హైదరాబాద్ : టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారంటూ సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆందోళన చెందుతున్న తరుణంలో నటి స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చింది.
కాజల్ స్పష్టం చేస్తూ – “ఇలాంటి వార్తలు పూర్తిగా అవాస్తవం. దేవుడి దీవెనలతో నేను క్షేమంగానే ఉన్నాను. సోషల్ మీడియాలో ఎవరో ఊహాగానాలు సృష్టించి వ్యాప్తి చేస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారాలు ఫన్నీగా అనిపిస్తున్నాయి” అని పేర్కొంది.
అలాగే, తప్పుడు ప్రచారాలపై దృష్టి పెట్టకుండా నిజాలపై మాత్రమే ఫోకస్ చేయాలని అభిమానులను కోరింది. “ప్రతి చిన్న రూమర్‌ను నమ్మకుండా వాస్తవాలను తెలుసుకొని మాత్రమే నమ్మాలి. మన సమయాన్ని, శక్తిని విలువైన విషయాలపై వెచ్చిద్దాం” అని కాజల్ సూచించింది.
ఇటీవల కాజల్ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండగా, తను పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నానని మరోసారి అభిమానులకు హామీ ఇచ్చింది.
Post A Comment: