మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
యాజమాన్యం మొండి వైఖరి విడనాడి ఎన్టిపిసి కాంటాక్ట్ కార్మికుల అగ్రిమెంట్ ను అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ ముత్యం రావు డిమాండ్ చేశారు.
ఈరోజు ఎన్టిపిసి ప్రాజెక్టు గేట్ 2 వద్ద యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన మహా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులు తమ హక్కుల కోసం పది నెలల నుండి పోరాడుతున్న ఎన్ టి పి సి యజమాన్యం నిర్లక్ష్య వైఖరి ఆలంబిస్తున్నదని, మహారత్న కంపెనీలో కార్మికుల శ్రమ ఉందని యజమాన్యం గుర్తించాలని, ఎన్టిపిసి కార్మికులకు పోరాటం కొత్త కాదని, వారి సహనాన్ని పరీక్షించవద్దని, కార్మికులు సమ్మె బాట పట్టకముందే వారి సమస్యలను పరిష్కరించాలని, లేనియెడల తర్వాత జరిగే పరిణామాలకు, పారిశ్రామిక ప్రాంతం అశాంతికి గురయ్యే ప్రమాదం ఉంటుందని, దానికి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
నిరసన కార్యక్రమంలో సిఐటియు నాంసాని శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, గోదావరి యూనియన్ కౌశిక్ హరి, రాజమల్లు, బిఎమ్ఎస్ బి లక్ష్మీనారాయణ, టి శ్రీనివాస్, ఐఎఫ్టియు చిలుక శంకర్, బుచ్చన్న, టిఆర్ఎస్ ఈ భూమయ్య, చింతల సత్యం, ఏఐటియుసి ఎం శంకర్, ఆర్ లక్ష్మణ్, ఐఎన్టియుసి బి చందర్, జమీల్, టిఎన్టియుసి కంది చంద్రయ్య, ఏ శ్రీనివాస్, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: