలు పద్మ,,జిల్లా కార్యదర్శి వై యాక య్య, కార్య దర్శి వర్గ సభ్యులు ఏ.ముత్యం రావు, ఎం రామాచారి,నాయకులు గిట్ల  లక్ష్మారెడ్డి, ఎన్ బిక్షపతి, వి నాగమణి, సి హెచ్ ఉపేందర్, రమణ, పి. నాగలక్ష్మి, టి రవీందర్, వి. శ్రీనివాస్ రెడ్డి ఎం కృష్ణారెడ్డి ,భాగ్య,స్వప్న ,నర్మద ,పూజ,  అలివేలుమంగా స్వర్ణలత రమాదేవి  తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 




పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం అకేనపల్లి గ్రామానికి చెందిన గుడికందుల కొమురయ్య అనే వ్యవసాయ కూలి.పొలం పనిలో నిమిత్తం ఎడ్ల కచ్చురం తో పొలం పనులకు వెళ్తుండగా ప్రమాదంశాత్తు కచ్చురం బోల్తాపడడంతో.గుడికందుల కొమురయ్య కు త్రీవ గాయాలు కాగా వెంటనే వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్ కు తరలించడం జరిగిందని ఎంజీఎం లో చికిత్స పొందుతూ ఐదు రోజుల క్రితం మరణించడం జరిగిందని కుటుంబీకులు. తెలిపారు ఆకేనపల్లి మాజీ ఎంపీటీసీ గంగాధరి శ్రీనివాస్ గౌడ్ సేవా స్ఫూర్తి ఫౌండేషన్ మడిపెల్లి మల్లేష్ కు ఫోన్ ద్వారా మృతుని కుటుంబ పరిస్థితిని తెలుపగా బాధిత కుటుంబానికి ఇటీవల పుట్టినరోజు జరుపుకున్న సేవా స్పూర్తి ఫౌండేషన్ సభ్యులు తలకోటి రఘు  కుమార్తె తలకోటి నాగ సింధూర జన్మదిన సందర్భంగా మరణించిన  కొమరయ్య కుటుంబానికి శుక్రవారం రోజున మాజీ ఎంపిటిసి గంగాధరి శ్రీనివాస్ గౌడ్ ద్వారా 25 కిలోల బియ్యం.మరియు 5 కిలోల వంట నూనె పంపించడం జరిగిందని పౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ తెలిపారు. బియ్యం అందజేసిన అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మరణించిన కొమరయ్య పొలాలకు కైకిల్ వెళ్తూ ఎవరు పిలిచినా కైకిల్ పనులకు వెళ్లేవాడని ఆకేనపల్లి గ్రామంలో అందరితో కలు గోల్పుగా ఉండేవాడని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు కొమురయ్య యొక్క కుటుంబం చాలా పేద కుటుంబమని ఉండటానికి ఇల్లు కూడా లేదని చాలా దీన స్థితిలో ఉన్న కుటుంబానికి ప్రభుత్వ పరంగా కూడా సహాయం అందించాలని మరియు దాతలు కూడా ముందుకు వచ్చి సహాయం చేసి ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా శ్రీనివాస్ గౌడ్ కోరారు అడగగానే సహాయం అందజేసిన తలకోటి నాగ సింధురా కు అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు మరియు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులందరికీ అకేనపల్లి గ్రామ ప్రజల తరఫున మరియు మృతుడు కొమురయ్య కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని గంగాధరి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో.ఫౌండేషన్ ప్రతినిధులు.సామల కుమార్. సామల శ్రీనివాస్; కనుగాంటి బాలరాజు; ఐలావెని రవి. గెళ్ళూ కుమార్.తదితరులు పాల్గొన్నారు.. 

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 






రామగుండం నియోజకవర్గం 38 డివిజన్ ఇందిరా నగర్ కు చెందిన సాగర్ ఎండ దెబ్బ తో మరణించారు అతనికి తల్లి,భార్య పిల్లలు ఉన్నారు వారు ఇంటికి పెద్ద ను కోల్పోవడం తో ఆర్థిక ఇబ్బందులతో అవస్థలుపడుతున్నారు ఈవిషయం తెలుసుకొన్న బిజెపి నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్  వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి వారి ఇంటి ఖర్చులకు ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది వారి వెంట గ్యాస్ నూనె వెంకటయ్య, బిజెపి సీనియర్ నాయకురాలు మాతంగి రేణుక,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి  పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజ్ ఠాగూర్  ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దశాబ్ది ఉత్సవాలకు వ్యతిరేకంగా అంతర్గాం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండ్రు హనుమాన్ రెడ్డి  ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది...

మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వ నిధులను ఖర్చు చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ప్రచారానికి వాడుకోవడాన్ని అంతర్గాo మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు

 తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈ ఉత్సవాలు ఎందుకు జరుపుతున్నారని, పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వనందుకు ఉత్సవాలు జరుగుతున్నారా, ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేసినందుకు ఉత్సవాలు జరుగుతున్నరా, యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు జరుపుతున్నారా, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అందిస్తానని హామీ ఇచ్చి మోసం చేసినందుకు ఈ ఉత్సవాల అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అన్నారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది దశాబ్ది ఉత్సవాలు కావని తెలియజేస్తూ  దశాబ్ద కాలంగా  ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తూ టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న దశాబ్ది దగా ఉత్సవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా టిఆర్ఎస్ పార్టీకి రాబోవు ఎలక్షన్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని అన్నారు 

ఈ కార్యక్రమంలో ఆవుల గోపాల్ యాదవ్, ఎంపీటీసీ బొడ్డు లింగమూర్తి, అధికార ప్రతినిధి మడ్డి తిరుపతిగౌడ్, అంతర్గామ్ మండల గ్రామాల అధ్యక్షులు ఒల్లపు స్వామి, గొర్రె చందు, కోలా రమేష్ గౌడ్, శ్రీకాంత్, జక్కుల నారాయణ ,రాజ్ కుమార్,లు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల నాగరాజు కాంపల్లి సంతోష్ , అల్లనేరేడు కనకయ్య, మేడి ఓదెల్, మొగిలి, గడ్డం రాజనర్సు గాండ్ల లింగన్న మైనార్టీ సెల్  నాయకులు ఎండి గౌస్ బాబా, ఎండి మేరాజ్, అంతర్గామ్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఓల్లపు సాయికుమార్, యువజన కాంగ్రెస్ నాయకులు సంఘన వేణి శేఖర్, కొత్తకొండ సంతోష్ సంకరి అనిల్ , ఆళ్లకుంట రాజేష్, సంధి అక్షయ్ ధరణి అనిల్ తదితర నాయకులు పాల్గొన్నారు....

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;



తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అయిన తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. హనుమకొండ లో రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గారు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, సిపి రంగనాథ్ తదితరులతో కలిసి అదాలత్ సెంటర్ లో అమరవీరుల స్థూపం కు నివాళులు అర్పించి, తెలంగాణ గర్వించదగ్గ మహనీయులు కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్ సార్, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆ తరువాత హనుమకొండ కలెక్టరేట్ లో జరిగిన హనుమకొండ, వరంగల్ జిల్లాల అమరవీరుల కుటుంబాలకు సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ 





తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో ఈ రోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాం.

ఈ సందర్భంగా అమరులందరికి నా ఘన నివాళులు.

తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది అమరవీరుల త్యాగాలతో ఏర్పడింది.

అసువులు బాసిన వీరులను మనం మరచిపోలేం.

ఇప్పటికీ ఉద్యమ రోజులు గుర్తు వస్తె బాధ అన్పిస్తుంది.

తాము నష్టపోయిన తరువాతి తరాలు తెలంగాణ రాష్ట్రంలో బాగుపడాలి అని వీర మరణం పొందారు.

వారికి మనం ఏమి చేసినా తక్కువే. కానీ వారికి అన్ని విధాలా రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి ఉద్యమ సారథి, నేటి సీఎం కేసీఆర్  అండగా నిలబడ్డారు.

అమరవీరులను, అమరవీరుల కుటుంబాలను సీఎం కెసిఆర్  గుర్తించారు.

తెలంగాణ అమరవీరుల పథకం కింద 4 వందల 50 మందికి కుటుంబసభ్యులలో ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు.

తరువాత మరో 126 మందికి అమరవీరుల కుటుంబసభ్యుల్లో ఒక్కరికీ ఉద్యోగం కల్పించారు.

మొత్తం 5 వందల 76 మందికి ఉద్యోగాలు కల్పించారు

వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు.

వారికి కష్టం వస్తె ప్రభుత్వం తరుపున సహాయం చేస్తున్నారు.

తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమర వీరుల స్మృతికి ఘనంగా నివాళులు అర్పించేందుకు, అమరుల త్యాగాలను స్మరించేందుకు హైదరాబాద్ లో ఒక మహాస్మృతి కేంద్రాన్ని, స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కెసిఆర్  నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

ఇందుకోసం పలు డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్, 24 గంటలపాటు వెలుగుతూ ఉండే మహా దీపకళిక స్థూపం నమూనాను ఖరారు చేశారు. 

25 మంది ప్రఖ్యాత డిజైనర్లు, ఆర్టిస్టులు కలిసి ఈ డిజైన్ రూపొందించారు. 

ప్రపంచంలో అపూర్వమైన రీతిలో జ్వలించే మహా దీపకళిక రూపంలో ఈ అమరవీరుల స్థూపం ఉండేలా, స్మృతికేంద్రం నిర్మాణం జరిగింది. 

హుస్సేన్‌సాగర్ తీరంలో 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే అమరవీరుల స్మృతి కేంద్రాన్ని, ప్రమిద ఆకృతిలో డిజైన్ చేశారు. ఈ అపురూప స్మారకానికి రూ.146 కోట్లకు పైగా ఖర్చయింది. 

తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని పూర్తిస్థాయిలో దుబాయ్ నుంచి 40 కంటెయినర్లతో తెప్పించిన స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మించారు. 

సాధారణంగా ఆరు లేదా ఏడు అంతస్తుల భవనంతో ఇది సమానం. 

ఇక్కడికి వచ్చినవారు కొంత సమయం గడిపేలా, తెలంగాణ ప్రాంత చరిత్ర, అమరవీరుల త్యాగాలు తెలుసుకునేలా ఒక మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారు. 

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మరోసారి వారికి ఘన నివాళి అర్పిస్తున్నాను.

తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు మన రాష్ట్ర ప్రగతికి సోపానాలు


తెలంగాణ రాక ముందు ఎట్లా ఉండే. ఇప్పుడు ఎట్లా ఉన్నది?!

అప్పటి పరిస్థితులు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.

సాగు, తాగు నీళ్ళు లేవు. కరెంట్ ఉండేది కాదు. రోడ్లు సరిగా లేవు. సంక్షేమం లేదు. అభివృద్ధి లేదు.  కుల వృత్తులు ఆగమైనవి. 

తెలంగాణ రాష్ట్రం వచ్చాకే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు

సీఎం కెసిఆర్ కి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు

రాష్ట్రము ఏర్పడి పదేళ్లు అయిన మన పథకాలు, అభివృద్ధి వల్ల దేశానికి ఆదర్శంగా నిలిచాం.

సీఎం కెసిఆర్  ప్రగతి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాల్లో  గుణాత్మక మార్పు వచ్చింది.

నేడు తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాల్లో ఒక మోడల్ గా దేశం లోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. 

ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాజనీతిని కనబరుస్తూ పనిచేస్తే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో తెలిపేందుకు తెలంగాణ ప్రగతి ఒక కొలమానం.

నేడు తెలంగాణలో సబ్బండ వర్గాల జీవితాల్లో వెల్లివిరుస్తున్న సుఖసంతోషాలే అందుకు నిదర్శనం.

3.5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో 44,12,882 మందికి ప్రతి నెల ఆసరా పెన్షన్లు అందిస్తున్నాం.

కళ్యాణ లక్ష్మి (షాదీ ముబారక్):

ఆడపిల్ల పెండ్లి కోసం ఆర్థిక భారంతో కుంగిపోయే నిరుపేద కుటుంబాలను పెండ్లి ఖర్చుల అవస్థలనుంచి గట్టెక్కించడానికి రాష్ట్రంలోని ప్రతీ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం చేయాలని సీఎం కెసిఆర్  నిర్ణయించారు.

 ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు ‘కల్యాణలక్ష్మి’ పథకాన్ని, మైనారిటీలకు షాదీముబారక్ పథకాలన్నీ ప్రభుత్వం అమలు చేస్తున్నది. 

ఆడబిడ్డ పెండ్లి ఖర్చులకుగాను రూ.1,00,116 ఆర్థికసాయం అందిస్తున్నది. 

దివ్యాంగులకు కళ్యాణలక్ష్మి పథకం కింద రూ. 1,25,145 చెల్లిస్తున్నారు. 

2014 నుండి 2023 మే మధ్య కాలంలో 12,71,839  నిరుపేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు రూ 11,130 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది.

రైతుబంధు, రైతు బీమా:

రైతుల పెట్టుబడి సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్నమైన, ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నది. 

రైతుకు పంట సమయంలో పెట్టుబడి తెచ్చుకొని అప్పుల పాలయ్యే క్షోభను తప్పించి ప్రభుత్వమే పంటసాయం ఇస్తున్నది. 

రాష్ట్ర ప్రభుత్వం 2018 నుంచి మే 2023 నాటికి 10 విడతల్లో 65,00,588 మంది రైతులకు 65,910.32 కోట్ల రూపాయలను పంట పెట్టుబడి సాయంగా అందజేసింది.

రైతు బీమా ప్రారంభమైనప్పటి నుండి 2023 మే వరకు రూ. 5,383.83 కోట్లను ప్రభుత్వం బీమా ప్రీమియంగా చెల్లించింది. ఇప్పటివరకు 99,297 మంది రైతులు మరణించగా వారి కుటుంబాలకు రూ.4,964.85 కోట్ల బీమా అందింది.

వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు:

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు దశాబ్దాల తరబడి కరెంటు కష్టాలు అనుభవించారు. రోజుకు కనీసం 3 లేదా 4 గంటల కరెంటు కూడా రాకపోయేది. దీంతో పంటలు ఎండిపోయి రైతులు విపరీతంగా నష్టపోయేవారు. 

ఎలాంటి షరతులు లేకుండా దేశంలోనే 24 గంటలపాటు వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే. 

పుట్టడం నుండి మరణం దాకా సీఎం కెసిఆర్  అనేక సంక్షేమ పథకాల ను అందిస్తున్నారు.

అమ్మఒడి, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ల పంపిణీ, ఉచిత వైద్యం అందిస్తున్న ఘనత సీఎం కెసిఆర్ గారి ప్రభుత్వానిది.

యాదవులకు బర్రెల పంపిణీ, గొర్రెల పంపిణీ, ముదిరాజ్ లకుచేప పిల్లల పంపిణీ చేపట్టి కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నాము.

అన్ని కులాల వారికి ఆత్మగౌరవ భవనాలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు, సెలూన్లకు ఉచిత విద్యుత్ సరఫరా అందించి ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదిగేలా చేస్తున్నాం.

ఎన్నో ఏళ్ల కలగా మిగిలి పోయిన గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు గా చేసుకొని పల్లె ప్రగతి ద్వారా పల్లెలను కడిగిన ముత్యంలా చేస్తున్నాం.

పేద విద్యార్థులకు గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలు, బ్రాహ్మణులకు ఉన్నత విద్యార్జనకై ఓవర్సీస్ స్కాలర్ షిప్ లు ఇచ్చి విద్యార్థుల భవితకు బంగారు బాట వేస్తున్నాం.

మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత తో భూ గర్భ జలాలు పెరిగాయి.

ప్లోరోసిస్ లాంటి వ్యాధులు రాకుండా ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తున్నాం 

మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చి వారు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తున్నాం.

మహిళలు ఎదగడానికి కుట్టు మిషను శిక్షణ ఇప్పించి ఉచితంగా కుట్టు మిషన్లను అందిస్తున్న ఘనత మన ప్రభుత్వానిది.

ప్రతిష్టాత్మక పథకాలతో ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నో పథకాలతో విజయవంతంగా ముందుకు సాగుతున్నది. 

తెలంగాణ మోడల్ గా నిలిచిన తెలంగాణ ఆచరిస్తున్న పలు కార్యక్రమాలను, పథకాలను, దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నది.

సీఎం కేసీఆర్ సారథ్యంలో స్వరాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యవసాయరంగ ప్రగతి నేడు దేశానికే దిక్సూచిగా నిలిచింది. 

తెలంగాణ వ్యవసాయరంగం వ్యవసాయాధారిత భారత దేశానికి వొక నమూనా మార్పును తెచ్చింది.  

సీఎం కేసీఆర్ రైతుల గుండెల్లో రైతుబాంధవుడిగా కొలువై వుండడం వెనక అరవయేండ్ల తన్లాట కు సమాధానం వున్నది. 

నేడు తెలంగాణ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు సంక్షేమ శిఖరాన నిలిచి ప్రగతి ఫలాలను అనుభవిస్తున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వ సాకారంతో వెనుకబడిన తరగతులు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు.   

గంగాజమునా తెహజీబ్ కు నిలయమైన తెలంగాణలో, మైనార్టీలు దేశంలో మరెక్కడాలేని విధంగా భరోసాతో ప్రగతి పథంలో దూసుకుపోతున్నారు. 

తెలంగాణ వస్తే ఏమొచ్చిందని అడిగినోళ్లకు నేడు తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరిస్తున్న అద్భుత విజయాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్

మహాదేవపూర్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, మండల కేంద్రము లో ఏర్పాటు చేసిన అమరవీరుల స్మారక స్తూపం, స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిదులతో కలిసి ఆవిష్కరించి, అమరులకు పుష్పాలతో ఘన నివాళులు అర్పించి సంస్కరణ సభలో పాల్గొన్న మంథని నియోజకవర్గ ఇన్చార్జ్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసి పడుతుండగా తెలంగాణ ఉద్యమ గొంతునొక్కిన చరిత్ర కాంగ్రెస్‌ పాలకులదేనని, 

ప్రస్తుత ఎమ్మెల్యే ఆనాడు మంత్రిగా ఉన్నసమయంలో నియోజకవర్గంలో ఉద్యమాన్ని అణిచివేసేలా ప్రయత్నం చేశారని, ఈ ప్రాంతంలో ఉద్యమం లేదని చాటి చెప్పే ప్రయత్నంలో బాగంగా, కొయ్యూర్‌లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డితో సభను నిర్వహించి, ఢిల్లీలోని కాంగ్రెస్‌ పెద్దలకు గొప్పగా సభ నిర్వహించామని, ఉద్యమం లేదని చాటి చెప్పాడని ఆయన గుర్తు చేశారు. కానీ అలాంటి అణిచివేసే ప్రయత్నాల్లో కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి, తమ ఉద్యమ స్పూర్తిని చాటి చెప్పేలా ఈనాడు తెలంగాణ అమర వీరుల స్మారక స్థూపం ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు ఆత్మబలిదానాలు చేసుకున్న అమరవీరుల స్పూర్తితో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో, ఈనాడు సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గొప్పగా పరిపాలన అందిస్తోందన్నారు. నాడు, నేడు పరిస్థితులపై బేరీజు వేసుకునే విధంగా తెలంగాణ ఆవిర్బాద దశాబ్దిఉత్సవాలు జరుపుకుంటున్నామని, ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఈనాటి తెలంగాణ ప్రభుత్వంలో జగిగిన అభివృధ్ది, మార్పులపై చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అభివృధ్దిని బేరీజు వేసుకోకపోతే మళ్లీ మోసం చేసేవాళ్లు మన ముందుకు వస్తారని ఆయన తెలిపారు. గత పాలకుల పనితీరుకు మహాదేవ్‌పూర్‌ బస్టాండ్‌ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని, 1991లో బస్టాండ్‌ ప్రారంభమైతే, 2014వరకు కూడా బస్టాండ్‌లోకి బస్సులు వెళ్లలేని పరిస్థితి ఉండేదన్నారు. పేరుకే బస్టాండ్‌ ఉన్నా, బయట నుంచే బస్సులు వచ్చి పోయేవనే విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. 2014తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో బస్టాండ్‌ను అభివృధ్ది చేసి, సకల సౌకర్యాలు కల్పించామని, ఈ ప్రాంత ఆడబిడ్డల ప్రయాణాలకు ఇబ్బందులు ఎదురు కావద్దనే ఆలోచన చేశామని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంపై ప్రేమ ఉన్న నాయకులే మన గురించి ఆలోచన చేస్తారే తప్ప, ఏదో అధికారం, పదవుల కోసం ఆరాటపడేవారు ఎందుకు అభివృధ్ది చేస్తారని ఆయన ప్రశ్నించారు. బారత రాజ్యాంగ నిర్మాణ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్పూర్తితోనే తెలంగాణ సాధించుకున్నామని, ఈ నియోజకవర్గంలో ప్రపంచ మేధావిగా పేరు గాంచిన అంబేద్కర్‌ను కాంగ్రెస్‌ నాయకులు కనబడనీయలేదని, ఒక్క విగ్రహం పెట్టి ఆయన చరిత్ర చాటి చెప్పే ప్రయత్నం కూడ చేయలేదన్నారు. తమ విగ్రహాలే పెట్టి, తమ చరిత్రను చెప్పే ప్రయత్నం చేస్తూ, చీకట్లోనే ఉండాలని కోరుకున్నారే కానీ, ఈ ప్రాంతానికి వెలుగులు ప్రసాదించాలని ఏనాడు ఆలోచన చేయలేదన్నారు. అలాంటి చీకటి పాలనను అంతం చేయాలంటే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మాయమాటలు నమ్మి మళ్లీ మోసపోవద్దని, అభివృధ్ది, సంక్షేమం బీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని ఆయన ఈసందర్బంగా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 




యాజమాన్యం మొండి వైఖరి విడనాడి ఎన్టిపిసి కాంటాక్ట్ కార్మికుల అగ్రిమెంట్ ను అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ ముత్యం రావు డిమాండ్ చేశారు.

ఈరోజు ఎన్టిపిసి ప్రాజెక్టు గేట్ 2 వద్ద యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన మహా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులు తమ హక్కుల కోసం పది నెలల నుండి పోరాడుతున్న ఎన్ టి పి సి యజమాన్యం నిర్లక్ష్య వైఖరి ఆలంబిస్తున్నదని, మహారత్న కంపెనీలో కార్మికుల శ్రమ ఉందని యజమాన్యం గుర్తించాలని, ఎన్టిపిసి కార్మికులకు పోరాటం కొత్త కాదని, వారి సహనాన్ని పరీక్షించవద్దని, కార్మికులు సమ్మె బాట పట్టకముందే వారి సమస్యలను పరిష్కరించాలని, లేనియెడల తర్వాత జరిగే పరిణామాలకు, పారిశ్రామిక ప్రాంతం అశాంతికి గురయ్యే ప్రమాదం ఉంటుందని, దానికి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

నిరసన కార్యక్రమంలో సిఐటియు నాంసాని శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, గోదావరి యూనియన్ కౌశిక్ హరి, రాజమల్లు, బిఎమ్ఎస్ బి లక్ష్మీనారాయణ, టి శ్రీనివాస్, ఐఎఫ్టియు చిలుక శంకర్, బుచ్చన్న, టిఆర్ఎస్ ఈ భూమయ్య, చింతల సత్యం, ఏఐటియుసి ఎం శంకర్, ఆర్ లక్ష్మణ్, ఐఎన్టియుసి బి చందర్, జమీల్, టిఎన్టియుసి కంది చంద్రయ్య, ఏ శ్రీనివాస్, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్  అన్నారు.

 అంతర్గాం మండలం సోమన్ పల్లి  గ్రామంలో నిర్వహించిన పోచమ్మ కొలుపు కార్యక్రమానికి ఎమ్మెల్యే  ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  ప్రతి సంవత్సరం 

గ్రామంలో ప్రజలందరూ గ్రామ దేవతలను పూజించడం ఆనవాయితీగా వస్తుందని 

భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తూ  

భక్తి భావాన్ని ప్రజలందరూ చాటుకున్నారని అన్నారు గ్రామంలోని ప్రజలందరూ కలిసి మెలిసి గ్రామ అభివృద్ధి కోసం పని చేయాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో అంతర్గాం జెడ్పిటిసి రాములు నారాయణ సర్పంచ్ కొల్లూరు సత్య సతీష్  తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మరియు ఐ ఎన్ టి యు సి ఆద్వర్యం లో కే సి ఆర్ దిష్టి బొమ్మ దహనం. 

తెలంగాణ కాంగ్రెస్ పీ సి సి పిలువు మేరకు బి ఆర్ ఎస్ ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపడుతుంది ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐ ఎన్ టి యు సి జాతీయ కార్యదర్శి  జనక్ ప్రసాద్  నాయకత్వంలో గోదావరిఖని లో పెద్ద ఎత్తున్న కే సి ఆర్ దిష్టి బొమ్మ దహనం చేసి పెద్ద ఎత్తున  నిరసన కార్యక్రమం చేశారు . 

ఆర్ జీ-1 వైస్ ప్రెసిడెంట్ సదానందం గారి అద్యక్షత న జరిగిన ఈ కార్యక్రమం లో. సెంట్రల్ సేనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి , సెంట్రల్ సేనియర్ వైస్ ప్రెసిడెంట్ దర్మపురి ,  సెంట్రల్ క్యాంపెనింగ్ ఇంఛార్జ్  వికాస్ కుమార్ యాదవ్ , దేవులపల్లి రాజేందర్ , టైసన్ శ్రీనివాస్ , టి పి సి సి సోషల్ మీడియా సెక్రెటరీ పోలు  మహేష్ బాబు , బ్రాంచ్ నాయకులు శ్రీనివాస్ , నాగరాజు , సాగర్ , జగన్మోహన్ , ఆంజనేయులు , అల్లావుద్దీన్ , శ్రీనివాస్ , గణపతి దామోధర్, చారి , తాళ్ల కుమార్ , పృథ్వీ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్



మహాదేవపూర్ మండలం:- మండల కేంద్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ, పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నందున, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు, బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఖండిస్తూ, ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు, దశాబ్ది దగా పేరుతో, మండల పార్టీ అధ్యక్షులు అక్బర్ ఖాన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి కెసిఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వం నిధుల దుర్వినియోగం చేస్తూ ఏం సాధించారని ఉత్సవాలు జరుపుతున్నారు, నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఇప్పటివరకు ఏ పనులు కూడా అమలుకు నోచుకోలేదని, ఏ రంగాల్లో కూడా ఇంతవరకు ఏమాత్రం అభివృద్ధి చెందకుండా

ప్రజలందరిని మోసం చేస్తూ, మరోసారి గద్దెనెక్కెందుకు దశాబ్ది ఉత్సవాల పేరుతో హంగామా ఆర్భాటాలు చేస్తున్నారని, మీరు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు  ఇక మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరని... 2014, 2018 మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదని, 





కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య, ఫీజ్ రీయంబర్స్ మెంట్, 

ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్ బెడ్రుం ఇళ్లు, 

దళిత కుటుంబాలకు మూడు ఎకరాల  భూమి, పోడు భూములకు పట్టాలు, 

రైతులకు రుణ మాఫీ, 

12 శాతం ముస్లిం రిజర్వేషన్లు,12 శాతం గిరిజన రిజర్వేషన్లు కల్పించాలనీ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రేస్ నాయకులు, సీనీయర్ కాంగ్రేస్ నాయకులు, యూత్ కాంగ్రేస్ నాయకులు, మహిళ కాంగ్రేస్ నాయకురాళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కాంగ్రేస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 





హన్మకొండ ;

రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక దినోత్స‌వాన్ని ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక దినోత్స‌వ వేడుకల్లో మండలి  డిప్యూటీ చైర్మన్  బండ  ప్రకాష్ ,రాష్ట్ర ప్రభుత్వ చీఫ్  వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. వేయి స్తంబాల దేవాలయం లో వారికి తోలుత ఆలయ అర్చకులు  పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. ఆలయం లో ప్రత్యేకంగా పూజలు  చేశారు.24 మంది అర్చకులకు ధూప దీపనైవేద్య నియామక పత్రాలను అందజేశారు.

ఈ  సందర్బంగా మండలి  డిప్యూటీ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో మనమందరం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తుంది.

ఆధ్యాత్మిక చింతన క‌లిగిన‌  ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు గారి నాయ‌క‌త్వంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఈ ప్రాంత సాంప్ర‌దాయ‌ల‌కు ఆల‌యాల‌కు , పండుగ‌ల‌కు, వేడుక‌ల‌కు అత్యంత ప్రాధ‌న్య‌త క‌ల్పించ‌డంతో ఆధ్మాత్మిక వైభ‌వం ఉట్టిప‌డుతుంది. స్వ‌రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత మ‌న పండుగ‌ల‌కు, వేడుక‌ల‌కు ప్ర‌పంచ ఖ్యాతి ల‌భించింది. స్వ‌పరిపాల‌న‌లో తెలంగాణ స్వంత‌ ఆస్థిత్వంతో కూడిన ఆధ్యాత్మిక శోభ‌ను సంత‌రించుకుంది.




రాష్ట్ర ప్రభుత్వ చీఫ్  విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూఆధ్యాత్మిక భావాలను పెంపొందించడంతో సమాజంలో  శాంతి సామరస్యాలు నెలకొంటాయి. ఈ  క్రమంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ఆధ్యాత్మిక అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్నారు.ధూప దీప నైవేద్య పథకం ద్వారా అర్చకుల వేతనాలను రూ.6,000 నుంచి రూ.10,000 లకు పెంచుతామ‌ని సీయం కేసీఆర్ నిర్ణయించారు అని తెలిపారు .  ఇలా ఆధ్యాత్మికంగా  ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాము.

ప్రభుత్వ సంగీత ఉపాధ్యాయురాలు వద్ది రాజ్ నివేదిత  పర్యవేక్షణ లో స్పెషల్ టీటీసీ  విద్యార్థులు గర్భ  గుడి లో నిర్వహించిన హిందూస్తాని, కర్ణాటక సంగీత  గాత్ర కచేరి  విశేషంగా ఆకర్శించింది.

ఈ  కార్యక్రమం లు అసిస్టెంట్ కమిషనర్ సునీత , ఈఓ వెంకటయ్య, ప్రధాన అర్చకులు  గంగు  ఉపేంద్ర శర్మ  తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



*భగత్ సింగ్ భవన్ సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా నిర్మల్ జిల్లా కార్యాలయంలో  సిపిఐ (ఎంఎల్ )ప్రజాపంథా వ్యవస్థాపకులు కామ్రేడ్ డివి కృష్ణ  ప్రధమ వర్ధంతి సభని 26 /6/ 2023 హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే వర్ధంతి సభను జయప్రదం చేయాలని గోడ పత్రికలు ఆవిష్కరించడం జరిగింది *ఈ సందర్భంగా సీపీఐఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి. కె రాజన్న మాట్లాడుతూ కామ్రేడ్ డివి కృష్ణ గారు తన జీవితాన్ని ప్రజల కోసమే సర్వం త్యాగం చేశాడని శక్తి వంచన లేకుండా ప్రజల కోసం పనిచేశాడని ఆయన ఆశయాలతో ముందుకు పోదామని ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటాన్ని చేశారని మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని విదేశీ సంస్కృతిని పార్దోలాలని స్వదేశీ సంస్కృతిని కాపాడాలని ఆయన ఆశయాల సాధన కోసం ప్రజా పోరాటాలను వర్గ పోరాటాలను నిర్మించాలని పిలుపునిచ్చారు*ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఎం బక్కన్న. S. గంగన్న. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్. సమత  కె లక్ష్మి. ఎస్ లక్ష్మి . రేష్మ . గంగామణి.తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 విద్యార్థినీలకు బస్సు పాస్ ల పంపిణీ కార్యక్రమం మంగళవారం రోజున సుబేదారిలోని ప్రభుత్వ బాలికాసదనంలో జరిగింది.

హనుమకొండ టీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ సంబంధిత అధికారులు స్వయంగా బాలికా సదనాన్ని సందర్శించి విద్యార్థినీలతో  మాట్లాడిన అనంతరం ఆర్టీసీ  హనుమకొండ డిపో మేనేజర్ కే బాబు నాయక్ మాట్లాడుతూ  ప్రభుత్వ బాలికా సదనంలో రక్షణ సంరక్షణ పొంది, లష్కర్ బజార్  ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసించే  విద్యార్థినిలకు అనుకూలంగా రవాణా సౌకర్యం కల్పించుటకు చర్యలు తీసుకొని బస్ పాస్ లను అందించడం జరిగిందని రక్షణ  సంరక్షణ అవసరం ఉన్న ఇలాంటి పిల్లలకు ఈ రకమైన  సేవ చేయడం సంతోషకరమని అన్నారు. 

బాలికా సదనం సూపరింటెండెంట్ 

ఎం కళ్యాణి మాట్లాడుతూ ప్రస్తుతానికి ప్రాథమిక విద్య నభ్యసించే 23 మంది విద్యార్థినిలకు బస్ పాస్ సౌకర్యం కల్పించడం జరిగిందని, ఉన్నత పాఠశాల విద్యనభ్యసించే వారికి కూడా బస్ పాస్ లు త్వరలో అందచేస్తామని అన్నారు.

అనంతరం బస్సును మామిడి తోరణాలతో బస్సును అలంకరించగా పిల్లలందరూ సంతోషంతో బస్సులో పాఠశాలకు వెళ్లారు.

కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కజాంపురం  దామోదర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్,   ఆర్టీసీ హనుమకొండ సూపర్వైజర్ 

గౌస్ మొయినుద్దీన్, బస్ పాస్ ఇంచార్జి గిరి రాజయ్య  బాలికా సదనం సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.