కాటారం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం పూర్తిగా శూన్యమైందని బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు రామిళ్ల కిరణ్ ఆరోపించారు. మొన్నటి వర్షాలతో నాలాలు, చెరువుల్లో నిల్వ నీళ్లు, మురుగు నీరు, ఎక్కడికక్కడ పెరిగిన పిచ్చిమొక్కలతో గ్రామం మొత్తం చెత్త మయంగా మారిందన్నారు. దీంతో దోమల బెడద విపరీతంగా పెరిగి, పిల్లలు, పెద్దలు విషజ్వరాలతో బాధపడుతున్నారని తెలిపారు.“శ్రీధర్ బాబు  సొంత మండలానికి చెందిన కాటారం పంచాయతీలో కనీస పరిశుభ్రత కనిపించదు. 14 వాడలలో ఒక్క వాడలో కూడా పరిశుభ్రత నిలకడగా లేదు. చెత్త కుప్పల మధ్య పందులు స్వైర విహారం చేస్తున్నాయి. దళిత వాడల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కోతుల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఎర్రగుంటపల్లెలో ఒకరిపై కోతులు దాడి చేయగా ఆయన చేతి విరిగింది. అయినా అధికారుల దృష్టి లేకపోవడం విచారకరం” అని రామిళ్ల కిరణ్ మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం పైన కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “సంవత్సరంన్నరుగా సర్పంచులు లేక, వార్డు సభ్యులు లేక పాలన స్తబ్ధుగా మారింది. పంచాయతీ కార్యదర్శి గాని, స్పెషల్ అధికారి గాని క్షేత్రస్థాయి సమస్యలను పట్టించుకోవడం లేదు. ఫోటోలు కోసం మాత్రం మెయిన్ రోడ్డు శుభ్రం చేసి కలెక్టర్‌కి చూపిస్తున్నారు. వాస్తవానికి వాడల్లో ఒక్క మొక్క కూడా తీసి వేయని పరిస్థితి ఉంది” అని విమర్శించారు. బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ మిషన్ల వినియోగం పూర్తిగా నిలిచిపోయిందని ఆయన ఆరోపించారు. “మునుపటి ప్రభుత్వంలో వాడవాడకు ఫాగింగ్ చేసి దోమలను అదుపులో పెట్టేవారు. ఈ ప్రభుత్వంలో అయితే ఫాగింగ్ మిషన్ల స్థితిగతులే తెలియడం లేదు. అవి ఎక్కడున్నాయో, నిధులు లేవని అమ్మేశారో అనే అనుమానం వస్తోంది” అన్నారు.
స్థానిక కాంగ్రెస్ నాయకుల పైన కూడా రామిళ్ల కిరణ్ తీవ్రంగా దాడి చేశారు. “వాళ్ల సారుకు ఒక్క మాట చెప్పే స్థితిలో కూడా లేరు. వారి రాజకీయ స్థాయి పెరిగినా ప్రజల పరిస్థితి మాత్రం ఏ మాత్రం మారలేదు. కనీసం రాబోయే ఎన్నికల్లో ఓటు కోసం అయినా ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి” అని డిమాండ్ చేశారు. మంత్రివర్యులు శ్రీధర్ బాబు  సొంత మండలంలో కనీస పారిశుద్ధ్య పనులకైనా నిధులు కేటాయించాలని, ప్రజల ఆరోగ్య రక్షణపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామిళ్ల కిరణ్‌తో పాటు బీఆర్ఎస్ నాయకుడు మనేం రాజబాబు పాల్గొన్నారు.



Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: