ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రులు శుక్రవారం రాత్రి తో ముగిశాయి.తొమ్మిది రోజుల పాటు హన్మకొండ,వరంగల్, కాజీపేట ట్రై సిటీ లో వాడవాడలా వినాయక విగ్రహాలు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శుక్రవారం సాయంత్రం హన్మకొండ, గోపాల పూర్ ,నయీం నగర్ ,భీమారం ఎన్జీవో కాలనీ,వందఫీట్ల రోడ్డు చౌరస్తా, వడ్డేపల్లి, కుమార్ పల్లి, రెడ్డి కాలనీ, బ్రాహ్మణ వాడ, చౌరస్తా సెంటర్ లో గణేష్ ఉత్సవ కమిటీ,విశ్వ హిందు పరిషత్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు పద్మాక్షి, భద్రకాళి,హంటర్ రోడ్ వైపు వెళ్లే వాహన గణపతి విగ్రహాలకు పూలు వేసి జై బోలో గణేశ్ మహరాజ్ కీ జై.. గణపతి పప్పా మోరియా అంటూ భారీ ఎత్తున నినాదాలతో హోరెత్తించారు.పట్టణ వీధులు అన్ని వినాయక నిమజ్జనం భజనలతో మారు మ్రోగాయి.
Post A Comment: