మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
అంతర్గాం మండలం సోమన్ పల్లి గ్రామంలో నిర్వహించిన పోచమ్మ కొలుపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం
గ్రామంలో ప్రజలందరూ గ్రామ దేవతలను పూజించడం ఆనవాయితీగా వస్తుందని
భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తూ
భక్తి భావాన్ని ప్రజలందరూ చాటుకున్నారని అన్నారు గ్రామంలోని ప్రజలందరూ కలిసి మెలిసి గ్రామ అభివృద్ధి కోసం పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్గాం జెడ్పిటిసి రాములు నారాయణ సర్పంచ్ కొల్లూరు సత్య సతీష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: