మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



 

గుడిసెలు వేసుకున్న పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి,బస్సు యాత్ర బృందం కన్వీనర్ స్.వీరయ్య . తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యవేదిక బస్సు యాత్ర బృందం నాయకులు ఎన్టీపీసీలోని పి కె రామయ్య కాలనీ 3వ కేంద్రం  లో వేసుకున్న గుడిసెలను సందర్శించారు, నాయకులకు పూలమాలలు వేసి స్వాగతం పలికారుఈ సందర్భంగా సీపీఎం జెండాను స్.వీరయ్య  ఎగుర వేశారు.అలాగే ఇందిరమ్మ కాలనీ 2వ కేంద్రంలో వేసుకున్న గుడిసెలను సందర్శించదానికి వచ్చిన యాత్ర బృందం కు పూలమాలలతో స్వాగతం పలికారు.ఈసందర్భంగా సీపీఎం జెండాను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు స్కైలాబ్ బాబు ఎగురవేశారు అనంతరం స్.వీరయ్య , మల్లు లక్ష్మి , స్కైలబ్ బాబు మాట్లాడుతూ,ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వం మాట నిలబెట్టు కాలేదు కాబట్టే ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని ఉంటున్న రని ప్రభుత్వం బెదిరించి గుడిసెలు తొలగిస్తే ఉరుకునే ప్రసక్తే లేదన్నారు.భూకబ్జా దారులు పై చూపని ప్రతాపం పేదలపై చూపడం సరికాదని , ఈ ప్రాంతంలో గత మూడు నెలలుగా ఇండ్ల స్థలాల కోసం పోరటం చేస్తున్న పేదలందరికీ 125 గజాల స్థలం కేటాయించి ఇండ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 5లక్షలు కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసేవరకు పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చించారు. ఈ  కార్యక్రమంలో బస్సు యాత్ర బృందం నాయకులు డి వై ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులుకోట రమేష్,రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్,ప్రజా నాట్య మండలి కార్యదర్శి వేముల ఆనంద్,సోషల్ మీడియా రాష్ట్ర బాధ్యులు జగదీష్ వ్య. కా స రాష్ట్ర నాయకురాలు పద్మ,,జిల్లా కార్యదర్శి వై యాక య్య, కార్య దర్శి వర్గ సభ్యులు ఏ.ముత్యం రావు, ఎం రామాచారి,నాయకులు గిట్ల  లక్ష్మారెడ్డి, ఎన్ బిక్షపతి, వి నాగమణి, సి హెచ్ ఉపేందర్, రమణ, పి. నాగలక్ష్మి, టి రవీందర్, వి. శ్రీనివాస్ రెడ్డి ఎం కృష్ణారెడ్డి ,భాగ్య,స్వప్న ,నర్మద ,పూజ,  అలివేలుమంగా స్వర్ణలత రమాదేవి  తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: